హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / ఎనర్జీ హెల్త్ ఇన్సూరెన్స్
Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • FAQs

ఎనర్జీ- మీ డయాబెటిస్ కోసం రూపొందించబడిన ఒక ప్రత్యేక ప్లాన్

 

ప్రతిదీ షుగర్-రహితంగా తీసుకోవడం, పార్టీలను స్కిప్ చేయడం, చాయ్‌ను తగ్గించడం, ఆర్థోపెడిక్ షూలను వాడటం, ఇన్సులిన్ బ్యాగ్‌లు క్యారీ చేయడం, చేదుగా ఉన్న (కాకరకాయ) జ్యూస్ తీసుకోవడం ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు కదూ! డయాబెటిస్‌తో జీవించడం అనేది కొన్నిసార్లు వ్యక్తిని ఒంటరిగా చేస్తుందని, ఎంతో బాధను మిగులుస్తుందని మేము అర్థం చేసుకున్నాము. అయితే, ఇకపై పరిస్థితులు మారనున్నాయి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఎనర్జీ హెల్త్ ప్లాన్ ప్రత్యేకంగా డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్నవారి కోసం రూపొందించబడింది. ఈ ఎనర్జీ పాలసీ మీ డయాబెటిస్, దాని కారణంగా తలెత్తే సమస్యలను కవర్ చేస్తుంది; డయాబెటిస్‌తో మీరు ఆనందకరమైన జీవితాన్ని కొనసాగించడంలో ఇది మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. డయాబెటిస్‌ను నిజంగా అర్థం చేసుకునే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ . ఎంత తీపి కబురు కదూ?

మీ డయాబెటిస్ కోసం ఎనర్జీ హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవడానికి గల కారణాలు

Active Wellness Program
యాక్టివ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్
మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో, దానిని నిర్వహించడంలో మీకు సహాయపడటానికి వెల్‌నెస్ ప్రోగ్రామ్, పర్సనలైజ్డ్ హెల్త్ కోచ్ అందుబాటులో ఉంటారు. ఈ ప్లాన్ రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తుంది, మీరు ఆరోగ్యంగా ఉన్నందుకు గాను, రెన్యూవల్ ప్రీమియంపై 25% డిస్కౌంట్‌ను అందిస్తుంది.
No Waiting Periods
ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ లేవు
ఎనర్జీ హెల్త్ ప్లాన్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కారణంగా తలెత్తే ప్రతి హాస్పిటలైజెషన్ కోసం 1 రోజు నుండి కవరేజీని అందిస్తుంది.
Reward Bucket
రివార్డ్ బకెట్
మీ మెడికల్ టెస్టుల ఫలితాలు మరియు BMI, BP, HbA1c, కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన అనారోగ్య పారామితుల ఆధారంగా, మేము మీ మెరుగైన ఆరోగ్యం కోసం ప్రోత్సాహకాలను అందిస్తాము.
Sum Insured Restore
బీమా చేసిన మొత్తం పునరుద్ధరణ
అనారోగ్యాలకు చికిత్స చేయడానికి బీమా చేయబడిన మొత్తం తక్కువయిందని ఆందోళన చెందుతున్నారా? ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం రీబౌండ్‌తో, మీరు మీ మొదటి క్లెయిమ్‌ తరువాత మీ కవర్‌కు అవసరమైన 100% ఇన్సూరెన్స్ మొత్తాన్ని తక్షణమే అదనంగా పొందుతారు.

డయాబెటిస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో ఏమి కవర్ చేయబడుతుంది?

Hospitalization expenses

హాస్పిటలైజేషన్ ఖర్చులు

ప్రతి ఇతర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగానే మేము, అనారోగ్యాలు, గాయాల కారణంగా హాస్పిటలైజేషన్ కోసం మిమ్మల్ని కవర్ చేస్తాము.

Pre and post-hospitalisation

ఆసుపత్రిలో చేరడానికి ముందు మరియు తరువాత

రోగ నిర్ధారణ, ఇన్వెస్టిగేషన్స్ గురించిన మీ ఖర్చులు కూడా కవర్ చేయబడతాయి. హాస్పిటలైజేషన్‌కు 30 రోజుల ముందు వరకు మీ అన్ని ప్రీ-హాస్పిటలైజేషన్ ఖర్చులు, 60 రోజుల వరకు డిశ్చార్జ్ తర్వాత ఖర్చులు ఇందులో చేర్చబడ్డాయి.

Day-care procedures

డే-కేర్ విధానాలు

సాంకేతిక పురోగతి కారణంగా 24 గంటల కన్నా తక్కువ వ్యవధిలో ఆసుపత్రి/ డే కేర్ సెంటర్లలో తీసుకున్న డే కేర్ చికిత్సలను ఇది కవర్ చేస్తుంది.

Emergency Road Ambulance

ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్

మీకు అవసరమైనప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లండి. మీ ప్రతి హాస్పిటలైజేషన్ సందర్భంలో అంబులెన్స్ ఖర్చులు ₹ 2000 వరకు కవర్ చేయబడతాయి.

Organ Donor Expenses

అవయవ దాత ఖర్చులు

అవయవ దానం ఒక గొప్ప కార్యం కావున, పెద్ద అవయవాల మార్పిడి సందర్భంలో అవయవ దాతకు సంబంధించిన వైద్య, శస్త్రచికిత్స ఖర్చులను మేము కవర్ చేస్తాము.

Lifelong renewability

జీవితకాలం పునరుద్ధరణ

ఒకసారి మీరు మా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో సురక్షితం చేయబడిన తరువాత, ఇక మీరు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిరంతర రెన్యూవల్స్‌‌తో మీ జీవితాంతం కొనసాగుతుంది.

Save Tax

పన్నును ఆదా చేసుకోండి

ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీ పొదుపులను సురక్షితం చేయడానికి మాత్రమే కాకుండా మీకు పన్ను ఆదా చేసుకోవడానికి కూడా సహాయపడుతుందని మీకు తెలుసా? అవును, మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో ₹ 75,000 వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు.

HbA1C Benefit

HbA1C ప్రయోజనం

ప్రతి పాలసీ సంవత్సరానికి మీ HbA1C టెస్టుల కోసం అయ్యే ఖర్చులు ₹750 వరకు కవర్ చేయబడతాయి. వెల్‌నెస్ టెస్టులు అని పిలువబడే రెండు సంపూర్ణ మెడికల్ చెక్-అప్‌లు కూడా క్యాష్‌లెస్ ప్రాతిపదికన గోల్డ్ ప్లాన్‌లో ₹2000 వరకు చెల్లించబడతాయి.

Personalized wellness portal

పర్సనలైజ్డ్ వెల్‌నెస్ పోర్టల్

మీ అన్ని మెడికల్ రికార్డులను ట్రాక్ చేసే, స్టోర్ చేసే ఒక వ్యక్తిగత వెల్‌నెస్ వెబ్ పోర్టల్‌కు యాక్సెస్ పొందండి. ఇది మీ పరిస్థితిని మానిటర్ చేయడంలో మీకు సహాయపడుతుంది, మీకు అవసరమైన హెల్త్ ప్రొడక్టుల కొనుగోలు కోసం ప్రత్యేక ఆఫర్‌లను అందిస్తుంది.

Health Coach

హెల్త్ కోచ్

మీ పోషకాహారం, ఫిట్‌నెస్ ప్లాన్‌లను రూపొందించడానికి, వాటిని గైడ్ చేయడానికి మరియు మీకు గుర్తు చేయడానికి, ప్రత్యేక శిక్షణ పొందిన హెల్త్ కోచ్‌ను పొందండి.

Wellness Support

వెల్‌నెస్ సపోర్ట్

మీ సందేహాలకు తీర్చడానికి, మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అందుబాటులో ఉన్న కేంద్రీకృత హెల్ప్‌లైన్‌కు యాక్సెస్ పొందండి. ఆరోగ్య సంరక్షణ, నిర్వహణపై మీకు విలువైన సమాచారాన్ని అందించడానికి మంత్లీ న్యూస్‌లెటర్స్

Reward points

రివార్డ్ పాయింట్లు

మీ మెడికల్ టెస్టులు మరియు BMI, BP, HbA1c, కొలెస్ట్రాల్ వంటి తీవ్రమైన అనారోగ్య పారామితుల ఫలితాలను బట్టి, మేము మీకు 25% వరకు రెన్యూవల్ ప్రీమియం డిస్కౌంట్లను అందిస్తాము.

డయాబెటిస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో చేర్చబడని అంశాలు?

Other Pre-existing diseases
ఇతర ముందుగా-ఉన్న వ్యాధులు

ముందుగా-ఉన్న ఏదైనా అనారోగ్య పరిస్థితి (డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్ కాకుండా) 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత కవర్ చేయబడుతుంది.

Self-inflicted injuries
స్వయంగా చేసుకున్న గాయాలు

మత్తు మందులు, మాదకద్రవ్యాలు వంటి పదార్ధాల ఉపయోగం మరియు దుర్వినియోగం వలన కలిగే పరిణామాలు స్వీయ గాయాలకు దారితీస్తాయి. మా పాలసీ స్వతహా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

War
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

Treatment of obesity or cosmetic surgery
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవరేజీ కోసం అనుమతించబడవు.

Venereal or Sexually transmitted diseases
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

వెయిటింగ్ పీరియడ్స్

First 24 Months From Policy Inception
పాలసీ ప్రారంభం నుండి మొదటి 24 నెలలు

డయాబెటిస్, హైపర్‌టెన్షన్ కాకుండా, ముందు నుండి ఉన్న వ్యాధులు పాలసీ జారీ చేసిన రెండు సంవత్సరాల తర్వాత కవర్ చేయబడతాయి.

మా నగదురహిత
హాస్పిటల్ నెట్‌వర్క్

15000+

ఆసుపత్రి లొకేటర్
లేదా
మీకు సమీపంలో ఉన్న ఆసుపత్రులను గుర్తించండి

అవాంతరాలు లేని, సులభమైన క్లెయిములు! నిశ్చితము


మా వెబ్‌సైట్ ద్వారా క్లెయిమ్స్ రిజిస్టర్ చేయండి మరియు ట్రాక్ చేయండి

మీకు సమీపంలో ఉన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను గుర్తించండి

మీ మొబైల్‌లో నిరంతర క్లెయిమ్ అప్‌డేట్

మీకు నచ్చిన క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ విధానాన్ని పొందండి

తరచుగా అడిగే ప్రశ్నలు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎనర్జీ అనేది డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులకు అనుగుణంగా రూపొందించబడిన ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్.
ఎనర్జీ ప్లాన్ ప్రయోజనాలను రెండు విధాలుగా వర్గీకరించవచ్చు:
డయాబెటిస్/హైపర్‌టెన్షన్ నిర్దిష్ట ప్రయోజనాలు- డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్ వలన అయ్యే ఇన్-పేషంట్ ఖర్చుల కోసం కవరేజ్, పర్సనలైజ్డ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్, వెల్‌నెస్ ఇన్సెంటివ్‌లు, పర్సనల్ హెల్త్ కోచ్, ఇంటిగ్రేటెడ్ వెబ్ పోర్టల్ మరియు మరెన్నో.
స్టాండర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు- ప్రమాదం కారణంగా అయ్యే గాయాలు, తీవ్రమైన అనారోగ్యాలు, రీస్టోర్ ప్రయోజనం, నో క్లెయిమ్ బోనస్, పన్ను ప్రయోజనాలు, అవయవ దాత ఖర్చులు, కో-పేమెంట్ (ఐచ్ఛికం) మరియు ఇతర వాటి కోసం కవరేజ్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎనర్జీ ప్లాన్ 18-65 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1, డయాబెటిస్ టైప్ 2 మెల్లిటస్, ఇంపెయిర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ (IFG), ఇంపెయిర్డ్ గ్లూకోస్ టాలరెన్స్ (IGT), ప్రీ-డయాబెటిస్ (IFG, IGT) లేదా హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వారి కోసం రూపొందించబడింది.
లేదు, టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్ కారణంగా ఉత్పన్నమయ్యే లేదా దానితో అనుసంధానించబడిన ఏదైనా అనారోగ్యం, సమస్యలు లేదా జబ్బుల కోసం వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు, అవి 1 రోజు నుండి కవర్ చేయబడతాయి. అంతే కాకుండా, వీటితో పాటు ఇక్కడ:
  • కొన్ని నిర్దిష్ట అనారోగ్యాలు/ సర్జరీల కోసం 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది
  • PEDల పై 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్
అవును, ఎనర్జీ ప్లాన్ ప్రమాదవశాత్తు గాయాల కారణంగా తలెత్తే ఇన్-పేషెంట్ హాస్పిటలైజెషన్ ఖర్చులను, ఇతర ప్రాణాంతక వ్యాధులను కవర్ చేస్తుంది.
ఎనర్జీ అనేది డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వ్యక్తుల కోసం రూపొందించిన ఒక సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లోని అన్ని ప్రయోజనాలను కలిగి ఉంటుంది, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ఎనర్జీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొరకు రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి:
1. Silver (excludes the cost of wellness test)
2. Gold (includes the cost of wellness test)
యాక్టివ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ అనేది ఎనర్జీ ప్లాన్‌కు వెన్నెముక లాంటిది. ఇది మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో, మీ ఫిట్‌నెస్ లక్ష్యాలను (ఆహారం, వ్యాయామ పరమైన) ట్రాక్ చేయడంలో, ఛేదించడంలో మీకు సహాయపడుతుంది, ఆరోగ్యంగా ఉన్నందుకు గాను మీకు రివార్డులను కూడా అందిస్తుంది. ఇందులో:
వెల్‌నెస్ టెస్టులు
పాలసీ సంవత్సరంలో రెండు పూర్తి హెల్త్ చెకప్‌ల ప్రయోజనాలను పొందండి.
  • వెల్‌నెస్ టెస్ట్ 1: HbA1c, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, BMI
  • వెల్నెస్ టెస్ట్ 2: HbA1c, FBS, పూర్తి కొలెస్ట్రాల్, క్రియాటినిన్, హై-డెన్సిటీ లైపోప్రొటీన్ (HDL), లో-డెన్సిటీ లైపోప్రొటీన్ (LDL), ట్రైగ్లిజరైడ్స్ (TG), పూర్తి ప్రొటీన్, సీరం ఆల్బుమిన్, గామా-గ్లుటామిల్‌ట్రాన్స్‌ఫేరేస్ (GGT), సీరం గ్లుటామిక్ ఆక్సలోఅసెటిక్ ట్రాన్సామినేస్ (SGOT), సీరం గ్లుటామిక్ పైరువిక్ ట్రాన్సామినేస్ (SGPT), బిలిరుబిన్, పూర్తి కొలెస్ట్రాల్: HDL కొలెస్ట్రాల్, ECG, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, BMI, డాక్టర్ కన్సల్టేషన్.
వెల్‌నెస్ సపోర్ట్
  • మీ హెల్త్ రికార్డు కోసం వెబ్ పోర్టల్‌కు యాక్సెస్
  • మీ డైట్ మరియు ఫిట్‌నెస్ లక్ష్యాలను ప్లాన్ చేయడానికి మరియు సాధించడానికి ఒక పర్సనలైజ్డ్ హెల్త్ కోచ్
  • మీ అన్ని సందేహాలను తీర్చడానికి ఒక కేంద్రీకృత హెల్ప్‌లైన్
వెల్‌నెస్ రివార్డులు
  • మంచి ఆరోగ్య పరిస్థితులను నిర్వహించినందుకు గాను 25% వరకు రెన్యూవల్ ప్రీమియం డిస్కౌంట్లు
  • మీ మెడికల్ ఖర్చుల కోసం (కన్సల్టేషన్ ఛార్జీలు, మెడిసిన్స్ మరియు డ్రగ్స్, డయాగ్నోసిస్ ఫీజులు, డెంటల్ ఖర్చులు, ఏ మెడికల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడని ఇతర ఖర్చులు వంటివి) 25% వరకు రెన్యూవల్ ప్రీమియం రీయింబర్స్‌మెంట్
వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లోని ప్రతి ఫీచర్ మీ జీవితాన్ని మెరుగ్గా, ఆరోగ్యవంతంగా మార్చే లక్ష్యంతో నిర్దేశించబడింది.
  • వెల్‌నెస్ టెస్టులతో మీ ఆరోగ్యాన్ని అర్థం చేసుకోండి, మరియు పర్యవేక్షించండి
  • వెల్‌నెస్ సపోర్ట్‌తో ఆరోగ్యవంతంగా ఉండండి
  • వెల్‌నెస్ రివార్డులతో మరింత ఆదా చేసుకోండి
అవును, ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ప్రీ-హెల్త్ చెకప్ తప్పనిసరి. ఎనర్జీ అనేది డయాబెటిస్ ఉన్నవారి కోసం ప్రత్యేకించిన ప్లాన్. ఇది వారి ప్రత్యేకమైన ఆరోగ్య సంరక్షణ అవసరాల పట్ల శ్రద్ధ వహిస్తుంది.
ప్రీ-హెల్త్ చెకప్ టెస్టులు మీ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, అనారోగ్యాలను బహిర్గతం చేస్తాయి, ఇది మీకు అత్యంత అనుకూలమైన కవర్‌ను అందించడంలో మాకు సహాయపడతాయి.
లేదు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న వ్యక్తుల కోసం మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.
అవును, మీరు భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా 16000+ నగదురహిత నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత సదుపాయాన్ని పొందవచ్చు.
సంభావ్య రిస్కులను బట్టి, పాలసీ కింద మినహాయింపులు అనేక ప్రయోజనాలను అందించవచ్చు. ఈ ప్లాన్ కోసం సాధారణ మినహాయింపుల జాబితా కింది విధంగా ఉంటుంది:
  • ముందస్తు-వ్యాధులకు (డయాబెటిస్ లేదా హైపర్‌టెన్షన్ కాకుండా) 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది
  • ముఖ్యంగా కంటిశుక్లం, హెర్నియా, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీలు, హైడ్రోసెల్ సర్జరీ మొదలైనటువంటి నిర్దిష్ట వ్యాధులకు 2 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది.
  • HIV లేదా AIDS మరియు సంబంధిత వ్యాధుల కారణంగా తలెత్తే ఖర్చులు
  • పుట్టుకతో వచ్చే బాహ్య లోపాలు, మానసిక వ్యాధి లేదా అస్వస్థత, మతిస్థిమితం కోల్పోవడం, కాస్మెటిక్ సర్జరీ మరియు బరువు నియంత్రణ చికిత్సలు
  • మత్తు కలిగించే డ్రగ్స్ మరియు ఆల్కహాల్ వంటి మత్తు పదార్థాలు లేదా హాలూసినోజెనిక్ పదార్థాల దుర్వినియోగం
  • యుద్ధం లేదా యుద్ధం చర్యల కారణంగా ఆసుపత్రిలో చేరడం. లేదా అణు, రసాయన లేదా జీవ ఆయుధం మరియు ఏదైనా రకం రేడియేషన్ కారణంగా
  • గర్భధారణ, దంత చికిత్స, బాహ్య పరికరాలు మరియు ఉపకరణాలు
  • వ్యక్తిగత సౌలభ్యం మరియు సౌకర్యానికి వస్తువులు
  • ప్రయోగాత్మక, పరిశోధనాత్మక మరియు నిరూపించబడని చికిత్స పరికరాలు మరియు ఔషధ నియమాలు
లేదు, ఈ ప్లాన్‌లో ఉప-పరిమితులు లేవు.
లేదు, మీరు ఎంచుకుంటే తప్ప లేదా ఎంచుకోనంత వరకు, సహ-చెల్లింపు నిబంధన వర్తించదు.
మీ ప్రీమియంను తగ్గించుకోవడానికి మీరు పాలసీ కొనుగోలు సమయంలో 20% వరకు సహ-చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
అవును, ఫ్రీలుక్ వ్యవధిలో మీరు మీ ప్రీమియంను తిరిగి పొందవచ్చు.
అది ఎలాగో ఇక్కడ ఇవ్వబడింది
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద పాలసీ డాక్యుమెంట్లను అందుకున్న తేదీ నుండి 15 రోజుల వరకు ఫ్రీలుక్ పీరియడ్‌ను పొందవచ్చు. ఒకవేళ, ఈ వ్యవధిలో మీరు మనసు మార్చుకున్నట్లయితే లేదా పాలసీ నిబంధనలు, షరతులతో సంతృప్తి చెందకపోతే, మీరు మీ పాలసీని రద్దు చేసుకోవడాన్ని ఎంచుకోవచ్చు.
అవార్డులు మరియు గుర్తింపు
x