మారుతీ స్విఫ్ట్ డిజైర్ కోసం కార్ ఇన్సూరెన్స్
ప్రీమియం కేవలం ఇంత వద్ద ప్రారంభం: ₹2094*

ప్రీమియం ప్రారంభం

కేవలం ₹2094 వద్ద*
8000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

8000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / మారుతీ సుజుకి / స్విఫ్ట్ డిజైర్

మారుతీ స్విఫ్ట్ డిజైర్ కోసం ఆన్‌లైన్‌లో కార్ ఇన్సూరెన్స్

స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్
భారతదేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల జాబితాలో మారుతీ ఎల్లప్పుడూ అనేక మోడల్స్ కలిగి ఉంటోంది మరియు ఈ జాబితాలో స్విఫ్ట్ డిజైర్‌కు నిరంతరంగా స్థానం ఉంటోంది. ఇది భారతదేశంలో అనేక సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతున్న సెడాన్ కార్‌గా ఉంటోంది. స్టైల్ మరియు విశ్వసనీయతతో పాటు సాధ్యమైనంత ఉత్తమ ధరల మధ్య మంచి సమతౌల్యత కోసం అన్వేషించే ఎవరికైనా, మారుతీ అందించే ప్రారంభ స్థాయి సెడాన్ అయిన స్విఫ్ట్ డిజైర్‌తో సరిపోలినది మరొకటి లేదు. వాణిజ్య మరియు ప్రైవేట్ ప్రయోజనాల కోసం ఈ మోడల్ విస్తృతంగా వినియోగించబడుతోంది. మొదటిసారి కారు కొనే వారికోసం కూడా ఇది ఇష్టమైన కారుగా ఉంటోంది. టూర్ కోసం ఉపయోగించే ప్రత్యేకమైన వాణిజ్య వేరియెంట్‌లలోనూ ఈ కారు ఒకటిగా ఉంటోంది.

మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆఫర్‌లు

మారుతీ స్విఫ్ట్ డిజైర్ భారతదేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విక్రయించబడుతుంది, అంటే ఈ వాహనం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా విస్తృత రకాల కార్ ఇన్సూరెన్స్ ప్రోడక్టులను అందిస్తాయి. మోటార్ వాహనాల చట్టం ప్రకారం తప్పనిసరి చేయబడిన ప్రాథమిక థర్డ్-పార్టీ కవర్ నుండి మూడు సంవత్సరాల వరకు పూర్తి రక్షణను నిర్ధారించే దీర్ఘకాలిక సమగ్ర పాలసీల వరకు, మీరు ఈ అన్నింటినీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద పొందవచ్చు.

ఇదొక బండిల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్. తమ కారు కోసం ఆల్ రౌండ్ రక్షణ కోరుకునే వారు సాధారణంగా దీనిని ఎంచుకుంటారు. మీరు చట్టపరంగా మరియు ఆర్థికంగా అన్ని అంశాల్లోనూ మీ కారును సురక్షితం చేసుకోవాలని చూస్తున్నట్లయితే, ఇది మీకు ఉత్తమ ఎంపిక కాగలదు. ఈ మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో మీకు లభించేవి:

X
ఆల్-రౌండ్ రక్షణ కోరుకునే కారు ప్రేమికులకు అనువైన ఈ ప్లాన్, క్రింది అంశాలను కవర్ చేస్తుంది:

ప్రమాదం

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి

ఇది మీరు కొనుగోలు చేయగల అత్యంత ప్రాథమిక మరియు చట్టపరంగా తప్పనిసరి అయిన కార్ ఇన్సూరెన్స్ పాలసీ. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్స్ ద్వారా ప్రకటించబడగల ఏదైనా చట్టపరమైన బాధ్యత నుండి మిమ్మల్ని రక్షించే థర్డ్-పార్టీ కవర్‌తో ఇది లభిస్తుంది. ఇది మీ ఏకైక వాహనం అయితే, దీనిని తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్‌తో కూడా కలపవచ్చు. తద్వారా మీకు లభించేవి:

X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

మరిన్ని అన్వేషించండి

ఇది మూడు సంవత్సరాల కాలపరిమితి వరకు అందించబడుతుంది మరియు పైన చర్చించిన అదే థర్డ్-పార్టీ కవర్‌గా ఉంటుంది. సాధారణంగా, ఈ పాలసీ అనేది కొత్త కారు కొనుగోలుదారులకు అందించబడుతుంది. అయితే, కారు కొని కొంతకాలం అయిన వ్యక్తులు కూడా ఈ కవర్‌ను ఎంచుకోవచ్చు.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

ఒక పొడిగించబడిన కాలవ్యవధితో ఉండే ఈ బండిల్ ఉత్పత్తి అనేది ఒకే సంవత్సరం కార్ ఇన్సూరెన్స్కు సంబంధించిన అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, అనేక సంవత్సరాల చెల్లుబాటుతో వాటిని అందిస్తుంది. ఈ ప్లాన్‌ను ఒకేసారి మూడు సంవత్సరాల కోసం కొనుగోలు చేయవచ్చు. మీరు స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్లో భాగంగా ఈ కవర్‌ ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి. ఇది ధరను మొదటి సంవత్సరం రేట్లలో లాక్ చేయడం ద్వారా, మీరు గణనీయంగా ఆదా చేసుకోవడంలో సహాయపడుతుంది. మీరు ప్రస్తుత రేటు వద్ద పన్నులు చెల్లిస్తారు మరియు పన్ను పెరుగుదల నుండి రక్షణ పొందుతారు. మొత్తం పాలసీ వ్యవధి కోసం నో క్లెయిమ్ బోనస్ కూడా తక్షణమే అందించబడుతుంది.

X
కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేసే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

మీరు ఒక సమగ్ర మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసినప్పుడు, ఏదైనా ఊహించని ప్రమాదం నుండి మీ కారు అన్ని విధాలా సురక్షితం చేయబడుతుందని గుర్తుంచుకోండి. అలాగే, దీని విస్తృతమైన కవరేజ్ పరిధి కారణంగా, మీకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీకి బదులు సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలని సిఫార్సు చేయబడుతుంది:

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడేది - యాక్సిడెంట్ కవరేజీ

యాక్సిడెంట్ కవరేజ్

ఏదైనా యాక్సిడెంట్‌లో భాగంగా మీ కారుకు ఏదైనా నష్టం జరిగితే మరియు రిపేర్ కోసం దానిని సర్వీస్ సెంటర్‌కు పంపాల్సి వస్తే, మినహాయింపులు మరియు తరుగుదలకు లోబడి, మరమ్మత్తు ఖర్చులను మీ మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడేది - ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు

ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు

వరదలు, భూకంపం, మంచు లేదా కొండచరియలు విరిగిపడడం లాంటి ఏదైనా ప్రకృతి వైపరీత్యం కారణంగా మీ కారుకు నష్టం జరిగితే, వర్తించే నిబంధనల ప్రకారం, మరమ్మత్తు ఖర్చులను మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - దొంగతనం

దొంగతనం

మీ కారు దొంగిలించబడి, పోలీసులు దానిని కనిపెట్టలేకపోతే, కారు IDV మరియు వర్తించే తరుగుదలలు మరియు మినహాయింపుల ప్రకారం మీ నష్టానికి తగిన పరిహారం అందించబడుతుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడేది - వైద్య ఖర్చు

వైద్య ఖర్చు

ఏదైనా యాక్సిడెంట్‌లో మీరూ భాగంగా ఉన్నప్పుడు, పాలసీకి సంబంధించిన తప్పనిసరి పర్సనల్ యాక్సిడెంట్ కవర్ యాక్టివ్‌గా మారుతుంది మరియు ₹ 15 లక్షల వరకు వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ అందిస్తుంది. మీకు మెడికల్ ఇన్సూరెన్స్ లేనప్పుడు లేదా తక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఇది సహాయపడుతుంది.

కార్ ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేయబడుతుంది - థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్-పార్టీ లయబిలిటీ

మీ కారు కారణంగా జరిగిన ఏదైనా యాక్సిడెంట్ కారణంగా థర్డ్ పార్టీకి ఏదైనా గాయం, నష్టం లేదా ఆస్తి నష్టం జరిగితే, కార్ ఇన్సూరెన్స్ ద్వారా పరిహారం కవర్ చేయబడుతుంది.

మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూవల్ చేయాలి?

రోజులు గడిచే కొద్దీ, మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటు తేదీ పూర్తయిపోతుంది మరియు కవర్ అందించడం ఆపివేస్తుంది. అంటే, మీ పాలసీని సకాలంలో రెన్యూవల్ చేసుకోవడం ముఖ్యం. తద్వారా, మీరు మీ స్విఫ్ట్ డిజైర్‌ను చట్టపరంగా నడపవచ్చు మరియు అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు డబ్బు నష్ట పోవడం నుండి రక్షణ పొందవచ్చు. మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోవడాన్ని సులభతరం చేస్తుంది.

  • దశ #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి లేదా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, మరియు రెన్యూవల్ ఎంపికను ఎంచుకోండి
  • దశ #2
    దశ #2
    రిజిస్ట్రేషన్, స్థానం, మునుపటి పాలసీ వివరాలు, NCB మొదలైన వాటితో సహా మీ కార్ వివరాలు నమోదు చేయండి.
  • దశ #3
    దశ #3
    కోట్ అందుకోవడానికి మీ ఇమెయిల్ ID మరియు ఫోన్ నంబర్ నమోదు చేయండి
  • దశ #4
    దశ #4
    ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి, మరియు నిర్ధారించుకోండి! మీరు సురక్షితంగా ఉన్నారు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండే మారుతీ స్విఫ్ట్ డిజైర్ కార్ ఇన్సూరెన్స్ ఎందుకు కొనుగోలు చేయాలి?

స్విఫ్ట్ డిజైర్ కోసం కార్ ఇన్సూరెన్స్ అందించే కంపెనీలు అనేకం ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ఫీచర్‌లు మరియు ప్రయోజనాలతో పోటీపడగల సామర్థ్యం కొన్ని కంపెనీలకే ఉంది. పూర్తిగా అవాంతరాలు-లేని ఇన్సూరెన్స్ అనుభవం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే, ఇబ్బందులు లేని మరియు వేగవంతమైన మరియు సులభమైన క్లెయిమ్స్ ప్రాసెస్‌తో లభించే పాలసీ కోసం మీకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒక గొప్ప ఎంపికగా ఉంటుంది.

నగదురహిత క్లెయిములు

నగదురహిత క్లెయిములు

మీరు మీ కారును నగదురహిత వ్యవస్థ కింద మరమ్మత్తు చేసుకోగల గ్యారేజీలకు సంబంధించిన పెద్ద నెట్‌వర్క్ మా వద్ద ఉంది. ఈ గ్యారేజీల్లో, మీరు కేవలం మీ కారు తీసుకువచ్చి మరమ్మత్తు చేసుకోండి, మరమ్మత్తు ఖర్చులో మీ స్వంత వాటా చెల్లించండి మరియు డ్రైవింగ్ మొదలుపెట్టండి. గ్యారేజీకి చెల్లించాల్సిన మిగిలిన మొత్తాన్ని హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సెటిల్ చేస్తుంది.

యాప్ ఆధారిత క్లెయిమ్‌లు

యాప్ ఆధారిత క్లెయిమ్‌లు

మీ కార్ ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేయడానికి మీరు వేగవంతమైన మరియు సులభమైన మార్గం కోసం చూస్తున్నట్లయితే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు ఉత్తమమైనదిగా ఉంటుంది. మా యాప్-ఆధారిత క్లెయిమ్స్ ప్రాసెస్‌తో, మీరు ఫోటోలు క్లిక్ చేసి మరియు వాటిని అప్‌లోడ్ చేయడం ద్వారా, మొబైల్ ఫోన్ యాప్ ఉపయోగించి క్లెయిమ్‌లు ఫైల్ చేయవచ్చు.

ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్

ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్

చిన్నపాటి సొట్టలు మరియు చిన్నపాటి ప్రమాదవశాత్తూ మరమ్మతుల కోసం, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీకు అర్హత కలిగిన గ్యారేజ్ వద్ద రాత్రిపూట మీ కారును మరమ్మత్తు చేసుకునే ఎంపికను అందిస్తుంది. మీ కారు మరమ్మత్తులు రాత్రిపూట ఫిక్స్ చేయబడుతాయి మరియు ఉదయానికి మీ కారు ఇంటి వద్దకు చేరుతుంది.

24x7 సహాయం

24x7 సహాయం

మా ఈ ఫీచర్ మీద అనేకమంది వినియోగదారులు ఆధారపడుతున్నారు. ఫ్లాట్ టైర్, డెడ్ బ్యాటరీ లేదా ఏదైనా మైనర్ సమస్య కారణంగా మీరు ఎక్కడైనా చిక్కుకుపోతే, మేము అక్కడకు వచ్చి మీకు సహాయం చేయగలము.

భారతదేశ వ్యాప్తంగా 8000+ నగదురహిత గ్యారేజీలు

తరచుగా అడగబడిన ప్రశ్నలు


అవును, స్విఫ్ట్ డిజైర్ మోడల్స్ మరియు స్విఫ్ట్ డిజైర్ టూర్ మోడల్స్ భిన్నంగా ఉంటాయి. మొదటిది ప్రైవేట్ ఉపయోగం కోసం కాగా, రెండవది వాణిజ్య ఉపయోగం కోసం ఉద్దేశించబడినది. ఫలితంగా, స్విఫ్ట్ డిజైర్ మరియు స్విఫ్ట్ డిజైర్ టూర్ కోసం ఇన్సూరెన్స్ పాలసీలు భిన్నంగా ఉంటాయి మరియు ఇవి పరస్పరం మార్పిడి చేయదగినవి కావు.
మీ పాలసీ ఇప్పటికీ అమలులో ఉన్నప్పటికీ, త్వరలోనే గడువు ముగిసే పరిస్థితి ఉన్నప్పుడు, మీరు తప్పక త్వరపడాలి. తక్షణమే హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి మరియు సంబంధిత పాలసీ వివరాలన్నీ సమర్పించండి. మీరు తక్షణమే చెల్లింపు చేస్తే, పాలసీ వెంటనే రెన్యూవల్ చేయబడుతుంది. మీరు పాలసీ కాపీని ప్రింట్ చేసుకోవచ్చు మరియు వెంటనే కారులో ఉంచుకోవచ్చు మరియు మీ ప్రస్తుత పాలసీ ముగిసిన క్షణం నుండి అది అమలులోకి వస్తుంది.
మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీతో పాటు మీరు కొనుగోలు చేయగల యాడ్-ఆన్‌లు అనేకం ఉన్నాయి. వీటిలో జీరో డిప్రిషియేషన్ కవర్, రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్ మరియు ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మొదలైనవి ఉంటాయి.
క్లెయిమ్ ఏదీ చేయకుండా మీరు ఒక సంవత్సరం కార్ ఇన్సూరెన్స్ పూర్తి చేసినప్పుడు నో క్లెయిమ్స్ బోనస్ ప్రారంభమవుతుంది మరియు మీ స్వంత నష్టం కవర్ ప్రీమియం ఖర్చులో 10%తో ఇది ప్రారంభమవుతుంది. గరిష్టంగా, ఇది 50% వరకు వెళ్ళవచ్చు, ఎలాంటి క్లెయిమ్‌లు లేకుండా విజయవంతంగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు ఇది అందుబాటులోకి వస్తుంది