
Comprehensive car insurance is a type of car insurance policy which offers full-fledged protection for your vehicle. It covers third-party liabilities as required by law and also protects own damage to your vehicle caused by accidents, theft, fire, floods, and other natural or man-made events. With this wide coverage, you can drive with confidence and peace of mind.
This policy also includes a personal accident cover of up to ₹15 lakhs~* for the owner-driver, providing financial support in case of accidental injury or death. With HDFC ERGO, you can customize your plan with useful add-ons like Zero Depreciation, EMI Protector Plus, Return to Invoice, and more.
ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ థర్డ్-పార్టీ నష్టాలు మరియు వాహనానికి స్వంత నష్టాలను కవర్ చేస్తుంది. కారు కోసం సమగ్ర ఇన్సూరెన్స్ కింద ఇన్సూర్ చేయబడిన ఏదైనా ప్రమాదం కారణంగా మీ వాహనానికి నష్టం జరిగిన సందర్భంలో, ఇన్సూరర్ రిపేరింగ్ ఖర్చును భరిస్తారు. దొంగతనం జరిగిన సందర్భంలో, ఇన్సూరెన్స్ సంస్థ మీకు కలిగిన ఆర్థిక నష్టాన్ని కవర్ చేస్తూ ఏకమొత్తంలో ప్రయోజనాన్ని చెల్లిస్తుంది. మీరు ఒక నెట్‌వర్క్ గ్యారేజీలో మీ కారును మరమ్మత్తు చేయించుకుంటే, సమగ్ర ఇన్సూరెన్స్ క్రింద క్యాష్‌లెస్ క్లెయిమ్ కూడా చేయవచ్చు.
ఉదాహరణ: వరద కారణంగా మిస్టర్ A వాహనం దెబ్బతిన్నట్లయితే మరమ్మత్తు ఖర్చును ఇన్సూరర్ భరిస్తారు.మరోవైపు, ఏదైనా థర్డ్-పార్టీ శారీరకంగా గాయపడినా లేదా చంపబడినా లేదా ఇన్సూర్ చేయబడిన వాహనం ద్వారా ఏదైనా థర్డ్-పార్టీ ఆస్తి దెబ్బతిన్నా, పాలసీదారు ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ క్రింద ఈ నష్టాలకు ఖర్చులను క్లెయిమ్ చేయవచ్చు. ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ క్రింద మీ వలన కలిగిన ఆర్థిక నష్టానికి థర్డ్ పార్టీకి చెల్లించవలసిన పరిహారాన్ని ఇన్సూరర్ నిర్వహిస్తారు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజ్ కింద అనేక చేర్పులను ఈ క్రింది అంశాలు వివరిస్తాయి ;
కారు ప్రమాదంలో పడ్డారా? ప్రశాంతంగా ఉండండి, ప్రమాదంలో మీ కారుకు జరిగిన నష్టాన్ని మేము కవర్ చేస్తాము.
ఒక అగ్నిప్రమాదం లేదా విస్ఫోటనం మీ సేవింగ్‌లను హరించి వేయడాన్ని మేము అనుమతించము, మీ కారు పూర్తిగా కవర్ చేయబడుతుందని నిశ్చింతగా ఉండండి.
మీ కారు దొంగతనానికి గురికావడం అనేది మీ పీడకల నిజం కావడంతో సమానం, ఈ పరిస్థితులలో మీ మనశ్శాంతికి భంగం కలగకుండా మేము మీకు భరోసా ఇస్తున్నాము.
విపత్తులు వినాశనానికి దారితీస్తాయి, మీ కారు వాటికి అతీతమైనది కాదు, కానీ మీ ఆర్థిక పరిస్థితి మాత్రం దెబ్బతింటుంది!
మీ భద్రతయే మా ప్రాధాన్యత, కారు యాక్సిడెంట్ కారణంగా జరిగిన గాయాలకు మేము మీ చికిత్స ఖర్చులను కవర్ చేస్తాము.
మేము మా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫీచర్ ద్వారా థర్డ్ పార్టీ ఆస్తికి జరిగే నష్టాలను లేదా థర్డ్ పార్టీ వ్యక్తికి కలిగిన గాయాలను కవర్ చేస్తాము.
భారతదేశంలో మీ ఫోర్-వీలర్ కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని కీలక ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ;
సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ సంబంధిత ప్రధాన ఫీచర్లు మరియు ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి
ప్రతి సంవత్సరం కారు విలువ తగ్గుతుంది. అయితే జీరో డిప్రిసియేషన్ కవర్‌తో, మీరు క్లెయిమ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు క్లెయిమ్ పూర్తి మొత్తాన్ని అందుకుంటారు.
క్లెయిమ్ చేశారా, మీ NCB డిస్కౌంట్ గురించి ఆందోళన చెందుతున్నారా? చింతించకండి, ఈ యాడ్ ఆన్ కవర్ మీరు ఇప్పటివరకు సంపాదించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించడమే కాకుండా, తదుపరి NCB స్లాబ్‌కు కూడా తీసుకువెళ్లి మీ ప్రీమియంపై గణనీయమైన డిస్కౌంట్‌ను అందిస్తుంది.
మీ కారులోని ఏదైనా సాంకేతికత లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము 24 గంటలూ మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఈ యాడ్-ఆన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు గ్రీజ్, లూబ్రికెంట్లు, ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, బ్రేక్ ఆయిల్ మొదలైన వినియోగ వస్తువులకు కవరేజ్ పొందవచ్చు.
ఒక యాక్సిడెంట్ కారణంగా మీ కారు టైర్ లేదా ట్యూబ్ దెబ్బతిన్నట్లయితే ఈ యాడ్-ఆన్ కవర్ ఉపయోగకరంగా ఉంటుంది. టైర్ సెక్యూర్ కవర్ ఇన్సూర్ చేయబడిన వాహనానికి చెందిన టైర్లు మరియు ట్యూబ్‌ల రీప్లేస్‌మెంట్ ఖర్చులకు కవరేజ్ అందిస్తుంది.
మీ కారు అంటే మీకు చాలా ఇష్టమా? మీ కారుకు ఈ యాడ్‌ను కవర్‌ను జోడించండి, దొంగతనం లేదా మీ కారుకు జరిగిన పూర్తి నష్టాన్ని, మీ ఇన్‌వాయిస్ విలువను తిరిగి పొందండి.
ఇంజిన్ మీ కారుకు గుండె లాంటిది, అది సురక్షితం చేయబడిందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. ఈ కవర్ మీ కార్ ఇంజిన్ దెబ్బతినడం వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుండి మిమ్మల్ని కాపాడుతుంది.
కారు గ్యారేజీలో ఉందా? మీ కారు గ్యారేజిలో రిపేర్ అవుతున్నప్పుడు, మీ రోజువారీ ప్రయాణానికి క్యాబ్‌ల కోసం మీరు వెచ్చించే ఖర్చులను భరించడంలో ఈ కవర్ సహాయపడుతుంది.
ఈ యాడ్-ఆన్ కవర్‌తో మీ సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని కస్టమైజ్ చేయడం ద్వారా మీరు ల్యాప్‌టాప్, వాహన డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు మొదలైనటువంటి మీ వ్యక్తిగత వస్తువులను కోల్పోవడానికి కవరేజ్ పొందవచ్చు.
పాలసీ సంవత్సరం చివరిలో ఓన్-డ్యామేజ్ ప్రీమియంపై ప్రయోజనాలను పొందడానికి పే యాజ్ యు డ్రైవ్ యాడ్-ఆన్ కవర్ మీకు వీలు కల్పిస్తుంది. మీరు 10,000km కంటే తక్కువ డ్రైవ్ చేస్తే పాలసీ వ్యవధి ముగింపులో ప్రాథమిక ఓన్-డ్యామేజ్ ప్రీమియంలో 25% వరకు ప్రయోజనాలను క్లెయిమ్ చేయవచ్చు.
సమగ్ర ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను కవర్ చేయదు. పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది యజమాని-డ్రైవర్ కోసం ఒక సౌకర్యం. కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద వాహనం యజమాని తీసుకోవాల్సిన తప్పనిసరి పొడిగింపు. మోటార్ ఇన్సూరెన్స్ కింద తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ వాహనం యజమాని పేరుతో జారీ చేయబడుతుంది. మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ లేకపోతే, మీరు సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు దానిని ఎంచుకోవచ్చు.
ఒక వర్షాకాలం రోజున మీకు గొడుగు, గమ్ బూట్లు, రెయిన్‌కోట్ మరియు నాసిరకం జాకెట్‌ను ఇచ్చి, వాటి మధ్యన ఎంపిక చేసుకోమ్మని అడిగినప్పుడు, మీరు దేనిని ఎంచుకుంటారు? క్షణం కూడా ఆలస్యం చేయకుండా, మొదటి వస్తువునే మీ సమాధానంగా ఎంచుకుంటారు, ఎందుకనగా అది అత్యంత సురక్షితమైన, తెలివైన ప్రత్యామ్నాయం. అయితే, కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ లేదా మీ కారు కోసం ఒక థర్డ్ పార్టీ కవర్ ఈ రెండింటి మధ్యన ఎంచుకోవడానికి సంబంధించిన ప్రశ్న కూడా అదే విధంగా ఉంటుంది. కేవలం థర్డ్ పార్టీ బాధ్యతల నుండి రక్షణ కోసం కవర్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల మీరు ఆర్థిక నష్టాలు కలిగించే అనేక ప్రమాదాలకు గురవుతారు మరియు కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీతో మీ కారుకు 360 డిగ్రీల పరిధిలో కవరేజ్ లభిస్తుంది. ఇంకా ఆలోచిస్తున్నారా? ఈ రెండింటి వల్ల కలిగే లాభాలు, నష్టాలను అంచనా వేయడంలో మేము మీకు సహాయం చేస్తాము:
దీనిని ఎంచుకున్నారు | ||
|---|---|---|
| సమగ్ర కవర్ | థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ కవర్ | |
| ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టం - భూకంపం, సైక్లోన్, వరదలు మొదలైనవి. | చేర్చబడినది | మినహాయించబడింది |
| అగ్నిప్రమాదం, దొంగతనం, విధ్వంసం మొదలైన సంఘటనల కారణంగా జరిగే నష్టం. | చేర్చబడినది | మినహాయించబడింది |
| ₹15 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ | చేర్చబడినది | చేర్చబడినది |
| యాడ్-ఆన్‌ల ఎంపిక – జీరో డిప్రిసియేషన్, NCB రక్షణ మొదలైనవి. | చేర్చబడినది | మినహాయించబడింది |
| థర్డ్ పార్టీ వాహనానికి/ ఆస్తికి జరిగిన నష్టం | చేర్చబడినది | చేర్చబడినది |
| థర్డ్ పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు | చేర్చబడినది | చేర్చబడినది |
| చెల్లుబాటు అయ్యే పాలసీ అమలులో ఉన్నట్లయితే భారీ జరిమానాలు విధించబడవు | చేర్చబడినది | చేర్చబడినది |
| కారు విలువ కస్టమైజేషన్ | చేర్చబడినది | మినహాయించబడింది |
ఒక సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు, దాని ప్రీమియం ఎలా లెక్కించబడుతుందో తెలుసుకోవడం అవసరం. మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి దశలవారీ గైడ్ ఇక్కడ ఇవ్వబడింది
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లో సమగ్ర కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం సులభం మరియు సజావుగా ఉంటుంది. మీరు మీ సౌలభ్యం కోసం మా కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను కూడా ఉపయోగించవచ్చు.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం దాని విస్తృత శ్రేణి కవరేజ్ మరియు అదనపు ప్రయోజనాల కారణంగా అత్యంత సిఫార్సు చేయబడుతుంది. కారు యజమానులు తమ కార్ల కోసం సమగ్ర ఇన్సూరెన్స్ను కొనుగోలు చేయడాన్ని ఎందుకు పరిగణించాలి అనేదానికి కొన్ని కీలక కారణాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి;
The premium for a comprehensive insurance policy is higher than a third-party car insurance plan. The higher premium is justified, given the policy's enhanced scope of coverage. Besides, there are multiple other factors affecting the car insurance premium. The following section highlights some of the key aspects that can influence the premium payable for a comprehensive car insurance policy;
ఒక కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం సాపేక్షంగా సులభం. కేవలం ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించండి మరియు ప్రాసెస్‌ను అనుసరించండి, మీ క్లెయిమ్ త్వరగా సెటిల్ చేయబడుతుంది. అయితే, క్లెయిమ్ చేసేటప్పుడు మీరు పరిగణించాల్సిన కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి -
• ఎల్లప్పుడూ క్లెయిమ్ తర్వాత, వెంటనే ఆ విషయాన్ని ఇన్సూరర్‌కు తెలియజేయండి. ఇది ఆ సంస్థ, క్లెయిమ్‌ను నమోదు చేసుకోవడానికి మరియు మీకు క్లెయిమ్ రిఫరెన్స్ నంబర్ ఇవ్వడానికి అనుమతిస్తుంది. భవిష్యత్తులో క్లెయిమ్ సంబంధిత సంప్రదింపుల కోసం ఆ నంబర్ అవసరం అవుతుంది.
• థర్డ్-పార్టీ క్లెయిమ్ లేదా దొంగతనం విషయంలో పోలీస్ FIR తప్పనిసరి.
• కొన్ని సందర్భాలను పాలసీ కవర్ చేయదు. తిరస్కరణలను నివారించడానికి, మీరు పాలసీ మినహాయింపుల కోసం క్లెయిమ్ చేయలేదని నిర్ధారించుకోండి.
• మీరు నగదురహిత గ్యారేజీలో మీ కారును రిపేర్ చేయించనట్లయితే, రిపేర్ ఖర్చులను మీరే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. తదుపరి, మీరు ఇన్సూరెన్స్ కంపెనీతో క్లెయిమ్‌ను సబ్మిట్ చేయడం ద్వారా ఖర్చుల కోసం రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
• మీరు చేసే ప్రతి క్లెయిమ్‌లో మినహాయించదగిన ఖర్చును మీరు భరించాలి.
మా 4 దశల ప్రాసెస్‌తో క్లెయిమ్‌ను ఫైల్ చేయడం ఇప్పుడు సులభం, అలాగే, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రికార్డు మీ క్లెయిమ్ సంబంధిత ఆందోళనలను దూరం చేస్తుంది!
ఎన్‌సిబి అంటే నో క్లెయిమ్ బోనస్. మీరు ఒక పాలసీ సంవత్సరంలో క్లెయిమ్ చేయకపోతే సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీలో ఈ బోనస్ సంపాదిస్తారు. NCBతో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి తరువాతి పాలసీ సంవత్సరంలో వారి ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసినప్పుడు వారి సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై డిస్కౌంట్ పొందుతారు. ప్రతి వరుస క్లెయిమ్ రహిత సంవత్సరం తర్వాత NCB రేటు కూడా పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో, పాలసీదారు మొదటి పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిములు చేయకపోతే 20% NCB డిస్కౌంట్ పొందుతారు.
పర్యవసానంగా, పాలసీదారు ప్రతి వరుస క్లెయిమ్-ఫ్రీ సంవత్సరంతో అదనంగా 5% నుండి 10% NCB పొందుతారు. అయితే, మీరు ఒక క్లెయిమ్ చేసిన తర్వాత, జమ చేయబడిన NCB సున్నా అవుతుంది. ఆ తర్వాత, మీరు తదుపరి పాలసీ సంవత్సరం నుండి NCB సంపాదించడం ప్రారంభిస్తారు. కార్ ఇన్సూరెన్స్‌లో నో క్లెయిమ్ బోనస్ (NCB) గురించి దాని ప్రయోజనాలు, అది ఎలా లెక్కించబడుతుంది, దానిని ఎలా రద్దు చేయవచ్చు మొదలైనటువంటి మరింత తెలుసుకోవడానికి, ఇక్కడక్లిక్ చేయండి.
NCB, రెన్యూవల్స్ పై మీకు ప్రీమియం డిస్కౌంట్‌ను అనుమతిస్తుంది. NCB రేటు ఈ కింది విధంగా ఉంటుంది:
| క్లెయిమ్-రహిత సంవత్సరాల సంఖ్య | అనుమతించబడిన NCB |
| మొదటి క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత | 20% |
| రెండు విజయవంతమైన క్లెయిమ్-రహిత సంవత్సరాల తర్వాత | 25% |
| మూడు విజయవంతమైన క్లెయిమ్-రహిత సంవత్సరాల తర్వాత | 35% |
| నాలుగు క్లెయిమ్-రహిత సంవత్సరాల తర్వాత | 45% |
| ఐదు విజయవంతమైన క్లెయిమ్-రహిత సంవత్సరాల తర్వాత | 50% |
సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అనేది వాహనం మరమ్మత్తు లేదా దొంగిలించబడకుండా దెబ్బతిన్నట్లయితే పాలసీదారు ఇన్సూరర్ నుండి అందుకునే గరిష్ట మొత్తం. IDV అనేది కారు యొక్క సుమారు మార్కెట్ విలువ మరియు ఇది డిప్రిసియేషన్ కారణంగా ప్రతి సంవత్సరం మారుతుంది. ఉదాహరణకు, మీరు పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీ కారు IDV రూ. 10 లక్షలు అయితే మరియు అది దొంగిలించబడినప్పుడు మీ ఇన్సూరర్ రూ. 10 లక్షల మొత్తాన్ని అందిస్తారు. ఇన్సూర్ చేసేటప్పుడు పాలసీదారు ద్వారా IDV ప్రకటించబడుతుంది. ఇది సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను నేరుగా ప్రభావితం చేస్తుంది. IDV ఎంత ఎక్కువగా ఉంటే, ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.
IDV ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది - IDV = (తయారీదారు నిర్ణయించిన కారు ధర - కారు వయస్సు ఆధారంగా తరుగుదల) + (కారుకు జోడించబడిన యాక్సెసరీల ధర - అటువంటి యాక్సెసరీల వయస్సు ఆధారంగా తరుగుదల). ఈ పేజీలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) గురించి మరింత చదవండి, అది ఎంత ముఖ్యమైనది, దానిని ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి, ఇది కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఎలా ప్రభావితం చేస్తుంది మొదలైనవి.
డిప్రిసియేషన్ రేటు ముందుగా-నిర్ణయించబడుతుంది. అది ఈ కింది విధంగా ఉంటుంది –
| కారు వయస్సు | డిప్రిసియేషన్ రేటు |
| 6 నెలల వరకు | 5% |
| ఆరు నెలల కంటే ఎక్కువ కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ | 15% |
| ఒక సంవత్సరం కంటే ఎక్కువ కానీ రెండు సంవత్సరాల కంటే తక్కువ | 20% |
| రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కానీ మూడు సంవత్సరాల కంటే తక్కువ | 30% |
| మూడు సంవత్సరాల కంటే ఎక్కువ కానీ నాలుగు సంవత్సరాల కంటే తక్కువ | 40% |
| నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ కానీ ఐదు సంవత్సరాల కంటే తక్కువ | 50% |

సాధారణ కారు ఇన్సూరెన్స్‌తో పోలిస్తే సవరించబడిన కార్ల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సవరణలు మీ వాహనం దొంగతనం లేదా సామర్థ్యాన్ని పెంచుతాయి కాబట్టి. ఉదాహరణకు, మీరు మీ వాహనాన్ని టర్బో ఇంజిన్‌తో అమర్చినట్లయితే, మీ కారు వేగం పెరిగితే, అది ప్రమాదంలో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ఈ అన్ని సంభావ్యతలను పరిగణనలోకి తీసుకుంటారు మరియు మీరు మీ వాహనాన్ని సవరించినప్పుడు మీ ప్రీమియం మొత్తం పెరుగుతుంది. మరోవైపు, మీరు మీ కారులో పార్కింగ్ సెన్సార్లను ఇన్‌స్టాల్ చేస్తే, రివర్స్ చేసేటప్పుడు మీ వాహనాన్ని క్రాష్ చేసే ప్రమాదం తగ్గుతుంది కాబట్టి ప్రీమియం తగ్గుతుంది.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం, ఒక విక్రేతగా మీరు కారును విక్రయించిన 14 రోజుల్లోపు ప్రస్తుత కారు ఇన్సూరెన్స్ పాలసీని కొత్త యజమానికి బదిలీ చేయాలి. కార్ల మార్పిడి లేదా కార్ల కొనుగోలు-విక్రయంలో ముఖ్యమైన భాగం ఏమిటంటే, మునుపటి యజమాని నుండి తదుపరి యజమానికి ఇన్సూరెన్స్ పాలసీని మార్పిడి లేదా బదిలీ చేయడం. మీరు ఊహించని ప్రమాదాల నుండి మీ కారును ఆర్థికంగా సురక్షితం చేయడానికి ఇన్సూరెన్స్ కొనుగోలు చేస్తారు. ఒకవేళ మీ వద్ద కారు లేకపోతే కారు ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటానికి ఎలాంటి అవకాశం లేదు. అందువల్ల, మీరు కొత్త కారు యజమాని పేరుతో ఇన్సూరెన్స్ పాలసీని బదిలీ చేయాలని నిర్ధారించుకోవాలి. మీరు వేరొకరి నుండి ఒక కారును కొనుగోలు చేస్తే, ఇన్సూరెన్స్ పాలసీ మీ పేరు మీద బదిలీ చేయబడిందని నిర్ధారించుకోండి.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. 1988 మోటార్ వాహనాల చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ కవర్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి. అయితే, సమగ్ర ఇన్సూరెన్స్‌తో మీరు స్వంత నష్టం మరియు థర్డ్ పార్టీ బాధ్యతలకు కవరేజ్ పొందుతారు, అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌తో ఇన్సూరర్ థర్డ్ పార్టీ నష్టాలకు మాత్రమే ఆర్థిక భారాన్ని భరిస్తారు.
మీరు మీ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో ఎప్పుడైనా రెన్యూ చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో లాంటి ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీలను ఆఫర్ చేస్తారు.
మీ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవడం చాలా సులభమైన ప్రాసెస్. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ వివరాలను పూరించండి మరియు నిమిషాల్లో మీ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోండి.
ఏవైనా సందర్భాలలో సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయడానికి అవసరమైన అత్యంత సాధారణ డాక్యుమెంట్లలో FIR రిపోర్ట్, వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, కార్ ఇన్సూరెన్స్ కాపీ, క్లెయిమ్ ఫారం ఉంటాయి. దొంగతనం సందర్భంలో అవసరమైతే, RTO యొక్క దొంగతనం ప్రకటన మరియు ఉపసంహరణ లెటర్. థర్డ్ పార్టీ క్లెయిమ్ కోసం, మీరు ఇన్సూరెన్స్ కాపీ, FIR, RC మరియు డ్రైవింగ్ లైసెన్స్ కాపీతో పాటు క్లెయిమ్ ఫారం సబ్మిట్ చేయాలి.
కొత్త కారు యజమానులకు, నిరంతర రోడ్డు ట్రిప్‌లు చేసేవారికి మరియు మెట్రోపాలిటన్ సిటీ కారు యజమానులకి సమగ్ర కారు ఇన్సూరెన్స్ పాలసీ సలహా ఇవ్వబడుతుంది.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్ చెల్లుబాటు సాధారణంగా ఒక సంవత్సరం. అయితే, మీరు దీర్ఘకాలిక పాలసీని ఎంచుకుంటే, పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంచుకున్న సంవత్సరాల సంఖ్య ఆధారంగా కవరేజ్ పొడిగించబడుతుంది.
NCB ప్రయోజనాన్ని కోల్పోకుండా మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మరొక ఇన్సూరెన్స్ కంపెనీకి మీ NCB ప్రయోజనాన్ని బదిలీ చేయవచ్చు. మీ ఇన్సూరెన్స్ కంపెనీ మారినప్పుడు NCB చెల్లుబాటు అవుతుంది, అలాగే, మీ కొత్త ఇన్సూరర్ వద్ద NCB ప్రయోజనాన్ని ఉపయోగించవచ్చు. అయితే, గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు పాలసీని రెన్యూ చేయకపోతే, నో క్లెయిమ్ బోనస్ (NCB) ల్యాప్స్ అవుతుంది.
థర్డ్ పార్టీ మరియు సమగ్ర ఇన్సూరెన్స్ మధ్య ప్రాథమిక వ్యత్యాసం అనేది అందించబడిన కవరేజ్ రకం. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ మీ స్వంత నష్టాలు మరియు థర్డ్ పార్టీ నష్టాలను కవర్ చేస్తుంది, అయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ బాధ్యతలను మాత్రమే కవర్ చేస్తుంది. భారతదేశంలో కనీసం ప్రాథమిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం అనేది 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం చట్టపరమైన అవసరం. ఒక వ్యక్తి దానిని కలిగి ఉండటంలో వైఫల్యం అనేది జరిమానాలకు దారితీయవచ్చు.
అవును, మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను థర్డ్ పార్టీ లయబిలిటీ నుండి సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీకి మార్చవచ్చు. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో యాక్సిడెంట్లు, ఢీకొనడం, వర్షాకాలం వరదలు, అగ్నిప్రమాదాలు మొదలైనటువంటి ఊహించని సంఘటనల కారణంగా మీ స్వంత కారు నష్టాలు మరియు డ్యామేజీలకు మీరు కవరేజ్ పొందుతారు. కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ పాలసీ ఒక ప్రత్యేక పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని కొనుగోలు చేయాల్సిన అవసరాన్ని తొలగిస్తుంది, ఎందుకనగా ఇది ప్రతిదానిని కవర్ చేస్తుంది. గమనిక: మీకు ఇప్పటికే థర్డ్-పార్టీ లయబిలిటీ పాలసీ ఉంటే, మీ వాహనం స్వంత నష్టాన్ని కవర్ చేయడానికి మీరు ప్రత్యేక స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీని కూడా పొందవచ్చు.
యాంటీ థెఫ్ట్ పరికరాలను ఇన్‌స్టాల్ చేయడం, మినహాయింపులను పెంచడం, అనవసరమైన క్లెయిములను చేయడాన్ని నివారించడంతో నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను సేకరించడం ద్వారా మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించవచ్చు. చివరగా, మీరు మీ వాహనానికి ఏదైనా సవరణ చేయడాన్ని నివారించాలి ఎందుకంటే అది మీ ప్రీమియంను పెంచుతుంది.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సెకండ్‌హ్యాండ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించవచ్చు. మీరు మా కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. మీరు మా కార్ ఇన్సూరెన్స్ పేజీని కూడా సందర్శించవచ్చు, మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్, మునుపటి పాలసీ వివరాలను నమోదు చేయవచ్చు, ఇంకా సమగ్ర, థర్డ్ పార్టీ మరియు ఓన్ డ్యామేజ్ కవర్ నుండి ప్లాన్ ఎంచుకోవచ్చు. మీరు సమగ్ర లేదా ఓన్ డ్యామేజ్ కవర్‌లను కొనుగోలు చేసినట్లయితే యాడ్-ఆన్‌లను ఎంచుకోండి లేదా తొలగించండి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి, అప్పుడు మీరు మీ సెకండ్‌హ్యాండ్ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను చూడవచ్చు.
అవును, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్రకృతి వైపరీత్యాలను కవర్ చేస్తుంది. ఒకవేళ మీరు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలను ఎదుర్కొన్నట్లయితే, మీరు కలిగిన నష్టం గురించి ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించాలి. దానిని ఇన్సూరెన్స్ కంపెనీకి సమర్పించడానికి అన్ని సాక్ష్యాలను స్పష్టంగా డాక్యుమెంట్ చేయండి. అందుబాటులో గల సాక్ష్యంతో, క్లెయిమ్ ఫైల్ చేయడానికి వెంటనే మీ ఇన్సూరర్‌ను సంప్రదించండి. అనేక మంది పాలసీహోల్డర్లు ఇదే విధంగా చేసే అవకాశం ఉన్నందున, తక్షణ చర్యలు తీసుకోవడం మంచిది. ఓపికగా ఉండండి. ఒక ప్రకృతి వైపరీత్యం సందర్భంలో, అనేక మంది వ్యక్తుల క్లెయిమ్‌లపై పని చేయాల్సి వస్తుంది.
మీరు మల్టీ-ఇయర్ పాలసీని (3 సంవత్సరాలు) ఎంచుకుంటే తప్ప సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కోసం పాలసీ వ్యవధి సాధారణంగా ఒక సంవత్సరం కోసం ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) కార్ ఇన్సూరెన్స్‌లో 3 సంవత్సరాల వరకు మల్టీ-ఇయర్ లేదా లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని జారీ చేయడానికి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అధికారం ఇచ్చింది.
భారతదేశంలో, పాలసీ వ్యవధి ఆధారంగా సమగ్ర కార్ ఇన్సూరెన్స్ను వర్గీకరించవచ్చు. మీరు వార్షిక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు లేదా 3 లేదా 5 సంవత్సరాల అవధి గల దీర్ఘకాలిక ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. కొత్త కార్ల కోసం, మీరు బండిల్డ్ లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్ను ఎంచుకోవచ్చు, ఇక్కడ ఓన్ డ్యామేజ్ భాగం వార్షికంగా ఉంటుంది, అయితే థర్డ్-పార్టీ భాగం మల్టీ-ఇయర్.
లేదు. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన కార్ ఇన్సూరెన్స్ పాలసీ, అయితే బంపర్-టు-బంపర్‌ను జీరో డిప్రిషియేషన్ కవర్ అని కూడా పిలుస్తారు, ఇది మీరు మీ సమగ్ర లేదా స్టాండ్అలోన్ OD కార్ ఇన్సూరెన్స్ ప్లాన్లతో ఎంచుకోగల ఒక యాడ్-ఆన్.
అవును. మీరు మీ 15-సంవత్సరాల వయస్సు గల కారు కోసం భారతదేశంలో సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే, మొదట, పాత కార్ల కోసం అటువంటి ప్లాన్‌లను అందిస్తున్నారా అని మీరు ఇన్సూరర్‌తో తనిఖీ చేయాలి. అలాగే, ఈ సందర్భంలో కవరేజ్ మరియు ప్రీమియంలు ప్రొవైడర్ల వ్యాప్తంగా మారుతూ ఉంటాయని గమనించండి.
సమగ్ర కవరేజ్ కారణంగా థర్డ్-పార్టీ లేదా స్టాండ్అలోన్ OD పాలసీ కంటే సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ యొక్క ఖచ్చితమైన ఖర్చు అనేది వాహనం తయారీ, మోడల్ మరియు వేరియంట్, వాహనం వయస్సు, వాహనం రిజిస్ట్రేషన్ లొకేషన్, యాడ్-ఆన్‌ల ఎంపిక, ఎంచుకున్న IDV మొదలైనటువంటి అనేక అంశాల ఆధారంగా మారుతుంది.
సాధారణంగా, కారు ఇంజిన్‌కు నష్టం జరిగితే, అప్పుడు ప్లాన్ దానిని కవర్ చేస్తుంది. అయితే, మీ నిర్లక్ష్యం లేదా వినియోగం సంబంధిత అరుగుదల మరియు తరుగుదల కారణంగా కారు ఇంజిన్ వైఫల్యం జరిగిన సందర్భంలో, పాలసీ దానిని కవర్ చేయదు. అలాగే, పాలసీ మీ కారు ఇంజిన్ యొక్క మెకానికల్ వైఫల్యాన్ని కవర్ చేయదు. అదనపు భద్రత కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌తో ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ను పొందవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
అవును. రెన్యూవల్ సమయంలో మీరు మీ కారు కవరేజీని థర్డ్-పార్టీ నుండి సమగ్రంగా మార్చుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ప్లాన్‌ను సవరించడం ద్వారా పాలసీని అప్‌గ్రేడ్ చేయడానికి అందుబాటులో ఉన్న ఎంపికలను అన్వేషించడానికి మీరు ఇన్సూరర్‌ను కూడా సంప్రదించవచ్చు.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, తగిన ప్లాన్‌ను కనుగొనడానికి మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీ అవసరాలకు అత్యంత తగిన ఎంపికను కనుగొనడానికి ఆన్‌లైన్‌లో అనేక ప్రొవైడర్ల ప్లాన్‌లను సరిపోల్చండి. చేర్పులు, మినహాయింపులు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్, ఇన్సూరర్ CSR, నగదురహిత గ్యారేజీల లభ్యత మొదలైన వాటి ఆధారంగా మీరు ప్లాన్‌లను సరిపోల్చవచ్చు.
అవును. పాలసీ నిబంధనల ప్రకారం ఇన్సూర్ చేయబడిన కారుకు జరిగిన ప్రమాదవశాత్తు గీతలను సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
ఫస్ట్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ అనేది స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ పాలసీని సూచిస్తుంది. ఇది ప్రమాదాలు, అగ్నిప్రమాదం, దొంగతనం, వరదలు మొదలైనటువంటి ప్రమాదాల కారణంగా ఇన్సూర్ చేయబడిన కారుకు జరిగిన నష్టాలు/ డ్యామేజీలకు మాత్రమే కవరేజీని అందిస్తుంది. మరోవైపు, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ నష్టాలు మరియు ఇన్సూర్ చేయబడిన వాహనం యొక్క స్వంత నష్టాలను కవర్ చేసే ఒక పాలసీ. కాబట్టి, ఒక విధంగా, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది ఫస్ట్-పార్టీ మరియు థర్డ్-పార్టీ నష్టం కవర్‌ను కలిగి ఉన్న ఒక బండిల్డ్ ప్లాన్.
సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇన్సూర్ చేయబడిన వాహనం యొక్క అన్ని ప్రాథమిక భాగాలను కవర్ చేస్తుంది. వివరణాత్మక సమాచారం కోసం మీరు పాలసీ వర్డింగ్స్ను తనిఖీ చేయవచ్చు. అయితే, ప్లాన్ కవర్ చేయని కొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, పాలసీ కన్జ్యూమబుల్ వస్తువుల ఖర్చును కవర్ చేయదు. కాబట్టి, స్టాండర్డ్ ప్లాన్‌లో చేర్చబడని భాగాల కోసం కవరేజీని నిర్ధారించడానికి మీరు వర్తించే యాడ్-ఆన్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.
మొదట, క్లెయిమ్ సమాచారం కోసం మీరు ఇన్సూరర్‌ను సంప్రదించాలి. మీ క్లెయిమ్ ఫైల్ చేయబడిన తర్వాత, నష్టాల కోసం రిజిస్టర్డ్ సర్వేయర్ ద్వారా మీ కారు అంచనా వేయబడుతుంది మరియు ఖర్చు అంచనా వేయబడుతుంది. ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం మీరు అవసరమైన డాక్యుమెంట్లను కూడా సబ్మిట్ చేయాలి. మీ క్లెయిమ్ అభ్యర్థన మూల్యాంకన చేయబడి, ఆమోదించబడిన తర్వాత, నగదురహిత మరమ్మత్తుల కోసం లేదా రీయింబర్స్‌మెంట్ విషయంలో ఇన్సూరర్ నేరుగా భాగస్వామ్య గ్యారేజీతో దానిని సెటిల్ చేస్తారు.
భారతదేశంలోని పబ్లిక్ రోడ్లపై చట్టపరంగా కారును నడపడానికి మీరు కనీసం థర్డ్-పార్టీ కవరేజ్‌తో చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ను కలిగి ఉండాలి. కాబట్టి, అవును, చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌తో ఇన్సూర్ చేయబడినంత వరకు మీరు సమగ్ర ఇన్సూరెన్స్ లేకుండా కారును డ్రైవ్ చేయవచ్చు. అయితే, ఓన్ డ్యామేజ్ కవర్ మరియు తప్పనిసరి థర్డ్-పార్టీ కవర్‌తో వస్తుంది కాబట్టి సమగ్ర కార్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం చాలా సిఫార్సు చేయబడుతుంది.
ఇది ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర కవర్ చేయబడిన సంఘటనల నుండి మీ స్వంత వాహనానికి జరిగిన థర్డ్-పార్టీ బాధ్యతలు మరియు నష్టాలను కవర్ చేసే ఒక కార్ ఇన్సూరెన్స్ ప్లాన్.
ఇది మీ అవసరం పై ఆధారపడి ఉంటుంది. సున్నా డిప్రిషియేషన్ అనేది డిప్రిషియేషన్‌ను పరిగణించకుండా పూర్తి క్లెయిమ్ విలువను అందించే ఒక యాడ్-ఆన్. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ బాధ్యతలు మరియు మీ కారుకు స్వంత నష్టం నుండి రక్షణను అందిస్తుంది.
కారు మోడల్, లొకేషన్ మరియు యాడ్-ఆన్‌ల ప్రకారం ధర మారుతుంది, కానీ విస్తృత కవరేజ్ కారణంగా ఇది సాధారణంగా ప్రాథమిక థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ల కంటే ఎక్కువగా ఉంటుంది.
ప్రాథమిక కార్ ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది, అయితే సమగ్ర ఇన్సూరెన్స్ థర్డ్-పార్టీ మరియు మీ స్వంత కారు నష్టాన్ని కవర్ చేస్తుంది.
అవును. మీకు మనశ్శాంతి, పూర్తి కవరేజ్ మరియు చాలా రకాల నష్టాల నుండి రక్షణ కావాలనుకుంటే, అది కొంచెం ఎక్కువ ప్రీమియం రేటు కొరకు విలువైనది.
లేదు. మీరు మీ సమగ్ర పాలసీకి ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ను జోడించినప్పుడు మాత్రమే ఇంజిన్ వైఫల్యం కవర్ చేయబడుతుంది.