స్కోడా కార్ ఇన్సూరెన్స్ కొనండి
ప్రీమియం కేవలం ఇంత వద్ద ప్రారంభం: ₹2094*

ప్రీమియం ప్రారంభం

కేవలం ₹2094 వద్ద*
8000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

8000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలుˇ
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / తయారీ మరియు మోడల్ కోసం కార్ ఇన్సూరెన్స్ / స్కోడా

స్కోడా కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి/రెన్యూవల్ చేసుకోండి

స్కోడా కార్ ఇన్సూరెన్స్
స్కోడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొత్త సహస్రాబ్ధిలో భారతదేశ మార్కెట్లోకి ప్రవేశించిన మొట్టమొదటి యూరోపియన్ కార్ కంపెనీల్లో ఒకటి. నవంబర్ 2001లో ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది మరియు అప్పటి నుండి భారతదేశపు ప్యాసెంజర్ కార్ మార్కెట్లో తమకంటూ ఒక స్థానం సంపాదించుకున్న కొన్ని కంపెనీల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోంది. కాలక్రమంలో, అధునాతన డిజైన్లు మరియు చూడచక్కని రూపంతో ఈ కంపెనీ తన కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గడచిన రెండు దశాబ్దాల్లో, చక్కటి నిర్మాణం మరియు దీర్ఘకాలం మన్నే కార్ల తయారీదారుగా ఈ కంపెనీ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

ప్రముఖ స్కోడా కార్ మోడల్స్

1
స్కోడా న్యూ కుషాక్
ఎక్కువ మంది ప్రజలు ఎగువ మధ్య తరగతికి చేరుకున్న నేపథ్యంలో, కాంపాక్ట్ సైజు SUVల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో, స్కోడా తన కుషాక్ కాంపాక్ట్ SUVని భారతదేశంలో ప్రవేశపెట్టింది. సాధారణ మోడళ్ల కోసం కాకుండా, ఒక కాంపాక్ట్ SUVని కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఈ కారు తయారు చేయబడింది. ఈ కారు సంవృద్ధమైన భద్రతా ఫీచర్‌లతో లోడ్ చేయబడడంతో పాటు ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ రెండింటిలోనూ ఇది గొప్ప శ్రేణితో అందుబాటులో ఉంది. ఢిల్లీలో ఈ వాహనం ఎక్స్-షోరూమ్ ధర ₹ 10.5 లక్షలు మరియు 17.6 లక్షల మధ్య ఉంటోంది.
2
స్కోడా న్యూ ఆక్టేవియా
స్కోడాకి భారతదేశంలో మొదటి విజయాన్ని అందించింది ఆక్టేవియా కారు. ఒక మంచి మిడ్-రేంజ్ సెడాన్ ఎంపిక కోసం అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ దేశపు మార్కెట్‌కు ఒక సరికొత్త ఊపిరిగా ఈ కారు అందుబాటులోకి వచ్చింది. చాలాకాలం తర్వాత, కొత్త ఆక్టేవియాను ప్రవేశపెట్టడం ద్వారా మళ్లీ అదేవిధమైన మ్యాజిక్‌ చేయడానికి ఈ సంస్థ నిర్ణయించుకుంది. ₹ 26 లక్షల ధరతో ప్రారంభమయ్యే ఈ కార్, ఇప్పటికే మార్కెట్లో గొప్ప ప్రజాదరణ సాధించడంతో పాటు ఒరిజినల్ ఆక్టేవియాతో సంతోషంగా ఉన్న వినియోగదారుల నుండి తక్షణం ఆమోదం సంపాదించింది.
3
స్కోడా న్యూ సూపర్బ్
న్యూ సూపర్బ్, ఒరిజినల్ స్కోడా సూపర్బ్‌కు చెందిన నిజమైన వారసుడు. ఒరిజినల్ సూపర్బ్ మార్కెట్‌లో లాంచ్ అయినప్పుడు, దేశంలో ఒక పొడవైన-లగ్జరీ సెడాన్‌ కార్లు ఎక్కువగా లేవు. అప్పుడు ఒరిజినల్ సూపర్బ్ తక్షణమే సాధించింది. న్యూ సూపర్బ్ కూడా భారత కారు మార్కెట్లో ఇలాంటి మ్యాజిక్‌ను సృష్టించేందుకు ప్రయత్నించింది. భారతదేశంలో ఒరిజినల్ మోడల్ లాంచ్ అయినప్పటికన్నా, ఇప్పుడు ₹32 లక్షల బేస్ ధర వద్ద ఈ కారు చాలా పెద్ద మార్కెట్‌ను కలిగి ఉంది. ఇది చాలా మెరుగైన పరికరాల ఎంపికలతో కూడా వస్తుంది.
4
స్కోడా ర్యాపిడ్ 1.0 TSI
స్కోడా ర్యాపిడ్ 1.0 TSI అనేది ఈ కంపెనీ ద్వారా భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంట్రీ-లెవల్ సెడాన్ మరియు అత్యంత చవకైన కారు. ఎవరైతే వారి మొట్టమొదటి సెడాన్ కొనాలనుకుంటున్నారో మరియు ప్రత్యేకించి, ఒక యూరోపియన్ కంపెనీ నుండి వారి మొదటి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారో, వారికి స్కోడా ర్యాపిడ్ కంటే మెరుగైన ఎంపిక లేదు. రూ. 7.79 లక్షల తక్కువ ఎక్స్-షోరూమ్ ధర వద్ద ప్రారంభమయ్యే ఈ కారు ప్రతి ఒక్కరికీ సరైన ఎంపికగా ఉంటుంది. ఇది ట్రిమ్ మరియు ట్రాన్స్‌మిషన్‌లో బహుళ ఎంపికలు అందిస్తుంది మరియు 999 CC ఇంజన్‌తో మరియు ఆకట్టుకునే 175HPతో లభిస్తుంది.
5
స్కోడా ర్యాపిడ్ మ్యాట్ ఎడిషన్
మ్యాట్ పెయింట్ ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఇది కంపెనీ వారి సమాధానం. స్కోడా రాపిడ్ మ్యాట్ ఎడిషన్ అనేది స్కోడా ర్యాపిడ్‌కు చెందిన వారసత్వం మీద నిర్మితమైన ఒక కారు. అయితే, ఇది నల్ల రంగులో ఒక ప్రత్యేకమైన, మ్యాట్ పెయింటింగ్‌తో లభిస్తుంది. ఆకర్షణీయమైన రంగుతో రూపొందిన ఈ కారు ప్రత్యేకించి కారు ప్రేమికుల కోసం ఉద్దేశించబడింది, కారణం - దీనిని శుభ్రంగా మరియు చక్కగా కనిపించేలా ఉంచడానికి చాలా ప్రయత్నం అవసరం. ఈ కారులోని మోటివ్ వ్యవస్థలు మరియు అంతర్గత ట్రిమ్ లాంటివి స్కోడా రాపిడ్ 1.0 TSIకు సంబంధించిన ఇతర ఎడిషన్‍లు లాగే ఉంటాయి కాబట్టి, దీని నుండి మీరు మంచి పనితీరును ఆశించవచ్చు.

మీ స్కోడాకు కార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?


కార్ ఇన్సూరెన్స్ పాలసీ అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, వరద మొదలైనటువంటి అనవసరమైన సంఘటనల కారణంగా మీ వాహనానికి కవరేజ్ అందిస్తుంది. మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం కూడా చట్టపరమైన అవసరం. ప్రతి వాహన యజమానికి చట్టపరమైన నిబంధన ప్రకారం కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ ఉండాలి. అయితే, మీ వాహనం యొక్క పూర్తి రక్షణ కోసం, ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం మంచిది. స్కోడా కోసం కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి గల కొన్ని కారణాలను చూద్దాం.

ఇది యజమాని బాధ్యతను తగ్గిస్తుంది

నష్టం యొక్క ఖర్చును కవర్ చేస్తుంది

స్కోడా వంటి విలాసవంతమైన కారు అధిక నిర్వహణ ఖర్చుతో వస్తుంది. ఒకవేళ, యాక్సిడెంట్ లేదా ఏదైనా సహజ లేదా మానవ నిర్మిత విపత్తుల కారణంగా అది దెబ్బతిన్నట్లయితే, అది భారీ మరమ్మత్తు బిల్లులకు దారితీస్తుంది. సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, ఊహించని సంఘటనల కారణంగా జరిగిన నష్టాల నుండి మీ స్కోడా కారుకు పూర్తి రక్షణ లభిస్తుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్యాష్‌లెస్ గ్యారేజీలలో స్కోడా రిపేర్ సర్వీసులను కూడా పొందవచ్చు.

నష్టం ఖర్చును ఇది కవర్ చేస్తుంది

యజమాని యొక్క బాధ్యతను తగ్గిస్తుంది

కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద థర్డ్ పార్టీ కవర్ థర్డ్ పార్టీ బాధ్యతల నుండి రక్షిస్తుంది. ఒకవేళ, మీ స్కోడా కారు థర్డ్ పార్టీ వాహనం లేదా ఆస్తికి నష్టాలు లేదా డ్యామేజీలను కలిగి ఉంటే, మీరు దాని కోసం కవరేజ్ పొందుతారు.

ఇది మనశ్శాంతి అందిస్తుంది

ఇది మనశ్శాంతి అందిస్తుంది

స్కోడా కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, మీరు మనశ్శాంతిగా డ్రైవ్ చేయవచ్చు. ఒక కార్ ఇన్సూరెన్స్ పాలసీ వాహనాన్ని నడపడానికి చట్టపరమైన సమ్మతిని నెరవేరుస్తుంది మరియు ప్రమాదం కారణంగా జరిగే నష్టాల నుండి మీ ఖర్చులను కూడా కాపాడుతుంది, అందువల్ల ఒక ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒత్తిడి లేకుండా ఉండవచ్చు. దీనితోపాటు, మెట్రో మరియు నాన్-మెట్రో నగరాల్లో ప్రమాదాలు జరిగే రేటు ఎక్కువగా ఉంటుంది, మీ స్కోడా కార్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఏదైనా ప్రమాదం కారణంగా జరిగిన నష్టాలకు కవరేజ్ అందిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే స్కోడా కార్ ఇన్సూరెన్స్ రకాలు

స్వంత డ్యామేజీ కవర్, థర్డ్-పార్టీ లయబిలిటీ మరియు ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో సహా, ఈ ఏక సంవత్సరం సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ మీకు మరియు మీ వాహనానికి సంపూర్ణ రక్షణను అందిస్తుంది. అనేక యాడ్-ఆన్‌లతో మీ కార్ ఇన్సూరెన్స్ కవరేజీని మీరు మరింత మెరుగుపరచవచ్చు.

X
అన్ని విధాలా రక్షణను కోరుకునే కారు ప్రేమికులకు ఇది తగిన విధంగా సరిపోతుంది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

భారతదేశపు రహదారుల మీద డ్రైవ్ చేయగలగడానికి థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది చట్టపరంగా తప్పనిసరిగా ఉండాలి. మీ వాహనం కారణంగా జరిగిన యాక్సిడెంట్ ఫలితంగా థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి సంభవించిన ఏదైనా నష్టానికి ఆర్థిక బాధ్యత నుండి ఇది మిమ్మల్ని కవర్ చేస్తుంది.

X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

మరిన్ని అన్వేషించండి

యాక్సిడెంట్ లేదా ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తు సందర్భంలో, మీ స్వంత వాహనానికి జరిగిన నష్టానికి స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ అనేది ఆర్థిక కవరేజీ అందిస్తుంది. దొంగతనం నుండి కూడా ఇది రక్షిస్తుంది. ఇది మీ థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్ పాలసీకి సరైన భాగస్వామిగా ఉంటుంది. యాడ్-ఆన్‌ల ఎంపిక అనేది మీ కవరేజీని మరింత మెరుగుపరుస్తుంది.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ కవర్‌ను కలిగి ఉన్నవారికి ఇది సరైనది, ఈ ప్లాన్ కవర్ చేసే అంశాలు:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

మీ సౌలభ్యం కోసం నిపుణులు ఈ ప్లాన్ రూపొందించారు. మీ స్వంత నష్టం కవర్ గడువు ముగిసినప్పుడు కూడా మీకు అవాంతరాలు లేని రక్షణ లభిస్తుందని నిర్ధారించుకోవడానికి ఒక ప్యాకేజీలో 3-సంవత్సరాల థర్డ్-పార్టీ కవర్ మరియు ఒక వార్షిక ఓన్ డ్యామేజ్ కవర్ పొందండి. సమగ్ర రక్షణను ఆస్వాదించడం కోసం స్వంత నష్టం కవర్‌ను రెన్యూవల్ చేసుకోండి.

X
కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేసే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

స్కోడా కార్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

మీరు మీ స్కోడా కారు కోసం ఎంచుకునే ప్లాన్‌పై మీరు పొందే కవరేజ్ పరిధి ఆధారపడి ఉంటుంది. ఒక సమగ్ర స్కోడా కారు ఇన్సూరెన్స్ పాలసీ సాధారణంగా కింది వాటిని కలిగి ఉంటుంది

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - అగ్ని ప్రమాదం

ప్రమాదాలు

ప్రమాదం కారణంగా ఉత్పన్నమయ్యే ఆర్థిక నష్టాలను మేము కవర్ చేస్తాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడతాయి - విపత్తులు

అగ్నిప్రమాదం మరియు పేలుడు

మీ కారుకు ఎదురయ్యే అగ్నిప్రమాదాలు మరియు విస్ఫోటనాల నుండి మీకు ఆర్థికంగా రక్షణ లభిస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - దొంగతనం

దొంగతనం

మీ కారు దొంగతనానికి గురికావడం అనేది మీకు పీడకల లాంటిది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మీరు ప్రశాంతంగా ఉండే అవకాశాన్ని మేము అందిస్తాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడేవి - యాక్సిడెంట్లు

విపత్తులు

ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు ఏవైనప్పటికీ, అలాంటి విస్తృత శ్రేణి వైపరీత్యాల కోసం మేము ఆర్థిక కవరేజ్ అందిస్తాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

ఏదైనా యాక్సిడెంట్ సమయంలో, మీ చికిత్స కోసం ఖర్చులను మేము చూసుకుంటాము.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ లయబిలిటీ

ఎవరైనా థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా వారి ఆస్తికి జరిగిన గాయాలు లేదా నష్టం కూడా కవర్ చేయబడతాయి.

మీ స్కోడా కార్ ఇన్సూరెన్స్‌ - మా యాడ్ ఆన్ కవర్‌లకు సరైన సహచరుడు

క్లెయిమ్ చేసే సమయంలో జీరో డిప్రిసియేషన్ యాడ్ ఆన్ కవర్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ యాడ్-ఆన్ కవర్‌తో, ఇన్సూరర్ తరుగుదల విలువను మినహాయించకుండా దెబ్బతిన్న భాగం కోసం క్లెయిమ్ పై పూర్తి మొత్తాన్ని అందిస్తారు.
మీరు మీ స్కోడా కార్ ఇన్సూరెన్స్ పాలసీతో నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్‌ను ఎంచుకుంటే, పాలసీ అవధి సమయంలో కొన్ని క్లెయిములు లేవదీయబడినప్పటికీ మీరు బోనస్ భాగాన్ని సరిగ్గా ఉంచుకోవచ్చు. ఈ యాడ్-ఆన్ కవర్‌తో, మీరు సంచిత NCBని కోల్పోకుండా పాలసీ సంవత్సరంలో రెండు క్లెయిమ్‌లను లేవదీయవచ్చు.
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్ అనేది స్టాండ్అలోన్ ఓన్-డ్యామేజ్ మరియు సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అదనపు కవర్. ఒక హైవే మధ్యలో ఆకస్మిక ప్రమాదం లేదా బ్రేక్‌డౌన్ సందర్భంలో మీకు మద్దతు అందించడానికి ఈ యాడ్-ఆన్ కవర్ రూపొందించబడింది.
ఈ యాడ్-ఆన్ కవర్ వాహన యజమానికి గణనీయమైన ఆర్థిక నష్టాన్ని రికవర్ చేసుకోవడానికి సహాయపడుతుంది. రిటర్న్ టు ఇన్‌వాయిస్ కవర్‌తో, కారు దొంగిలించబడినా లేదా మరమ్మత్తు చేయలేని నష్టానికి గురైనా ఇన్సూర్ చేయబడిన కస్టమర్‌కు పూర్తి పరిహారం క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది.
ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా ఇంజిన్ మరియు గేర్‌ బాక్స్ ప్రొటెక్టర్
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్ యాడ్ ఆన్ కవర్ ఇంజిన్ మరియు గేర్ బాక్స్ మరమ్మత్తు చేయడానికి అయ్యే ఖర్చులకు కవరేజ్ అందిస్తుంది. లూబ్రికేటింగ్ ఆయిల్, నీటి ప్రవేశం మరియు గేర్ బాక్స్‌కు జరిగిన నష్టం కారణంగా నష్టం జరిగితే కవరేజ్ వర్తిస్తుంది.
మీ స్కోడా కారు ప్రమాదానికి గురైతే, దానిని మరమ్మత్తు చేయడానికి అనేక రోజులు పట్టవచ్చు. ఆ వ్యవధిలో, మీరు ప్రయాణం చేయడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌పై తాత్కాలికంగా ఆధారపడవలసి రావచ్చు, తద్వారా మీకు అసౌకర్యం కలుగుతుంది. డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్‌తో, మీ కారు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నంత వరకు మీ రవాణా ఖర్చులను తీర్చడానికి ఇన్సూరర్ రోజువారీ కవరేజీని అందిస్తారు.

మీ స్కోడా కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను సులభంగా లెక్కించండి

దశ 1 కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

దశ 1

మీ స్కోడా కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.

దశ 2 - పాలసీ కవర్‌ను ఎంచుకోండి - కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

దశ 2

మీ పాలసీ కవర్‌ను ఎంచుకోండి*
(ఒకవేళ మేము మీ స్కోడాను ఆటోమేటిక్‌గా పొందలేకపోతే
ఆటోమేటిక్‌గా పొందలేకపోతే, కారుకు సంబంధించిన కొన్ని వివరాలు మాకు అవసరమవుతాయి. అవి తయారీ,
మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ సంవత్సరం, మరియు నగరం)

 

దశ 3 - మునుపటి కార్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు

దశ 3

మీ మునుపటి పాలసీని మరియు
నో క్లెయిమ్ బోనస్ (NCB) స్టేటస్.

దశ 4- మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను పొందండి

దశ 4

మీ స్కోడా కార్ కోసం తక్షణ కోట్ పొందండి.

మా వద్ద క్లెయిములు సులభతరం అవుతాయి!

ప్రపంచం డిజిటల్‌గా మారిపోయింది. ఈ నాలుగు వేగవంతమైన, అనుసరించడానికి సులభమైన దశలతో మా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ కూడా అదేవిధంగా మారింది.

  • దశ #1
    దశ #1
    మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడానికి పేపర్‌వర్క్‌తో దూరంగా ఉండండి మరియు మా వెబ్‌సైట్ ద్వారా మీ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో షేర్ చేయండి.
  • దశ #2
    దశ #2
    ఒక సర్వేయర్ లేదా వర్క్‌షాప్ భాగస్వామి ద్వారా మీ స్కోడా యొక్క స్వీయ-తనిఖీ లేదా డిజిటల్ తనిఖీని ఎంచుకోండి.
  • దశ #3
    దశ #3
    మా స్మార్ట్ AI-ఎనేబుల్డ్ క్లెయిమ్ ట్రాకర్ ద్వారా మీ క్లెయిమ్ స్టేటస్‌ను ట్రాక్ చేయండి.
  • దశ #4
    దశ #4
    మా విస్తృతమైన నెట్‌వర్క్ గ్యారేజీలతో మీ క్లెయిమ్ ఆమోదించబడి సెటిల్ చేయబడుతుండగా రిలాక్స్ అవండి!

స్కోడా కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూవల్ చేసుకోవాలి?

కొత్త స్కోడా కార్ ఇన్సూరెన్స్ పాలసీని రెన్యూవల్ చేయడం లేదా కొనుగోలు చేయడం చాలా సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. మరియు కేవలం కొన్ని క్లిక్‌లతోనే మీరు ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు. నిజానికి, ఇప్పుడు నిమిషాల్లోనే మీరు మీ పాలసీ పొందవచ్చు. మీకోసం కవర్ పొందడానికి క్రింది నాలుగు దశలు అనుసరించండి.

  • దశ #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్‌ను ఎంచుకోండి
  • దశ #2
    దశ #2
    మీ కారు వివరాలు, రిజిస్ట్రేషన్, నగరం మరియు మునుపటి పాలసీ వివరాలు, ఏవైనా ఉంటే నమోదు చేయండి
  • దశ #3
    దశ #3
    కోట్‌ను స్వీకరించడానికి మీ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్‌ను అందించండి
  • దశ #4
    దశ #4
    ఆన్‌లైన్ చెల్లింపు చేయండి మరియు తక్షణమే కవరేజ్ పొందండి!

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ మొదటి ఎంపికగా ఎందుకు ఉండాలి?

మీరు స్కోడా కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు వివిధ కారణాలు తెలియజేస్తుంది. ఈ విధంగా, మీరు అనిశ్చిత సంఘటనల నుండి ఆర్థికంగా కవర్ చేయబడడమే కాకుండా, చట్టాన్ని ఉల్లంఘించని వారుగా కూడా ఉండగలుగుతారు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్ పాలసీతో సంబంధం కలిగిన అనేక ప్రయోజనాలతో, మీరు ఎల్లప్పుడూ ఉత్తమ డీల్ అందుకుంటారు. మా కీలక ప్రయోజనాల్లో ఇవి భాగంగా ఉంటాయి:

సౌకర్యవంతమైన మరియు విస్తృతమైన సర్వీస్

సౌకర్యవంతమైన మరియు విస్తృతమైన సర్వీస్

వర్క్ షాప్‌తో నేరుగా నగదురహిత సెటిల్‌మెంట్ చేయడం ద్వారా మీరు స్వంతంగా డబ్బును ఖర్చు చేయడం తగ్గుతుంది. మరియు దేశవ్యాప్తంగా ఉన్న 8000 నగదురహిత గ్యారేజీలతో, మీకోసం సహాయం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ అనేది కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది కాబట్టి, మీరెప్పుడూ నిస్సహాయంగా నిల్చిపోయే పరిస్థితి రాదు.

విస్తృతమైన కుటుంబం

విస్తృతమైన కుటుంబం

1.5 కోట్లకు పైగా సంతోషకరమైన వినియోగదారులతో మీ ఖచ్చితమైన అవసరాలేమిటో మాకు తెలుసు కాబట్టే, లక్షలాది మంది ముఖాల మీద చిరునవ్వులు పూయించాము. కాబట్టి, మీ ఆందోళనలు పక్కన పెట్టండి మరియు క్లబ్‌లో చేరండి!

ఓవర్‌నైట్ సర్వీస్

ఓవర్‌నైట్ సర్వీస్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఓవర్‌నైట్ సర్వీస్ రిపెయిర్స్ ద్వారా, చిన్నపాటి యాక్సిడెంటల్ డ్యామేజీ లేదా బ్రేక్‌డౌన్‌లు జరిగినప్పుడు మీకు కారు మరుసటిరోజుకు మళ్లీ సిద్ధంగా ఉండేలా నిర్ధారించబడుతుంది. తద్వారా, మీ రోజువారీ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదు. మీరు రాత్రివేళ చక్కగా నిద్రపోండి మరియు ఉదయానికి మీ కారును సిద్ధం చేయడానికి మాకు అనుమతి ఇవ్వండి.

సులభమైన క్లెయిమ్

సులభమైన క్లెయిములు

క్లెయిమ్‌లు చేయడమనేది సులభమైన మరియు వేగవంతమైన ప్రక్రియ. మేము ఈ ప్రక్రియను కాగితరహితంగా చేస్తాము, స్వీయ-తనిఖీ కోసం అనుమతిస్తాము మరియు మీ ఆందోళనల దూరం చేయడం కోసం వేగవంతమైన సెటిల్‌మెంట్‌ అందిస్తాము.

మీరు ఎక్కడికి వెళ్లినా మేము అక్కడ ఉంటాము

ఇలా ఊహించుకోండి. మీరు ఒక రోడ్ ట్రిప్‌కు బయలుదేరారు, అందమైన ప్రదేశంలో డ్రైవ్ చేస్తున్నారు, నగరానికి దూరంగా ఉండే మ్యాప్ చేయబడని రోడ్ల మీదుగా మీ ప్రయాణం సాగుతోంది. అలాంటి సమయంలో ఊహించని రీతిలో, మీ ప్రయాణంలో ఒక ఇబ్బంది ఎదురైంది. అలాంటి పరిస్థితుల్లో, చాలా తరచుగా, సహాయం కోసం నగదు రూపంలో చెల్లించడమనేది సహాయం పొందడం కంటే కష్టమైనదిగా ఉంటుంది. అయితే, నగదురహిత గ్యారేజీల నెట్‌వర్క్‌తో, మీరు ఎప్పుడూ అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోరు.

మీ స్కోడా కార్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్ మీకు 8000+ నగదురహిత గ్యారేజీలతో విస్తృత స్థాయి నెట్‌వర్క్‌కు యాక్సెస్ అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ నగదురహిత గ్యారేజీలనేవి నిపుణుల నుండి సహాయం కోసం నగదు లేకపోవడం అనే ఆందోళనకు మీరెప్పుడూ గురి కావాల్సిన అవసరం లేకుండా చేస్తాయి! మేము మిమ్మల్ని కవర్ చేశాము!

భారతదేశ వ్యాప్తంగా 8000+ నగదురహిత గ్యారేజీలు

మీ స్కోడా కార్ కోసం టాప్ చిట్కాలు

ఎక్కువ కాలం పార్క్ చేయబడిన కారు కోసం చిట్కాలు
ఎక్కువ కాలం పార్క్ చేయబడిన కారు కోసం చిట్కాలు
• కవర్ చేయబడిన పార్కింగ్‌లో మీ స్కోడా కారును పార్క్ చేయండి, ఇది వర్షం మరియు సూర్యకాంతి నుండి అరుగుదల మరియు తరుగుదలను నివారిస్తుంది. మీరు మీ స్కోడా కారును బయట పార్క్ చేస్తున్నట్లయితే, మీరు దానిపై కవర్‌ వేయండి.
• మీరు దీర్ఘకాలం పాటు మీ వాహనాన్ని పార్క్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే, స్పార్క్ ప్లగ్‌ను తొలగించండి. ఇది సిలిండర్ లోపల తుప్పును నివారించడానికి సహాయపడుతుంది.
• మీ స్కోడా కారును ఎక్కువ కాలం పార్క్ చేసినప్పుడు ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా ఉంచండి. అందువల్ల ఇంధన ట్యాంక్ పట్టకుండా ఉంటుంది.
• కారుకు హ్యాండ్ బ్రేక్‌ వేయడాన్ని నివారించండి. మీరు మీ కారు హ్యాండ్ బ్రేక్ లేదా పార్కింగ్ బ్రేక్‌ను వేసి, దీర్ఘకాలం పాటు దానిని అలా ఉంచినప్పుడు, బ్రేక్ ప్యాడ్‌లు బ్రేక్ రూటర్‌కు అటాచ్ చేయబడతాయి, దానివలన కొన్నిసార్లు తుప్పు పట్టడానికి దారితీయవచ్చు.
ప్రయాణాలకు సలహాలు
ప్రయాణాలకు సలహాలు
• సుదీర్ఘ ప్రయాణానికి బయలుదేరే ముందు, ఇంధన ట్యాంక్ నిండుగా ఉందని చూసుకోండి, రిజర్వ్‌లో డ్రైవింగ్ చేయవద్దు.
• సుదీర్ఘ ప్రయాణానికి వెళ్లడానికి ముందు మీ టైర్ ప్రెషర్, మీ స్కోడా కార్ యొక్క ఇంజిన్ ఆయిల్‌ను తనిఖీ చేయండి.
• ప్రయాణం సమయంలో ఎక్కువ కాలం ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ చేయడాన్ని నివారించండి, ఇది మీ స్కోడా కార్ బ్యాటరీ లైఫ్‌ను పెంచుతుంది.
నివారణ నిర్వహణ
నివారణ నిర్వహణ
• మీ స్కోడా కారు సజావుగా పని చేయడం కోసం ఫ్లూయిడ్ తనిఖీని క్రమానుగతంగా తనిఖీ చేయండి.
• మీ స్కోడా కార్ ఇంజిన్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా మార్చండి.
• లూబ్రికెంట్ మరియు ఆయిల్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా మార్చండి.
• ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా భర్తీ చేయండి మరియు బయట భాగాన్ని శుభ్రంగా ఉంచండి.
ప్రతిరోజు చేయవలసినవి మరియు చేయకూడనివి
ప్రతిరోజు చేయవలసినవి మరియు చేయకూడనివి
• కార్ క్లీనింగ్ లిక్విడ్ సోప్ మరియు నీటితో మీ కారును వాష్ చేయండి. ఇంటి డిష్ సోప్ ఉపయోగించడాన్ని నివారించండి, ఎందుకంటే ఇది పెయింట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
• గుంతలను నివారించండి మరియు స్పీడ్ బంప్‌లపై నెమ్మదిగా డ్రైవ్ చేయండి. గుంతలు మరియు స్పీడ్ బంప్‌ల మీదుగా వేగంగా వెళ్లడం వల్ల షాక్ అబ్జార్బర్‌లు, టైర్లు మరియు సస్పెన్షన్ దెబ్బతింటాయి.
• అత్యవసర పరిస్థితులు అయితే తప్ప, షార్ప్ బ్రేకింగ్‌ను నివారించడం మంచిది. షార్ప్ బ్రేకింగ్ అనేది బ్రేకింగ్ సిస్టమ్‌ను వేడి చేస్తుంది, బ్రేక్ ప్యాడ్‌లు, ఇంకా టైర్ల అరుగుదల మరియు తరుగుదలను పెంచుతుంది.
• మీ స్కోడా కారును పార్క్ చేసేటప్పుడు హ్యాండ్ బ్రేక్‌ను ఉపయోగించండి. మీరు ఒక ఇన్‌క్లైన్‌లో పార్క్ చేస్తున్నట్లయితే, కారును రివర్స్ లేదా 1వ గేర్‌లో వదిలివేయడం తెలివైన నిర్ణయం.

తరచుగా అడగబడిన ప్రశ్నలు


హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద అనేక ఎంపికలు ఉన్నాయి. క్రింది రకాల ప్లాన్‌లు ఎంచుకోవడం ద్వారా మరమ్మతులు మరియు నష్టాల ఖర్చు కారణంగా ఏర్పడే ఆర్థిక భారం నుండి మీరు మీ స్కోడా కారును సురక్షితం చేసుకోవచ్చు మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.
a. థర్డ్-పార్టీ కవర్
b. స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్
c. సింగిల్ ఇయర్ కాంప్రిహెన్సివ్ కవర్
d. సరికొత్త బ్రాండ్ కార్ల కోసం కవర్
థర్డ్ పార్టీ కవర్ అనేది తప్పనిసరి, కానీ ఇతర ప్లాన్‌లు ఐచ్ఛికం.
మీరు మీ స్కోడా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి ఎంచుకుంటే అనేక ప్రయోజనాలు లభిస్తాయి. కనీస స్థాయిలో మొదలుకొని, ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండానే, అత్యంత వేగంగా మరియు దాదాపు-తక్షణమే పాలసీ అందించబడుతుంది మరియు వివిధ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఒకేచోట సరిపోల్చే ఎంపిక లభిస్తుంది కాబట్టి, ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం సౌకర్యవంతమైనది మరియు అవాంతరాలు-లేనిది.
మీ స్కోడా కార్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. థర్డ్-పార్టీ కవర్‌ల విషయంలో, వాహనం క్యూబిక్ పరిమాణం అనేది ప్రీమియంను నిర్ణయిస్తుంది. అయితే, సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం అనేది ఇన్సూర్ చేయబడిన డిక్లేర్డ్ వాల్యూ (IDV), క్యూబిక్ సామర్థ్యం, మీ కారు రిజిస్టర్ చేయబడిన నగరం, మీరు ఎంచుకున్న కవరేజీ రకం మరియు మీ కారుకు ఏవైనా మార్పులు చేశారా అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రీమియం కోసం ఎంత చెల్లించాలో తెలుసుకోవడానికి కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ ఉపయోగించడం ఉత్తమం!