10,000 + నగదురహిత నెట్‌వర్క్ ఆసుపత్రులతో, క్లెయిమ్ సెటిల్‌మెంట్ చాలా సులభం !

హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ
Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • FAQs

పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్

ప్రమాదాలు ప్రజలను మానసికంగా, శారీరకంగా మరియు ఆర్థికంగా విచ్ఛిన్నం చేస్తాయి, జీవితకాలం పొదుపును హరించివేస్తాయి. మీ మోహంలో చిరునవ్వు మాయమవుతుంది, మీరు షాక్‌లో ఉండిపోతారు, ఆర్థిక భారంతో మిగిలిపోతారు. ఇలాంటి సమయాల్లో స్థిరంగా ప్రయాణించడానికి మీకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ అండగా ఉంటుంది. ఈ health insurance policy ఆకస్మిక వైద్య ఖర్చులను కవర్ చేయడానికి ఒకే ట్రాన్సాక్షన్‌తో ఏకమొత్తంలో పరిహారం అందిస్తుంది. మీరు లేని పక్షంలో మీ కుటుంబం నిత్య జీవితాన్ని సురక్షితం చేయడానికి, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను పొందడం చాలా అవసరం.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి గల కారణాలు

Worldwide Coverage
ప్రపంచవ్యాప్త కవరేజ్
మీ పాలసీ భౌగోళిక పరిమితులకు పరిమితం కావడం గురించి ఆందోళన చెందుతున్నారా? చింతించకండి, మా పాలసీలు ప్రపంచవ్యాప్తపు భౌగోళిక కవరేజీని అందిస్తాయి.
Option to cover family
కుటుంబాన్ని కవర్ చేయడానికి ఆప్షన్
పెరుగుతున్న మీ కుటుంబాన్ని కవర్ చేయడం గురించి చింతిస్తున్నారా? మంచి ఆలోచన, మేము కుటుంబం ఐక్యతను ఇష్టపడతాము, ఒకే పాలసీలో మీ కుటుంబం మొత్తాన్ని కవర్ చేయడానికి మా వద్ద అనేక పాలసీలు ఉన్నాయి.
Lifelong Renewability
జీవితకాలం పునరుద్ధరణ
పాలసీని రెన్యూ చేయడం నుండి, వయస్సు పరిమితులు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా? మా వద్ద నున్న లైఫ్‌టైమ్ రెన్యూవల్ ఆప్షన్‌లతో, వయస్సు పరంగా వచ్చే అడ్డంకులను మీరు అధిగమించవచ్చు.
No medical checkups
వైద్య పరీక్షలు లేవు
పాలసీని పొందడానికి మీరు అనేక వైద్య పరీక్షలు చేయించుకోవడంలో విసిగిపోయారా? గొప్ప శుభవార్త ఏమిటంటే, మీరు ఇకపై వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.

ఏమి చేర్చబడింది?

Accidental Death
ప్రమాదం కారణంగా మరణం

ఘోరమైన ప్రమాదాలు మరణానికి కారణమవుతాయి. ఒక ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అతని/ఆమె తన ప్రాణాలను కోల్పోతే, మా పాలసీ బీమా మొత్తంలో 100% వరకు అందిస్తుంది.

Permanent Total Disability
శాశ్వత పూర్తి వైకల్యం

కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలు తలరాతను నిర్ణయిస్తాయి. ప్రమాదంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి శాశ్వతంగా వైకల్యానికి గురైతే, ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ప్రయోజనాలు అందిస్తాము.

Broken Bones
విరిగిన ఎముకలు

ఎముకలు లేకుండా కదలికలు అసాధ్యం. ఒక యాక్సిడెంట్ కారణంగా ఎముకలు విరిగినట్లయితే మా పాలసీ ఇన్సూరెన్స్ మొత్తాన్ని బట్టి ప్రయోజనాలను అందిస్తుంది.

Burns
కాలిన గాయాలు

ఒక అగ్నిప్రమాదం మీ జీవితంలోని వెలుగును తొలగిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఏదైనా ప్రమాదం ఎదురైతే మా పాలసీ బీమా మొత్తం ఆధారంగా ప్రయోజనాలను అందిస్తుంది మరింత తెలుసుకోండి...

Ambulance costs
అంబులెన్స్ ఖర్చులు

సకాలంలో సహాయం అందకపోవడం ప్రాణాంతకంగా మారవచ్చు. సమీపంలోని ఆసుపత్రికి చేరుకోవడానికి మా పాలసీ రవాణా ఖర్చులను చెల్లిస్తుంది, మరింత తెలుసుకోండి...

Hospital Cash
ఆసుపత్రి నగదు

ప్రమాదాల వల్ల నగదు కొరత ఏర్పడుతుంది. ప్రమాదం కారణంగా జరిగిన హాస్పిటలైజేషన్‌ కోసం మేము రోజువారీ నగదు అలవెన్సును అందిస్తాము.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

Adventure Sport injuries
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Self-inflicted injuries
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

War
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

Participation in defense operations
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

Venereal or Sexually transmitted diseases
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

Treatment of Obesity or Cosmetic Surgery
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం ఎందుకు ముఖ్యం?

Round the clock coverage
24 గంటల పాటు కవరేజ్

ప్రపంచమంతా రాత్రిపూట నిద్రిస్తుంది కానీ, మేము గడియారం వలె రాత్రి, పగలు తేడా లేకుండా మీకు 24 గంటల పాటు నిరంతర కవరేజిని అందిస్తామని నిర్ధారిస్తున్నాము

Covers Age 18-70 Years
18-70 ఏళ్ల వయస్సు గల వారిని కవర్ చేస్తుంది

మీరు మీ తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ వహిస్తారని మాకు తెలుసు. మేము మీ తల్లిదండ్రులను 70 సంవత్సరాల వరకు, ఇతరులను 65 సంవత్సరాల వరకు కవర్ చేయడంలో మద్దతును అందిస్తాము.

Worldwide Coverage
ప్రపంచవ్యాప్త కవరేజ్

మేము భౌగోళిక సరిహద్దులను దాటవేసి ప్రపంచవ్యాప్తంగా కవరేజీని అందిస్తాము.

Lifelong Renewability
జీవితకాలం పునరుద్ధరణ

మేము లైఫ్‌టైమ్ రెన్యూవల్ కోసం వీలైన పాలసీలను అందిస్తాము, కావున, వయస్సు పెరిగే కొద్దీ పాలసీని రెన్యూ చేయడంలో సహాయం చేయడానికి మీ ముందుకు వస్తాము.

Free Look Cancellation
ఫ్రీ లుక్ క్యాన్సలేషన్

మేము సదా మీకు సేవచేయాలని కోరుకుంటాము, పాలసీని రద్దు చేసే ఆప్షన్ మీపై ఆధారపడి ఉంటుంది. మేము ఫ్రీ లుక్ క్యాన్సలేషన్ కోసం అనుమతిస్తాము.

Long Term Discount
దీర్ఘకాలిక డిస్కౌంట్

మాపై మీకున్న నమ్మకాన్ని మేము గుర్తిస్తున్నాము మరియు దీర్ఘకాలిక పాలసీలపై డిస్కౌంట్ల కోసం హామీ ఇస్తున్నాము.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇప్పుడు మీరు ప్రమాదవశాత్తు గాయాల నుండి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌తో మీ మొత్తం కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. ఈ పాలసీ ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం, విరిగిన ఎముకలు, ప్రమాదం కారణంగా కాలిన గాయాల కోసం మీకు మరియు మీ కుటుంబానికి ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అంబులెన్స్ ఖర్చు మరియు హాస్పిటల్ క్యాష్ యొక్క ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.
మీరు ఫ్యామిలీ ప్లాన్ కింద మీ జీవిత భాగస్వామితో పాటు ఇద్దరు ఆధారపడిన పిల్లలను చేర్చుకోవచ్చు.
అవును, మీరు మీ ఆధారపడిన తల్లిదండ్రులను 70 సంవత్సరాల వయస్సు వరకు చేర్చుకోవచ్చు. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సరసమైన ఫ్లాట్ రేటుతో మీ ఆధారపడిన తల్లిదండ్రులకు యాడ్ ఆన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు మీరు వారు మీ పట్ల చూపిన ప్రేమ మరియు శ్రద్ధలో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వవచ్చు.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు నాలుగు ప్లాన్ ఎంపికలతో రూ. 2.5 లక్షల నుండి 15 లక్షల వరకు విస్తృత శ్రేణి ఇన్సూరెన్స్ మొత్తాన్ని అందిస్తుంది.
  1. సెల్ఫ్ ప్లాన్
  2. స్వీయ మరియు కుటుంబం కోసం ప్లాన్
  3. సెల్ఫ్+డిపెండెంట్ పేరెంట్స్ యాడ్-ఆన్.
  4. సెల్ఫ్ మరియు ఫ్యామిలీ ప్లాన్ + డిపెండెంట్ పేరెంట్స్ యాడ్-ఆన్
ఆధారపడిన పిల్లలు అంటే 91 రోజులు మరియు 25 సంవత్సరాల మధ్య వయస్సు గల వివాహం కాని, ప్రాథమిక ఇన్సూర్ చేయబడిన వ్యక్తి లేదా ప్రపోజర్ పై ఆర్థికంగా ఆధారపడి ఉండే మరియు అతని/ఆమె స్వతంత్ర ఆదాయ వనరులను కలిగి ఉండని పిల్లలు (సహజంగా పుట్టిన పిల్లలు లేదా చట్టపరంగా దత్తత తీసుకోబడినవారు).
పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వరకు వయస్సు గల ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది.
మీరు 022-6234 6234(భారతదేశం నుండి మాత్రమే యాక్సెస్ చేయవచ్చు) లేదా 022 66384800 (స్థానిక/ STD ఛార్జీలు వర్తిస్తాయి)కు కాల్ చేయడంతో క్లెయిమ్ చేయవచ్చు. తదుపరి, మీరు సమర్పించవలసిన డాక్యుమెంట్ల విషయంలో మేము మీకు సహాయం చేస్తాము, అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అందిన తరువాత ప్రాసెస్ మొదలవుతుంది, 7 పనిదినాల్లో పూర్తి అవుతుంది.
ఫారమ్ మరియు ప్రీమియం చెల్లింపు అందిన తేదీ నుండి 15 రోజుల్లోపు పాలసీ ప్రారంభమవుతుంది.
ఈ పాలసీలోని ఉత్తమ భాగం ఏమిటంటే, అవాంతరాలు లేని డాక్యుమెంటేషన్‌ ప్రాసెస్‌ను కలిగి ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా సంబంధిత వివరాలతో పూర్తి ప్రపోజల్ ఫారమ్‌ను పూరించండి, దానిపై సంతకం చేయండి. ఏదైనా ఒక ప్లాన్‌ను టిక్ చేయండి, చెక్‌ను అటాచ్ చేయండి లేదా ఫారమ్‌లో క్రెడిట్ కార్డు వివరాలను పూరించండి.
ప్రమాదం కారణంగా ఎముకలు విరిగితే, ఇది 50,000 (ఆధారపడిన తల్లిదండ్రుల కోసం) వరకు 10% ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తుంది.
అవార్డులు మరియు గుర్తింపు
x