పర్యావరణం మీద మనిషికి గౌరవం కొరవడిన కారణంగా, ప్రకృతి వైపరీత్యాలనేవి తరచుగా సంభవించడమే కాకుండా, అవి తీవ్రంగా కూడా మారుతున్నాయి. ప్రత్యేకించి భారతదేశంలో, భౌగోళిక వైవిధ్యానికి తోడు వివిధ ప్రాంతాలు ఎల్లప్పుడూ కొన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉంటాయి. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో హిమ శకలాలు విరిగిపడడం, భూచరియలు విరిగిపడడం, లేదా తీర ప్రాంతాల్లో సునామీ మరియు తుపాన్లు రావడం లాంటివి ఈ ప్రమాదాల క్రిందకే వస్తాయి. ప్రత్యేకించి రుతుపవనాల కాలంలో, నదుల్లో నీటి మట్టాలు పెరిగినప్పుడు భారతదేశంలోని చాలా రాష్ట్రాలు వరదలతో సతమతమవుతుంటాయి.
వరదల కారణంగా, సాధారణ జీవితం స్థంభించిపోతుంది. రోడ్లు, పంటలు మరియు డ్రైనేజీ వ్యవస్థలకు నష్టం వాటిల్లడమే కాకుండా, మీ ఇల్లు మరియు వస్తువులు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, మీకు వరద ఇన్సూరెన్స్ ఉంటే, అది కూడా సాధారణంగా సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్‌లో భాగం అయితే, మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం తక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో మరమ్మత్తు ఖర్చులు చాలావరకు తిరిగి చెల్లించబడతాయి. అందుకే, వరద ఇన్సూరెన్స్ గురించిన మరింత సమాచారం ఇక్కడ ఇవ్వబడింది.
భారతదేశంలో, ఒక ఇంటి కోసం ఆదా చేయడానికి ప్రజలకు తరచుగా దశాబ్దాల కాలం పడుతుంది. అయితే, ఒక పెద్ద వరద కారణంగా ఆ శ్రమ మొత్తం కొన్ని నిమిషాల్లోనే నాశనం కాగలదు. కాబట్టే, ఒక సమగ్ర హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయడం తప్పనిసరి. వరద ఇన్సూరెన్స్ అనేది అలాంటి హోమ్ ఇన్సూరెన్స్‌కు ఉపభాగంగా ఉంటుంది, మరియు మీరు దానిని ఎంచుకున్నప్పుడు, వరద కారణంగా మీరు ప్రభావితమైతే, మరమ్మత్తుల కోసం పరిహారం అందుకోవడానికి మీరు అర్హులవుతారు.
మరో మాటలో చెప్పాలంటే, వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లినప్పుడు, లేదా నీళ్లు ఇళ్లలోకి వచ్చినప్పుడు, లేదా సముద్ర పోటు కారణంగా సముద్రపు నీరు నగరంలోకి ప్రవేశించినప్పుడు జరిగే నష్టం నుండి మీకు పరిహారం లభిస్తుంది.
భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి మరియు రావి, యమున, సుట్లెజ్, గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి మొదలైన నదీ తీరాల్లో అనేక ప్రముఖ నగరాలు మరియు పట్టణాలు ఉన్నాయి. ఈ నదులకు అనేక ఉపనదులు కూడా ఉన్నాయి. అలాగే, భారతదేశం ఒక ద్వీపకల్ప దేశం కావడం వల్ల, దేశం మూడు వైపులా - పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ప్రకారం, దేశంలోని దాదాపుగా 12.5% ప్రదేశాలు ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలుగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్ లాంటి కొన్ని రాష్ట్రాలు క్రమం తప్పకుండా వరద ప్రభావం చవిచూస్తుంటాయి. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు భయంకరమైన వర్షాలు మరియు ఆకస్మిక వరదలతో బాధపడుతుంటాయి.

• మీ ఇంట్లోకి నీళ్లు రావడం వల్ల ఫ్లోరింగ్‌కు నష్టం జరగడం

• నీటి లీకేజీ వల్ల షార్ట్ సర్క్యూట్ ఏర్పడిన కారణంగా జరిగే ఏదైనా డ్యామేజీ

• ఫర్నిచర్‌కు డ్యామేజీ, మీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది వ్యక్తిగత వస్తువులను పేర్కొంటే

నిర్మాణం నుండి పెయింట్ వరకు గోడలకు జరిగిన డ్యామేజీ

రూఫ్ నుండి నీళ్లు లీక్ కావడం. అలాగే, పగుళ్లు మరియు జాయింట్‌ల ద్వారా లీకేజీ మాత్రమే కాకుండా, పైకప్పు మీద నీళ్లు నిలవడం వల్ల కూడా నిర్మాణానికి డ్యామేజీ ఏర్పడుతుంది
 ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం
ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం
 యజమానుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన నష్టాలను ఇన్సూరెన్స్ కవర్ చేయదు
 ఉద్దేశపూర్వక విధ్వంసం
ఉద్దేశపూర్వక విధ్వంసం
 యజమానుల ఉద్దేశపూర్వక ప్రవర్తనతో జరిగిన డ్యామేజీలు ఈ పాలసీ క్రింద కవర్ చేయబడవు
 లోపం గురించి తెలియజేయకపోవడం
లోపం గురించి తెలియజేయకపోవడం
 పాలసీ తీసుకునే సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పారదర్శక పద్ధతిలో ఉత్పత్తి గురించిన సరైన సమాచారం అందించాలి.
ఒప్పందంలో జాబితా చేయబడని ఏదైనా వస్తువు కవర్ చేయబడదు.
 శిధిలాలు
శిధిలాలు
 శిధిలాల తొలగింపును ఈ పాలసీ కవర్ చేయదు
 టైమ్ ల్యాప్స్
టైమ్ ల్యాప్స్
 మీరు సకాలంలో నష్టం గురించి తెలియజేయకపోతే
 ల్యాప్స్ అయిన పాలసీ
ల్యాప్స్ అయిన పాలసీ
 ఇన్సూరెన్స్ వ్యవధి ముగిసిన తర్వాత సంభవించే ఏవైనా నష్టాలు కవర్ చేయబడవు
1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@
మీకు అవసరమైన సపోర్ట్ 24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి
మీకు అవసరమైన సపోర్ట్-24x7
కస్టమర్ అవసరాలను తీర్చడం
అత్యుత్తమమైన పారదర్శకత
Awards
అవాంతరాలు లేని మరియు వేగవంతమైన క్లెయిమ్ సెటిల్‌మెంట్
క్లెయిమ్ సమయంలో, నష్టాన్ని అంచనా వేయడం కోసం ఇన్సూరెన్స్ కంపెనీ ఒక నిపుణుడిని కేటాయిస్తుంది. కాబట్టి, మీరు సరైన ప్రకటన చేయడం మరియు నష్టాన్ని నిరూపించడానికి సరైన డాక్యుమెంట్లు మరియు సాక్ష్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి, ఇన్వాయిస్లను సురక్షితంగా ఉంచుకోండి మరియు మీకు వీలైన పరిస్థితిలో నష్టానికి సంబంధించిన ఫోటోలను రుజువుగా ఉంచుకోండి. అలాగే, నష్టం గురించి వీలైనంత త్వరగా ఇన్సూరర్‌కు తెలియజేయండి.