పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రమాదాల కారణంగా సంభవించే గాయాలు, మరణం లేదా వైకల్యం నుండి ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి రక్షణ అందిస్తుంది. ఒక వాహనం నడిపే సమయంలో ఏదైనా దుర్ఘటన లేదా వేరొకరి తప్పు కారణంగా అనేక సంభావ్య ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ఊహించని రోడ్డు ప్రమాదం ఎదురైనప్పుడు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి మరియు వారి ప్రియమైన వారికి పరిహారం చెల్లిస్తుంది. అలాగే, పని సంబంధిత ప్రయాణం కోసం ఎక్కువ సమయం వెచ్చించే వ్యక్తులకి ఇది ప్రత్యేకించి ఉపయోగకరంగా ఉంటుంది.
కారు ఉన్న ఎవరికైనా తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అవసరం. ఇదొక తప్పనిసరి చట్టబద్దమైన అవసరం కాబట్టి, మీకు కారు ఉంటే, మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా ఉండాలి. లేకపోతే, కార్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ను ఎంచుకోవడానికి మీకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. మరియు ఈ పాలసీ కోసం గరిష్ట కవరేజీ వయస్సు 70 సంవత్సరాలుగా ఉంటుంది.
వ్యక్తిగత పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఫీచర్లను ఇక్కడ చూడండి.
ఆఫర్ పై ఫీచర్ | వివరాలు |
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రమాదవశాత్తు మరణం | కవర్ చేయబడింది |
ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ప్రమాదం కారణంగా జరిగిన వైకల్యం | కవర్ చేయబడింది |
ప్రమాదం కారణంగా కాలిన గాయాలు | కవర్ చేయబడింది |
విరిగిన ఎముకలు | కవర్ చేయబడింది |
ఇన్సూర్ చేయబడిన మొత్తం | ₹15 లక్షలు |
రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనేక అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఒక జంతువుని తప్పించే క్రమంలో మరియు పక్కకు ప్రయాణించే క్రమంలో కొందరికి ప్రమాదం ఎదురుకావచ్చు. అలాగే, కొన్ని క్షణాలు వేరొక ఆలోచనలోకి వెళ్లడం లేదా దృష్టి మరల్చడం వల్ల కొందరికి ప్రమాదం ఎదురుకావచ్చు. ఎవరి విషయంలోనైనా అలాంటి సంఘటనలు ఎదురుకావచ్చు. అయితే, యజమాని డ్రైవర్ కోసం PA కవర్ అనేది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక సున్నిత మార్గంగా ఉంటుంది. కార్ ఇన్సూరెన్స్‌లో PA కవర్ ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
1. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రమాదానికి గురై, వైకల్యం సంభవించినప్పుడు ఆర్థిక సహాయం అందిస్తుంది.
2. ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అవసరమయ్యే చికిత్స, హాస్పిటల్ బిల్లులు మరియు మందుల లాంటి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందిస్తుంది.
3. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రమాదం సమయంలో ప్రాణాలు కోల్పోయిన పక్షంలో, పాలసీలో పేర్కొనబడిన నామినీలకు లేదా కుటుంబంలోని సభ్యులకు PA కవర్ ఆర్థిక మద్దతు అందిస్తుంది.
ఇన్సూరెన్స్‌లో రెండు రకాల PA కవర్లు ఉన్నాయి, అవి ఇలా ఉంటాయి:
యజమాని డ్రైవర్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది గరిష్టంగా ₹15 లక్షల ఇన్సూరెన్స్ మొత్తంతో సెట్ చేయబడి ఉంటుంది. మరియు ప్రమాదం సంభవించిన సందర్భాల్లో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి లేదా పాలసీలోని నామినీలకు పరిహారం చెల్లించబడుతుంది. యజమాని డ్రైవర్ కోసం PA కవర్ పరిహారం నిర్మాణం ఇక్కడ ఇవ్వబడింది.
గాయం రకం | పరిహారం |
ఒక కంటిలో దృష్టి కోల్పోవడం లేదా ఒక అవయవం కోల్పోవడం | 50% |
రెండు కళ్లలోనూ దృష్టి కోల్పోవడం లేదా loss of both limbs | 100% |
ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యం | 100% |
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మరణించడం | 100% |
1988 నాటి ఒరిజినల్ మోటార్ వాహన చట్టంలో ఎక్కడా కూడా యజమాని డ్రైవర్ కోసం PA కవర్ తప్పనిసరి అని పేర్కొనలేదు. అయితే, ఆ తర్వాత చేసిన సవరణలో PA కవర్ తప్పనిసరి అని జోడించబడింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం అందించే లేదా వైకల్యం లేదా గాయాలు సంభవించినప్పుడు పరిహారం అందించే ఉద్దేశ్యంతో ఇది జోడించబడింది.
జనవరి 2019లో చేసిన మరొక సవరణతో తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ పొందడానికి సంబంధించిన నియమాలు కొంచెం మారాయి. తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ని దాటవేయడం కోసం క్రింది షరతుల్లో దేనినైనా మీరు ఎంచుకోవచ్చు.
1. మీ వద్ద ఇప్పటికే ₹15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కవరేజీ అందించే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే.
2. మీరు ఇప్పటికే మీ ఇతర ప్రస్తుత వాహనాల్లో దేనికోసమైనా యజమాని డ్రైవర్ PA కవర్ కొనుగోలు చేసి ఉంటే.
పైన పేర్కొన్న షరతులేవీ నెరవేర్చకపోతే, కార్ ఇన్సూరెన్స్ పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌ని మీరు ఎంచుకోవచ్చు మరియు ₹15 లక్షల కవరేజీ అందుకోవచ్చు.
కార్ ఇన్సూరెన్స్‌లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అనేది క్రింది చేర్పులు మరియు మినహాయింపులను అందిస్తుంది.
లేదు, ఒకసారి కంటే ఎక్కువ సార్లు PA కవర్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. జనవరి 2019కి ముందు, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ అనేది కార్ ఇన్సూరెన్స్ పాలసీతో కలిసి ఉండేది.
గతంలో, మీకు రెండు కార్లు ఉంటే మరియు ఆ రెండు కార్ల కోసం కార్ ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేస్తే, ఆ రెండు సమయాల్లోనూ మీరు రెండుసార్లు PA కవర్ కొనుగోలు చేస్తారు. దీని ఫలితంగా, కారు యజమానులు ఒకటి కంటే ఎక్కువ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగి ఉండడంతో పాటు దానివల్ల ఖర్చు ఎక్కువయ్యేది.
అయితే, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని ఇప్పుడు కార్ ఇన్సూరెన్స్ పాలసీతో బండిల్‌గా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పటికే కవరేజీ ఉంటే, మీరు ఈ పాలసీని దాటవేయవచ్చు.
1. 1.6 కోట్ల కంటే ఎక్కువ సంతోషకరమైన కస్టమర్లతో ఇన్సూరెన్స్ పరిశ్రమలో ఒక విశ్వసనీయమైన పేరుగా ఉంటోంది.
2. అసమానమైన 24/7 కస్టమర్ సపోర్ట్‌కి యాక్సెస్ పొందండి.
3. కస్టమర్లకు సేవలు అందించడం మరియు ప్రతి ఒక్కరి కోసం ప్లాన్‌లు రూపొందించడంలో 16 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.
4. ఉత్తమ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీకి యాక్సెస్ పొందండి.
5. అవాంతరాలు లేని క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ మరియు అత్యంత పారదర్శకత.
6. కస్టమర్ అనుభవం, ఇబ్బందులు లేని క్లెయిమ్‌ల ప్రక్రియ కోసం ప్రపంచ-శ్రేణి సేవ కోసం మరియు ఉత్తమ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీగా అనేక అవార్డులు గెలుచుకున్న బ్రాండ్‌తో సంబంధం.
పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవర్ కోసం క్లెయిమ్ ఫైల్ చేయడానికి, మీరు:
1. possess a valid driving license.
2. must not be driving under the influence of any intoxicating substances or alcohol.
3. must have a valid insurance policy.
మీ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని క్లెయిమ్ చేయడానికి, మీరు ఈ క్రింది డాక్యుమెంట్లు సమర్పించాలి. సులభమైన క్లెయిమ్స్ ప్రాసెస్ కోసం మార్గాన్ని ఈ డాక్యుమెంట్లు సులభం చేస్తాయి.
1. సరిగ్గా నింపిన క్లెయిమ్స్ ఫారం
2. ఓనర్-డ్రైవర్ మరణ సర్టిఫికెట్
3. డాక్టర్ నుండి వైకల్యం సర్టిఫికెట్
4. ఓనర్-డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్
5. కారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
6. హాస్పిటల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్
7. ఆసుపత్రి డిశ్చార్జ్ సారాంశం
8. FIR
9. పోస్ట్ మార్టం రిపోర్ట్
10. ఔషధాల కోసం బిల్లులు
11. KYC ఫారం మరియు KYC డాక్యుమెంట్లు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే అత్యుత్తమ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీకు నగదు రహిత మరియు నగదు చెల్లింపు రూపంలో రీయింబర్స్‌మెంట్ రెండింటికీ యాక్సెస్ అందిస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని క్లెయిమ్ చేయడానికి మీరు ఈ దశలు అనుసరించాలి.
1. హాస్పిటలైజేషన్ గురించి 48 గంటల లోపు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకి తెలియజేయాలి.
2. హాస్పిటల్‌లోని ఇన్సూరెన్స్ డెస్క్ వద్ద పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ వివరాలు అందించాలి.
3. ఆసుపత్రిలో ప్రీ-ఆథరైజేషన్ ఫారం నింపాలి.
4. ఈ ఫారం గురించి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకి తెలియజేయడమనేది ప్రాసెస్‌ని వేగవంతం చేస్తుంది.
5. సాధారణంగా, రెండు గంటల్లోపు అప్లికేషన్ సమీక్షించబడుతుంది మరియు SMS మరియు ఇమెయిల్ ద్వారా మీరు సమాచారం అందుకుంటారు.
6. మీరు మీ పర్సనల్ యాక్సిడెంట్ కవర్ క్లెయిమ్ స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు.
1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో భాగం కాని ఏదైనా ఆసుపత్రికి మీరు వెళ్లినట్లయితే రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
2. అత్యవసర అడ్మిషన్ జరిగిన 2 రోజుల లోపు, మీరు హాస్పిటల్‌లో చేరడం గురించి హెచ్‌డిఎఫ్‌సికి తెలియజేయాలి.
3. డిశ్చార్జ్ జరిగిన తర్వాత, 15 రోజుల్లోపు ఓనర్ డ్రైవర్ కోసం PA కవర్ పొందడానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి.
4. అన్ని డాక్యుమెంట్లు సమీక్షించిన తర్వాత, క్లెయిమ్ అప్రూవల్ లేదా తిరస్కరణ గురించి హెచ్‌డిఎఫ్‌సి మీకు తెలియజేస్తుంది.
5. ఆమోదం పొందిన తర్వాత, మీరు సమర్పించిన అకౌంట్ వివరాల ప్రకారం, నిఫ్ట్ ద్వారా ఆ మొత్తం బదిలీ చేయబడుతుంది.
6. తిరస్కరించబడిన పక్షంలో, మీ క్లెయిమ్ తిరస్కరణ గురించి మీకు ఒక ఇమెయిల్ మరియు SMS వస్తుంది.
సమగ్ర ఇన్సూరెన్స్తో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది గరిష్ట కవరేజీ మరియు సూపర్ స్మూత్ క్లెయిమ్ ప్రాసెస్‌ని అందిస్తుంది, దీనికోసం మీ వైపు నుండి అతి తక్కువ ప్రయత్నం సరిపోతుంది.
వైకల్యం, మరణం లేదా గాయాలకు దారితీసే ప్రమాదాలు జరిగినప్పుడు యజమాని-డ్రైవర్‌ని ఈ ప్లాన్ రక్షిస్తుంది.
అవును, చిన్న మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా మీ కార్ ఇన్సూరెన్స్‌తో పాటు ఆన్‌లైన్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీని మీరు ఎంచుకోవచ్చు. బండిల్ చేయబడిన ప్లాన్ మీకు అవసరమైన మొత్తం కవరేజీని అందిస్తుంది.