హోండా యాక్టివా ఇన్సూరెన్స్
ప్రీమియం ఇంత వద్ద ప్రారంభం ₹538*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
2000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలుˇ
ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / హోండా టూ వీలర్ ఇన్సూరెన్స్ / హోండా యాక్టివా ఇన్సూరెన్స్

హోండా యాక్టివా ఇన్సూరెన్స్

యాక్టివా ఇన్సూరెన్స్

భారతీయులు స్కూటర్‌ల కన్నా ఎక్కువగా మోటార్‌సైకిళ్లను ఇష్టపడతారనే అభిప్రాయం ఊపందుకున్న సమయంలోనే, హోండా యాక్టివా ఒక గేమ్ ఛేంజర్‌లా నిలిచింది. 1999లో దానిని ప్రవేశపెట్టినప్పటి నుండి ఒకటిన్నర దశాబ్దం పాటు, రోజువారీ ప్రయాణం కోసం వాహనాన్ని వెతుకుతున్న భారతీయులందరికీ ఇది ఒక టూ వీలర్ వెహికల్‌గా మారింది. అయితే, ఇది ఎలా సాధ్యమైంది? స్టార్ట్ చేయడానికి ఇది యూనిసెక్స్ రూపాన్ని కలిగి ఉంటుంది, అనగా, అదే స్కూటర్‌ను కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు. ప్రతి కొత్త వేరియంట్‌తో పాటు, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికే హోండా నిరంతరం శ్రమిస్తుంది. ప్రతి సంవత్సరం గడిచేకొద్దీ ఈ బ్రాండ్ మీకు మెరుగైన స్టైలింగ్, పెద్ద ఇంజిన్, ఆకర్షణీయమైన రంగులు మరియు మరింత స్టోరేజ్ స్థలాన్ని తీసుకురావాలని ఆశిస్తుంది. కావున, హోండా యాక్టివా ఇంత పెద్ద హిట్ అయింది అనడంలో ఆశ్చర్యం లేదు.

అత్యంత ప్రజాదరణ పొందిన హోండా యాక్టివా వేరియంట్లు

హోండా యాక్టివా అనేది 109.51cc సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ కలిగి 7.79PS మరియు 8.84Nm ఉన్న మరియు భారతదేశంలో అత్యధికంగా విక్రయించబడే స్కూటర్. హోండా యాక్టివా యొక్క తాజా వెర్షన్ 6G. యాక్టివా 5G మరియు హోండా యాక్టివా 6G మధ్య ప్రధానమైన మార్పులు - టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు పెద్ద 12 అంగుళాల ఫ్రంట్ వీల్. భారతదేశంలో హోండా యాక్టివా 6G ధర ₹ 76, 234 వద్ద ప్రారంభమవుతుంది మరియు ₹ 82,734 వరకు ఉంటుంది. హోండా యాక్టివా 6G 5 వేరియంట్లతో లభిస్తుంది. దిగువ పట్టికలో అన్ని వేరియంట్లను చూద్దాం.

హోండా యాక్టివా 6G ధర (ఎక్స్-షోరూమ్)
హోండా యాక్టివా 6G STD ₹ 76,234
హోండా యాక్టివా 6G DLX ₹ 78,734
హోండా యాక్టివా 6G DLX లిమిటెడ్ ఎడిషన్ ₹ 80,734
హోండా యాక్టివా 6G H-స్మార్ట్ ₹ 82,234
హోండా యాక్టివా 6G స్మార్ట్ లిమిటెడ్ ఎడిషన్ ₹ 82,734

హోండా యాక్టివా - ఓవర్‍వ్యూ మరియు USPలు


యాక్టివా 125 ఆధారంగా హోండా యాక్టివా 6G రూపొందించబడింది. LED హెడ్‌లైట్ డీలక్స్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఆటోమేటిక్ లాక్/అన్లాక్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్ మరియు కీలెస్ స్టార్ట్ వంటి అనేక ఫంక్షన్లను అందించే ఒక స్మార్ట్ కీని యాక్టివా హెచ్-స్మార్ట్ వేరియంట్ పొందుతుంది. హెచ్-స్మార్ట్ వేరియంట్ OBD-2 నిబంధనలకు అనుగుణంగా లభిస్తుంది. సరికొత్త 6G యాక్టివా ఇంజిన్ 109.51cc సింగిల్ సిలిండర్ ఇంజిన్, ఇది 7.79PS మరియు 8.84Nm ఉత్పత్తి చేసే విధంగా ట్యూన్ చేయబడింది. ఇది ఒక ACG స్టార్టర్ (సైలెంట్ స్టార్టర్) మరియు ఇంజిన్ కిల్ స్విచ్ కూడా పొందుతుంది. హోండా యాక్టివా USPలలో కొన్నింటిని చూద్దాం:

1
బడ్జెట్
అత్యున్నత పనితీరు, రైడింగ్ సౌలభ్యం, క్లాసీ డిజైన్ మరియు హోండా యాక్టివా యొక్క తాజా ఫీచర్లు ఉన్నప్పటికీ, ఇది ఒక బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూటర్. దాని ధర సాధారణంగా ₹ 76,000 నుండి ₹ 83,000 వరకు ఉంటుంది. ఈ ధర వలన ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ-వీలర్‌గా నిలిచింది.
2
మైలేజ్
హోండా యాక్టివా విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి దాని అద్భుతమైన మైలేజ్. పెరుగుతున్న ఇంధన ఖర్చులతో, రైడర్లు ఇంధనాన్ని ఆదా చేసే రవాణా మార్గాల కోసం శోధిస్తున్నారు. ఒక యాక్టివా నుండి సగటు మైలేజ్ 60 km/లీటర్.
3
సస్పెన్షన్ 
గుంతలు మరియు పగుళ్లతో నిండి ఉన్న నగరపు వీధులలో ప్రయాణించేటప్పుడు, సురక్షితమైన డ్రైవింగ్ అనుభవం కోసం అత్యుత్తమ సస్పెన్షన్ సిస్టమ్ అవసరం. ఈ సమస్యను ఎదుర్కోవడానికి యాక్టివా స్కూటర్లు ఒక ప్రత్యేక సస్పెన్షన్ సిస్టమ్‌తో లభిస్తున్నాయి.
4
రైడ్ నాణ్యత
హోండా యాక్టివా యొక్క రైడ్ నాణ్యత దాని అత్యుత్తమ అంశాలలో ఒకటి. పెద్ద ఫ్రంట్ వీల్ మరియు మెరుగైన సస్పెన్షన్ సిస్టమ్‌తో యాక్టివా 6G అధిక వేగంలో మరింత స్థిరంగా ఉంటుంది. యాక్టివ్ స్కూటర్లలో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇంజిన్‌ను అద్భుతంగా, మృదువుగా మరియు మరింత సమర్థవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, ట్యూన్ చేయబడిన ఇంజిన్ పనితీరు కారణంగా అధిక వేగంలో కూడా ఈ స్కూటర్ స్థిరంగా ఉంటుంది.
5
స్టైలింగ్
ఎవరైనా హోండా యాక్టివా 6G ని ఎంచుకుంటే, వారు యాక్టివా 125 డిజైన్ లాగా బోల్డర్ లుక్ కలిగిన ఒక స్కూటర్ పొందుతారు.
6
రక్షణ
ఆధునిక హోండా యాక్టివా స్కూటర్లు మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యం కోసం ముందు భాగం మరియు వెనుక చక్రాల వద్ద CBS (కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్) కలిగి ఉన్నాయి. దీని కారణంగా, జారిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హోండా యాక్టివా 6G ఒక ఇంజిన్ కిల్ స్విచ్ ను పొందుతుంది, ఇది ఎలక్ట్రిక్ స్టార్టర్‌గా కూడా పనిచేస్తుంది.

హోండా యాక్టివా ఇన్సూరెన్స్ ఆవశ్యకత

మీరు యాక్టివా కలిగి ఉంటే లేదా ఒకదాన్ని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తే, మీ వాహనం హోండా యాక్టివా ఇన్సూరెన్స్‌ను కలిగి ఉందని నిర్ధారించుకోవాలి. వరదలు, దొంగతనం, భూకంపాలు మొదలైనటువంటి ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం కారణంగా మీ వాహనానికి జరిగిన నష్టం వలన మీకు కలిగే ఖర్చుల నుండి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ రక్షిస్తుంది. యాక్టివా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడానికి కొన్ని కారణాలను చూద్దాం

• చట్టపరమైన ఆవశ్యకతలు – 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, మోటారు ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అందువల్ల, ప్రతి యాక్టివా యజమానికి కనీసం థర్డ్ పార్టీ యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి.

• వాహన నష్టానికి కవరేజ్ – మీరు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ లేదా సమగ్ర కవర్‌ను ఎంచుకుంటే, ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం కారణంగా మీ వాహనానికి జరిగిన ఏదైనా నష్టానికి మీరు కవరేజ్ పొందుతారు. దీనికి అదనంగా, మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్, జీరో డిప్రిసియేషన్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ మొదలైనటువంటి యాడ్-ఆన్ కవర్‌లను కూడా ఎంచుకోవచ్చు.

• థర్డ్ పార్టీ లయబిలిటీలు – హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ పాలసీతో, సంఘటన జరిగినప్పుడు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వాహనం ప్రమేయం వలన థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగిన ఏదైనా నష్టానికి కూడా మీరు కవరేజ్ పొందుతారు. 

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా అందించబడే హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్ రకాలు

హోండా యాక్టివా లాంటి స్కూటర్ కుటుంబ వినియోగానికి తగినవిధంగా సరిపోతుంది, ఆకర్షణీయమైన మైలేజీని అందిస్తుంది, ఇది భారతీయ రోడ్లపై రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ గమ్యస్థానాన్ని చేరుకోవడంతో ఇంధనంపై మీ డబ్బును ఆదా చేసేలా చేస్తుంది. కానీ, మీకు ఇష్టమైన స్కూటర్‌ను కలిగి ఉంటే సరిపోదు, మీరు దానిని హోండా యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో కూడా సురక్షితం చేసుకోవాలి. ఒక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం చట్టం ప్రకారం తప్పనిసరి అయినప్పటికీ, నిపుణులు మీరు సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు, ఎందుకంటే, ఇది ముఖ్యంగా అనేక సంభావ్య ప్రమాదాల నుండి విస్తృత కవరేజీ కోసం హామీ ఇస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యాక్సిడెంట్ లేదా దొంగతనం లాంటి దురదృష్టకర సంఘటనల సందర్భంలో మీ పొదుపులను సురక్షితం చేసే అనేక రకాల ప్లాన్లను అందిస్తుంది. ఇక్కడ మీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి:

మీ స్వంత బైక్‌తో పాటు థర్డ్-పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి జరిగే నష్టాల నుండి అన్ని విధాలా రక్షణను కోరుకుంటే, ఇది మీకు అనువైన ప్యాకేజీ. మీరు ఒకటి, రెండు లేదా మూడు సంవత్సరాల కవరేజీని ఎంచుకోవచ్చు. అయితే, మీరు ప్రతి సంవత్సరం రెన్యూవల్ ఇబ్బందులను నివారించడానికి, మీ హోండా యాక్టివాను మూడు సంవత్సరాల కోసం సురక్షితం చేయాలని సిఫార్సు చేస్తున్నాము. ఈ పాలసీ వలన కలిగే మరొక అదనపు ప్రయోజనం ఏమిటంటే, మెరుగైన కవరేజ్ కోసం మీరు మీ హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ను యాడ్-ఆన్‌లతో కస్టమైజ్ చేయవచ్చు.

X
అన్ని-విధాలా రక్షణ కోరుకునే బైక్ ప్రేమికులకు ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
బైక్ యాక్సిడెంట్

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

మరిన్ని అన్వేషించండి

ఇది థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టం, డ్యామేజీ, గాయం, వైకల్యం కారణంగా తలెత్తే ఏవైనా బాధ్యతల నుండి మీకు ఆర్థిక రక్షణను అందించే ఒక ప్రాథమిక ఇన్సూరెన్స్ రకం. భారతీయ రోడ్లపై రైడ్ చేయడానికి ఇది తప్పనిసరి అవసరం, మీరు చెల్లుబాటు అయ్యే హోండా యాక్టివా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా పట్టుబడితే, ₹2000 జరిమానాను చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి.

X
తరచుగా బైక్‌ను ఉపయోగించే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ప్రమాదం, దొంగతనం లేదా విపత్తుల కారణంగా మీ స్వంత వాహనానికి జరిగిన ఏదైనా నష్టం - ప్రకృతి లేదా మానవ నిర్మితమైనది, స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడుతుంది. మీకు ఇప్పటికే హోండా యాక్టివా థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉంటే, ఈ కవర్ మీకు అదనపు రక్షణను అందిస్తుంది.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
బైక్ యాక్సిడెంట్

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

యాడ్-ఆన్‌ల ఎంపిక

మీరు ఒక సరికొత్త బైక్‌ను కొనుగోలు చేసినట్లయితే, ఈ కవర్ మీ స్వంత వాహనానికి నష్టం జరగకుండా ఒక సంవత్సరం పాటు రక్షణ ఇస్తుంది, అలాగే, థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి నష్టం జరగకుండా 5 సంవత్సరాల కవరేజీని అందిస్తుంది.

X
సరికొత్త టూ వీలర్ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి తగినది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
బైక్ యాక్సిడెంట్

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

హోండా యాక్టివా ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

మీరు మీ హోండా యాక్టివా బైక్‌ కోసం ఎంచుకున్న పాలసీపై దాని కవరేజ్ ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అయితే, అది థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి మాత్రమే జరిగిన ఏదైనా నష్టం నుండి కవరేజీని అందిస్తుంది. కానీ సమగ్ర హోండా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కింది వాటి నుండి రక్షణను అందిస్తుంది:

ప్రమాదాలు

ప్రమాదాలు

యాక్సిడెంట్ కారణంగా తలెత్తే ఆర్థిక నష్టాలను మేము చూసుకుంటాము, కావున మీ పొదుపులు అలాగే ఉంటాయి.

అగ్నిప్రమాదం మరియు విస్పోటనం

అగ్నిప్రమాదం మరియు విస్పోటనం

అగ్నిప్రమాదం, పేలుడు కారణంగా మీ బైక్‌కు ఏదైనా నష్టం లేదా డ్యామేజ్ జరిగితే అది కవర్ చేయబడుతుంది.

దొంగతనం

దొంగతనం

మీ హోండా యాక్టివా దొంగిలించబడితే, మేము బైక్ ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువకు సమానమైన మొత్తాన్ని పరిహారంగా చెల్లిస్తాము.

విపత్తులు

సహజ/ మానవ నిర్మిత విపత్తులు

వరదలు, భూకంపాలు, తుఫానులు, అల్లర్లు మరియు విధ్వంసాల కారణంగా మీ బైక్‌కు జరిగిన ఏదైనా నష్టాన్ని మేము కవర్ చేస్తాము.

పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

ఏదైనా యాక్సిడెంట్ సందర్భంలో మీ వైద్య ఖర్చులను తీర్చుకోవడానికి మీరు ₹15 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీని పొందుతారు.

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ లయబిలిటీ

మీరు థర్డ్ పార్టీ వ్యక్తికి లేదా వారి ఆస్తికి నష్టం లేదా గాయం కలిగించినట్లయితే, తద్వారా తలెత్తే ఆర్థిక బాధ్యతల నుండి మేము మీకు రక్షణ కల్పిస్తాము.

హోండా యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు

జీరో డిప్రిసియేషన్ బైక్ ఇన్సూరెన్స్
సున్నా తరుగుదల
మీ యాక్టివా ఇన్సూరెన్స్ యొక్క జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్‌తో క్లెయిమ్ సెటిల్ చేసేటప్పుడు బైక్ లేదా స్కూటర్ భాగాలపై డిప్రిసియేషన్‌ను ఇన్సూరర్ పరిగణించరు. ఇన్సూరర్ దాని తరుగుదల విలువను మినహాయించకుండా దెబ్బతిన్న భాగం కోసం పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తారు.
బైక్ ఇన్సూరెన్స్‌లో నో క్లెయిమ్ బోనస్
నో క్లెయిమ్ బోనస్ (NCB) రక్షణ
మునుపటి పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌ను రిజిస్టర్ చేయకపోతే, నో క్లెయిమ్ బోనస్ (NCB) యాడ్-ఆన్ కవర్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి NCB ప్రయోజనాన్ని పొందే అర్హతను అందిస్తుంది.
టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్
ఈ యాడ్-ఆన్ కవర్‌ను రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కవర్ అని కూడా పిలుస్తారు. హైవే మధ్యలో వాహనం బ్రేక్‌డౌన్ అయితే ఇన్సూర్ చేయబడిన టూ-వీలర్‌కు ఇన్సూరెన్స్ సంస్థ అందించే అత్యవసర సహాయం ఇది. 
టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్
రిటర్న్ టు ఇన్వాయిస్
మీ బైక్ లేదా స్కూటర్ దొంగిలించబడినా లేదా మరమ్మతు చేయడం సాధ్యం కాకపోయినా, రిటర్న్ టూ ఇన్వాయిస్ యాడ్-ఆన్ కవర్ మీరు దానిని కొనుగోలు చేసినప్పుడు మీ టూ-వీలర్ ఇన్వాయిస్ విలువకు సమానమైన క్లెయిమ్ మొత్తాన్ని పొందడానికి మీకు సహాయపడుతుంది.
బైక్ ఇన్సూరెన్స్‌లో ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్టర్ యాడ్-ఆన్ కవర్ అనేది ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ లోని చిన్న భాగాల మరమ్మతు మరియు భర్తీ ఖర్చు కోసం ఇన్సూరర్‌కు కవరేజీని అందిస్తుంది. నీటి ప్రవేశం, నూనె లీకేజ్ మరియు గేర్‌బాక్స్ నష్టం కారణంగా నష్టం జరిగితే కవరేజ్ అందించబడుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి యాక్టివా ఇన్సూరెన్స్ ఎందుకు మీ మొదటి ఎంపికగా ఉండాలి!

టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. దేశంలో చట్టబద్ధంగా రైడ్ చేయాలంటే యజమాని-రైడర్ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి. ప్రధానంగా, ఇది మిమ్మల్ని ఆర్థికంగా సురక్షితం చేస్తుంది. ఇక్కడ, మీ స్కూటర్‌కు భారీ నష్టాన్ని కలిగించే అనేక ప్రకృతి, మానవ నిర్మిత వైపరీత్యాలు ఉన్నాయి, వాటి ఫలితంగా జరిగిన నష్టాలకు రిపేర్ చేయించడం అనగా మీ పొదుపులో మంచి మొత్తాన్ని ఉపయోగించడం. ప్రమాదాలు మరియు దొంగతనాలు ఎటువంటి ముందస్తు హెచ్చరికలతో రావు. మీ బైక్‌కు ఎన్ని భద్రతా ఫీచర్లు ఉన్నప్పటికీ, వాటితో సంబంధం లేకుండా ఉత్తమ రైడర్‌లతో ఇవి జరగవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఒక టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ ఊహించని ఖర్చులను నివారించడంలో మీకు సహాయపడుతుంది, అలాగే, మీకు మనశ్శాంతినిస్తుంది. సరైన రకం ఇన్సూరెన్స్‌ను ఎక్కడ పొందాలి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, హోండా యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ: కోసం మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోవడానికి గల ప్రధాన కారణాలు ఇక్కడ ఉన్నాయి

యాక్టివా రోడ్‌సైడ్ అసిస్టెన్స్

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

బ్రేక్‌డౌన్ విషయంలో, మేము కేవలం ఒక్క కాల్ దూరంలో ఉన్నాము. మీరు దారి మద్యలో ఎక్కడ చిక్కుకుపోయినా, బ్రేక్‌డౌన్ సమస్యలను పరిష్కరించడంలో మా 24x7 రోడ్డు సైడ్ అసిస్టెన్స్ మీకు సహాయం చేస్తుంది.

యాక్టివా ఇన్సూరెన్స్ క్లెయిములు

సులభమైన క్లెయిములు

మాకు 100% క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి రికార్డ్ ఉంది. అదనంగా, మేము కాగితరహిత క్లెయిములు మరియు స్వీయ-తనిఖీ ఎంపికలను అందిస్తాము. మా పాలసీదారులు సులభంగా క్లెయిమ్‌లను చేయవచ్చు.

యాక్టివా బైక్ కోసం ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్

ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్

చిన్న యాక్సిడెంటల్ రిపేరింగ్స్ కోసం మా ఓవర్‌నైట్ రిపేర్ సేవతో, మీ బైక్‌ను ఉదయం వరకు ప్రయాణానికి సిద్ధంగా అందుకోవచ్చు. అలాగే, మీరు మీ నిద్రను కోల్పోకుండా రాత్రివేళలో మీ బైక్‌ను రిపేర్ చేయించవచ్చు. మరుసటి రోజు ఉదయం దానిని తిరిగి ఒరిజినల్ స్థితిలో పొందవచ్చు.

యాక్టివా బైక్ కోసం నగదురహిత సహాయం

నగదురహిత సహాయం

భారతదేశ వ్యాప్తంగా ఉన్న హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి 2000+ నెట్‌వర్క్ గ్యారేజీల కారణంగా ధన్యవాదాలు, మీ బైక్‌ను రిపేర్ చేయించడానికి మీరు ఎప్పుడూ మీ సమీపంలోనే ఒక నెట్‌వర్క్ గ్యారేజీని కనుగొంటారు.

యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్రీమియం లెక్కించండి

బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ - రిజిస్ట్రేషన్ నంబర్

దశ 1

మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి

ప్రీమియంని లెక్కించండి
బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ - పాలసీ కవర్

దశ 2

మీ పాలసీ కవర్‌ను ఎంచుకోండి*
(ఒకవేళ మేము మీ వాహన వివరాలను ఆటోమేటిక్‌గా పొందలేకపోతే, మాకు మీ వాహనం యొక్క కొన్ని వివరాలు మాత్రమే అవసరం
- మేక్, మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ సంవత్సరం మరియు రిజిస్ట్రేషన్ నగరం)

ప్రీమియంని లెక్కించండి
బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ - NCB వివరాలు

దశ 3

మీ మునుపటి పాలసీని మరియు
నో క్లెయిమ్ బోనస్ (NCB) స్థితిని అందించండి

ప్రీమియంని లెక్కించండి
బైక్ ఇన్సూరెన్స్ కోట్‌ను పొందండి

దశ 4

మీ బైక్ ఇన్సూరెన్స్ కోట్‌ను తక్షణమే పొందండి!

ప్రీమియంని లెక్కించండి
Slider Right
Slider left

హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్‌‌ను ఎలా కొనుగోలు/రెన్యూ చేయాలి?


కేవలం కొన్ని క్లిక్‌లతో, మీరు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ యాక్టివా కోసం బైక్ ఇన్సూరెన్స్ పాలసీని సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీకు ఇప్పటికే గడువు ముగియబోతున్న ఒక యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉంటే, అంతరాయం లేని కవరేజీని ఆనందించడానికి మీ హోండా యాక్టివా ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేసుకోండి. క్రింది నాలుగు-దశల ప్రక్రియను అనుసరించండి మరియు మీ బైక్‌ను తక్షణమే సురక్షితం చేసుకోండి!

  • హోండా యాక్టివా ఇన్సూరెన్స్ కొనండి/రెన్యూ చేసుకోండి
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్‌ను ఎంచుకోండి
  • యాక్టివా బైక్ వివరాలు
    దశ #2
    కొత్త పాలసీని కొనుగోలు చేయడానికి మీ బైక్ వివరాలు, రిజిస్ట్రేషన్, నగరం మరియు మునుపటి పాలసీ వివరాలు ఏవైనా ఉంటే, వాటిని నమోదు చేయండి
  • యాక్టివా ఇన్సూరెన్స్ కోట్ జనరేషన్
    దశ #3
    కోట్‌ను స్వీకరించడానికి మీ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్‌ను అందించండి
  • యాక్టివా ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు
    దశ #4
    ఆన్‌లైన్ చెల్లింపు చేయండి మరియు తక్షణమే కవరేజ్ పొందండి!

ఆన్‌లైన్‌లో హోండా యాక్టివా ఇన్సూరెన్స్కొనుగోలు చేయడం వలన కలిగే ప్రయోజనాలు


మనం ఒక డిజిటల్ యుగంలో నివసిస్తున్నాము, ఇక్కడ ప్రతిదీ మీ వేలికొనలపై కొనుగోలు చేయవచ్చు. హోండా యాక్టివా ఇన్సూరెన్స్ రెన్యూవల్ విషయానికి వస్తే, మీరు ఎటువంటి ఆందోళన లేకుండా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి

1
తక్షణ కోట్స్ ని పొందండి
మా టూ వీలర్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్లతో, మీరు హోండా యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కోసం తక్షణ కోట్స్ పొందుతారు. మీ టూ వీలర్ వివరాలను ఎంటర్ చేయండి ; పన్నులతో సహా మరియు వాటిని మినహాయించి ప్రీమియం ప్రదర్శించబడుతుంది. మీరు మీ సమగ్ర పాలసీతో యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు, తక్షణమే అప్‌డేట్ చేయబడిన ప్రీమియంను పొందవచ్చు.
2
తక్షణ జారీ
మీరు నిమిషాల్లో ఆన్‌లైన్‌లో యాక్టివా ఇన్సూరెన్స్ ప్లాన్‌ను పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బైక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఒక ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూర్తి చేయాలి. దీనిలో, మీరు వాహన వివరాలను అందించాలి, సమగ్ర ఇన్సూరెన్స్ మరియు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మధ్య ఎంచుకోవాలి. చివరగా, హోండా యాక్టివా ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించండి. పాలసీ కేవలం కొన్ని క్లిక్‌ల దూరంలో ఉన్నందున గంటలు, రోజులు లేదా వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
3
అవాంతరాలు లేనిది, పారదర్శకతతో కూడినది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు ప్రక్రియ అవాంతరాలు లేనిది మరియు పారదర్శకమైనది. ఆన్‌లైన్‌లో యాక్టివా ఇన్సూరెన్స్ ప్లాన్‌లను కొనుగోలు చేయడానికి మీరు కొన్ని సులభమైన దశలను అనుసరించాలి మరియు ఇందులో ఎటువంటి రహస్య ఛార్జీలు లేవు. మీరు చూసిందే మీరు చెల్లిస్తారు.
4
చెల్లింపు రిమైండర్లు
మీ యాక్టివా ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అవ్వకుండా ఉండడానికి మేము సకాలంలో విక్రయానంతర సేవలు అందిస్తున్నాము. అలాగే, మీరు బైక్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తర్వాత. మా వైపు నుండి హోండా యాక్టివా ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం మీరు ఒక రెగ్యులర్ రిమైండర్ పొందుతారు. ఇది మీరు నిరంతరాయ కవరేజీని పొందడానికి మరియు చెల్లుబాటు అయ్యే బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండడం ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా ఉండేలాగా నిర్ధారిస్తుంది.
5
అతితక్కువ పేపర్ వర్క్
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అనేక డాక్యుమెంట్ల అవసరం ఉండదు. మీరు మొదటిసారి పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీ హోండా యాక్టివా రిజిస్ట్రేషన్ ఫారంలు మరియు వివరాలు మరియు మీ KYC డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత, మీరు బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఎంచుకోవచ్చు లేదా ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా మీ ప్లాన్‌ను పోర్ట్ చేసుకోవచ్చు.
6
సౌలభ్యం
యాక్టివా ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం సౌకర్యవంతం మరియు సులభం. మీరు మా బ్రాంచ్‌లను సందర్శించవలసిన అవసరం లేదు లేదా ఏజెంట్ మిమ్మల్ని సంప్రదించడానికి వేచి ఉండవలసిన అవసరం లేదు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు మరియు తగిన బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. అలాగే, రోజులో ఏ సమయంలోనైనా మరియు ఎక్కడినుండైనా ఆన్‌లైన్‌లో టూ వీలర్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ఫ్లెక్సిబిలిటీని ఆనందించండి.

హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఎలా ఫైల్ చేయాలి?

మీరు మీ హోండా యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ పై నగదురహిత క్లెయిమ్ చేయాలనుకుంటే, అప్పుడు మీరు ఈ క్రింది దశలను అనుసరించాలి:

• మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా సంఘటనకు సంబంధించి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందానికి తెలియజేయండి.

• మీ టూ-వీలర్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్యాష్‌లెస్ నెట్‌వర్క్ గ్యారేజీకి తీసుకువెళ్ళండి. ఇక్కడ, ఇన్సూరర్ నియమించిన వ్యక్తి ద్వారా మీ వాహనం తనిఖీ చేయబడుతుంది.

• మా అప్రూవల్ అందుకున్న తర్వాత, గ్యారేజీ మీ బైక్‌ను రిపేర్ చేయడం ప్రారంభిస్తుంది.

• ఈ సమయంలో, అవసరమైన డాక్యుమెంట్లు మరియు సరిగ్గా నింపబడిన క్లెయిమ్ ఫారంను మాకు సబ్మిట్ చేయండి. ఏదైనా నిర్దిష్ట డాక్యుమెంట్ అవసరమైతే, మేము దాని గురించి మీకు తెలియజేస్తాము.

• హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందం బైక్ ఇన్సూరెన్స్‌లోని నగదురహిత క్లెయిమ్ వివరాలను ధృవీకరిస్తుంది మరియు క్లెయిమ్‌ను అంగీకరిస్తుంది లేదా తిరస్కరిస్తుంది.

• విజయవంతమైన ధృవీకరణ తర్వాత, మరమ్మత్తు ఖర్చులను నేరుగా గ్యారేజీకి చెల్లించడం ద్వారా మేము నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సెటిల్ చేస్తాము. మీరు వర్తించే మినహాయింపులు, ఏవైనా ఉంటే, మీ స్వంత ఖర్చుతో చెల్లించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

గమనిక: థర్డ్-పార్టీ నష్టం జరిగిన సందర్భంలో, మీరు యాక్సిడెంట్‌లో ప్రమేయం ఉన్న ఇతర వాహన యజమాని వివరాలను తీసుకోవచ్చు. అయితే, మీ మీ వాహనానికి పెద్ద నష్టం జరిగినప్పుడు లేదా దొంగతనం చేయబడినప్పుడు, నగదురహిత బైక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు మీరు సమీప పోలీస్ స్టేషన్‌లో FIR రిపోర్ట్‌ను ఫైల్ చేయాలి

యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు

యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది

1. మీ హోండా యాక్టివా యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) బుక్ కాపీ.

2. ప్రమాదం సందర్భంలో ఇన్సూర్ చేయబడిన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యొక్క డ్రైవర్ లైసెన్స్ కాపీ.

3. సంఘటన జరిగిన సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫైల్ చేయబడిన FIR కాపీ.

4. గ్యారేజీ నుండి రిపేరింగ్స్ కోసం అంచనాలు

5. మీ కస్టమర్ (KYC) డాక్యుమెంట్లను తెలుసుకోండి

యాక్టివా థెఫ్ట్ క్లెయిముల కోసం అవసరమైన అదనపు డాక్యుమెంట్లు

యాక్టివా థెఫ్ట్ క్లెయిములను ఫైల్ చేయడానికి అవసరమైన అదనపు డాక్యుమెంట్ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది

• యాక్టివా టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క అసలు డాక్యుమెంట్లు

• సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయం నుండి దొంగతనం ఆమోదం

• సర్వీస్ బుక్‌లెట్స్/ బైక్ కీస్ మరియు వారంటీ కార్డు

• టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్, ఇన్సూరెన్స్ కంపెనీ వివరాలు మరియు పాలసీ వ్యవధి లాంటి మునుపటి టూ వీలర్ ఇన్సూరెన్స్ వివరాలు

• పోలీస్ FIR/ JMFC రిపోర్ట్/ ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్

• సంబంధిత RTOకు దొంగతనం గురించి వివరిస్తూ మరియు బైక్‌ "ఉపయోగించనిది" గా పేర్కొంటూ రాసిన ఒక లెటర్ యొక్క ఆమోదించబడిన కాపీ

మీ యాక్టివా కోసం టాప్ టిప్స్

మీరు హోండా యాక్టివా యజమాని అయితే, మీ స్కూటర్‌ను ఉత్తమ పరిస్థితిలో ఉంచడానికి కొన్ని ప్రాథమిక చిట్కాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

• అతి వేగం నివారించండి మరియు మీ వాహనాన్ని 40–60 km/hr మధ్య ఉండే వేగంతో నడపండి.

• రైడ్ చేసేటప్పుడు ఎక్కువ బరువుతో మీ వాహనాన్ని ఓవర్‌లోడ్ చేయవద్దు. ఇది ప్రమాదకరం మాత్రమే కాదు, ఇది వాహనం యొక్క ఇంధన సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

• ప్రతి 1800-2000 km తర్వాత మీ యాక్టివాని సర్వీసింగ్ చేయించడం మరచిపోవద్దు.

• టైర్లలో ఎల్లప్పుడూ సరైన ఎయిర్ ప్రెజర్ ఉండే విధంగా చూసుకోండి.

• వాహనాన్ని రిజర్వ్‌లో నడపడం నివారించండి మరియు ఎల్లప్పుడూ పెట్రోల్ ట్యాంక్‌ను సగం కంటే ఎక్కువ స్థాయిలో ఉంచుకోండి.

• మీ యాక్టివాను షేడ్‌లో పార్క్ చేయడానికి ప్రయత్నించండి మరియు ఎండలో పార్కింగ్ నివారించండి.

• మీ యాక్టివాను శుభ్రంగా ఉంచండి మరియు సరైన టూ వీలర్ క్లీనింగ్ లిక్విడ్‌తో క్రమం తప్పకుండా వాష్ చేయించుకోండి.

2000కు పైగా భారతదేశం అంతటా నెట్‌వర్క్ గ్యారేజీలు

హోండా యాక్టివా బ్లాగులు

హోండా యాక్టివా 7G గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

హోండా యాక్టివా 7G గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జనవరి 02, 2023 నాడు ప్రచురించబడింది
రాబోయే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్ నుండి మనం ఏమి ఆశించవచ్చు?

రాబోయే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వేరియంట్ నుండి మనం ఏమి ఆశించవచ్చు?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
నవంబర్ 23, 2022న ప్రచురించబడింది
యూజ్డ్ హోండా యాక్టివా కొనుగోలు చేయడానికి కారణాలు

యూజ్డ్ హోండా యాక్టివా కొనుగోలు చేయడానికి కారణాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
మే 26, 2022న ప్రచురించబడింది
గడచిన సంవత్సరాలలో హోండా యాక్టివా పరిణామం

గడచిన సంవత్సరాలలో హోండా యాక్టివా పరిణామం?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ప్రచురణ తేదీ ఏప్రిల్ 21, 2022
హోండా యాక్టివా స్కూటర్ పొందేటప్పుడు పరిగణించవలసిన ప్రధాన కారణాలు

హోండా యాక్టివా స్కూటర్ పొందేటప్పుడు పరిగణించవలసిన ప్రధాన కారణాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ప్రచురణ తేదీ ఏప్రిల్ 05, 2022
blog right slider
blog left slider
మరిన్ని బ్లాగ్‌లను చూడండి
ఇప్పుడే ఉచిత కోట్ పొందండి
టూ వీలర్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి సమయం ఆసన్నమైంది

యాక్టివా ఇన్సూరెన్స్ పై సాధారణ ప్రశ్నలు


అవును, మీరు కొంచెం అదనపు ప్రీమియం చెల్లించడంతో చేయవచ్చు. మీ సమగ్ర ఇన్సూరెన్స్‌లో యాడ్-ఆన్‌లు చేర్చబడలేదు. కావున, కవరేజీని మెరుగుపరచడానికి మీరు వాటిని విడిగా కొనుగోలు చేయాలి. మేము జీరో డిప్రిసియేషన్ మరియు ఎమర్జెన్సీ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్‌లను అందిస్తాము.
మీరు మీ లాప్స్ అయిన హోండా యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని ఆఫ్‌లైన్‌లో రెన్యూ చేస్తే ఇన్‌స్పెక్షన్ తప్పనిసరి. అవసరమైన డాక్యుమెంట్లతో పాటు మీరు మీ బైక్‌ను ఇన్సూరర్‌ వద్దకు తీసుకువెళ్లాలి.
అవును, ఉంది. మీరు యాక్సిడెంట్ లేదా దొంగతనం జరిగిన 24 గంటల్లోపు క్లెయిమ్‌ను ఫైల్ చేయాలి, లేని పక్షంలో మీ క్లెయిమ్ తిరస్కరించబడవచ్చు. అయితే, కొన్ని సందర్భాల్లో క్లెయిమ్‌ ఫైల్ చేయడంలోని ఆలస్యానికి నిజమైన కారణం ఉంటే, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ దానిని పరిగణలోకి తీసుకుంటారు.
మీ యాక్టివా దొంగిలించబడితే, సంఘటన జరిగిన సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో వెంటనే FIR ఫైల్ చేయండి. 8169500500 పై వాట్సాప్ పై ఒక సందేశాన్ని పంపడం ద్వారా మా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందానికి క్లెయిమ్‌ను పంపించండి. మరింత ప్రాసెస్ కోసం మా క్లెయిమ్ బృందం మీకు మార్గనిర్దేశం చేస్తుంది.
మీ హోండా యాక్టివా కోసం ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) సెట్ చేయడానికి ఉత్తమ మార్గం ఏంటంటే దాని ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధరను తనిఖీ చేయడం మరియు దాని విడిభాగాలపై డిప్రిసియేషన్ నుండి విలువను తగ్గించడం. గుర్తుంచుకోండి, మీ వాహనం కోసం సరైన IDVని ఎల్లప్పుడూ ప్రకటించండి, ఎందుకంటే మీ వాహనాన్ని రిపేర్ చేయడం సాధ్యం కానప్పుడు లేదా పోయినప్పుడు మీరు ఒక క్లెయిమ్ చేసినట్లయితే, ఇన్సూరర్ ఆ మొత్తాన్ని అందిస్తారు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో టూ వీలర్ ఇన్సూరెన్స్ పాలసీతో మీరు హోండా యాక్టివా ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో మీ వాహనాన్ని తనిఖీ చేయడానికి మా సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ యాప్‌ను ఉపయోగించవచ్చు. ఇది కాకుండా, మీరు మా సర్వేయర్‌తో కూడా ఒక అపాయింట్ బుక్ చేసుకోవచ్చు, ఆ వ్యక్తి మీ స్థలానికి వస్తారు మరియు మీ వాహనానికి సర్వే చేస్తారు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి, మా హోమ్ పేజీలోని హెల్ప్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మీ పాలసీ నంబర్ లేదా మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నమోదు చేయడం ద్వారా మీరు మీ యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ పాలసీని అక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అవును, యాక్టివా ఇన్సూరెన్స్‌ను బదిలీ చేయడం సాధ్యం అవుతుంది. వాహనం విక్రయించిన 14 రోజుల్లోపు మీరు మీ యాక్టివా బైక్ ఇన్సూరెన్స్ పాలసీ యొక్క యాజమాన్యాన్ని కొత్త యజమానికి బదిలీ చేయాలి. ఇది అన్ని సంబంధిత డాక్యుమెంట్లు మరియు ఇన్సూరెన్స్ సంబంధిత ట్రాన్స్‌ఫర్ ఫారంలను ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించడం ద్వారా చేయబడాలి.