Renew Expired Car Insurance
Premium starts at ₹2094*

ప్రీమియం ప్రారంభ ధర

ఇది: ₹2094*
12200+ cashless Garagesˇ

12200+ నగదురహిత

గ్యారేజీలుˇ
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేయండి

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోండి

Expired Car Insurance Renewal

తీవ్రమైన పరిణామాలను నివారించడానికి ప్రతి పాలసీదారు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూ చేసుకోవాలి. గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో కారును నడపడం ద్వారా మీరు చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, ప్రమాదం జరిగిన సందర్భంలో మీ కారు కోసం ఇన్సూరెన్స్ రక్షణను కూడా కోల్పోతారు. భారతీయ రోడ్లపై ప్రతి సంవత్సరం సుమారుగా అర మిలియన్ రోడ్ల ప్రమాదాలు జరుగుతాయి, ఫలితంగా వాహనాలకు గణనీయమైన నష్టం జరుగుతుంది. చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోవడం వలన, ఒక ఊహించని సంఘటన కారణంగా అది దెబ్బతిన్నట్లయితే మీరు వాహనం మరమ్మత్తు కోసం భారీ ఖర్చులను భరించాలి. అలాగే, మీరు గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయకపోతే, మీరు రెన్యూవల్ డిస్కౌంట్లు మరియు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను కోల్పోవచ్చు. అందువల్ల, అంతరాయం లేని కవరేజీలు మరియు ప్రయోజనాలను ఆనందించడానికి కారు ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం తెలివైన నిర్ణయం.

అందుకే, కార్ ఇన్సూరెన్స్ పాలసీని సకాలంలో రెన్యూవల్ చేయాల్సిన ప్రాముఖ్యతను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మేము అర్థం చేసుకున్నాము. అందుకే గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ కోసం సులభమైన మరియు అవాంతరాలు-లేని రెన్యూవల్‌ను అనుమతించడం ద్వారా మీ ఇన్సూరెన్స్ అవసరాలు తీర్చడంలో మేము మీకు సహాయపడతాము.

మీ గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవడానికి 3 కారణాలు

మీరు మీ కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేసుకోవడం మిస్ అయినప్పటికీ, ఈ 3 కారణాలతో గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకుంటారు.

Financial loss in case of accidents - Car insurance renewal
ప్రమాదాల సమయంలో ఆర్థిక నష్టం
ప్రమాదాలనేవి ఎప్పుడైనా మరియు ఎక్కడైనా సంభవించవచ్చు కాబట్టి, అలాంటి సమయంలో మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోయి ఉంటే, మీకు భారీ ఆర్థిక నష్టం ఏర్పడవచ్చు. మీ కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోయిన సమయంలో, డ్యామేజీలు మరమ్మత్తు చేయాల్సి వస్తే, మీరు మీ పొదుపు నుండి ఖర్చు చేయాల్సి వస్తుంది
Loss of Insurance Protection - Car insurance renewal
ఇన్సూరెన్స్ రక్షణ నష్టం
కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు విస్తృత కవరేజీలను అందిస్తుంది, ఇది ఏదైనా కారు సంబంధిత అత్యవసర పరిస్థితిలో మిమ్మల్ని రక్షించగలదు. మీ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసే వరకు మీరు పట్టించుకోకపోతే, ఇన్సూరెన్స్ కవర్ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది మరియు కొత్తగా కారు ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే లోపల ఏవైనా మరమ్మత్తుల కోసం మీరు స్వంతంగా చెల్లించాల్సి రావచ్చు.
Driving With Expired Insurance is Illegal -  Car insurance renewal
గడువు ముగిసిన ఇన్సూరెన్స్‌తో డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం
చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేయడమనేది భారతదేశంలోని మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ఒక నేరపూరిత చర్య మరియు ఈ నేరానికి రూ. 2000 వరకు జరిమానా లేదా 3 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి, అనవసరమైన సమస్యను మీకు మీరే ఆహ్వానిస్తున్నారు. కాబట్టి, ఎలాంటి సందేహానికి తావు లేకుండా, మీరు మీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవడం చాలా ముఖ్యం.

మీరు గడువు ముగిసిన వాహనం ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చా?

అవును, మీరు చేయవచ్చు. ఒక దురదృష్టకరమైన పరిస్థితిలో, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని గడువు ముగిసేలోపు రెన్యూ చేయడం మర్చిపోయినా లేదా మిస్ అయినా మీరు దాని వలన కలిగే నష్టం నుండి తప్పించుకోవచ్చు. గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేయాలి అని ఆలోచిస్తున్నారా?? మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే మరియు దానిని రెన్యూ చేసుకోవాలని అనుకుంటే మీకు రెండు రకాల పరిస్థితులు ఉంటాయి-

గ్రేస్ వ్యవధిలో రెన్యూ చేయడం
కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గ్రేస్ పీరియడ్ అనేది కార్ యజమాని గడువు ముగిసిన ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసుకోవడానికి ఉన్న అదనపు సమయాన్ని సూచిస్తుంది. అనేక ఇన్సూరెన్స్ సంస్థలు గ్రేస్ పీరియడ్లను అందిస్తాయి. ఇది 30 నుండి 90 రోజుల మధ్య ఉండవచ్చు. గడువు ముగిసిన తర్వాత కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం చివరి మరియు తుది అవకాశంగా గ్రేస్ పీరియడ్‌ను పరిగణించండి.
గ్రేస్ వ్యవధి తరువాత రెన్యూ చేయడం
గ్రేస్ పీరియడ్‌లో కూడా మీరు గడువు ముగిసిన కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయని పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సందర్భంలో, మీ పాలసీ రద్దు చేయబడుతుంది. కారు ఇన్సూరెన్స్ గడువు ముగిసిన గ్రేస్ పీరియడ్‌లో, పాలసీని క్లెయిమ్ చేయలేరు. ఇప్పుడు, మీరు గతంలో చేసిన విధంగా తాజా మరియు కొత్త పాలసీని కొనుగోలు చేయాలి. మీకు ఏదైనా నో క్లెయిమ్ బోనస్ జమ చేయబడితే, పాలసీ గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు పాలసీని రెన్యూ చేయకపోతే కూడా అది రద్దు చేయబడుతుంది. కాబట్టి, కొత్త దానిని కొనుగోలు చేసే సమయంలో, మీరు ఇకపై మీ NCBని ఉపయోగించలేరు.

కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే ఏమి జరుగుతుంది?

గడువు ముగిసేలోపు లేదా గ్రేస్ పీరియడ్ ముగిసేలోపు కారు ఇన్సూరెన్స్‌ను కారు యజమాని రెన్యూ చేయకపోతే ఏమి జరుగుతుంది?? పరిణామాలు ఏమిటి?? కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మీరు ఏ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందో అర్థం చేసుకోవడానికి క్రింది వివరాలను చదవండి-

  You can get into legal obligations

మీకు చట్టపరమైన సమస్యలు ఏర్పడవచ్చు

భారతదేశ రహదారులపై మోటార్ వాహనాన్ని నడపడానికి ఉన్న ప్రాథమిక అవసరాలలో ఇన్సూరెన్స్ పాలసీ (థర్డ్ పార్టీకి కనీసం) ఒకటి. మీ పాలసీ గడువు ముగిసినట్లయితే, రోడ్లపై డ్రైవ్ చేయడానికి మీరు చట్టపరంగా అర్హులు కారు. పాలసీ లేకుండా మీరు డ్రైవ్ చేసినప్పుడు మిమ్మల్ని ట్రాఫిక్ పోలీస్ పట్టుకుంటే, మీరు చట్టపరంగా తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుంది, వీటిలో జరిమానా మరియు కారాగార శిక్ష కూడా ఉండవచ్చు. కాబట్టి, మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను వీలైనంత త్వరగా రెన్యూ చేసుకోవడం అవసరం

You could lose your hard-earned NCB

మీరు కష్టపడి సంపాదించిన NCBని కోల్పోవచ్చు

నో క్లెయిమ్ బోనస్ వలన మీ పాలసీ రెన్యూవల్ పై డిస్కౌంట్లు మరియు ఆఫర్లను మీరు పొందవచ్చు. మీరు ఒక పాలసీ సంవత్సరం అంతటా ఎటువంటి క్లెయిమ్ చేయనప్పుడు ఇది జమ చేయబడుతుంది. కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గ్రేస్ వ్యవధిలో కూడా మీరు సకాలంలో పాలసీని రెన్యూ చేయకపోతే ఈ కష్టపడి సంపాదించిన బోనస్ కోల్పోతారు

No policy=N o coverage

పాలసీ లేదు = కవరేజ్ లేదు

పాలసీ లేకపోతే కవరేజ్ కూడా ఉండదు. కాబట్టి, మీ వద్ద చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే మీ కారును రోడ్డు పైకి తీసుకురాకపోవడం మంచిది. లేకపోతే, మీరు ప్రమాదానికి గురైతే మరియు అది మీ స్వంత నష్టం లేదా థర్డ్-పార్టీ నష్టాన్ని కలిగించినట్లయితే, అన్ని మరమ్మత్తు ఖర్చులు మీరు భరించవలసి ఉంటుంది. పాలసీ ఏదీ లేనందున, మీ ఇన్సూరెన్స్ సంస్థ నుండి మీరు ఎటువంటి పరిహారం మరియు సహాయం అందుకోరు

You’ll have to buy a new policy

మీరు ఒక కొత్త పాలసీని కొనుగోలు చేయాలి

చివరిలో, మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే మీరు పూర్తిగా కొత్త పాలసీని కొనుగోలు చేయాలి. ఈ సారి, ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా మరియు సమయం తీసుకునేదిగా ఉండవచ్చు. ఇన్సూరెన్స్ ప్రొవైడర్ తనిఖీని కూడా నిర్వహించవచ్చు. ఎందుకంటే, పాలసీ ఎక్కువ కాలం పాటు రెన్యూ చేయబడనందున పాలసీని ఆమోదించడానికి ముందు కంపెనీ మీ కారును తనిఖీ చేయాలని భావించవచ్చు. కాబట్టి, కారు పరిస్థితి బాగుంది అని నిర్ధారించడానికి, వారు తనిఖీని నిర్వహించవచ్చు. ఆ విధంగా, ఈ చర్యలు అన్నీ చివరికి పాలసీ కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగేటట్లు చేస్తాయి.

గడువు ముగిసిన పాలసీని రెన్యూ చేసేటప్పుడు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించాలి?

గడువు ముగిసిన తర్వాత మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ వీలైనంత త్వరగా చేయబడాలి. మీరు గ్రేస్ వ్యవధిలో అలా చేస్తే, ప్రీమియంను తగ్గించడానికి మీ NCB మరియు ఇతర ప్రయోజనాలను ఉపయోగించే అవకాశం మీకు ఇప్పటికీ ఉంటుంది. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని సులభమైన మరియు ప్రాక్టికల్ చిట్కాలు క్రింద ఇవ్వబడ్డాయి-

1
1. NCBతో ప్రీమియంపై 50% డిస్కౌంట్
రెన్యూవల్ సమయంలో, మీరు నో క్లెయిమ్ బోనస్ (ఏదైనా ఉంటే) కోసం తనిఖీ చేయవచ్చు. మీరు ఒక పాలసీ సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయనప్పుడు, మీరు మీ పాలసీ రెన్యూవల్ పై NCB యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. చెల్లించవలసిన ప్రీమియంపై ఇది మీకు 50% వరకు మంచి డిస్కౌంట్ ఇస్తుంది. గ్రేస్ వ్యవధిలో కూడా, మీరు జమ అయిన NCBని ఉపయోగించవచ్చు. అయితే, పాలసీ ముగిసిన తర్వాత, మీరు NCBని ఉపయోగించలేరు.
2
యాంటీ-థెఫ్ట్ పరికరాలు మీకు రెండింతల ప్రయోజనాన్ని అందిస్తాయి
యాంటీ-థెఫ్ట్ పరికరాలు దొంగతనం నుండి కార్లను సురక్షితంగా ఉంచడానికి వాటిలో ఇన్‌స్టాల్ చేయబడతాయి. మీరు ఈ పరికరాలను మీ కారులో ఇన్‌స్టాల్ చేస్తే, అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు చెల్లించవలసిన ప్రీమియంపై రాయితీని అందించే అవకాశం ఉంది. కాబట్టి, ఈ విధంగా, ఒక యాంటీ-థెఫ్ట్ పరికరం మీకు ప్రయోజనాన్ని రెట్టింపు చేస్తుంది, ఇది మీకు భద్రతను అందిస్తూనే మరోవైపు ఇది మీ డబ్బును ఆదా చేస్తుంది.
3
అధిక మినహాయింపులను ఎంచుకోవడం ఉపయోగకరంగా ఉండవచ్చు
ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసేటప్పుడు, మీరు మినహాయింపుల శాతంతో సహా కొన్ని మార్పులు చేయవచ్చు. మినహాయించదగినది అనేది కారు యజమానిగా మీరు చెల్లించవలసిన క్లెయిమ్ యొక్క మొత్తం లేదా శాతం. కాబట్టి, మినహాయించదగినది ఎక్కువగా ఉంటే, ప్రీమియం తక్కువగా ఉంటుంది. అయితే, మీరు క్లెయిమ్ చేసినట్లయితే, మీ జేబు నుండి చెల్లించాల్సిన ఖర్చులు పెరుగుతాయని గుర్తుంచుకోండి.

కారు ఇన్సూరెన్స్ గడువు తేదీని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి?

కార్ ఇన్సూరెన్స్ గడువు తేదీని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం. IIB (ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అనే పోర్టల్‌ను IRDAI ప్రవేశపెట్టింది. ఇది 1 ఏప్రిల్ 2010 తర్వాత కొనుగోలు చేసిన పాలసీల వివరాలను మీకు అందిస్తుంది.

• IIB ద్వారా కార్ ఇన్సూరెన్స్ గడువు తేదీని తనిఖీ చేయడానికి క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించండి

దశ 1

IIB పోర్టల్‌ను సందర్శించండి మరియు 'త్వరిత లింకులు' పై క్లిక్ చేయండి

దశ 2

కోరిన విధంగా కారు మరియు యజమాని యొక్క వివరాలను నమోదు చేయండి. ఇన్సూరెన్స్ వివరాలను చూడటానికి సబ్మిట్ చేయండి.

• వాహన్ ద్వారా కార్ ఇన్సూరెన్స్ గడువు తేదీని తనిఖీ చేయడానికి క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించండి

దశ 1

వాహన్ ఇ-సర్వీసులకు లాగిన్ అవ్వండి. 'మీ వాహనం వివరాలను తెలుసుకోండి' పై క్లిక్ చేయండి

దశ 2

కారు యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ వంటి అడిగిన వివరాలను నమోదు చేయండి

దశ 3

ఇప్పుడు, 'వాహనాన్ని శోధించండి' ఎంపికపై క్లిక్ చేయండి

దశ 4

మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు తేదీతో సహా అన్ని వివరాలు మీ స్క్రీన్ పై ప్రదర్శింపబడతాయి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో మీ గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేసుకోవాలి

మేము మీ సమయం విలువను అర్థం చేసుకున్నాము. అందుకే, ఒక సులభమైన మరియు అవాంతరాలు-లేని ప్రక్రియను అందించడం ద్వారా, గడువు ముగిసిన మీ కార్ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాము.

మీరు చేయవలసిందల్లా ఈ సులభమైన దశలను అనుసరించండి:

  • Step 1- Visit HDFC ERGO car insurance page

    మా వెబ్‌సైట్‌ను సందర్శించండి

  • Step 2- Select Appropriate Category

    తగిన కేటగిరీ ఎంచుకోండి

  • Step 3- Verify Your Details

    మీ వివరాలు ధృవీకరించండి

  • Step 4-  Select expired details to view quotes

    గడువు ముగిసిన వివరాలు ఎంచుకోండి

Did you know
భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా 12200+ నగదురహిత గ్యారేజీలతో, మీ కారు మరమత్తు కోసం నగదు గురించి మీరు ఆందోళన చెందడమనేది ఒకప్పటి విషయం!

మీ గడువు ముగిసిన పాలసీ కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించడం చాలా సులభం మరియు వేగవంతం. కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్ అని పిలువబడే ఆన్‌లైన్ డిజిటల్ టూల్, మీకు అవసరమైనది. చాలామంది ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు వారి అధికారిక వెబ్‌సైట్‌లో ఉచిత ప్రీమియం కాలిక్యులేటర్‌ను అందిస్తారు. వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి మరియు దానిని ఉపయోగించడానికి ప్రీమియం కాలిక్యులేటర్‌పై క్లిక్ చేయండి. మీరు చేయవలసిందల్లా కొన్ని వివరాలను సమర్పించడం మరియు మీరు చెల్లించవలసిన ప్రీమియంను కాలిక్యులేటర్ మీకు చూపుతుంది.

వేరొక ఇన్సూరెన్స్ ప్రొవైడర్ నుండి ఒక పాలసీని రెన్యూ చేయవచ్చా?

• గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేసేటప్పుడు మీరు ఇన్సూరర్‌ను మార్చవచ్చు. కొత్త ఇన్సూరర్‌ను ఎంచుకునేటప్పుడు మీరు ప్రాథమిక పరిశోధనను నిర్వహించాలి. మీరు వారి క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిష్పత్తి, నెట్‌వర్క్ గ్యారేజీలు మొదలైన వివరాలను తనిఖీ చేయవచ్చు.

• ప్రస్తుత కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగియడానికి సమీపంలో ఉన్నప్పుడు మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను కూడా మార్చవచ్చు. ఇది కాకుండా, ప్రస్తుత ఇన్సూరర్‌తో చెడు క్లెయిమ్ అనుభవం సందర్భంలో మీరు మరొక పాలసీ మిడ్-కవరేజ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు.

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కింద ఆన్‌లైన్‌లో స్వీయ-తనిఖీ

• మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసినప్పుడు, ఇన్సూరర్ మీ లొకేషన్‌ను సందర్శించి వాహనాన్ని తనిఖీ చేయమని ఒక సర్వేయర్‌ను అడుగుతారు. వారి రిపోర్ట్ ఆధారంగా, ఇన్సూరర్ మీ కొత్త కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం ప్రీమియం రేటును నిర్ణయిస్తారు. అయితే, ఈ ప్రాసెస్ చాలా కాలం మరియు సమయం తీసుకుంటుంది. అందువల్ల, మీరు స్వీయ-తనిఖీని ఎంచుకోవచ్చు.

• కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో స్వీయ తనిఖీ ప్రాసెస్‌లో, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి వాహనం వీడియోను తీసి, దానిని మా యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. మేము వీడియోను మూల్యాంకన చేస్తాము మరియు కొత్త కార్ ఇన్సూరెన్స్ ధర గురించి మీకు తెలియజేస్తాము. మీరు దానితో సంతృప్తి చెందినట్లయితే, మీరు మీ పేరుతో పాలసీని కొనుగోలు చేయవచ్చు.

బ్రేక్-ఇన్ వ్యవధిలో మీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడంలో మీరు విఫలమైతే ఏమి చేయాలి?

మీ గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత మరియు మీరు ఇప్పటికీ మీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, గడువు ముగిసిన పాలసీ కోసం మీరు కొత్త కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలి. మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసినట్లయితే, మీరు చేయవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి -

1
మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో కనెక్ట్ అవ్వండి
మీ కార్ ఇన్సూరెన్స్ గడువు ముగిసిన తర్వాత మీరు చేయవలసిన మొదటి విషయం మీ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌తో కనెక్ట్ అవ్వడం. పాలసీని రెన్యూ చేయడానికి మీ కోరికను తెలపండి. పాలసీ వివరాలు అనుమతించినట్లయితే, మీరు వేగంగా ప్లాన్‌ను రెన్యూ చేసుకోవచ్చు లేకపోతే మీరు కొత్త కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవలసి ఉంటుంది.
2
పాలసీని వెంటనే రెన్యూ చేసుకోండి
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పటికీ రెన్యూవల్ చేయదగినట్లయితే, ఇకపై ఆలస్యం చేయకండి మరియు వెంటనే పనిని పూర్తి చేయించుకోండి. మీరు ఈ గ్రేస్ వ్యవధిని కోల్పోయిన తర్వాత, మీరు ఈ పాలసీని శాశ్వతంగా కోల్పోవచ్చు మరియు ఒక కొత్త ప్లాన్ కొనుగోలు చేయవలసి ఉంటుంది.
3
ఇన్సూర్ చేయబడని కారును డ్రైవ్ చేయవద్దు
చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేనప్పుడు మీరు రోడ్డుపై మీ కారును డ్రైవ్ చేయకుండా నిర్ధారించుకోండి. ఎందుకంటే, మీ వద్ద కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకపోతే భారతదేశ రహదారులపై డ్రైవ్ చేయడం చట్టవిరుద్ధం. ఇంకా, ఇన్సూరెన్స్ లేకపోతే కవరేజ్ ఉండదు. అందువల్ల, మీరు ఏదైనా ప్రమాదానికి గురి అయితే, మీ కార్ ఇన్సూరెన్స్ సంస్థ మీకు సహాయం చేయలేదు.
4
మెరుగైన డీల్ కోసం శోధించండి
మీ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను మీరు పోగొట్టుకున్న తర్వాత మరియు అది రద్దు చేయబడిన తర్వాత, మీరు కొత్త దానిని కొనుగోలు చేయాలి. అయితే, దీనిని ఒక అవకాశంగా కూడా చూడవచ్చు. మీ ప్రస్తుత ఎంపికను అన్వేషించడానికి మరియు మీ కారు కోసం ఉత్తమమైనదాన్ని పొందడానికి మీకు మరొక అవకాశం లభిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ లాప్స్ అయితే పరిణామాలు ఏమిటి?

మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అయితే, మీరు RTO నుండి చట్టపరమైన సమస్యను ఎదుర్కోవాలి. గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేసినందుకు మీకు ₹4000 వరకు జరిమానా విధించబడవచ్చు. అంతేకాకుండా, మీ వాహనం ఓన్ డ్యామేజ్ మరియు థర్డ్ పార్టీ నష్టాల కోసం మీరు స్వంత ఖర్చులను కూడా భరించాలి. అందువల్ల, అంతరాయం లేని కవరేజీని పొందడానికి మరియు వర్తించే డిస్కౌంట్లను కూడా పొందడానికి గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను సకాలంలో ఆన్‌లైన్‌లో రెన్యూ చేయడం తెలివైన నిర్ణయం.

నో క్లెయిమ్ బోనస్ పై గడువు ముగిసిన పాలసీ ప్రభావం ఏ విధంగా ఉంటుంది?

ఒక పాలసీ సంవత్సరంలో కారు యజమాని ఎటువంటి క్లెయిమ్లు చేయకపోతే కారు యజమానికి అందించబడే బోనస్/ రివార్డును నో క్లెయిమ్ బోనస్ అని పేర్కొంటారు. రాబోయే పాలసీ రెన్యువల్ కోసం నో క్లెయిమ్ బోనస్‌ను డిస్కౌంట్లు పొందడానికి ఉపయోగించవచ్చు. ఒక కారు యజమాని కార్ ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేయకపోతే, ఇది జమ అయిన NCB పై ప్రభావం చూపుతుంది. గ్రేస్ వ్యవధి సమయంలో యజమాని NCB ని ఉపయోగించవచ్చు లేదా కాపాడుకోవచ్చు. అయితే, గడువు ముగిసిన తరువాత పాలసీ రద్దు అయినట్లయితే, జమ చేయబడిన NCB ని కోల్పోతారు.

ఒకవేళ కారు యజమాని రెన్యూవల్ వ్యవధిలో కొత్త కారు ఇన్సూరెన్స్ పాలసీకి మారాలనుకుంటే, జమ అయినా NCB ప్రభావితం కాదు. కారు లేదా ఇన్సూరెన్స్ పాలసీకి కాకుండా వ్యక్తికి NCB ఇవ్వబడుతుంది కాబట్టి, కొత్త కారు ఇన్సూరెన్స్ కొనుగోళ్లపై డిస్కౌంట్లను కూడా పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు.

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీ అప్రయోజనాలు

• చట్టపరమైన సమస్య – గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం మరియు మీకు 1వ నేరం కోసం ₹2000 మరియు 2వ నేరం కోసం ₹4000 వరకు జరిమానా విధించబడవచ్చు.

• థర్డ్ పార్టీ బాధ్యతలు - మీరు ప్రమాదవశాత్తు మీ వాహనంతో థర్డ్ పార్టీ ఆస్తి/వ్యక్తికి నష్టం జరిగితే మరియు ఆ సమయంలో చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే, నష్టాల కోసం మీరు మీ స్వంతంగా ఖర్చులను భరించాలి. అదనంగా, మీరు చట్టపరమైన పరిణామాలను కూడా ఎదుర్కోవాలి.

• స్వంత ఖర్చుల నుండి – ల్యాప్స్ అయిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, అగ్నిప్రమాదం, భూకంపం, వరద, దొంగతనం మొదలైనటువంటి ఏవైనా ఊహించని సంఘటనల కారణంగా వాహన నష్టానికి మీకు కవరేజ్ లభించదు.

• NCB ప్రయోజనాలు – గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, మీరు నో క్లెయిమ్ బోనస్ ప్రయోజనాలను కోల్పోతారు మరియు తద్వారా పాలసీ రెన్యూవల్‌పై డిస్కౌంట్ పొందలేరు.

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు

1. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా పాస్‌పోర్ట్ వంటి ప్రభుత్వ ID రుజువు

2. చిరునామా రుజువు

3. డ్రైవింగ్ లైసెన్సు

4. ఇటీవలి ఫొటోగ్రాఫ్

5. కార్ రిజిస్ట్రేషన్ నంబర్

6. కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ 

7. కాలుష్యం తనిఖీ సర్టిఫికెట్ 

8. పాత మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్

8700+ cashless Garagesˇ Across India

తాజా గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ బ్లాగులను చదవండి

Grace Period in Car Insurance & Its Importance

కార్ ఇన్సూరెన్స్‌లో గ్రేస్ పీరియడ్ మరియు దాని ప్రాముఖ్యత

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 19, 2023 న ప్రచురించబడింది
What is Self-Inspection for Expired Car Insurance Renewal?

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం స్వీయ-తనిఖీ అంటే ఏమిటి?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ప్రచురణ తేదీ ఏప్రిల్ 20, 2023
How to renew expired car insurance?

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేసుకోవాలి?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూన్ 22, 2020న ప్రచురించబడింది
Here’s all you need to know about renewing your long-term car insurance

మీ లాంగ్-టర్మ్ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడం గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 23, 2021న ప్రచురించబడింది
Why You Should Not Miss Your Car Insurance Renewal Date

మీరు మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ తేదీని ఎందుకు మిస్ చేయకూడదు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 20, 2019 న ప్రచురించబడింది
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌పై ఆన్‌లైన్‌లో తరచుగా అడగబడే ప్రశ్నలు

లేదు, గత సంవత్సరం మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసినట్లయితే, మీరు నో క్లెయిమ్ బోనస్ (NCB) ప్రయోజనాలను పొందలేరు. గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేయకపోతే, మీ NCB రద్దు చేయబడుతుంది మరియు మీరు ఇకపై నో క్లెయిమ్ బోనస్ నుండి ప్రయోజనం పొందరు.

హోమ్‌పేజీలోని డ్రాప్‌డౌన్ మెనూ నుండి మా పాలసీ ట్యాబ్‌ను తెలుసుకోండి పై క్లిక్ చేయడం ద్వారా మీరు మా వెబ్‌సైట్‌లో మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ స్థితిని తనిఖీ చేయవచ్చు. ఇక్కడ, మీరు కేవలం మీ పాలసీ నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి, మీరు మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ స్థితిని పొందుతారు.

అవును, మీరు కొన్ని నిమిషాల్లోనే మా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు. పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి మెయిల్ చేయబడుతుంది లేదా మీ వాట్సాప్ నంబర్‌కు పంపబడుతుంది.

అప్‌డేట్ చేయబడిన మోటార్ వాహనాల చట్టం 2019 ప్రకారం, మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవ్ చేస్తే, మొదటి నేరం కోసం జరిమానా ₹2,000 మరియు రెండవ నేరం కోసం ₹4,000.

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌తో డ్రైవింగ్ చేయడం అనేది RTO నుండి ట్రాఫిక్ జరిమానాలు లేదా చలాన్‌లను దారితీయవచ్చు. గడువు ముగియడానికి ముందు మీరు కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయడంలో విఫలమైతే మరియు అది ల్యాప్స్ అయిన తర్వాత దానిని మళ్లీ రెన్యూ చేసుకోవడానికి ప్లాన్ చేసుకున్నట్లయితే, మీ వాహనం మోటార్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మరలా పరిశీలన చేయడంపై లోబడి ఉంటుంది. అలాగే, గడువు ముగిసిన 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, మీరు NCB ప్రయోజనాలను కోల్పోతారు.

గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఆన్‌లైన్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ ద్వారా చేయవచ్చు. మీరు మా కార్ ఇన్సూరెన్స్ పేజీని సందర్శించాలి, మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసి, చూపిన విధంగా దశలను అనుసరించాలి.

గడువు ముగిసిన తేదీ నుండి 90 రోజుల్లోపు మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయకపోతే, మీరు ఇప్పటివరకు సంపాదించిన అన్ని నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారు. అలాగే, గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవింగ్ చేసినందుకు ట్రాఫిక్ పోలీస్ మీకు ₹4000 వరకు జరిమానా విధించవచ్చు.

అవును, మీరు గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీతో డ్రైవ్ చేస్తే, మీకు RTO ద్వారా జరిమానా విధించబడుతుంది. మొదటి నేరం కోసం జరిమానా ₹2,000 మరియు రెండవ నేరం కోసం ₹4,000

పాలసీ కోసం చెల్లుబాటు ఒక సంవత్సరం అయితే గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రతి సంవత్సరం చేయబడాలి. స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక సంవత్సరం తర్వాత గడువు ముగుస్తుంది.

గడువు ముగిసిన పాలసీ అని మేము చెప్పినప్పుడు, పాలసీ నిర్దిష్ట తేదీలో ముగిసిందని మరియు పేర్కొన్న వ్యవధి వరకు పాలసీదారు కవరేజీకి అర్హులని అర్థం. అయితే, మేము ల్యాప్స్ అయిన పాలసీ అని చెప్పినప్పుడు, పాలసీదారు షెడ్యూల్ చేయబడిన తేదీన కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయలేదని మరియు అతను/ఆమె ఇకపై కవర్ చేయబడరని అర్థం.

గడువు ముగిసిన తేదీ తర్వాత మీరు ల్యాప్స్ అయిన కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూ చేస్తే, మీరు అధిక ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది. పాలసీ ల్యాప్స్ అయిన తర్వాత, మీరు 90 రోజుల్లోపు రెన్యూ చేయకపోతే, నో-క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారు. మీరు ఇతర డిస్కౌంట్లను కూడా కోల్పోవచ్చు. ఈ రెండు అంశాలు అధిక ప్రీమియంలకు దారితీస్తాయి.

అవార్డులు మరియు గుర్తింపు

అన్ని అవార్డులను చూడండి