హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / కారు ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయండి

కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్

ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ నిర్మిత సంఘటనల వంటి ఊహించని ప్రమాదాల కారణంగా తలెత్తే బాధ్యతలకు కార్ ఇన్సూరెన్స్, బీమా కవరేజీని అందిస్తుంది. మీరు మీ పాలసీని దాని గడువు తేదీకి ముందుగానే రెన్యూ చేయలేకపోతే, అది ల్యాప్స్ అయిన స్థితిలోకి వస్తుంది, ఈ సమయంలో మీరు రైజ్ చేసిన ఏదైనా క్లెయిమ్ తిరస్కరించబడగల అవకాశం ఉంటుంది. మోటారు వాహనాల చట్టం 1988, ఇటీవల ఆమోదించబడిన మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం టూ వీలర్ డ్రైవర్లు ఎల్లవేళలా చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి.

కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ రెన్యూవల్ ఎందుకు అవసరం?

కారు డ్రైవర్లు ఎప్పుడూ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం అనేది చట్టపరమైన అవసరం. మీరు ప్రమాదానికి గురైన సందర్భంలో మీ వద్ద చెల్లుబాటు అయ్యే కార్ ఇన్సూరెన్స్ లేనపుడు, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యూ చేసుకోకపోవడం అనేది ఖరీదైన తప్పుగా రుజువు అవుతుంది. అప్పుడు మీరు థర్డ్ పార్టీకి జరిగిన ఏదైనా శారీరక గాయం లేదా నష్టానికి, థర్డ్ పార్టీ ఆస్తికి సంబంధించిన ఖర్చులను మీ స్వంత జేబు నుండి చెల్లించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ ప్లాన్‌ల విషయంలో గడువు తేదీకి ముందుగానే మీ పాలసీని ఆన్‌లైన్ రెన్యూవల్ ఆప్షన్‌తో, రెన్యూ చేయడం అనేది మీకు మరింత సౌకర్యవంతంగా మరియు సులభంగా మారింది.

  • దయచేసి గమనించండి: ఇటీవల ఆమోదించిన మోటార్ వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం, ఇన్సూర్ చేయబడని కారును నడపడం ద్వారా, మీరు ₹2,000 జరిమానాను చెల్లించాలి లేదా 3 నెలల వరకు జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేయవచ్చు, తద్వారా మీ సమయం మరియు శ్రమను ఆదా చేయవచ్చు

  • మీరు ఎప్పుడైనా మీ ఇన్సూరెన్స్ పాలసీని గడువు కంటే ముందే రెన్యూ చేయడానికి ప్రయత్నించాలి, గడువు తేదీకి ముందుగా పాలసీని రెన్యూ చేయడంలో మీరు విఫలమైతే, అది ల్యాప్స్ స్థితిలోకి వెళ్తుంది మరియు ఈ వ్యవధిలో చేసిన ఏదైనా క్లెయిమ్ ఇన్సూరెన్స్ సంస్థచే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.

  • కారు ఇన్సూరెన్స్ పాలసీ 90 రోజుల కంటే ఎక్కువ కాలం వరకు లాప్స్ అయిన స్థితిలో ఉన్నట్లయితే, మీరు మీ సంచిత నో క్లెయిమ్ బోనస్‌ను కోల్పోతారు.

మా కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్లాన్‌లు

Single Year Comprehensive Car Insurance
సింగిల్ ఇయర్ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్
  • 1 సంవత్సరానికి మీ కారును రెన్యూ చేసుకోండి. ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత సంఘటనల వలన థర్డ్ పార్టీకి ఏ నష్టం జరగకుండా కవరేజ్ పొందండి
>Standalone Own Damage Cover - Private Car
స్టాండ్ అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ - ప్రైవేట్ కార్
  • మీరు ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత సంఘటనల నుండి మాత్రమే మీ కారును ప్రత్యేకంగా కవర్ చేయాలని చూస్తున్నట్లయితే స్టాండ్‌అలోన్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి.
Long Term Comprehensive Car Insurance
దీర్ఘకాలిక సమగ్ర కార్ ఇన్సూరెన్స్
  • ఇప్పుడు నేరుగా 3 సంవత్సరాల కోసం మీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోండి!! ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత సంఘటనలు వంటి వాటి నుండి థర్డ్ పార్టీకి ఏ నష్టం జరగకుండా కవరేజ్ పొందండి
Third Party Liability Car Insurance
థర్డ్ పార్టీ లయబిలిటీ కార్ ఇన్సూరెన్స్
  • థర్డ్ పార్టీకి జరిగిన శారీరక గాయాలకు లేదా థర్డ్ పార్టీ ఆస్తికి జరిగిన నష్టాల కోసం కవరేజీని పొందండి.
why-hdfc-ergo

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

మా కస్టమర్ బేస్‌ను త్వరగా పరిశీలించండి, 1 కోటి+ పైగా ప్రజలు మోహంలో ఆనందాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! IAAA మరియు ICRA రేటింగ్‌లతో సహా మాకు లభించిన అనేక అవార్డులు మా విశ్వసనీయతను, నమ్మకాన్ని మరియు అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్ధ్యాలను గురించి తెలియజేస్తాయి!
why-hdfc-ergo
why-hdfc-ergo
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ఓవర్ నైట్ వెహికల్ రిపేర్స్

The stars might refuse to shine, but we will never refuse to repair! We repair minor accidental damages from dusk to dawn without any hassle. You can simply get in touch with us; we will get your car picked at night, repair it and deliver it by morning at your door step .We offer these services in 13 cities at present!
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

మా లావాదేవీలకు పారదర్శకత కీలకం, అలాగే మీరు అవాంతరాలు లేని క్లెయిమ్ విధానాలను పొందగలరని హామీ లభిస్తుంది. 30 నిమిషాల *** క్లెయిమ్ ఆమోదం, QR కోడ్ ద్వారా ఆన్‌లైన్‌ క్లెయిమ్ సమాచారంతో మేము ప్రతిచోటా కస్టమర్‌ మనసుని గెలిచాము.
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

ప్రతి రోజు, ప్రతి వారం, ఎక్కడైనా మరియు ఎప్పుడైనా అవాంతరాలు లేని మద్దతును పొందండి! మా ప్రత్యేకమైన అంతర్గత క్లెయిమ్‌ల బృందం మరియు కస్టమర్ సపోర్ట్‌తో మీ ప్రతి ప్రశ్నకు ప్రతిస్పందన అందుతుందని మేము నిర్ధారిస్తున్నాము. ఇది గొప్ప విషయం కదా? అర్ధరాత్రి వేళల్లో కూడా మీకు సహకరించడానికి ఒకరు ఉన్నారనే ఆలోచన?
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
why-hdfc-ergo
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా వెళ్లండి! పరిమితులు లేకుండా వెళ్లండి!

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ పనులన్నింటినీ కాగితరహితంగా పూర్తి చేయగలిగినప్పుడు, పాతకాలం నాటి సమయం తీసుకునే పేపర్ వర్క్స్ కోసం ఎందుకు కట్టుబడి ఉండాలి? ఆన్‌లైన్ లావాదేవీలు మీకు అపరిమితంగా మరియు ఉచితంగా వస్తాయి! హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మీ సమయం విలువైనది!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
why-hdfc-ergo

1.5+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

మా కస్టమర్ బేస్‌ను త్వరగా పరిశీలించండి, 1 కోటి+ పైగా ప్రజలు మోహంలో ఆనందాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! IAAA మరియు ICRA రేటింగ్‌లతో సహా మాకు లభించిన అనేక అవార్డులు మా విశ్వసనీయతను, నమ్మకాన్ని మరియు అత్యధిక క్లెయిమ్ చెల్లింపు సామర్ధ్యాలను గురించి తెలియజేస్తాయి!
why-hdfc-ergo

ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు***

The stars might refuse to shine, but we will never refuse to repair! We repair minor accidental damages from dusk to dawn without any hassle. You can simply get in touch with us; we will get your car picked at night, repair it and deliver it by morning at your door step.We offer these services in 13 cities at present!
why-hdfc-ergo

అత్యుత్తమమైన పారదర్శకత

మా లావాదేవీలకు పారదర్శకత కీలకం, అలాగే మీరు అవాంతరాలు లేని క్లెయిమ్ విధానాలను పొందగలరని హామీ లభిస్తుంది. 30 నిమిషాల *** క్లెయిమ్ ఆమోదం, QR కోడ్ ద్వారా ఆన్‌లైన్‌ క్లెయిమ్ సమాచారంతో మేము ప్రతిచోటా కస్టమర్‌ మనసుని గెలిచాము.
why-hdfc-ergo

మీకు అవసరమైన - 24 x 7 మద్దతు!

ప్రతి రోజు, ప్రతి వారం, ఎక్కడైనా మరియు ఎప్పుడైనా అవాంతరాలు లేని మద్దతును పొందండి! మా ప్రత్యేకమైన అంతర్గత క్లెయిమ్‌ల బృందం మరియు కస్టమర్ సపోర్ట్‌తో మీ ప్రతి ప్రశ్నకు ప్రతిస్పందన అందుతుందని మేము నిర్ధారిస్తున్నాము. ఇది గొప్ప విషయం కదా? అర్ధరాత్రి వేళల్లో కూడా మీకు సహకరించడానికి ఒకరు ఉన్నారనే ఆలోచన?
why-hdfc-ergo

కాగితరహితంగా వెళ్లండి! పరిమితులు లేకుండా వెళ్లండి!

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ పనులన్నింటినీ కాగితరహితంగా పూర్తి చేయగలిగినప్పుడు, పాతకాలం నాటి సమయం తీసుకునే పేపర్ వర్క్స్ కోసం ఎందుకు కట్టుబడి ఉండాలి? ఆన్‌లైన్ లావాదేవీలు మీకు అపరిమితంగా మరియు ఉచితంగా వస్తాయి! హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద మీ సమయం విలువైనది!

యాడ్ ఆన్ కవర్లు

జీరో డిప్రిషియేషన్ కవర్
జీరో డిప్రిసియేషన్ కవర్‌తో పూర్తి అమౌంట్‌ను పొందండి!

సాధారణంగా, డిప్రిసియేషన్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత మాత్రమే మీ పాలసీ మీకు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. మీ పాలసీ వివరాలలో డిప్రిసియేషన్/తరుగుదల వివరాలు ఉంటాయి. కావున, పూర్తి మొత్తాన్ని పొందడానికి మీరు ఏమి చేయవచ్చు? ఇక్కడ ఒక మార్గం ఉంది! జీరో-డిప్రిసియేషన్ కవర్! జీరో డిప్రిసియేషన్‌తో, ఇక డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు పూర్తి మొత్తాన్ని అందుకుంటారు !


How does it Work? If you car is damaged and the claim amount is Rs 15,000, out of which insurance company says that you may have to pay 7000 as depreciation amount excluding policy excess/deductible. If you buy this add on cover then, the insurance company will pay the entire assessed amount. However, policy excess/deductible needs to be paid by the customer, which is quite nominal.
నో క్లెయిమ్ బోనస్ రక్షణ
మీరు మీ NCBని రక్షించుకోవడానికి ఒక మార్గం ఉంది

పార్క్ చేసిన వాహనానికి లేదా విండ్‌షీల్డ్ గ్లాస్‌కు ఏదైనా బాహ్య ప్రభావం వలన, వరదలు, మంటలు మొదలైన వాటి వల్ల కలిగే నష్టం కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఈ యాడ్ ఆన్ కవర్ మీరు ఇప్పటివరకు అర్జించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించడమే కాకుండా, తదుపరి NCB స్లాబ్‌కు కూడా తీసుకువెళుతుంది .


How does it work? Consider a situation wherein your parked car gets damaged due to collision or any other calamity, No Claim bonus protection shall keep your NCB of 20% protected for the same year and take it smoothly to the next year slab of 25%. This cover can be availed upto 3 claims during the entire policy duration.
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్
మేము మిమ్మల్ని కవర్ చేశాము!

మీ కారులోని ఏదైనా సాంకేతికత లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము 24 గంటలూ మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము! ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్‌లో సైట్‌లో చిన్న రిపేరింగ్‌లు, లాస్ట్ కీ అసిస్టెన్స్, డూప్లికేట్ కీ సమస్య, టైర్ మార్పులు, బ్యాటరీ జంప్ స్టార్ట్‌లు, ఇంధన ట్యాంక్ ఖాళీ చేయడం, టోయింగ్ ఛార్జీలు ఉంటాయి! 


How does it work? Under this add on cover there are multiple benefits which can be availed by you. For instance, If you are driving your vehicle and there is damage, it needs to be towed to a garage. With this add on cover, you may call the insurer and they will get your vehicle towed to the nearest possible garage upto 100 kms from your declared registered address.
రిటర్న్ టు ఇన్వాయిస్
IDV మరియు వాహనం ఇన్‌వాయిస్ విలువ మధ్య వ్యత్యాసం మొత్తాన్ని అందజేస్తుంది

మీ కారు దొంగిలించబడిందని లేదా పూర్తిగా డ్యామేజ్‌ అయిందని అనే మాట వినబడిన రోజు కన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది? మీ పాలసీ ఎల్లప్పుడూ మీ వాహనం యొక్క IDV (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ)ని మీకు చెల్లిస్తుంది. IDV వాహనం యొక్క ప్రస్తుత మార్కెట్ ధరకు సమానంగా ఉంటుంది. కానీ, ఇన్‌వాయిస్ యాడ్-ఆన్‌కు తిరిగి రావడంతో, మీరు ఇన్‌వాయిస్ విలువ మరియు IDV మధ్య వ్యత్యాసాన్ని కూడా పొందుతారు! మీరు FIR ఫైల్ చేయబడిందని, సంఘటన జరిగిన 90 రోజులలోపు కారును తిరిగి పొందలేదని నిర్ధారించుకోవాలి.


ఇది ఎలా పని చేస్తుంది? మీరు 2007లో ఒక వాహనాన్ని కొనుగోలు చేసి ఉంటే, దాని కొనుగోలు ఇన్‌వాయిస్ విలువ ₹7.5 లక్షలు అయితే. రెండు సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్‌లో పేర్కొనబడిన విలువ (IDV) ₹5.5 లక్షలు అవుతుంది, ఒకవేళ మీ కారు రిపేర్ లేదా డ్యామేజికి గురైతే లేదా దొంగిలించబడితే మీరు ఒరిజినల్ కొనుగోలు ఇన్‌వాయిస్ విలువ ₹7.5 లక్షలను పొందుతారు. దీనికి అదనంగా మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు వర్తించే పన్నులను కూడా పొందుతారు. పాలసీలో పేర్కొన్న విధంగా అదనపు/ మినహాయింపు మొత్తాలను మీరే భరించాల్సి ఉంటుంది.
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
వర్షాలు లేదా వరదల సమయంలో ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించినప్పుడు మీ కారు ఇంజిన్ దెబ్బతినకుండా కాపాడుతుంది

వర్షాలు కురిసినా లేదా వరద అలలు ఎగసిపడినా, మీ వాహనం యొక్క గేర్‌బాక్స్, ఇంజిన్‌లు ప్రత్యేక రక్షణ కవచం ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కవరేజీతో సురక్షితం చేయబడతాయి! ఇది అన్ని చిన్న భాగాలు లేదా అంతర్గత భాగాల భర్తీ లేదా మరమ్మత్తు కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఇది లేబర్ ఖర్చులు, కంప్రెషన్ టెస్టుల ఖర్చులు, మెషిన్ ఛార్జీలు, ఇంజన్ సిలిండర్ రీ-బోరింగ్‌లను మరింత కవర్ చేస్తుంది.


ఇది ఎలా పని చేస్తుంది? ఒక వర్షాకాలపు రోజున జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఇంజిన్/గేర్ బాక్స్ పాడైపోయిందని ఉహించుకుందాం, అపుడు ఇంజిన్ ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున, అటువంటి పరిస్థితిలో మీరు వాహనం నడపడం కొనసాగిస్తే, ఇంజిన్ సీజ్ చేయబడుతుంది. అటువంటి నష్టం పర్యవసాన నష్టంగా మారుతుంది, అది ప్రామాణిక మోటారు ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడదు. ఈ యాడ్-ఆన్‌తో మీ కారు ఇంజన్ అంతర్గత భాగాలు, గేర్‌బాక్స్ సురక్షితంగా ఉంటాయి.
కీ రీప్లేస్‌మెంట్ కవర్
కీలు పోగొట్టుకున్నారా / దొంగిలించబడ్డాయా? కీ రీప్లేస్‌మెంట్ కవర్ మీకు సహాయపడుతుంది!

మీ కీలు దొంగిలించబడ్డాయా లేదా పోగొట్టుకున్నారా? వీలైనంత త్వరగా మీరు రీప్లేస్‌మెంట్ కీలను పొందడానికి ఈ యాడ్-ఆన్ మీకు సహాయపడుతుంది!


ఇది ఎలా పనిచేస్తుంది? మీరు మీ కార్ కీలను కోల్పోయినా లేదా పోగొట్టుకున్నా, ఈ యాడ్-ఆన్ కవర్ ఒక రక్షకునిగా పనిచేస్తుంది.
వినియోగించదగిన వస్తువుల ధర

మీ కారులో ఉపయోగించే అన్ని వినియోగ వస్తువులను కవర్ చేసే వినియోగించదగిన వస్తువుల కవర్ ఇక్కడ ఇవ్వబడింది! అవును! మీకు ప్రస్తుతం ఇది అవసరం! ఇది నట్లు, బోల్ట్‌ల వంటి పునర్వినియోగంచదగని అన్ని వినియోగ వస్తువులకు కూడా చెల్లిస్తుంది ....


ఇది ఎలా పని చేస్తుంది? మీ కారు ప్రమాదానికి గురై, రిపేరింగ్స్ అవసరమైనట్లయితే, అలాంటి సందర్భంలో మీ కారును సరిచేయడానికి పునర్వినియోగించలేని వినియోగ వస్తువులను మళ్లీ కొనుగోలు చేయాల్సి రావచ్చు. వాషర్‌లు, స్క్రూలు, లూబ్రికెంట్‌లు, ఇతర నూనెలు, బేరింగ్‌లు, నీరు, రబ్బరు పట్టీలు, సీలెంట్లు, ఫిల్టర్లు మరియు మరెన్నో భాగాలు మోటారు ఇన్సూరెన్స్ కవరేజీ కింద కవర్ చేయబడవు మరియు ఇన్సూరెన్స్ చేసినవారే వాటిని భరించాలి. ఈ యాడ్ ఆన్ కవర్‌తో మేము అటువంటి వినియోగ వస్తువులకు చెల్లిస్తాము, మీకు సులభతరం చేస్తాము.
ఉపయోగం కోల్పోవడం - డౌన్‌టైమ్ రక్షణ

మీ కారు రిపేర్‌లో ఉన్నప్పుడు క్యాబ్స్ కోసం చెల్లించారా? డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది! రోజువారీ ప్రయాణం కోసం ఇతర రవాణా మార్గాలను ఉపయోగించడానికి కస్టమర్ చేసిన ఖర్చుకు క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది .


ఇది ఎలా పని చేస్తుంది? కావున, మీ వాహనం ఒక యాక్సిడెంట్‌కు గురైంది మరియు రిపేరింగ్ నిమిత్తం గ్యారేజిలో ఇవ్వబడింది! దురదృష్టవశాత్తు, ప్రయాణించడానికి వాహనం లేకుండా మీరు క్యాబ్‌లకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నారు! కానీ, వినియోగ నష్టం-డౌన్‌టైమ్ ప్రొటెక్షన్‌ కవర్‌తో, క్యాబ్‌లపై మీరు చేసే అన్ని ఖర్చులు కవర్ చేయబడతాయని మీకు తెలుసా? అవును! ఇది పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఉంటుంది!

తరచుగా అడిగే ప్రశ్నలు

ప్రకృతి వైపరీత్యాలు, మానవ నిర్మిత సంఘటనల కారణంగా థర్డ్ పార్టీకి జరిగిన ఏదైనా నష్టానికి, కార్ ఇన్సూరెన్స్ బీమా కవరేజీని అందిస్తుంది. ఇన్సూరెన్స్ లేకుండా మీ కారుని దాని ఒరిజినల్ స్థితికి తీసుకురావడానికి చాలా ఖర్చు అవుతుంది, మోటారు వాహనాల చట్టం 1988 మరియు ఇటీవల ఆమోదించిన మోటారు వాహనాల (సవరణ) చట్టం 2019 ప్రకారం, టూ వీలర్ డ్రైవర్లు అందరూ కూడా ఎల్లవేళలా చెల్లుబాటు అయ్యే కారు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి
ఆన్‌లైన్‌లో మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సౌకర్యవంతంగా, సులభంగా ఉంటుంది. అనుసరించవలసిన దశలు క్రింది విధంగా ఉంటాయి
  • మీ అకౌంట్ కి లాగిన్ అవండి
  • మీ వివరాలను ఎంటర్ చేయండి
  • మీరు ఎంచుకోవాలనుకుంటున్న ఏవైనా యాడ్-ఆన్‌లను ఎంచుకోండి
  • మరియు చెల్లింపు చేయండి
మీ గడువు ముగిసిన కార్ ఇన్సూరెన్స్ పాలసీలను సులభంగా ఆన్‌లైన్‌లో రెన్యూ చేసుకోవచ్చు - ఎటువంటి తనిఖీ అవసరం లేదు, మీరు చేయవలసిందల్లా మీ పాలసీ వివరాలతో లాగిన్ అవ్వడమే. ఒకసారి నమోదు చేసిన తర్వాత రెన్యూవల్ ప్రీమియంను ఇన్సూరర్ మీకు తెలియజేస్తారు. ఒకసారి చెల్లింపు చేసిన తర్వాత, మీరు నిమిషాలలో పాలసీ కాపీని అందుకుంటారు.
ఇన్సూరర్‌తో మీ అకౌంట్‌లోకి లాగిన్ అవడం మరియు మీ పాలసీ వివరాలను సందర్శించడం ద్వారా పాలసీ గడువు తేదీ గురించి మీరు తెలుసుకోవచ్చు, ప్రత్యామ్నాయంగా మీరు మీ పాలసీ వివరాల కోసం కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. గడువు తేదీలోగా మీ పాలసీని రెన్యూ చేయడంలో ఇది సహాయపడుతుంది కాబట్టి మీ టూ వీలర్ పాలసీ గడువు తేదీని మీరు తెలుసుకోవడం ముఖ్యం
ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ద్వారా ఆమోదించబడిన పరికరాలతో కారు అమర్చబడి ఉంటే, స్వంత డ్యామేజీ ప్రీమియంపై డిస్కౌంట్ అనుమతించబడుతుంది.
నిర్మాణాత్మక పూర్తి నష్టం అనేది మీ కారుకు జరిగిన ప్రమాదవశాత్తు నష్టం/ డ్యామేజిని సూచిస్తుంది, ఇక్కడ రిపేరింగ్ మరియు రిట్రైవల్ ఖర్చు మీ పాలసీలో ఉన్న ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) కన్నా 75% ఎక్కువగా ఉంటుంది. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి పూర్తి క్లెయిమ్ అమౌంట్ కోసం అర్హత పొందండి. పాలసీ డాక్యుమెంట్ ప్రకారం ఏదైనా అదనపు లేదా కోతలను మీరు భరించాలి.
అవసరమైన డాక్యుమెంట్లలో సక్రమంగా సంతకం చేసిన క్లెయిమ్ ఫారమ్, చెల్లుబాటు అయ్యే RC కాపీ, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ అది దొంగిలించబడితే పోలీసు కాపీ, FIR కాపీ మరియు బిల్లు ప్రూఫ్, రిలీజ్ నోట్ మరియు నగదు రసీదు ఉండాలి
చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.
అన్ని రకాల వాహనాలుఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు20%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు25%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు35%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు45%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు50%
మీరు మీ గడువు ముగిసిన పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి, ఒకసారి డాక్యుమెంట్లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆమోదించబడిన తర్వాత, చెల్లింపు లింక్ పంపబడుతుంది, మీరు పాలసీ రెన్యూవల్ కోసం చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయబడిన తర్వాత, మీరు పాలసీ కాపీని అందుకుంటారు.
మునుపటి పాలసీ గడువు తేదీ నుండి 90 రోజుల వరకు నో క్లెయిమ్ బోనస్ చెల్లుతుంది. పాలసీ 90 రోజుల్లోపు రెన్యూ చేయబడకపోతే, నో క్లెయిమ్ బోనస్ 0% అవుతుంది మరియు రెన్యూ చేయబడిన పాలసీకి ఎటువంటి ప్రయోజనం అందజేయబడదు.
వాహనం యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) 'ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం'గా పరిగణించబడుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో ఇది నిర్ణయించబడుతుంది.
వాహనం యొక్క IDV అనేది బ్రాండ్ యొక్క తయారీదారు జాబితా చేసిన అమ్మకం ధర మరియు ఇన్సూరెన్స్/ రెన్యూవల్ ప్రారంభంలో ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించిన వాహనం మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది మరియు డిప్రిసియేషన్ కోసం సర్దుబాటు చేయబడుతుంది (క్రింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం). IDV అనేది సైడ్ కార్(లు) మరియు/లేదా యాక్సెసరీలు వాహనానికి అమర్చబడి ఉంటే, కానీ తయారీదారు జాబితా చేసిన వాహనం యొక్క అమ్మకం ధరలో చేర్చబడకపోతే కూడా అదే విధంగా నిర్ణయించబడుతుంది.
వాహనం యొక్క వయస్సుIDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్
6 నెలలకు మించనిది5%
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది15%
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది20%
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది30%
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది40%
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది50%
అందుబాటులో ఉన్న ప్లాన్‌లలో థర్డ్ పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్, సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ, ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు ఉన్నాయి.
పేపర్ వర్క్, భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు మీరు మీ పాలసీని తక్షణమే పొందుతారు.
కేవలం ఒక ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలుదారు పేరు మీద బదిలీ చేయవచ్చు. సేల్ డీడ్/ విక్రేత ఫారమ్ 29/30/NOC / NCB రికవరీ అమౌంట్ వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లతో ఇప్పటికే ఉన్న పాలసీ కింద ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయాల్సి ఉంటుంది. లేదా మీరు ఇప్పటికే ఉన్న పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని రద్దు చేయడానికి సేల్ డీడ్/ ఫారమ్ 29/30 వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం.
మా వెబ్‌సైట్ hdfcergo.com ద్వారా ఆన్‌లైన్‌లో మీ పాలసీ వివరాలను మార్చుకోవచ్చు. వెబ్‌సైట్‌లోని 'సహాయం' విభాగాన్ని సందర్శించండి, అభ్యర్దనను పెట్టండి. అభ్యర్దనను పంపడానికి లేదా సేవలను అన్వేషించడానికి, ఇక్కడ క్లిక్ చేయండి
x