ప్రమాదాలు, దొంగతనం, అగ్నిప్రమాదం, వరదలు మరియు ఇతర ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల కారణంగా ఏర్పడే ఊహించని ఖర్చుల నుండి హోండా కార్ ఇన్సూరెన్స్ మీ వాహనాన్ని కవర్ చేస్తుంది. మీరు ఒక ప్రీమియం సెడాన్ లేదా కాంపాక్ట్ సిటీ కార్‌ను కలిగి ఉన్నా, సరైన ఇన్సూరెన్స్ ప్లాన్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆర్థిక భద్రత మరియు మనశ్శాంతిని అందిస్తుంది. 1948 లో జపాన్‌లో స్థాపించబడిన హోండా, ఆటోమొబైల్స్ మరియు మోటార్‌సైకిల్స్‌లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ఇది 1995 లో భారతదేశంలోకి ప్రవేశించింది మరియు అప్పటి నుండి విశ్వసనీయత మరియు ఆవిష్కరణ కోసం ప్రసిద్ధి చెందిన ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా మారింది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో, మీరు హోండా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు, సమగ్ర లేదా స్టాండ్అలోన్ లేదా థర్డ్ పార్టీ ప్లాన్ల నుండి ఎంచుకోవచ్చు. పూర్తి రక్షణ కోసం జీరో డిప్రిషియేషన్ మరియు రిటర్న్ టు ఇన్వాయిస్ వంటి యాడ్-ఆన్‌లతో మీరు మీ పాలసీని కస్టమైజ్ చేయవచ్చు.
ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ తయారీదారులలో హోండా ప్రసిద్ధి చెందిన సంస్థ. 1948 లో ఇంజనీర్ అయిన సోయిచిరో హోండా ద్వారా స్థాపించబడిన హోండా మోటార్ కంపెనీ 1949 లో మోటార్ సైకిల్ ఉత్పత్తిని ప్రారంభించింది.
కంపెనీ ఒక మోటార్‌సైకిల్ తయారీదారుగా ప్రారంభమైనప్పటికీ, ఇది క్రమంగా కార్ మార్కెట్‌లోకి ప్రవేశించింది, హోండా అకార్డ్ మరియు హోండా సివిక్ వంటి ప్రముఖ మోడళ్లను ప్రవేశపెట్టింది. హ్యాచ్‌బ్యాక్‌ల నుండి సెడాన్‌లు మరియు SUVల వరకు, హోండా నుండి వచ్చిన మోడల్స్ ప్రపంచ ఖ్యాతిని సాధించాయి.
హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ 1995 లో హోండా మోటార్ కంపెనీ అనుబంధ సంస్థగా స్థాపించబడింది. పర్యావరణాన్ని రక్షించడానికి, భద్రతను నిర్ధారించడానికి మరియు సామాజిక పరిరక్షణకు మద్దతు ఇవ్వడానికి హోండా దాని అన్ని సంస్థలలో కఠినమైన ప్రమాణాలను అనుసరిస్తుంది.
భారతదేశంలోని కొన్ని ప్రముఖ హోండా కార్లలో అమేజ్, సిటీ, సివిక్ మరియు జాజ్ ఉంటాయి. ఇవి విశ్వసనీయత, అధునాతన ఇంజనీరింగ్ మరియు ఇంధన సామర్థ్యం ఉన్న మోడల్స్ కోసం ప్రసిద్ధి చెందాయి. అత్యంత భద్రత మరియు సౌకర్యాన్ని అందించడానికి హోండా సెడాన్‌లు మరియు SUVలు భారతీయ రోడ్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డాయి. వాహనం యొక్క భద్రతను మరింత మెరుగుపరచడానికి, మోటార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్‌లలో ఒకటైన హోండా సిటీ, నగరంలో డ్రైవింగ్ కోసం అనుకూలంగా ఉంటుంది, ఇది ప్రీమియం సౌకర్యం అందిస్తుంది మరియు సరసమైన ధర వద్ద చక్కటి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. కొత్త తరం హోండా సిటీ పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్‌లు రెండింటిలోనూ తొమ్మిది ట్రిమ్ లెవల్స్‌లో లభిస్తుంది, గత మోడల్ సైతం సెవెన్-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద, మీ కారుకు రక్షణను అందించడానికి మేము అత్యంత సమగ్రమైన హోండా సిటీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఒకదాన్ని అందిస్తున్నాము.
సంస్థ మరో కొత్త కారును లాంచ్ చేసినప్పటికీ, 4వ తరం సిటీ ఇప్పటికీ హోండా కార్లలో ఒక ప్రముఖ ఎంపిక, దాని ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు ధర దీనికి కారణం. ఇది ఇప్పుడు రెండు స్పెసిఫికేషన్లతో పెట్రోల్-మాన్యువల్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో మాత్రమే అందించబడుతోంది. దాని అత్యధిక స్పెక్ కారు 5వ జెన్ యొక్క ఎంట్రీ-లెవల్ వేరియంట్ కంటే చవకైనది, ఇది బడ్జెట్‌లో లగ్జరీ సెడాన్ కోసం చూస్తున్నవారికి ఆకర్షణీయంగా నిలుస్తుంది.
మీ వాహనాన్ని రోడ్ కోసం సిద్ధం చేయడానికి హోండా సిటీ కోసం ఉత్తమ కార్ ఇన్సూరెన్స్‌ను పొందండి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద, మేము అత్యంత ఆకర్షణీయమైన హోండా సిటీ ఇన్సూరెన్స్ ధరను అందిస్తాము, కాబట్టి మీరు ఒకదాన్ని కొనుగోలు చేయడానికి ముందు మరల ఆలోచించవలసిన అవసరం ఉండదు.
సిటీకి క్రింది శ్రేణిలోని అమేజ్ అనేది హోండా వారి ఎంట్రీ-లెవల్ సెడాన్‌గా ఉంటోంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు విభాగాలైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లు మరియు కాంపాక్ట్ SUVలతో ధర విషయంలో పోటీపడటానికి అమేజ్ తనదైన ప్రత్యేకతలు కలిగి ఉంటోంది, ఈ కారణంగానే సెడాన్‌లను 'విజయం'తో సమానంగా చూసే పెద్ద సంఖ్యలోని వినియోగదారులకు ఇది ఆకర్షణీయమైన కారుగా ఉంటోంది.
కొత్త ఫేస్‌లిఫ్ట్, sub-4-metre SUV పోటీదారులతో నిండి ఉన్న సెగ్మెంట్‌లోకి ప్రవేశిస్తుంది, కానీ హోండా యొక్క BSVI-కంప్లైంట్ ఇంజిన్‌ల రిఫైన్‌మెంట్ మరియు ఫ్యామిలీ కారుగా దాని ప్రాక్టికాలిటీ అందించబడుతుంది. దాని SUV-లాంటి ఆకారం గొప్ప ఇంటీరియర్ స్పేస్ మరియు ఫీచర్లను అందిస్తుంది. హోండా తన కొత్త ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ మరియు వన్-టచ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (టాప్-స్పెక్ వేరియంట్) అలాగే ABS, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు మల్టీ-వ్యూ రియర్ కెమెరాను దేశంలోని తన ఏకైక SUVకి జోడించింది.
కేవలం పెట్రోల్ ఎంపికలు మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌తో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారతదేశంలో మళ్ళీ ప్రవేశపెట్టబడింది. CVT వేరియంట్‌లో ప్యాడిల్ షిఫ్ట్‌లు ఉన్నాయి, మరియు ఈ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఈ వాహనంలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ అందించబడుతుంది. పరిమిత కొలతల్లోనే గరిష్ట ఇంటీరియర్ స్పేస్ అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, ఇది గొప్ప బూట్ స్పేస్ కూడా అందిస్తుంది.
ఒక రిఫైన్డ్, స్మూత్ ఇంజిన్ మరియు డ్రైవర్ ఎయిడ్స్‌తో, ఈ వాహనంలో హైవేలపై క్రూయిజ్ చేయవచ్చు మరియు నగరాల్లో అదే సౌలభ్యంతో ప్రయాణించవచ్చు.
అత్యంత జనాదరణ పొందిన హోండా కార్లలో సివిక్ ఒకటి, మరియు ఖచ్చితంగా ఇది అందరి దృష్టిని ఆకర్షించగలదు. హోండా సంస్థ అందిస్తున్న ఈ ప్రీమియం సెడాన్‌లోని ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ రెండింటి డిజైన్ కూడా గొప్పగా ఉంటుంది. మృదువైన ఇంజన్లు మరియు రైడ్ నాణ్యతతో ఇది ఔత్సాహికులను లక్ష్యంగా చేసుకుంది, అదేసమయంలో నాలుగు డిస్క్ బ్రేకులు మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో భద్రత పరంగానూ ఇది అత్యున్నత స్థానంలో ఉంటుంది.
ప్రముఖ ఎంపికలతో పాటు, హోండా అనేక SUVలు, సెడాన్లు మరియు హ్యాచ్‌బ్యాక్‌లను అందిస్తుంది. వీటిని చూడండి:
మీరు మీ ఆధునిక జీవనశైలికి సరిపోయే SUV మోడల్ కోసం చూస్తున్నట్లయితే, హోండా ఎలివేట్ మీకు సరైన ఎంపిక. కారు బోల్డ్ డిజైన్, LED టెయిల్ ల్యాంప్‌లు, డ్యూయల్ డైమండ్-కట్ అలాయ్ వీల్స్ మరియు అత్యుత్తమ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. కారు పెట్రోల్ వేరియంట్లలో 16.92 km/l మైలేజీని అందిస్తుంది, ప్రీమియం క్యాబిన్, హోండా సెన్సింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలు, విజన్ కెమెరా మరియు అల్ట్రా-స్పేసియస్ బూట్‌ను కలిగి ఉంది.
ఈ హైబ్రిడ్ మోడల్‌లో 27.26 km/l మైలేజ్ మరియు 40 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ సామర్థ్యం ఉంది. ప్రీమియం సెడాన్ మోడల్ అయిన హోండా సిటీ e: HEV 6 విభిన్నమైన రంగులలో లభిస్తుంది. హోండా సెన్సింగ్, డైనమిక్ ఎలక్ట్రిఫైయింగ్ యాక్సిలరేషన్, పెద్ద బూట్ స్పేస్ మరియు ఇంధన సామర్థ్యంతో కూడిన ఈ కారు మీ జీవనశైలికి ఒక సరైన ఎంపిక. ఈ వాహనం 10-సంవత్సరాల వారెంటీ మరియు బ్యాటరీపై 8-సంవత్సరాల వారంటీతో లభిస్తుంది.
మీకు ఇష్టమైన హోండా కారును కొనడంతో మీ కల నెరవేరినట్లు కాదు; ఏవైనా దురదృష్టకర సంఘటనలు జరిగినప్పుడు మీ వాహనాన్ని ఆర్థికంగా రక్షించే హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రాథమిక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ నుండి మల్టీ-ఇయర్ కాంప్రిహెన్సివ్ ప్యాకేజ్ వరకు మీ వాహనాన్ని సరైన హోండా ఇన్సూరెన్స్‌తో సురక్షితం చేసుకోండి.
స్వంత డ్యామేజీ కవర్, థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో సహా, ఈ ఏక సంవత్సరం సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ మీకు మరియు మీ వాహనానికి ఆల్-రౌండ్ రక్షణ అందిస్తుంది. అనేక యాడ్-ఆన్‌లతో మీ కార్ ఇన్సూరెన్స్ కవరేజీని మీరు మరింత మెరుగుపరచవచ్చు.
ప్రమాదం
వ్యక్తిగత ప్రమాదం కవర్
ప్రకృతి వైపరీత్యాలు
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
భారతదేశపు రహదారుల మీద డ్రైవ్ చేయగలగడానికి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది చట్టపరంగా తప్పనిసరిగా ఉండాలి. మీ వాహనం కారణంగా జరిగిన యాక్సిడెంట్ ఫలితంగా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి సంభవించిన ఏదైనా నష్టానికి ఆర్థిక బాధ్యత నుండి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.
వ్యక్తిగత ప్రమాదం కవర్
థర్డ్-పార్టీ ఆస్తి నష్టం
థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు
యాక్సిడెంట్ లేదా ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తు సందర్భంలో, మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ అనేది ఆర్థిక కవరేజీ అందిస్తుంది. దొంగతనం నుండి కూడా ఇది రక్షిస్తుంది. ఇది మీ థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సరైన భాగస్వామిగా ఉంటుంది. యాడ్-ఆన్‌ల ఎంపిక అనేది మీ కవరేజీని మరింత మెరుగుపరుస్తుంది.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
అగ్ని
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీ సౌలభ్యం కోసం నిపుణులు ఈ ప్లాన్ రూపొందించారు. మీ స్వంత నష్టం కవర్ గడువు ముగిసినప్పుడు కూడా మీకు అవాంతరాలు లేని రక్షణ లభిస్తుందని నిర్ధారించుకోవడానికి ఒక ప్యాకేజీలో 3-సంవత్సరాల థర్డ్-పార్టీ కవర్ మరియు ఒక వార్షిక ఓన్ డ్యామేజ్ కవర్ పొందండి. సమగ్ర రక్షణను ఆస్వాదించడం కోసం స్వంత నష్టం కవర్‌ను రెన్యూవల్ చేసుకోండి.
ప్రమాదం
ప్రకృతి వైపరీత్యాలు
పర్సనల్ యాక్సిడెంట్
థర్డ్-పార్టీ లయబిలిటీ
యాడ్-ఆన్‌ల ఎంపిక
దొంగతనం
మీరు పొందే కవరేజ్ పరిధి మీ హోండా కార్ కోసం మీరు ఎంచుకున్న ప్లాన్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమగ్ర హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది:
ప్రమాదం కారణంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాలను మేము కవర్ చేస్తాము.
మీ కారుకు ఎదురయ్యే అగ్నిప్రమాదాలు మరియు విస్ఫోటనాల నుండి మీకు ఆర్థికంగా రక్షణ లభిస్తుంది.
మీ కారు దొంగతనానికి గురికావడం అనేది మీకు పీడకల లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మీరు ప్రశాంతంగా ఉండే అవకాశాన్ని మేము అందిస్తాము.
ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు ఏవైనప్పటికీ, అలాంటి విస్తృత శ్రేణి వైపరీత్యాల కోసం మేము ఆర్థిక కవరేజ్ అందిస్తాము.
ఏదైనా యాక్సిడెంట్ సమయంలో, మీ చికిత్స కోసం ఖర్చులను మేము చూసుకుంటాము.
ఎవరైనా థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా వారి ఆస్తికి జరిగిన గాయాలు లేదా నష్టం కూడా కవర్ చేయబడతాయి.
కార్ ఇన్సూరెన్స్ అనేది భారతదేశంలో ఏదైనా మోటార్ వాహనం కోసం అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్. 1988 మోటార్ వాహన చట్టం ప్రకారం ఇది తప్పనిసరి మాత్రమే కాకుండా, ఇది కూడా అత్యంత సిఫార్సు చేయబడుతుంది. ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మీ వాహనం కోసం అవసరమైన రక్షణ కవచం, ఎందుకంటే:
ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్సూర్ చేయబడిన వాహనం యొక్క స్వంత నష్టాలకు కవరేజ్ అందిస్తుంది. అంటే ఇన్సూర్ చేయబడిన వాహనం వలన జరిగిన ప్రమాదవశాత్తు నష్టాలు మరియు డ్యామేజీలు ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా కవర్ చేయబడతాయి. మీరు రిపేర్ లేదా నష్టం ఖర్చులను భరించవలసిన అవసరం లేదు.
రోడ్లపై ప్రమాదాలు థర్డ్-పార్టీ నష్టాలను కూడా కలిగించవచ్చు. కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉండటం వలన అటువంటి నష్టాలు ఇన్సూరర్ ద్వారా కవర్ చేయబడతాయి. మోటార్ వాహనాలకు కనీసం థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం చట్టపరంగా తప్పనిసరి.
అంతేకాకుండా, కార్ ఇన్సూరెన్స్ కారు యజమానికి మనశ్శాంతిని అందిస్తుంది. ప్రమాదం జరిగిన సందర్భంలో నష్టాలు మరియు సంబంధిత ఖర్చుల బాధ్యతను చేపట్టడానికి ఒకరు ఉన్నారు అని తెలుసుకొని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
పైన పేర్కొన్న విధంగా, 1988 మోటార్ వాహనాల చట్టం భారతీయ రోడ్లపై చట్టపరంగా డ్రైవ్ చేయడానికి మోటార్ వాహనాలకు కనీసం థర్డ్-పార్టీ మోటార్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి చేస్తుంది. కాబట్టి, కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం అంటే మీరు చట్టపరమైన బాధ్యతలను నెరవేర్చారని కూడా అర్థం.
కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ యాజమాన్యపు ఒక ముఖ్యమైన అవసరం. ప్రమాదాలనేవి ఎలాంటి ముందస్తు సంకేతం లేకుండా జరుగుతాయి కాబట్టి, ఇది తప్పనిసరి మాత్రమే కాకుండా, ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయం కూడా. అంతేకాకుండా, రోడ్డు మీద మీ భద్రత అనేది ఇతర డ్రైవర్‌ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే, కారు డ్యామేజీల కోసం మరమ్మత్తు చేయడం సాధారణంగా ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది.
ఇటువంటి సమయాల్లోనే కార్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది. ఇది ఊహించని ఆర్థిక నష్టాలను నివారిస్తుంది మరియు మిమ్మల్ని సురక్షితంగా మరియు భద్రంగా ఉంచుతుంది. మీ హోండా కార్ ఇన్సూరెన్స్ కోసం మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:
వర్క్ షాప్‌తో నేరుగా నగదురహిత సెటిల్మెంట్ ద్వారా మీరు మీ జేబు నుండి చెల్లించాల్సిన మొత్తం తగ్గించబడుతుంది. మరియు దేశవ్యాప్తంగా 9000 నగదురహిత గ్యారేజీలతో, మీకోసం సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. 24x7 రోడ్‌సైడ్ సహాయం అనేది కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది కాబట్టి, మీరెప్పుడూ నిస్సహాయంగా నిల్చిపోయే పరిస్థితి రాదు.
1.6 కోట్లకు పైగా సంతోషకరమైన వినియోగదారులతో మీ ఖచ్చితమైన అవసరాలేమిటో మాకు తెలుసు కాబట్టే, లక్షలాది మంది ముఖాల మీద చిరునవ్వులు పూయించాము. కాబట్టి, మీ ఆందోళనలను పక్కన పెట్టండి మరియు హోండా కోసం అత్యంత అనుకూలమైన కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి.
హోండా కార్ ఇన్సూరెన్స్ కింద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఓవర్‌నైట్ సర్వీస్ రిపేర్ల ద్వారా, చిన్నపాటి యాక్సిడెంటల్ డ్యామేజీ లేదా బ్రేక్‌డౌన్‌లు జరిగినప్పుడు మీకు కారు మరుసటిరోజుకు మళ్లీ సిద్ధం చేస్తుంది. తద్వారా, మీ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు రాత్రివేళ చక్కగా నిద్రపోండి మరియు ఉదయానికి మీ కారును సిద్ధం చేయడానికి మమ్మల్ని అనుమతించండి.
హోండా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను చేయడం సులభం మరియు సౌకర్యవంతం. మేము ప్రాసెస్‌ను కాగితరహితంగా చేస్తాము, స్వీయ-తనిఖీని అనుమతిస్తాము మరియు మీ ఆందోళనలను దూరం చేయడానికి త్వరిత సెటిల్‌మెంట్‌ను అందిస్తాము
హోండా కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ ప్రక్రియ సులభంగా ఉంటుంది. మీరు ఆన్‌లైన్‌లో లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సమీప శాఖను సందర్శించడం ద్వారా త్వరగా పాలసీని రెన్యూ చేసుకోవచ్చు. రెన్యూవల్ సమయంలో పాలసీ ప్రీమియం పై డిస్కౌంట్ పొందడానికి మీ నో-క్లెయిమ్ బోనస్ లేదా కొనసాగుతున్న ఆఫర్లను తనిఖీ చేయడం మర్చిపోకండి.
కార్ ఇన్సూరెన్స్ కోసం ప్రాథమిక కవరేజీలలో ప్రతిదీ ఉండకపోవచ్చు. ఇటువంటి యాడ్-ఆన్ కవర్లు ఉపయోగపడతాయి. ఇవి సమగ్ర కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో మీరు కొనుగోలు చేయగల అదనపు కవరేజీలు.
అత్యంత ప్రముఖ యాడ్-ఆన్‌లలో కొన్ని ఇలా ఉన్నాయి:
ఈ యాడ్-ఆన్‌తో, కారు డిప్రిషియేషన్‌ను క్లెయిమ్ మొత్తం లెక్కించబడదు లేదా మినహాయించబడదు.
కారు తాళం చెవుల ఖరీదు ఎక్కువగా ఉండవచ్చు. కీ రీప్లేస్‌మెంట్ యాడ్-ఆన్ కవర్‌తో, ఇన్సూరర్ కీ రీప్లేస్‌మెంట్ ఖర్చును కవర్ చేస్తారు.
మీరు ఇన్సూరెన్స్ చేయబడిన కారును ఎలా ఉపయోగిస్తారు అనేదాని ఆధారంగా, మీ పే-యాజ్-యూ-డ్రైవ్ యాడ్-ఆన్ కవర్ కోసం ప్రీమియం నిర్ణయించబడుతుంది. ఇది ముఖ్యంగా EVలకు ఉపయోగకరంగా ఉంటుంది.
నట్స్, బోల్ట్స్, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఫ్లూయిడ్ మొదలైన వస్తువుల కోసం ఖర్చుల కోసం కన్జ్యూమబుల్స్ యాడ్-ఆన్ కవరేజ్ అందిస్తుంది.
మీరు క్లెయిమ్ చేస్తే నో క్లెయిమ్ బోనస్ సున్నా అవుతుంది. NCB ప్రొటెక్ట్ యాడ్-ఆన్‌తో, జమ చేయబడిన NCBని ప్రభావితం చేయని విధంగా పాలసీ సంవత్సరంలో మీరు కొన్ని క్లెయిమ్‌లను పొందుతారు.
మీ వాహనానికి మార్గం మధ్యలో టోయింగ్ లేదా ఫ్యూయల్ డెలివరీ అవసరమైతే, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్ సహాయపడుతుంది.
ఇంజిన్ లేదా గేర్‌బాక్స్ నష్టాలు సాధారణంగా ప్రాథమిక కార్ ఇన్సూరెన్స్‌లో కవర్ చేయబడవు. ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌తో, అటువంటి ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి.
ముఖ్యంగా లగ్జరీ మోడల్స్ కోసం, కార్లకు టైర్ రీప్లేస్‌మెంట్ ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. టైర్ సెక్యూర్ కవర్‌తో, మీ ఇన్సూరర్ టైర్ రీప్లేస్‌మెంట్ ఖర్చులను కవర్ చేస్తారు.
మరమ్మత్తు సేవల కోసం కారు గ్యారేజీలో ఉన్నప్పుడు, కారు యజమానికి రోజువారీ భత్యంతో డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ పరిహారం అందించబడుతుంది.
వాహనానికి పూర్తి నష్టం లేదా దొంగతనం జరిగిన సందర్భంలో, ఇన్సూరర్ కారు ఇన్వాయిస్ విలువతో కారు యజమానులకు పరిహారం చెల్లిస్తారు. ఇది సాధారణంగా IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) కంటే ఎక్కువగా ఉంటుంది.
ఈ యాడ్-ఆన్ మీ కారులోని వస్తువులను కవర్ చేస్తుంది. ఈ జాబితా చేయబడిన వస్తువులు పోయినట్లయితే, ఇన్సూరర్ దాని కోసం పరిహారం చెల్లిస్తారు.
చిట్కా: మీరు స్టాండ్అలోన్ OD కార్ ఇన్సూరెన్స్‌తో ఈ యాడ్-ఆన్‌లలో ఎక్కువగా పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద ఆన్‌లైన్‌లో హోండా కార్ ఇన్సూరెన్స్ అందిస్తున్న ఉత్తమ ఎంపికలను తనిఖీ చేయండి.
మీరు హోండా నుండి మీ కలల వాహనాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, హోండా కార్ ఇన్సూరెన్స్‌ను కూడా కొనుగోలు చేయండి. కారు యజమాని ఎవరికైనా ఉండే ఒక ముఖ్యమైన ఆందోళన కారు ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇటువంటి సమయంలో మీరు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. ఇది మీరు ఎంచుకున్న కార్ ఇన్సూరెన్స్ మరియు యాడ్-ఆన్‌ల కోసం చెల్లించవలసిన ఏకమొత్తం ప్రీమియంను లెక్కించడానికి మీరు ఉపయోగించగల ఒక డిజిటల్ సాధనం.
కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ సరళంగా ఉంటుందని మరియు ఉపయోగించడానికి సులభం. మీరు కేవలం పాలసీ ప్రాధాన్యతలు మరియు కారు వివరాలను నమోదు చేయాలి. టూల్ మీ ఇన్‌పుట్‌ల ఆధారంగా త్వరగా లెక్కించి ఫలితాలను ఇస్తుంది.
కొత్త హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేయడం లేదా కొనుగోలు చేయడం చాలా సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. మరియు మీరు కేవలం కొన్ని క్లిక్స్‌తో ఈ పనిచేయవచ్చు. నిజానికి, ఇప్పుడు మీరు కొన్ని నిమిషాల్లోనే మీ పాలసీ పొందవచ్చు. మీకోసం కవర్ పొందడానికి క్రింది నాలుగు దశలు అనుసరించండి.
కార్ ఇన్సూరెన్స్ అనేది కార్ యాజమాన్యపు ఒక ముఖ్యమైన అవసరం. ప్రమాదాలనేవి ఎలాంటి ముందస్తు సంకేతం లేకుండా జరుగుతాయి కాబట్టి, ఇది తప్పనిసరి మాత్రమే కాకుండా, ఆర్థికంగా వివేకవంతమైన నిర్ణయం కూడా. అంతేకాకుండా, రోడ్డు మీద మీ భద్రత అనేది ఇతర డ్రైవర్‌ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే, కారు డ్యామేజీలనేవి సాధారణంగా మరమ్మత్తు చేయడం ఖరీదైన వ్యవహారంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే కార్ ఇన్సూరెన్స్ సహాయకరంగా ఉంటుంది. .ఇది ఊహించని ఆర్థిక నష్టాలను నివారిస్తుంది మరియు మిమ్మల్ని సురక్షితంగా మరియు భద్రంగా ఉంచుతుంది. మీ హోండా కార్ ఇన్సూరెన్స్ కోసం మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి:
వర్క్ షాప్‌తో నేరుగా నగదురహిత సెటిల్‌మెంట్ చేయడం ద్వారా మీరు స్వంతంగా డబ్బును ఖర్చు చేయడం తగ్గుతుంది. మరియు దేశవ్యాప్తంగా ఉన్న 9000 నగదురహిత గ్యారేజీలతో, మీకోసం సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది కాబట్టి, మీరెప్పుడూ నిస్సహాయంగా నిల్చిపోయే పరిస్థితి రాదు.

1.6 కోట్లకు పైగా సంతోషకరమైన వినియోగదారులతో మీ ఖచ్చితమైన అవసరాలేమిటో మాకు తెలుసు కాబట్టే, లక్షలాది మంది ముఖాల మీద చిరునవ్వులు పూయించాము. కాబట్టి, మీ ఆందోళనలు పక్కన పెట్టండి మరియు క్లబ్‌లో చేరండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఓవర్‌నైట్ సర్వీస్ రిపెయిర్స్ ద్వారా, చిన్నపాటి యాక్సిడెంటల్ డ్యామేజీ లేదా బ్రేక్‌డౌన్‌లు జరిగినప్పుడు మీకు కారు మరుసటిరోజుకు మళ్లీ సిద్ధంగా ఉండేలా నిర్ధారించబడుతుంది. తద్వారా, మీ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు రాత్రివేళ చక్కగా నిద్రపోండి మరియు ఉదయానికి మీ కారును సిద్ధం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి.

క్లెయిమ్‌లు చేయడమనేది సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. మేము ఈ ప్రక్రియను కాగితరహితంగా చేస్తాము, స్వీయ-తనిఖీ కోసం అనుమతిస్తాము మరియు మీ ఆందోళనల దూరం చేయడం కోసం వేగవంతమైన సెటిల్‌మెంట్ అందిస్తాము
హోండా కోసం కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం మీరు ఆలోచించిన దానికంటే సులభం మరియు వేగవంతమైనది. హోండా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఈ దశలను అనుసరించండి:
◦ 'కార్ ఇన్సూరెన్స్' ఎంపికపై క్లిక్ చేయండి మరియు మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి
◦ మీకు కావలసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీ రకాన్ని ఎంచుకోండి. వివరణాత్మక కవరేజ్ కోసం మీరు యాడ్-ఆన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు కొన్ని డాక్యుమెంట్లను కూడా అప్‌లోడ్ చేయాలి
◦ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి ప్రీమియం మొత్తాన్ని చెల్లించండి.
ఈ దశలను పూర్తి చేసిన తర్వాత, మీరు హోండా కార్ ఇన్సూరెన్స్ పాలసీ నిర్ధారణతో ఒక ఇమెయిల్ అందుకుంటారు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో క్లెయిమ్ చేయడం చాలా సులభం. హోండా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను చేయడానికి ఈ దశలను అనుసరించండి:
1. మా హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించడం ద్వారా లేదా 8169500500 పై వాట్సాప్‌లో మెసేజ్ పంపడం ద్వారా దుర్ఘటన గురించి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బృందానికి సమాచారాన్ని అందించండి. మీరు ఫారం ఫైల్ చేయడం ద్వారా లేదా సమీప శాఖను సంప్రదించడం ద్వారా ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేయవచ్చు
2. నగదురహిత క్లెయిమ్‌ల కోసం, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క 9000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలలో ఒకదాన్ని సందర్శించాలి. గ్యారేజీలో, వాహనం పూర్తిగా తనిఖీ చేయబడుతుంది
3. తనిఖీ పూర్తయిన తర్వాత మరియు ఆమోదం ఇవ్వబడిన తర్వాత, మరమ్మత్తు సేవలు గ్యారేజీలో ప్రారంభమవుతాయి. ఈ లోపు, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు అవసరమైన డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి
4. మా ఎగ్జిక్యూటివ్ క్లెయిమ్ స్థితిని ధృవీకరిస్తారు మరియు అప్‌డేట్ చేస్తారు. విజయవంతమైన ధృవీకరణ తర్వాత, అనుమతించదగిన మరమ్మత్తు ఖర్చులు గ్యారేజీకి చెల్లించబడతాయి.
మీరు కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను ఫైల్ చేసినప్పుడు కొన్ని డాక్యుమెంట్లు అవసరం. వీటిలో ఇవి ఉండవచ్చు:
1. మీ హోండా కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) కాపీ
2. డ్రైవర్ లైసెన్స్ కాపీ
3. FIR కాపీ
4. రిపేరింగ్ అంచనాలు
5. KYC (మీ కస్టమర్‌ను తెలుసుకోండి) వివరాలు.
హోండా కార్లు అంటే సౌకర్యం, విశ్వసనీయత మరియు పర్యావరణ సంరక్షణ. అయితే, రోడ్లు ఊహించని విధంగా ఉంటాయి మరియు ఎప్పుడైనా మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. ఆగిపోయిన ఇంజిన్, ఖాళీ ఇంధన ట్యాంక్, రోడ్డు దుర్ఘటన, కారుకు తరలించవలసిన అవసరం మొదలైన వాటి కారణంగా ఇలా జరగవచ్చు, ముఖ్యంగా మీరు మీ ఇంటి లేదా నగరం నుండి దూరంగా ఉన్నప్పుడు. ఇటువంటి ఊహించని ఖర్చులు అదనపు భారంగా మారతాయి.
అందుకే, ఇటువంటి పరిస్థితులలో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వంటి ప్రముఖ సంస్థలు అందించే కార్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. మేము నగదురహిత గ్యారేజ్ సేవలను అందిస్తాము, తద్వారా మీ హోండా త్వరిత సహాయం మరియు ఉత్తమ మరమ్మత్తు సేవలను అందుకుంటుంది. వివిధ భారతీయ నగరాల్లో మా వద్ద 9000+ నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి. కాబట్టి, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ హోండా కారుకు అవసరమైన రక్షణను అందించే కార్ ఇన్సూరెన్స్ పాలసీని పొందండి మరియు రెండవ ఆలోచన లేకుండా మీ హోండాలో ప్రయాణించండి.
