maruti car insurance
MOTOR INSURANCE
Premium starting at Just ₹2094*

ప్రీమియం ప్రారంభం

కేవలం ₹2094 వద్ద*
9000+ Cashless Network Garages ^

9000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కారు ఇన్సూరెన్స్ / మారుతీ సుజుకి
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్

Maruti insurance
మీరు భారతీయ రోడ్ల మీద ప్రయాణించినప్పుడు, మీ పక్క నుండి మారుతీ కారు జుమ్ అంటూ దూసుకుపోవడం చూసే ఉంటారు! బడ్జెట్ మరియు జీవనశైలి అంటూ ప్రతి అవసరం కోసం ఒక వేరియంట్‌తో, మారుతీ సుజుకి ఇప్పటికే మూడు దశాబ్దాల కంటే ఎక్కువ కాలంగా దేశంలో దాని హవాను కొనసాగిస్తుంది. భారతీయ మధ్యతరగతికి మోటారు వాహనాలను దగ్గర చేసే లక్ష్యంతో, 1983లో స్థాపించబడిన మారుతీ సంస్థ ప్రారంభంలో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ మరియు జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ మధ్య ఒక జాయింట్ వెంచర్‌గా ప్రారంభమైంది. నేడు, ఈ ఆటోమొబైల్ దిగ్గజం సంవత్సరానికి అర మిలియన్‌కు పైగా కార్లను విక్రయిస్తూ, "సామాన్యుడి కారు" అనే హోదాను ఈ బ్రాండ్ మరింత పటిష్టం చేసుకుంటోంది.
గడచిన సంవత్సరాల్లో, ఈ తయారీదారు అనేక కార్లను ప్రవేశపెట్టడం ద్వారా మార్కెట్‌లో అగ్రస్థానంలో అమ్ముడవుతున్న 5 కార్ల స్థానాన్ని కాపాడుకుంటోంది. ఇప్పుడు నెక్సాను తీసుకురావడం ద్వారా, ప్రీమియం ఎస్‌యువి (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) మరియు సెడాన్ సెగ్మెంట్‌లలో కూడా స్థానం సాధించడాన్ని మారుతీ సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. డబ్బుకు తగ్గ విలువ అందించడమే కాకుండా, దృఢమైన విక్రయ అనంతర నెట్‌వర్క్ అనేది మారుతీ సుజుకీ ప్రతిష్టను ప్రముఖ ఆటో దిగ్గజంగా మరియు విశ్వసనీయమైన సర్వీస్ ప్రొవైడర్‌గా రూపొందించింది.

నేటికి కూడా, అది స్విఫ్ట్, బాలెనో లేదా ఆల్టో అయినా, మారుతీ కారును కలిగి ఉండటం అనేది భారతదేశం అంతటా చాలా మందికి గొప్పగా సాధించాము అనే విషయానికి సూచిక. అలాగే, మీ విలువైన వాహనం కోసం ఒక మంచి ఇన్సూరెన్స్ అవసరం. థర్డ్-పార్టీ కవరేజ్ నుండి అదనపు ప్రయోజనాల వరకు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క మారుతీ కార్ ఇన్సూరెన్స్ అన్నింటినీ అందిస్తుంది - మీ మారుతీ కారుపై మీకు ఉన్న ప్రేమను చూపుతుంది!

మారుతీ సుజుకి – బెస్ట్ సెల్లింగ్ మోడల్స్

1
మారుతీ సుజుకి స్విఫ్ట్
స్విఫ్ట్ 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్ ధర, ₹5.99 లక్షల నుండి ₹9.03 లక్షల మధ్య అందుబాటులో ఉంది (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).. స్విఫ్ట్ నాలుగు విస్తృత శ్రేణి వేరియంట్లలో అందించబడుతుంది: LXi, VXi, ZXi, మరియు ZXi+. VXi మరియు ZXi ట్రిమ్‌లను CNGతో ఎంచుకోవచ్చు. ప్రస్తుతం, దాని మూడవ తరంలో ఉన్న ఈ కారులో పుష్-బటన్ స్టార్ట్, HID ప్రొజెక్టర్లు, AMT గేర్‌బాక్స్ మరియు మరెన్నో లాంటి గొప్ప ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అంశాలన్నీ వినియోగదారులను కారును కొనుగోలు చేసేలా చేస్తున్నాయి.
2
మారుతీ సుజుకి వ్యాగన్‌ఆర్
వాగన్ R అనేది ₹5.54 - 7.42 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర పరిధిలో అందుబాటులో ఉన్న 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్. సంవత్సరాలుగా, ఈ మారుతి కారు తన కోసం ఒక బలమైన పునాదిని నిర్మించుకుంది. ఇది అదనపు వినోదం మరియు భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న మూడవ తరం వాగన్ Rతో మరింత మెరుగుపరచబడింది. 1.0 లీటర్, మూడు-సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌తో కూడిన అదనపు-స్పేస్ గల ఇంటీరియర్లు వ్యాగన్‌Rని సౌకర్యవంతంగా మరియ శక్తివంతమైనవిగా చేస్తాయి.
3
మారుతీ సుజుకీ ఆల్టో
ఆల్టో అనేది ఒక ఎంట్రీ-లెవల్ 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్, దీని ధర ₹3.25 లక్షల నుండి ప్రారంభమవుతుంది మరియు ₹5.12 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వెళ్తుంది. చౌకధర మరియు ఆచరణాత్మకతను కోరుకునే కుటుంబాలకు ఆల్టో ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది. సంవత్సరాలుగా ఆల్టో వరుస అప్‌గ్రేడ్‌లను చూసింది మరియు రోజువారీ ప్రయాణానికి దాని అనుకూలతను నొక్కి చెబుతుంది.
4
మారుతీ సుజుకి బలేనో
బాలెనో అనేది ఒక ప్రీమియం 5-సీటర్ హ్యాచ్‌బ్యాక్. ఇది ₹6.61 లక్షల నుండి ₹9.88 లక్షల మధ్య ధర పరిధిలో అందుబాటులో ఉంది. బాలెనో CNG ధర ₹8.35 లక్షల నుండి ₹9.28 లక్షల మధ్య ఉంటుంది. బాలెనో మాన్యువల్ ధర ₹6.61 లక్షల నుండి ₹9.33 లక్షల మధ్య ఉంటుంది. మారుతీ ప్రీమియం రీటైల్ నెక్సా ఔట్‌లెట్‌ల ద్వారా ఈ మోడల్ విక్రయించబడుతోంది. పెట్రోల్-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మరియు క్లైమేట్ కంట్రోల్‌తో సహా ఈ కారు అనేక అప్‌గ్రేడ్‌లను సొంతం చేసుకుంది. ఇంటీరియర్ మరియు ఎక్స్‌టీరియర్ అప్‌గ్రేడ్‌లకు అదనంగా, ఈ మారుతీ కార్ మోడల్‌లో అప్‌గ్రేడ్ చేయబడిన BS-6 ఇంజిన్ ఉంది.
5
మారుతీ సుజుకి డిజైర్
డిజైర్ అనేది ₹6.52 లక్షలు మరియు ₹9.39 లక్షల ధర పరిధిలో అందుబాటులో ఉన్న ఒక ఎంట్రీ-లెవల్ సెడాన్. డిజైర్ CNG ధర ₹8.39 లక్షల నుండి ₹9.07 లక్షల మధ్య ఉంటుంది. డిజైర్ మాన్యువల్ ధర ₹6.52 లక్షల నుండి ₹9.07 లక్షల మధ్య ఉంటుంది. క్లాస్-లీడింగ్ ఫీచర్లు మరియు ఎర్గోనామిక్‌గా డిజైన్ చేయబడిన ఇంటీరియర్ నేడు భారతీయ మార్కెట్లో అత్యుత్తమ సెడాన్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ మారుతీ కారులోని టాప్-స్పెక్ మోడల్‌లో, AMTతో పెట్రోల్ ఇంజిన్ ఎంపికలు మాత్రమే ఉన్నాయి.

మారుతీ సుజుకి – ప్రత్యేక విక్రయ పాయింట్లు

1
డబ్బుకు విలువ
మారుతి సుజుకి కార్ల ధరలను భారతీయ కొనుగోలుదారులకు వారి డబ్బును ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకుండా ఉండేలా నిర్ణయించారు. మారుతీ సుజుకి ఆల్టో మరియు వాగన్R లాంటి కార్లు, ప్రతి కుటుంబానికి సొంత వాహనం కలిగి ఉండాలనే కలలను నెరవేర్చాయి.
2
అద్భుతమైన ఇంధన సామర్థ్యం
 మారుతి కార్లు చాలా ఇంధన సామర్థ్యం కలిగి ఉంటాయి. స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ సిస్టమ్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాలతో, ఇది మరింత ఇంధన సమర్థవంతమైన కార్లను తయారు చేస్తూనే ఉంది. ఈ విభాగంలోని ఇతర కార్లతో పోలిస్తే సియాజ్ మరియు బ్రెజ్జా లాంటి పెద్ద కార్లు కూడా అత్యుత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తాయి.
3
విశ్వసనీయత
మారుతీ సుజుకి కార్లను నిర్వహించడం సులభం, నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. మీరు దాని నిర్వహణ గురించి ఎక్కువగా ఆందోళన చెందకుండా సంవత్సరాల తరబడి మారుతీ సుజుకి కారును నడపవచ్చు. అంతేకాకుండా, భారతీయ రోడ్లపై మీరు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నడుస్తున్న మారుతి కారును కూడా చూడవచ్చు.
4
వినియోగదారు-కేంద్రీకృత స్వభావం
మారుతీ సుజుకి మార్కెట్లోని అత్యంత వినియోగదారు-కేంద్రీకృత కార్ల తయారీదారులలో ఒకటి. మీ కారు కొనుగోలు ప్రయాణం నుండి చివరి వరకు, మారుతి మీకు సున్నితమైన, అవాంతరాలు-లేని అనుభవాన్ని అందిస్తుంది.
5
అద్భుతమైన రీసేల్ విలువ
మారుతీ కార్లు సెకండ్-హ్యాండ్ కార్-సెల్లింగ్ మార్కెట్‌లో అత్యంత ప్రముఖమైనవి. విశ్వసనీయత మరియు ఇంధన ఆర్థిక వ్యవస్థ మారుతీ సుజుకి కార్లకు వారి విలువను నిలిపి ఉంచడానికి ప్రాథమిక కారణాలు.

మీకు మారుతీ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం?


Car insurance is not only an important safety feature for your Maruti car but also a legal requirement (third party insurance) to drive on roads. The Motor Vehicles Act mandates minimum a థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ cover for all vehicles plying on Indian roads. Keeping your Maruti car insured is a mandatory part of the car ownership experience. Here are some reasons why maruti car insurance is important:

It Diminishes Owner’s Liability

ఇది యజమాని బాధ్యతను తగ్గిస్తుంది

చట్టపరమైన అవసరంగా మాత్రమే కాకుండా, మీ థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది మీ మారుతీ సుజుకి కారు కారణంగా థర్డ్ పార్టీ వాహనం, వ్యక్తి లేదా ఆస్తికి సంభవించే డ్యామేజీలు మరియు నష్టాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో, ఎదుటి వ్యక్తి చేసిన క్లెయిమ్‌లనేవి ఈ పాలసీ క్రింద కవర్ కాగలవు, తద్వారా, మీ మీద ఆర్థిక మరియు చట్టపరమైన భారాలు తగ్గుతాయి.

It Covers Cost of Damage

నష్టం ఖర్చును ఇది కవర్ చేస్తుంది

ఒకవేళ మీరు మీ మారుతీ కారు కోసం ఒక సమగ్ర కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకుంటే, ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు లేదా దొంగతనం సందర్భంలో, మీ మారుతీ సుజుకి కారుకు సమగ్ర కవర్ లభిస్తుంది. లోపం కలిగిన భాగాల కోసం మరమ్మత్తులు లేదా వాటిని మార్చడం కోసం అయ్యే ఖర్చు, బ్రేక్‌డౌన్‌ల సమయంలో అత్యవసర సహాయం, మరియు మీ మారుతీ మరమ్మత్తు కోసం వెళ్లినప్పుడు మీకు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యం కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

It Gives Peace Of Mind

ఇది మనశ్శాంతి అందిస్తుంది

కొత్తగా డ్రైవ్ చేసేవారికి, మీరు కనీసం ఒక థర్డ్ పార్టీ కవర్‌తో ఇన్సూర్ చేయబడి ఉన్నారని తెలిసి ఉండడమనేది, రోడ్ మీద ఎలాంటి చలాన్‌లకు గురికాకుండా డ్రైవ్ చేయగల ఆత్మవిశ్వాసం అందిస్తుంది. అనుభవజ్ఞులైన డ్రైవర్ల కోసం, చాలా వరకు రోడ్డు ప్రమాదాలకు మీరు కారణం కాకపోవచ్చు. ఏదైనా సంఘటన నుండి మీరు రక్షణ పొందారని తెలుసుకోవడం వల్ల మీరు ఒత్తిడి లేకుండా ఉండడంలో సహాయపడుతుంది.

మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ రకాలు

ఆల్-రౌండ్ ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు కానీ, ఎక్కడ ప్రారంభించాలో తెలియడం లేదా?? హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి ఒక సంవత్సరం సమగ్ర కవర్‌తో మీ అయోమయం నుండి విశ్రాంతి పొందండి. ఈ ప్లాన్‌లో మీ మారుతీ కారుకు జరిగిన నష్టాలకు అలాగే థర్డ్ పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగిన నష్టాలకు కవర్ ఉంటుంది. మీకు నచ్చిన యాడ్-ఆన్‌లతో మీరు మీ మారుతీ ఇన్సూరెన్స్ కవర్‌ను మరింత కస్టమైజ్ చేసుకోవచ్చు.

X
అన్ని విధాలా రక్షణను కోరుకునే కారు ప్రేమికులకు ఇది తగిన విధంగా సరిపోతుంది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
Accident

ప్రమాదం

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

Theft

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

థర్డ్-పార్టీ కవర్ అనేది మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం ఒక తప్పనిసరి కవర్. మీరు మీ మారుతీ సుజుకీ కార్‌ను తరచుగా ఉపయోగించే పరిస్థితి లేనప్పుడు, మీరు ఈ ప్రాథమిక కవర్‌తో ప్రారంభించడం ద్వారా జరిమానాలు చెల్లించాల్సిన ఇబ్బంది నుండి తప్పించుకోవడం ఒక మంచి ఆలోచన. థర్డ్ పార్టీ కవర్ కింద, థర్డ్ పార్టీ నష్టం, గాయం లేదా నష్టం నుండి ఉత్పన్నమయ్యే బాధ్యతల నుండి రక్షణతో పాటు మీ కోసం ఒక పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా మేము అందిస్తాము.

X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

థర్డ్-పార్టీ కవర్ ఉన్నప్పటికీ, మిమ్మల్ని మీరు ఆర్థిక నష్టాల నుండి రక్షించుకోవడం గురించి ఆలోచించారా?? ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు మరియు దొంగతనం నుండి ఉత్పన్నమయ్యే మీ కారుకు జరిగే నష్టాలను కవర్ చేస్తుంది కాబట్టి మా స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ వాటిని కవర్ చేస్తుంది. అదనపు రక్షణను మీరు ఆస్వాదించాలనుకుంటే, తప్పనిసరి థర్డ్ పార్టీ కవర్‌కు మించి మరియు అంతకంటే ఎక్కువ యాడ్-ఆన్‌లతో ఈ ఆప్షనల్ కవర్‌ను మీరు ఎంచుకోవచ్చు.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
Accident

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

Theft

దొంగతనం

సరికొత్త మారుతీ సుజుకి కార్‌కు మీరు సగర్వమైన యజమాని అయితే, మీరు మీ కొత్త ఆస్తిని సురక్షితం చేసుకోవడానికి మా కొత్త కార్ల కోసం కవర్ మీకు తగినదిగా ఉంటుంది. యాక్సిడెంట్‌లు, ప్రకృతి వైపరీత్యాలు మరియు దొంగతనం కారణంగా మీ కారుకు జరిగే నష్టాలకు ఈ ప్లాన్ మీకు 1-సంవత్సరాల కవరేజీ అందిస్తుంది. ఇది థర్డ్-పార్టీ వ్యక్తి/ఆస్తికి జరిగిన నష్టాల నుండి మీకు 3-సంవత్సరాల కవర్ కూడా అందిస్తుంది.

X
కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేసే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
Accident

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

Theft

దొంగతనం

మారుతీ కార్ ఇన్సూరెన్స్ పాలసీలో చేర్పులు మరియు మినహాయింపులు

accidental cover

ప్రమాదాలు

కారు యాక్సిడెంట్‌లనేవి మీ కారు బాహ్య లేదా అంతర్గత భాగాలకు నష్టాలు కలిగించవచ్చు. నష్టం పరిధిని బట్టి, మీ కారును మరమ్మత్తు చేయడానికి అయ్యే ఖర్చులనేవి మైనర్ లేదా మేజర్ అయి ఉండవచ్చు. అయితే, అది ఎలాంటి రిపేర్ అయినప్పటికీ, మా కార్ ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్‌ల కారణంగా మీ కారుకు జరిగిన నష్టాలను కవర్ చేస్తుంది.
Fire and Explosion

అగ్నిప్రమాదం మరియు పేలుడు

అగ్నిప్రమాదం లేదా పేలుడు కారణంగా మీ మారుతీ సుజుకి కారు మరియు దాని భాగాలు కాలిపోవచ్చు మరియు అవి దెబ్బతినవచ్చు కానీ, ఆ విపత్తు కారణంగా మీ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది రాకుండా మేము నిర్ధారిస్తాము. అలాంటి సందర్భాల్లో మా కార్ ఇన్సూరెన్స్ ఆ నష్టాలను కవర్ చేస్తుంది.
Theft

దొంగతనం

కారు దొంగతనం అనేది ఒక పెద్ద ఆర్థిక నష్టం. అలాంటి పీడకల నిజమైనప్పటికీ, అదృష్టవశాత్తూ, మా కార్ ఇన్సూరెన్స్ కవరేజీ మీ వెంటే ఉంటుంది. మీ కారు దొంగతనం కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మీద భారం పడకుండా మేము నిర్ధారిస్తాము.
Natural Calamities

ప్రకృతి వైపరీత్యాలు

వరదలు మరియు భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు మీ కారుకు ఊహించని మరియు ఎదురుచూడని నష్టాన్ని కలిగిస్తాయి. అయితే, మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ ఉన్నప్పుడు, అలాంటి సంఘటనల కారణంగా మీ ఆర్థిక పరిస్థితి మీద భారం పడదని మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
Personal Accident

పర్సనల్ యాక్సిడెంట్

యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో, మేము మీ కారు కోసం జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా. మీ బాధ్యతను కూడా తీసుకుంటాము. మీకు ఏవైనా గాయాలు తగిలినట్లయితే, మా కార్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీ వైద్య చికిత్స కోసం మీరు వెచ్చించే ఏవైనా ఛార్జీలను కూడా కవర్ చేస్తుంది.
Third Party Liability

థర్డ్ పార్టీ లయబిలిటీ

మీ కార్ యాక్సిడెంట్ థర్డ్ పార్టీకి చెందిన వ్యక్తికి లేదా ఆస్తికి కూడా నష్టాన్ని కలిగించవచ్చు. అలాంటి సందర్భాల్లో మా కార్ ఇన్సూరెన్స్ మీరు కవర్ చేసినందున, థర్డ్ పార్టీ బాధ్యతలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటుంది, ఇక మీరు స్వయంగా మీ జేబు నుండి చెల్లించడం గురించి చింతించాల్సిన అవసరం లేదు.

మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ పాలసీ యాడ్-ఆన్‌లు

మీ మారుతీ కారు సులభంగా తరిగిపోయే ఆస్తి. కాబట్టి, మీ కారుకు జరిగిన నష్టాల కారణంగా ఉత్పన్నమయ్యే మారుతీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో, చెల్లింపు తరుగుదల కోతలకు లోబడి ఉండవచ్చు. మా జీరో డిప్రిసియేషన్ కవర్‌తో మీరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకనగా అలాంటి సందర్భంలో ఇది మీ ఆర్థిక స్థితిని రక్షిస్తుంది. విలువ.
మీరు స్వచ్ఛమైన రికార్డును కలిగిన నైపుణ్యం గల డ్రైవర్ అయితే, మీరు ఖచ్చితంగా రివార్డును పొందడానికి అర్హులు. మా నో క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్, మీరు సంవత్సరాల తరబడి సేకరించిన నో క్లెయిమ్ బోనస్ (NCB)ను సురక్షితంగా ఉంచుతుంది, అది యథాతతంగా తదుపరి స్లాబ్‌కు కొనసాగుతుందని నిర్ధారిస్తుంది.
అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ యాడ్-ఆన్ కవర్ మీకు సరైన స్నేహితుడిగా ఉంటుంది. ఈ కవర్ రీఫ్యూయలింగ్, టైర్ మార్పులు, టోయింగ్ సౌకర్యం, లాస్ట్ కీ అసిస్టెన్స్ మరియు మెకానిక్ కోసం ఏర్పాట్లు చేయడం వంటి 24x7 ఎమర్జెన్సీ అసిస్టెన్స్ సేవలను అందిస్తుంది.
మీ మారుతీ కారు దొంగిలించబడినా లేదా రిపేరింగ్ చేయలేని పక్షంలో మీకు అవసరమైనది ఈ ఆప్షనల్ యాడ్-ఆన్ మాత్రమే. ఇది పూర్తి నష్టం జరిగిన సందర్భంలో నిర్ధారిస్తుంది ; మారుతీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీరు చెల్లించిన రోడ్డు పన్ను మరియు రిజిస్ట్రేషన్ ఫీజుతో సహా మీ కారు యొక్క అసలు ఇన్వాయిస్ విలువను మీరు పొందుతారు.
Engine and gearbox protector cover
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
మీ కారు ఇంజన్‌ను జాగ్రత్తగా చూసుకోవడమంటే క్రమం తప్పకుండా ఆయిల్‌ మార్చడం లేదా ఫ్యూయల్ ఫిల్టర్‌ మార్చడం మాత్రమే కాదు. మీరు దానిని ఆర్థికంగా సురక్షితం చేసుకోవాలి, అందుకోసం ఈ యాడ్-ఆన్ మీకు సహాయం చేస్తుంది. కారులోని ముఖ్యమైన భాగాలైన ఇంజన్ మరియు గేర్ బాక్స్‌కు నష్టం వాటిల్లినప్పుడు ఆ కారణంగా మీ మీద పడే ఆర్థిక భారం నుండి ఇంజన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్ రక్షిస్తుంది.
మీ కారుకు యాక్సిడెంట్‌లు లేదా డ్యామేజీలు జరిగిన సందర్భంలో, మీ ప్రయాణం కోసం మీరు ప్రజా రవాణా మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మీరు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీ రవాణా అవసరాలను బట్టి, అది ఖరీదైన వ్యవహారంగా మారవచ్చు. డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ అనేది మీ కారు ఉపయోగించడానికి సిద్ధమయ్యే వరకు మీ రవాణా ఖర్చులు భర్తీ చేయడం కోసం ప్రత్యామ్నాయ రవాణా లేదా రోజువారీ ఆర్థిక సహాయం అందిస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి మారుతీ కార్ ఇన్సూరెన్స్ మీ మొదటి ఎంపికగా ఎందుకు ఉండాలి!

cashless garages for maruti cars
9000+ నగదురహిత గ్యారేజీలు**
మా నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్ అనేది మీకు అవసరమైన చోట మేము ఉన్నామని నిర్ధారిస్తుంది
maruti car overnight repairs
ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్¯
మేము 24x7, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము, మరియు మీకు సర్వీస్ అందిస్తాము!
maruti car insurance price
₹2094 నుండి ప్రీమియంలు*
చాలా తక్కువ ప్రీమియంల కారణంగా, మీరు ఇన్సూరెన్స్ చేయకుండా ఉండడానికి ఎలాంటి కారణం లేదు.
maruti car insurance policy
ఇంస్టెంట్ పాలసీ మరియు జీరో డాక్యుమెంటేషన్
మీ కారును సురక్షితం చేయడమనేది అక్షరాలా 3 వరకు లెక్కించినంత వేగంగా ఉంటుంది
maruti car insurance claims
అపరిమిత క్లెయిములు°
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి రెండవ ఉత్తమ కారణం? అపరిమిత క్లెయిములు.

మీ మారుతీ సుజుకి ప్రీమియంను తెలుసుకోండి: థర్డ్ పార్టీ వర్సెస్ ఓన్ డ్యామేజ్

మీరు మారుతీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, అవాంతరాలు లేని క్లెయిముల కోసం మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోవచ్చు. దీనికి అదనంగా, మా వద్ద 9000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీల నెట్‌వర్క్ ఉంది. మీ మారుతీ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గడువు ముగిసినట్లయితే, మీరు ఇప్పుడే మీ పాలసీని కొనుగోలు చేయాలి. మీరు అలా ఎలా చేయవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:

థర్డ్-పార్టీ (TP) ప్లాన్‌లు అనేవి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఆర్థిక మరియు చట్టపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని రక్షించడానికి రూపొందించబడ్డాయి. జరిమానాలు నివారించడానికి మరియు థర్డ్-పార్టీ క్లెయిమ్‌ల నుండి మీ ఆర్థిక అవసరాలు కవర్ చేయడానికి మీరు మీ మారుతీ కార్ కోసం థర్డ్-పార్టీ ప్లాన్ పొందడం అవసరం. అంతేకాకుండా, వీటి అన్నింటి కోసం ఇది సహేతుకమైన ధర కలిగిన పాలసీ. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? ప్రతి వాహనం క్యూబిక్ సామర్థ్యం ఆధారంగా, థర్డ్-పార్టీ ప్రీమియంను IRDAI ముందుగానే నిర్వచిస్తుంది. దానిని సర్దుబాటు చేయడం ద్వారా మారుతీ సుజుకి కారు యజమానులందరికీ చౌకైనదిగా చేస్తుంది.

మరోవైపు, మీ మారుతీ కారు కోసం ఓన్ డ్యామేజ్ (OD) ఇన్సూరెన్స్ అనేది ఐచ్ఛికమే అయినప్పటికీ, చాలా ప్రయోజనకరమైనది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదా భూకంపాలు, అగ్నిప్రమాదాలు, తుఫానులు మరియు అలాంటి ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో మరమ్మత్తు మరియు భాగాలు మార్చడానికి అయ్యే ఖర్చులకు పరిహారం అందించడానికి ఈ కవర్ మీకు సహాయపడుతుంది. అయితే, థర్డ్-పార్టీ ప్రీమియం లాగా కాకుండా, మీ మారుతీ సుజుకి కోసం స్వంత నష్టానికి ప్రీమియం అనేది మారుతూ ఉంటంది. అలా ఎందుకు అని ఆశ్చర్యపోతున్నారా? మేము వివరిస్తాము. మీ మారుతీ సుజుకి కార్ కోసం OD ప్రీమియం అనేది సాధారణంగా IDV, జోన్ మరియు క్యూబిక్ సామర్థ్యం మీద ఆధారపడి లెక్కించబడుతుంది. కాబట్టి, మీ కారులోని విశిష్టతలు లేదా మీ కారు ఏ నగరంలో రిజిస్టర్ చేయబడిందనే విషయాల మీద ఆధారపడి, మీ ప్రీమియం భిన్నంగా ఉంటుంది. అలాగే, మీ స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్ లేదా బండిల్డ్ కవర్‌తో పాటుగా మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌ల మీద ఆధారపడి కూడా మీ ప్రీమియం ప్రభావితమవుతుంది. అలాగే, మీ మారుతీ సుజుకి కారుకు మీరు చేసే ఏవైనా మార్పులు కూడా అధిక ప్రీమియంలకు దారితీస్తాయని గుర్తుంచుకోండి.

మీ మారుతీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించండి

maruti car insurance premium

దశ 1

మీ మారుతీ సుజుకి కార్ రిజిస్ట్రేషన్ నంబర్‌ ఎంటర్ చేయండి

Maruti insurance policy cover

దశ 2

మీ పాలసీ కవర్‌ను ఎంచుకోండి*
(in case we are not able to auto fetch your Maruti Suzuki
car details, we will need a few details of the car such as make,
model, variant, registration year, and city)

 

Maruti suzuki car insurance NCB status

దశ 3

మీ మునుపటి పాలసీని మరియు
మరియు నో క్లెయిమ్స్ బోనస్ (NCB) స్టేటస్ అందించండి

Maruti car insurance quote

దశ 4

మీ మారుతీ సుజుకి కార్ కోసం తక్షణ కోట్ పొందండి

Left
Right

మారుతీ కార్ ఇన్సూరెన్స్ కోసం ఎలా క్లెయిమ్ చేయాలి?

మీరు మారుతీ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, అవాంతరాలు లేని క్లెయిముల కోసం మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోవచ్చు. దీనికి అదనంగా, మా వద్ద 8000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీల నెట్‌వర్క్ ఉంది. మీ మారుతీ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గడువు ముగిసినట్లయితే, మీరు ఇప్పుడే మీ పాలసీని కొనుగోలు చేయాలి. మీరు అలా ఎలా చేయవచ్చో ఇక్కడ ఇవ్వబడింది:

  • దశ 1: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మీ మారుతీ సుజుకి కార్ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ అడ్రస్‌తో సహా అన్ని వివరాలను పూరించండి. మీరు మీ ప్రస్తుత మారుతీ కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేయాలనుకుంటే, పాలసీని రెన్యూ చేయడానికి కూడా క్లిక్ చేయవచ్చు.

  • దశ 2: కొనసాగిన తర్వాత, మీరు మునుపటి పాలసీ వివరాలను అందించాలి మరియు సమగ్ర లేదా థర్డ్ పార్టీ కవర్‌ను ఎంచుకోవాలి.

  • దశ 3: మీరు సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకున్నట్లయితే, యాడ్ ఆన్ కవర్‌లను చేర్చండి/మినహాయించండి. ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించడం ద్వారా ప్రయాణాన్ని పూర్తి చేయండి.

  • దశ 4: మారుతీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడికి ఇమెయిల్ చేయబడుతుంది.

Benefits of Buying Maruti Suzuki Car Insurance Online

ఇన్సూరెన్స్ పాలసీని పొందడానికి మీరు భౌతికంగా ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కార్యాలయాన్ని సందర్శించాల్సిన లేదా ఇన్సూరెన్స్ ఏజెంట్‌ను సంప్రదించాల్సిన రోజులు పోయాయి. ఇప్పుడు మీరు ఎలాంటి ఆందోళన లేకుండా మీ మారుతీ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. కొన్ని ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి

1

తక్షణ కోట్స్ ని పొందండి

మా కార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌తో, మీరు మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం తక్షణ కోట్ పొందుతారు. మీ కారు వివరాలను నమోదు చేయండి ; పన్నులతో సహా మరియు వాటిని మినహాయించి ప్రీమియం ప్రదర్శించబడుతుంది. మీరు మీ సమగ్ర పాలసీతో యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు, తక్షణమే అప్‌డేట్ చేయబడిన ప్రీమియంను పొందవచ్చు.
2

తక్షణ జారీ

మీరు నిమిషాల్లో మారుతీ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఆన్‌లైన్‌లో పొందవచ్చు. మారుతీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూరించాలి. దీనిలో మీరు కారు వివరాలను అందించాలి మరియు సమగ్ర ఇన్సూరెన్స్, అలాగే, థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మధ్య ఎంచుకోవాలి. అప్పుడు, చివరగా, కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లించండి. పాలసీ కేవలం కొన్ని క్లిక్‌ల దూరంలో ఉన్నందున గంటలు, రోజులు లేదా వారాల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు.
3

అవాంతరాలు లేనిది, పారదర్శకతతో కూడినది

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కారు కొనుగోలు ప్రక్రియ అవాంతరాలు లేనిది మరియు పారదర్శకమైనది. మారుతీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మీరు కొన్ని సులభమైన దశలను అనుసరించాలి, మరియు ఎటువంటి దాగి ఉన్న ఛార్జీలు లేవు. మీరు చూసిందే మీరు చెల్లిస్తారు.
4

చెల్లింపు రిమైండర్లు

మేము సకాలంలో పోస్ట్-సేల్ సేవలను అందిస్తాము కాబట్టి, మీ మారుతి సుజుకి కార్ ఇన్సూరెన్స్ పాలసీ ల్యాప్స్ అవదు. అలాగే, మీరు ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మా వైపు నుండి ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్‌ను రెన్యూ చేసుకోవడానికి మీకు రెగ్యులర్ రిమైండర్ అందుతుంది. ఇది మీరు నిరంతర కవరేజీని పొందుతారని మరియు చెల్లుబాటు అయ్యే మారుతి కార్ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండటం ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకుండా ఉండేలా చూస్తుంది.
5

అతితక్కువ పేపర్ వర్క్

ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి అనేక డాక్యుమెంట్ల అవసరం ఉండదు. మీరు మొదటిసారి పాలసీని కొనుగోలు చేసినప్పుడు మీ మారుతీ సుజుకి కార్ రిజిస్ట్రేషన్ ఫారంలు మరియు మీ KYC డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత, మీరు కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ను ఎంచుకోవచ్చు లేదా ఎటువంటి పేపర్‌వర్క్ లేకుండా మీ ప్లాన్‌ను పోర్ట్ చేసుకోవచ్చు.
6

సౌలభ్యం

చివరిగా, మారుతీ కార్ ఇన్సూరెన్స్‌ను కొనడం సౌకర్యవంతంగా ఉంటుంది మరియు సులభమైనది. మీరు మా బ్రాంచ్‌లను సందర్శించవలసిన అవసరం లేదు లేదా ఏజెంట్ మిమ్మల్ని సంప్రదించడానికి వేచి ఉండవలసిన అవసరం లేదు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు మరియు తగిన కారు ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవచ్చు. అలాగే, రోజులో ఏ సమయంలోనైనా మరియు ఎక్కడినుండైనా ఆన్‌లైన్‌లో కారు ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే ఫ్లెక్సిబిలిటీని ఆనందించండి.

మారుతీ ఇన్సూరెన్స్ కోసం ఎలా క్లెయిమ్ చేయాలి?

ప్రపంచం డిజిటల్‌గా మారిపోయింది. ఈ నాలుగు వేగవంతమైన, అనుసరించడానికి సులభమైన దశలతో మా క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ కూడా అదేవిధంగా మారింది.

  • maruti suzuki car insurance claims
    దశ #1
    మీ మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను రిజిస్టర్ చేయడానికి పేపర్‌వర్క్, పొడవాటి లైన్లను ఇకపై విడిచిపెట్టండి మరియు ఆన్‌లైన్‌లో మీ డాక్యుమెంట్లను షేర్ చేయండి.
  • self  inspection of your Maruti Suzuki car
    దశ #2
    ఒక సర్వేయర్ లేదా వర్క్‌షాప్ భాగస్వామి ద్వారా మీ మారుతి సుజుకి కారు స్వీయ-తనిఖీ లేదా డిజిటల్ తనిఖీని ఎంచుకోండి.
  • maruti insurance claim status
    దశ #3
    మా స్మార్ట్ AI-ఎనేబుల్డ్ క్లెయిమ్ ట్రాకర్ ద్వారా మీ మారుతీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయండి.
  • maruti Suzuki insurance claim settlement
    దశ #4
    మా విస్తృతమైన నెట్‌వర్క్ గ్యారేజీలతో మీ మారుతీ సుజుకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఆమోదించబడి, సెటిల్ చేయబడినప్పుడు నిశ్చింతగా ఉండండి!

మీరు ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని కనుగొనవచ్చు

మీరు మీ కారును ఎలాంటి రోడ్డు మీద నడుపుతున్నప్పటికీ, మా కార్ ఇన్సూరెన్స్ కవరేజీ అనేది అన్ని సమయాల్లో మీ కారును రక్షిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న మీ మారుతి సుజుకి కారు కోసం 9000+ ప్రత్యేక నగదు రహిత గ్యారేజీల మా విస్తృత నెట్‌వర్క్‌కు ధన్యవాదాలు, ఇప్పుడు మీ ప్రయాణంలో ఎలాంటి అవాంతరాల గురించి మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఊహించని అత్యవసర సహాయం లేదా మరమ్మత్తుల కోసం నగదు రూపంలో చెల్లించే అవసరం లేకుండా మీరు సకాలంలో మరియు నిపుణుల సహాయం మీద ఆధారపడవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి నగదురహిత గ్యారేజ్ సదుపాయంతో, మీ మారుతీ కారుకు ఎల్లప్పుడూ ఒక విశ్వసనీయమైన స్నేహితుడు ఉందని మీరు నిశ్చింతగా ఉండవచ్చు, కాబట్టి ఏదైనా ఇబ్బంది లేదా అత్యవసర పరిస్థితి వెంటనే ఎక్కడైనా మరియు ఏ సమయంలోనైనా పరిష్కరించబడుతుంది.

9000+ cashless Garagesˇ Across India

మీ మారుతీ సుజుకి కార్ కోసం టాప్ చిట్కాలు

Tips for long-parked car
ఎక్కువ కాలం పార్క్ చేయబడిన కారు కోసం చిట్కాలు
• మీ కారును నీడలో పార్క్ చేసి ఉంచుకోండి. మీ కారు మీద నేరుగా ఎండ పడడం వల్ల దాని పెయింట్‌ రంగు పోతుంది.
• వారంలో ఒకసారి మీ కారును స్టార్ట్ చేయండి. దీనివల్ల మీ బ్యాటరీ డెడ్ అవ్వకుండా ఉంటుంది.  
• మీ కారు ఇంజన్ బేలోకి ఎలుకలు మరియు ఇతర కీటకాలు ఏవైనా చేరాయా అని తరచూ తనిఖీ చేయండి. 
Tips for trips
ప్రయాణాలకు సలహాలు
• మీ ప్రయాణం ప్రారంభించే ముందే ఇంధనం నింపుకోండి. రిజర్వ్ ఇంధనంతో డ్రైవ్ చేసే సాహసం చేయకండి. 
• పంక్చర్ అయిన వీల్‌ను మీకు వీలైనంత త్వరగా రిపేర్ చేయించండి. స్పేర్‌ వీల్‌తో వాహనం నడుపుతున్నప్పుడు సమస్య ఎదురయ్యే అవకాశం ఉంటుంది.  
• అవసరం లేనప్పుడు ఎలక్ట్రికల్స్ ఆఫ్‌ చేయండి. మీ కార్ ECU బ్యాటరీ మీద పనిచేస్తుంది కాబట్టి, దానిమీద భారం పడకుండా చూడండి. 
Preventive maintenance
నివారణ నిర్వహణ
• సరైన ఆయిల్ స్థాయిని నిర్వహించండి. అన్ని మారుతీ కార్ల కోసం ఒక డిప్‌స్టిక్ ఉంటుంది; క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ ఉండండి.
• మీ వాహనం సరైన ఇంధన మైలేజీతో నడిచేలా చూడడానికి సరైన సమయంలో వీల్ బ్యాలెన్సింగ్ మరియు అలైన్‌మెంట్ చేయడం తప్పనిసరి.
• అత్యధిక ప్లే కోసం స్టీరింగ్ టై రాడ్‌లు తనిఖీ చేయండి. టైర్లు అధిక మొత్తంలో అరిగిపోవడానికి ఇది కారణం కావచ్చు. 
Daily Dos and Don’ts
ప్రతిరోజు చేయవలసినవి మరియు చేయకూడనివి
• ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేయడానికి ముందు ఎల్లప్పుడూ AC ని ఆఫ్ చేయండి. 
• ఇంజిన్‌ను స్టార్ట్ చేయడానికి ముందు ఇగ్నిషన్ క్లిక్ కోసం వేచి ఉండండి. 
• బ్యాటరీ డ్రైనేజీని నివారించడానికి కారు ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు హెడ్‌లైట్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌లను స్విచ్ ఆఫ్ చేయండి.

మారుతీ సుజుకి గురించిన తాజా వార్తలు

మారుతీ సుజుకి డిజైర్ హైబ్రిడ్ ఇప్పుడు ఫిలిప్పీన్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంది

మారుతీ సుజుకి తన ప్రస్తుత మోడల్స్ లైన్-అప్ కోసం కొత్త తరం హైబ్రిడ్ టెక్నాలజీ పై పరిశోధన చేస్తుంది. ఇది ఇప్పుడు ఫిలిప్పీన్స్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఫిలిప్పీన్స్‌లో విడుదల చేయబడిన సుజుకి డిజైర్ రెండు వేరియంట్లలో విక్రయించబడుతుంది: GL మరియు GLX, పెసో 920,000 నుండి ధరలు ప్రారంభమవుతాయి. ఇది సుమారుగా ₹13.9. రాబోయే సంవత్సరాలలో బెలానో, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ మరియు ఫ్రాంక్స్ యొక్క హైబ్రిడ్ వెర్షన్లను మారుతీ విడుదల చేయబోతుంది అని నివేదికలు పేర్కొంటున్నాయి. నాలుగవ-తరం డిజైర్ గత సంవత్సరం నవంబర్ నెలలో భారతదేశంలో విడుదల చేయబడింది.
మూలం: NDTV ఆటో

ప్రచురించబడిన తేదీ: ఏప్రిల్ 25, 2025

మారుతీ సుజుకి అన్ని కొత్త విటారా ఎలక్ట్రిక్ SUVని ప్రారంభించాలని యోచిస్తోంది


మిలాన్, ఇటలీలో అంతర్జాతీయ ఈవెంట్‌లో మారుతీ సుజుకి ఇ విటారా ని విడుదల చేసింది. మారుతీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ SUV హార్టెక్ట్-E ప్లాట్‌ఫామ్‌లో నిర్మించబడింది. ఇది రెండు బ్యాటరీ ఎంపికలు, ఒక 4WD సిస్టమ్ మరియు 500km అంచనా పరిధిని అందిస్తుంది. ఇ విటారా ఆటో ఎక్స్‌పో 2023 వద్ద చూపబడిన Evx ఆధారంగా ఉంటుంది. మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్‌లోని సుజుకి ఎలక్ట్రిక్ వాహన తయారీ సౌకర్యంతో కారు ఉత్పత్తి ఏప్రిల్ లేదా మే 2025 లో ప్రారంభమవుతుంది.


ప్రచురించబడిన తేదీ: నవంబర్ 14, 2024

సరికొత్త మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ బ్లాగులు చదవండి

Global NCAP Safety Rating for Maruti Suzuki WagonR

మారుతీ సుజుకి వాగన్ ఆర్ కోసం గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జనవరి 10, 2024 నాడు ప్రచురించబడింది
All You Need To Know About Maruti Insurance Policy

మారుతీ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
నవంబర్ 07, 2023న ప్రచురించబడింది
Maruti Wagon R Electric: Interiors, Exteriors, Safety, Price, And More!

మారుతీ వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్: ఇంటీరియర్స్, ఎక్స్టీరియర్స్, భద్రత, ధర మరియు మరిన్ని!

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 17, 2023 న ప్రచురించబడింది
Maruti Suzuki Invicto: A Redefined MPV Revolution!

మారుతీ సుజుకి ఇన్విక్టో: ఒక పునర్నిర్వచించబడిన MPV విప్లవం!

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఆగస్ట్ 18, 2023న ప్రచురించబడింది
Maruti Suzuki Jimny: All You Need to Know

మారుతీ సుజుకి జిమ్నీ: మీరు తెలుసుకోవలసిన అన్ని విషయాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జూలై 14, 2023న ప్రచురించబడింది
slider-right
slider-left
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు


అవును, మీరు మీ మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ పాలసీ మీద క్లెయిమ్ ఫైల్ చేయని పక్షంలో, నో క్లెయిమ్ బోనస్ కోసం మీరు అర్హత సాధిస్తారు. సంవత్సరాలు గడిచే కొద్దీ ప్రీమియంల మీద డిస్కౌంట్‌ రూపంలో నో క్లెయిమ్ బోనస్ కూడబెట్టవచ్చు. ఓన్ డ్యామేజ్ ప్రీమియం మీద 20% - 50% వరకు NCB ఉంటుంది.
మీ మారుతీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో రెన్యూవల్ చేసుకోవడమనేది వేగవంతమైన మరియు అవాంతరాలు లేని అనుభవంగా ఉంటుంది. వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు మారుతీ కార్ మోడల్, కారు కొనుగోలు తేదీ మొదలైన వివరాలు నమోదు చేయండి మరియు ఏవైనా యాడ్-ఆన్‌లు ఎంచుకోండి. మీరు చెల్లింపు చేసిన తర్వాత, మీ పాలసీ రెన్యూ చేయబడుతుంది.
అవును, జీరో డిప్రిషియేషన్ కవర్ అనేది మీరు ఓన్ డ్యామేజీ (OD) ఇన్సూరెన్స్ ప్లాన్‌లో చేర్చుకోగల ఒక యాడ్-ఆన్‌గా ఉంటుంది. జీరో డిప్రిషియేషన్ యాడ్-ఆన్ కవర్ అనేది డిప్రిషియేషన్ మినహాయింపు లేకుండా అన్ని ఫైబర్, రబ్బర్ మరియు మెటల్ భాగాలకు 100% కవరేజీ అందిస్తుంది.
అవును, భారతదేశ వ్యాప్తంగా ఉన్న మా 9000+ నగదురహిత గ్యారేజీల విస్తృత నెట్‌వర్క్‌ అనేది ఎక్కడైనా, ఎప్పుడైనా నగదురహిత సహాయం అందించడంలో మీకు సహాయపడుతుంది.
థర్డ్-పార్టీ (TP) ఇన్సూరెన్స్ అనేది రోడ్ మీద మీరు డ్రైవ్ చేయడానికి మీరు కలిగి ఉండవలసిన ఒక చట్టపరమైన అవసరం. మీ మారుతీ కార్ కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగిసే స్థితిలో ఉన్నప్పుడు, ఆలస్యం లేకుండా TP ఇన్సూరెన్స్‌ను రెన్యూవల్ చేసుకోవలసిందిగా సలహా ఇవ్వడమైనది. మీ మారుతీ కారు కోసం అదనంగా OD కవర్ అవసరమైతే, మీరు ఒక సమగ్ర ఇన్సూరెన్స్ కవర్ ఎంచుకోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
మీ మారుతీ కార్ కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్‌కు వెళ్లినప్పుడు మీరు తప్పనిసరి మినహాయింపులు చెల్లించాల్సి ఉంటుంది. IRDAI కొత్త మార్గదర్శకాల ప్రకారం, 1500cc కంటే తక్కువ లేదా సమానంగా ఉన్న వాహనం కోసం ₹1000 అనేది తప్పనిసరి మినహాయింపుగా ఉంటుంది. 1500cc కంటే ఎక్కువ వాహనాల కోసం, ₹1000 తప్పనిసరి మినహాయింపుగా ఉంటుంది.
మీ మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించడానికి నో క్లెయిమ్ బోనస్ (ఎన్‌సిబి) పొందడమనేది ఒక ఉత్తమ మార్గం. ఇన్సూరెన్స్ అవధిలో ఎలాంటి క్లెయిమ్‌లు ఫైల్ చేయకపోవడం ద్వారా మీరు దీనిని పొందవచ్చు. వెనుక లైట్ విరిగిపోవడం లేదా వెనుక ఫెండర్ దెబ్బతినడం లాంటి చిన్న నష్టాల సందర్భంలో ఇది నిజమవుతుంది. తెలివైన ఎంపికను పరిగణనలోకి తీసుకోండి మరియు తక్షణ మరమ్మతులను మీ సొంత ఖర్చుతో చేయించుకోండి, మరియు తక్కువ ప్రీమియంలతో దీర్ఘకాలంలో ఆదా చేసుకోండి.
పూర్తి కవరేజ్ పొందడానికి మీ మారుతీ కారు కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. మీ మారుతీ ఇన్సూరెన్స్ యొక్క సమగ్ర కవర్‌తో, తుఫానులు, దొంగతనం, భూకంపాలు, వరద మొదలైనటువంటి ఏదైనా ఇన్సూరెన్స్ చేయదగిన ప్రమాదం కారణంగా అయ్యే ఖర్చు కోల్పోవడానికి మీకు కవరేజ్ లభిస్తుంది. అదనంగా, ఇన్సూరెన్స్ చేయబడిన వాహనంతో సంబంధం ఉన్న థర్డ్-పార్టీ బాధ్యతల ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేస్తుంది.
మారుతీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్ చేయడానికి అవసరమైన ఈ క్రింది డాక్యుమెంట్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) బుక్ కాపీ
2. ప్రమాదం సందర్భంలో ఇన్సూర్ చేయబడిన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి యొక్క డ్రైవర్ లైసెన్స్ కాపీ.
3. పోలీస్ స్టేషన్‌లో ఫైల్ చేసిన FIR
4. గ్యారేజీ నుండి రిపేరింగ్స్ కోసం అంచనాలు
5. మీ కస్టమర్ (KYC) డాక్యుమెంట్లను తెలుసుకోండి
6. ఒకవేళ, తిరుగుబాటు చర్యలు, అల్లర్లు, యాక్సిడెంట్ లేదా సమ్మెల కారణంగా ప్రమాదం జరిగితే, అప్పుడు తప్పనిసరిగా ఒక FIR ఫైల్ చేయాలి.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ నుండి మారుతీ సుజుకి కార్ ఇన్సూరెన్స్ పాలసీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్ హోమ్ పేజీలో, మీరు హెల్ప్ బటన్‌ను క్లిక్ చేయవచ్చు మరియు ఇమెయిల్ పాలసీ కాపీ ఎంపికను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత, మీరు మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా పాలసీ నంబర్‌ను నమోదు చేయాలని అనుకుంటారు. పాలసీ వెంటనే వాట్సాప్‌లో మీకు మెయిల్ చేయబడుతుంది లేదా పంపబడుతుంది.
మీ మారుతీ కారు దొంగిలించబడినప్పుడు, మీరు వెంటనే ఒక FIR ఫైల్ చేయాలి, అప్పుడు మా హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా 8169500500 పై వాట్సాప్‌లో ఒక మెసేజ్ పంపడం ద్వారా క్లెయిమ్ చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్లెయిమ్ బృందానికి తెలియజేయండి.
అవును, మారుతి కార్ ఇన్సూరెన్స్ బదిలీ చేయబడుతుంది. కార్ ఇన్సూరెన్స్ బదిలీ అనేది మరొక పార్టీ ఆమోదం తర్వాత, ఇన్సూరెన్స్ పాలసీ ఒప్పందం నుండి ఒక పార్టీ ఉపసంహరణను అధికారికంగా చేస్తుంది. ముఖ్యంగా, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 157 ప్రకారం, ఇరు పార్టీల వారు వాహనం కొనుగోలు చేసిన 14 రోజుల్లోగా కారు ఇన్సూరెన్స్ పాలసీలను బదిలీ చేసుకోవాలి.

అవార్డులు మరియు గుర్తింపు