అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండడం వలన మీరు ఆందోళన లేకుండా మరియు హాయిగా ఆ పర్యాటక ప్రదేశంలో సంచరించడానికి రక్షణ మరియు మనశ్శాంతిని అందిస్తుంది. సుదూర ప్రాంతంలోని కొత్త సంస్కృతి మరియు అక్కడి ప్రజల గురించిన మరపురాని జ్ఞాపకాలను పొందే సమయంలో ఏదైనా ఊహించని సంఘటన నుండి మిమ్మల్ని మీరు ఆర్థికంగా సురక్షితం చేసుకోండి. గుర్తుంచుకోండి, వైద్య మరియు దంత అత్యవసర పరిస్థితులు ఎల్లప్పుడూ అకస్మాత్తుగా వస్తాయి. విదేశంలో అటువంటి ఖర్చులు మీకు తీవ్రమైన ఆర్థిక భారాన్ని కలిగించవచ్చు. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ లేదా విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం వలన అటువంటి సంక్షోభం నుండి మీకు రక్షణ దొరుకుతుంది.
అత్యవసర వైద్య పరిస్థితులు కాకుండా, ఇతర దురదృష్టకర సంఘటనలు విమానం లేదా సామాను ఆలస్యాలు వంటి సంఘటనలు మిమ్మల్ని బాధించవచ్చు. అంతర్జాతీయ ప్రయాణంలో, చెక్-ఇన్ సామాను కోల్పోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ పరిస్థితులు అదనపు ఖర్చులకు దారితీయవచ్చు మరియు మీ ప్రయాణ బడ్జెట్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. కానీ విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ హామీతో, అటువంటి దుర్ఘటనల గురించి చింతించకుండా మీరు మీ సెలవులను ఆనందించవచ్చు. అంతేకాకుండా, పాస్‌పోర్ట్ వంటి అవసరమైన డాక్యుమెంట్లను కోల్పోయినా లేదా దొంగతనం లేదా దోపిడీ జరిగినా అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అటువంటి క్లిష్టమైన సమయాల్లో అవసరమైన కవరేజ్ మరియు భద్రతను మీకు అందిస్తుంది. మీరు పని లేదా విశ్రాంతి కోసం ఒక విదేశీ యాత్రను ప్లాన్ చేస్తున్నట్లయితే, ఆన్‌లైన్‌లో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోండి మరియు మీ ఇంటి నుండే సౌకర్యవంతంగా మీ ట్రిప్‌ను సురక్షితం చేసుకోండి.
అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది వివిధ దురదృష్టకర సంఘటనల నుండి మీ విదేశీ ట్రిప్‌ను ఆర్థికంగా కవర్ చేసే ఒక పాలసీ. సులభంగా చెప్పాలంటే, విమాన ఆలస్యాలు, వైద్య అత్యవసర పరిస్థితులు, ట్రిప్ తగ్గింపు, చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ కోల్పోవడం మొదలైనటువంటి ఊహించని సంఘటనల కారణంగా జరిగిన ఆకస్మిక ఖర్చులకు కవరేజ్ అందించడం ద్వారా ఇది ఒక ఆర్థిక భద్రతా కవచంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో, ప్రయాణీకులు తమ విదేశీ ట్రిప్‌లో ఉన్నప్పుడు మనశ్శాంతిని పొందవచ్చు. ఇది అత్యవసర వైద్యం, సామాను మరియు ప్రయాణ సంబంధిత అవాంతరాలను సులభంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, మీ ట్రిప్ సజావుగా సాగేలా చూసుకుంటుంది. ఇది విదేశీ దేశంలో వ్యక్తిగత బాధ్యతకు కవరేజీ అందించే దిశగా కూడా విస్తరించింది.
ఇప్పటి వరకు, పర్యాటకం కోసం కొన్ని దేశాలలోకి ప్రవేశించడానికి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరం చేయబడింది, అయితే ఇది మిగిలిన వాటిలో స్వచ్ఛంద ఎంపికగా ఉంటుంది. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరంతో సంబంధం లేకుండా, మీ విదేశీ ప్రయాణం కోసం దానిలో పెట్టుబడి పెట్టడం దాని విస్తృత కవరేజ్ ప్రయోజనాల కోసం అత్యంత సిఫార్సు చేయబడుతుంది.
విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు, మునుపటి ప్రయాణ ప్రణాళిక పనిచేయకపోతే మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఒక బ్యాకప్ ప్లాన్‌ను సిద్ధంగా ఉంచుకోండి. పోయిన లగేజ్, విమాన ఆలస్యాలు, లగేజ్ ఆలస్యాలు లేదా ఏదైనా ఊహించని సంఘటనల వలన జరిగిన నష్టానికి ఒక విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కవరేజీని అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ 1 లక్ష+ నగదురహిత ఆసుపత్రుల నెట్‌వర్క్ మరియు క్లెయిములను సులభంగా సెటిల్ చేయడానికి 24x7 మద్దతును అందిస్తుంది.
మా ట్రావెల్ ఇన్సూరెన్స్ మిమ్మలని ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న పరిస్థితులలో రక్షణను అందిస్తుంది:
ముఖ్యమైన ఫీచర్లు | ప్రయోజనాలు |
నగదు రహిత ఆసుపత్రులు | ప్రపంచవ్యాప్తంగా 1,00,000+ నగదురహిత ఆసుపత్రులు. |
కవర్ చేయబడిన దేశాలు | 25 షెన్‌గన్ దేశాలు + 18 ఇతర దేశాలు. |
కవరేజ్ మొత్తం | $40K నుంచి $1000K |
హెల్త్ చెక్-అప్ అవసరం | ప్రయాణం చేయడానికి ముందు హెల్త్ చెక్-అప్ అవసరం లేదు. |
కోవిడ్-19 కవరేజ్ | కోవిడ్-19 హాస్పిటలైజేషన్ కోసం కవరేజ్. |
ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం వలన కలిగే కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి -
ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.
శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.
అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.
అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.
గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.
విమాన ఆలస్యాలు లేదా రద్దులు అనేవి మన నియంత్రణలో ఉండవు కనుక చింతించకండి, ఇలాంటి వాటి కారణంగా తలెత్తే ఏవైనా అవసరమైన ఖర్చులకు మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ ద్వారా పరిహారం పొందవచ్చు.
ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.
ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కావున, మేము కొత్త లేదా నకిలీ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అయ్యే ఖర్చులను తిరిగి చెల్లిస్తాము.
ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.
మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.
వైద్య అత్యవసర పరిస్థితుల అర్థం మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా? మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి
మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.
ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.
ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి ; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది. షరతులు మరియు నిబంధనలకు లోబడి.
మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.
వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.
పైన పేర్కొన్న కవరేజ్ మా కొన్ని ట్రావెల్ ప్లాన్లలో అందుబాటులో ఉండకపోవచ్చు. మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి పాలసీ వివరాలు, బ్రోచర్ మరియు ప్రాస్పెక్టస్‌ను చదవండి.
యుద్ధం లేదా చట్టం ఉల్లంఘన కారణంగా ఏర్పడే అనారోగ్యం లేదా ఆరోగ్య సమస్యలు ప్లాన్ పరిధిలోకి రావు.
మీరు ఏవైనా మత్తు పదార్థాలు లేదా నిషేధిత పదార్థాలను తీసుకుంటే, పాలసీ ఎలాంటి క్లెయిమ్‌లను స్వీకరించదు.
మీరు ఇన్సూర్ చేసిన ప్రయాణానికి ముందు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇప్పటికే ఉన్న అనారోగ్యానికి మీరు ఏదైనా చికిత్స చేయించుకుంటే, ఈ సంఘటనలకు సంబంధించిన ఖర్చులను పాలసీ కవర్ చేయదు.
మీరు ఇన్సూర్ చేసిన కాలవ్యవధిలో మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సౌందర్యం లేదా ఊబకాయం చికిత్సను ఎంచుకుంటే, అలాంటి ఖర్చులు కవర్ చేయబడవు.
స్వతహా-చేసుకున్న గాయాల కారణంగా ఉత్పన్నయమయ్యే హాస్పిటలైజెషన్ ఖర్చులు లేదా వైద్య ఖర్చులు మా ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పరిధిలోకి రావు.
మీ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అనేది అనేక అంశాల పై ఆధారపడి ఉంటుంది, అవి:
1. మీ ప్రయాణ గమ్యస్థానం: ప్రయాణ గమ్యస్థానం అనేది మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే ప్రధాన అంశాల్లో ఒకటి. ఉదాహరణకు, మీరు ఒక సురక్షితమైన దేశానికి ప్రయాణిస్తున్నట్లయితే, ప్రయాణం తక్కువ రిస్క్‌గా పరిగణించబడుతుంది మరియు ఛార్జ్ చేయబడే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. అదే విధంగా, అధిక రిస్క్‌గా పరిగణించబడే దేశాల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి.
2. మొత్తం ప్రయాణీకులు మరియు వారి వయస్సు: మొత్తం ప్రయాణీకుల సంఖ్య కూడా మీ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, వ్యక్తిగత ట్రావెల్ ఇన్సూరెన్స్ ఖర్చు గ్రూప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంటే తక్కువగా ఉంటుంది. అలాగే, ప్రయాణీకుల వయస్సు పాలసీ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, వృద్ధుల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌కు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎందుకంటే వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
3. ముందు నుండి ఉన్న ఆరోగ్య పరిస్థితులు: వైద్య చరిత్ర మరియు వ్యక్తుల ప్రస్తుత వైద్య అనారోగ్యాల ఉనికి కూడా అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా, చాలామంది ఇన్సూరెన్స్ సంస్థలు ముందు నుండి ఉన్న వ్యాధులను కవర్ చేయవు మరియు కవర్ అందించే సంస్థలు అధిక సంబంధిత రిస్క్ కారణంగా అధిక ప్రీమియం వసూలు చేస్తాయి.
4. ఎంచుకున్న ఇన్సూరెన్స్ ప్లాన్: ఇన్సూరర్లు అనేక రకాల అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందిస్తారు. మీరు వెతుకుతున్న ప్రయోజనాల ఆధారంగా మీరు మీ ఎంపికను తీసుకోవచ్చు. అయితే, మరిన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్ల కోసం మీరు అధిక ప్రీమియం చెల్లించవలసి ఉంటుందని గమనించండి.
5. ట్రిప్ వ్యవధి: మీ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేయడంలో పూర్తి ట్రిప్ వ్యవధి గణనీయమైన పాత్రను పోషిస్తుంది. మీరు ఎక్కువ రోజులు దూరంగా ట్రిప్‌లో ఉంటే, దురదృష్టకర సంఘటనను ఎదుర్కొనే ప్రమాదం అధికంగా ఉంటుంది. సులభంగా చెప్పాలంటే, దీర్ఘకాలిక ట్రిప్ అంటే, ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం మరింత ఇన్సూరర్ ఛార్జీలు.
6. ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం: హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో, మీరు మీ అవసరాలను బట్టి మీ అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొరకు $40k మరియు $1000k మధ్య కవరేజీని ఎంచుకోవచ్చు. అధిక ఇన్సూరెన్స్ మొత్తం అంటే మెరుగైన కవరేజ్, అంటే ఇన్సూరర్ వసూలు చేసే అధిక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం అని కూడా అర్ధం.
మీరు సురక్షితమైన లేదా ఆర్థికంగా మరింత స్థిరమైన దేశానికి ప్రయాణిస్తున్నట్లయితే, ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువగా ఉంటుంది. అలాగే, మీ ఇంటి నుండి గమ్యస్థానం ఎంత దూరంలో ఉంటే, ఇన్సూరెన్స్ ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.
మీరు ఎక్కువ కాలం దూరంగా ఉంటే, మీరు అనారోగ్యానికి గురయ్యే లేదా గాయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, మీ ప్రయాణ వ్యవధి ఎక్కువగా ఉంటే, వసూలు చేయబడే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
ప్రీమియంను నిర్ణయించడంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వయస్సు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సీనియర్ సిటిజన్స్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్యం మరియు గాయపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఎంచుకున్న ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ రకం వారి పాలసీ ప్రీమియంను నిర్ణయిస్తుంది. మరింత సమగ్రమైన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రాథమిక కవరేజ్ కంటే స్వాభావికంగా ఎక్కువగా ఉంటుంది.
అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం అనేది ఒక క్లిక్ దూరంలో ఉంటుంది మరియు మీ సౌలభ్యం ప్రకారం మీ ఇంటి నుండి లేదా కార్యాలయం నుండి సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. అందువల్ల, విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల ఆన్‌లైన్ కొనుగోలు వేగం అందుకుంది మరియు రోజురోజుకూ పెరుగుతోంది.
• ఇక్కడ క్లిక్ చేయండి లింక్, లేదా మా పాలసీని కొనుగోలు చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ వెబ్‌పేజీని సందర్శించండి.
• ప్రయాణీకుల వివరాలు, గమ్యస్థాన సమాచారం మరియు ట్రిప్ ప్రారంభం మరియు ముగింపు తేదీలను నమోదు చేయండి.
• మా మూడు ప్రత్యేకమైన ఎంపికల నుండి మీకు ఇష్టమైన ప్లాన్‌ను ఎంచుకోండి.
• మీ వ్యక్తిగత వివరాలను అందించండి.
• ప్రయాణీకుల గురించి అదనపు వివరాలను పూరించండి మరియు ఆన్‌లైన్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చెల్లించడానికి కొనసాగండి.
• ఇక మిగిలింది ఒక్కటే- మీ పాలసీని తక్షణమే డౌన్‌లోడ్ చేసుకోండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ప్రాసెస్ పారదర్శకంగా ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో క్యాష్‌లెస్ మరియు రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన ఆన్‌లైన్‌లో క్లెయిమ్ చేయవచ్చు.
travelclaims@hdfcergo.com కు క్లెయిమ్ సమాచారాన్ని మెయిల్ చేయండి, TPA నుండి నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను పొందండి.
Medical.services@allianz.com నగదురహిత క్లెయిముల కోసం సమర్పించాల్సిన డాక్యుమెంట్ల జాబితాను షేర్ చేస్తుంది.
travelclaims@hdfcergo.com కు క్లెయిమ్ సమాచారాన్ని మెయిల్ చేయండి లేదా గ్లోబల్ టోల్-ఫ్రీ నంబర్‌పై కాల్ చేయండి : +800 08250825
రీయింబర్స్‌మెంట్ కోసం మీరు పొందుపరచాల్సిన చెక్‌లిస్ట్/ డాక్యుమెంట్లను Travelclaims@hdfcergo.com షేర్ చేస్తుంది
travelclaims@hdfcergo.com లేదా processing@hdfergo.comకు క్లెయిమ్ ఫారంతో పాటు పంపవలసిన డాక్యుమెంట్లు
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ద్వారా క్లెయిమ్స్ సిస్టమ్‌లో క్లెయిమ్ నమోదు చేయబడుతుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను పూరించేటప్పుడు, మీరు క్లెయిమ్ విధానంలో భాగంగా కొన్ని డాక్యుమెంట్లను సబ్మిట్ చేయాలి. సమర్పించవలసిన ఖచ్చితమైన డాక్యుమెంట్లు ఫైల్ చేయబడిన క్లెయిమ్ రకం లేదా సంఘటన స్వభావం పై ఆధారపడి ఉంటాయి, అయితే సాధారణంగా ఇవి ఉంటాయి:
• ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ నంబర్
• అనారోగ్యం లేదా గాయం యొక్క స్వభావం మరియు దాని పరిధిని సూచించే మరియు స్పష్టమైన రోగనిర్ధారణను అందించే ఒక ప్రాధమిక మెడికల్ రిపోర్ట్
• ID మరియు వయస్సు రుజువు
• ప్రిస్క్రిప్షన్లు, హాస్పిటల్ ఖర్చులు, రిపోర్టులు మొదలైన వాటికి సంబంధించిన అన్ని బిల్లులు మరియు ఇన్వాయిస్లు.
• అధికారిక మరణ ధ్రువీకరణ పత్రం (మరణం సంభవించిన సందర్భంలో)
• చట్టపరమైన వారసుడి రుజువు (వర్తిస్తే)
• థర్డ్-పార్టీ సంప్రదింపు వివరాలు (థర్డ్-పార్టీ నష్టం జరిగిన సందర్భంలో)
• అదనపు డాక్యుమెంటేషన్ (క్లెయిమ్ అధికారి సూచించిన విధంగా).
ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడిన అనారోగ్యం విషయంలో, మీరు వీటిని సబ్మిట్ చేయాలి:
• అనారోగ్య లక్షణాలు ప్రారంభమైన తేదీ
• దాని చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించిన తేదీ
• డాక్టర్ యొక్క సంప్రదింపు సమాచారం.
ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడిన ప్రమాదం జరిగిన సందర్భంలో, మీరు వీటిని సబ్మిట్ చేయాలి:
• ప్రమాదం మరియు సాక్షుల సమాచారం (ఏదైనా ఉంటే) యొక్క పూర్తి వివరాలు
• సంబంధిత గాయం/గాయాల ఫలితంగా డాక్టర్‌ను సంప్రదించిన తేదీ
• యాక్సిడెంట్‌కు సంబంధించిన పోలీస్ రిపోర్ట్ కాపీ (ఏదైనా ఉంటే)
• డాక్టర్ యొక్క సంప్రదింపు సమాచారం.
తప్పనిసరిగా విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమయ్యే కొన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి: ఇది ఒక సూచిక జాబితా. ప్రయాణానికి ముందు ప్రతి దేశం యొక్క వీసా అవసరాన్ని స్వయంగా చెక్ చేసుకోవడం మంచిదని సలహా ఇవ్వబడింది.
సోర్స్: VisaGuide.World
ఈ కింద ఇవ్వబడిన ఆప్షన్‌ల నుండి మీకు కావలసినది ఎంచుకోండి, తద్వారా మీరు విదేశీ దేశానికి మీ పర్యటన కోసం మరింత మెరుగ్గా సిద్ధం అవచ్చు
ప్రపంచం అంతటా సాధారణ పరిస్థితులు నెలకొని అంతర్జాతీయ ప్రయాణం తిరిగి పుంజుకుంటున్నప్పటికీ, కోవిడ్-19 భయం ఇంకా తొలగిపోలేదు. ఇటీవల వెలుగు చూసిన కొత్త వేరియంట్ - ఆర్కుటురస్ కోవిడ్ వేరియంట్ ప్రజలు మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులను ఆందోళనకు గురి చేసింది. చాలా దేశాలు కోవిడ్-19 కు సంబంధించి వారి ప్రయాణ ప్రోటోకాల్స్‌ను సడలించినప్పటికీ, జాగ్రత్త మరియు హెచ్చరిక అనేవి మరొక వేవ్‌ను దూరంగా ఉంచడానికి మనకు సహాయపడగలవు. సమస్య ఏమిటంటే ఏదైనా కొత్త వేరియంట్ ఉద్భవిస్తే, అది గతంలో వచ్చిన రకాల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ఈ అనిశ్చితి అంటే మనం ఇంకా దేనికీ అవకాశం ఇవ్వలేము మరియు ప్రసారాన్ని నిరోధించడానికి ప్రాథమిక జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు, శానిటైజర్లు మరియు తప్పనిసరిగా శుభ్రం చేయడం ఇప్పటికీ మనకు ఆధారం కావాలి.
Whenever a new variant makes its presence felt, కోవిడ్ కేసులు in India and abroad increase rapidly highlighting the importance of vaccinations and booster doses. If you aren’t vaccinated yet, it’s high time you get the jab. Remember to take your booster doses on time too. International visits can be interrupted if you have not taken the requisite doses, as it is one of the mandates for overseas travel. Watch out for symptoms such as - cough, fever, fatigue, loss of smell or taste, and difficulty breathing, which could be a matter of concern and get checked at the earliest, especially if you are planning international travel or are at a foreign destination. Medical expenses in a foreign land can be expensive, so having the backing of international travel insurance can be of much help. HDFC ERGO’s international travel insurance policy ensures that you are protected if you catch COVID-19.
కోవిడ్-19 కోసం ట్రావెల్ మెడికల్ ఇన్సూరెన్స్ కింద ఏమి కవర్ చేయబడుతుందో ఇక్కడ ఇవ్వబడింది -
• హాస్పిటలైజేషన్ ఖర్చులు
• నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్స
• హాస్పిటలైజేషన్ సమయంలో రోజువారీ నగదు భత్యం
• మెడికల్ తరలింపు
• చికిత్స కోసం పొడిగించబడిన హోటల్ బస
• వైద్యపరమైన మరియు భౌతికకాయం తరలింపు
విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు, ఈ క్రింది విషయాలను పరిగణనలోకి తీసుకోండి:
విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందు, గమ్యస్థానాన్ని గురించి క్షుణ్ణంగా పరిశోధించవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది. ఈ విధంగా, మీరు స్థానిక నియమాలు మరియు నిబంధనల గురించి తెలుసుకోవచ్చు మరియు మీ సందర్శన సమయంలో వాటిని అనుసరించవచ్చు. మీరు అంతర్జాతీయ వెకేషన్‌లో ఉన్నప్పుడు అనవసరమైన ఇబ్బందిని నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది.
అంతర్జాతీయ వెకేషన్ కోసం మీ లగేజీని ప్యాక్ చేసేటప్పుడు, మీరు మీకు అవసరమైన అన్ని ట్రావెల్ డాక్యుమెంట్లను తీసుకువెళ్తున్నారని నిర్ధారించుకోండి. ఇందులో చెల్లుబాటు అయ్యే ఫోటో ID రుజువు, పాస్‌పోర్ట్, వీసా పేపర్లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, బుకింగ్ స్లిప్‌లు మొదలైనవి ఉంటాయి. అటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను భౌతిక మరియు/లేదా డిజిటల్ కాపీలలో తీసుకువెళ్ళవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
ఊహించని వెకేషన్ సాహసకరంగా అనిపించినప్పటికీ, అంతర్జాతీయ ట్రిప్ కొరకు ప్రతిదీ ముందుగానే ప్లాన్ చేయడం మరియు బుకింగ్ చేయడం సరైన మార్గం. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం, మీ వసతులు, విమానాలు, కార్యకలాపాలు మొదలైన వాటిని ముందుగానే బుక్ చేయడం, మీకు అవసరమైన మనశ్శాంతిని అందిస్తుంది.
రష్యా, షెన్‌గన్ దేశాలు, క్యూబా, UAE మొదలైనటువంటి అనేక దేశాలలో ప్రవేశానికి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి అవసరం అని గమనించండి. తప్పనిసరి అవసరం లేని USA వంటి దేశాలలో కూడా, దాని కవరేజ్ ప్రయోజనాల కారణంగా ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో పెట్టుబడి పెట్టడం ముఖ్యం అని సిఫార్సు చేయబడుతుంది. ఇది ఊహించని సంఘటనల నుండి మీ ట్రిప్‌కు ఆర్థికంగా రక్షణ కల్పిస్తుంది.
విదేశంలో ఉన్నప్పుడు, అధీకృత డీలర్ల నుండి మాత్రమే కరెన్సీని మార్పిడి చేయడం, నిర్జన ప్రదేశాలలోని ATMల నుండి డబ్బును విత్‍డ్రా చేయకపోవడం, మీ హోటల్ గది వెలుపలకి విలువైన వస్తువులను తీసుకెళ్లకపోవడం, లొకేషన్ మరియు సీజన్ ప్రకారం ప్యాకింగ్ చేయడం మొదలైనటువంటి సాధారణ భద్రతా చర్యలను అనుసరించండి.
స్థానిక అత్యవసర మరియు ముఖ్యమైన నంబర్ల సంప్రదింపు వివరాలను అందుబాటులో ఉంచుకోండి, ఇందులో ఆ విదేశీ దేశంలోని భారతీయ ఎంబసీ మరియు స్థానిక అగ్నిప్రమాద విభాగం, పోలీస్ విభాగం, అంబులెన్స్ సర్వీస్ మొదలైనవి ఉంటాయి.
భారతదేశం నుండి విదేశీ ప్రయాణం మీ బ్యాంక్ అకౌంట్ పై భారంగా ఉండవలసిన అవసరం లేదు. భారతదేశం నుండి తక్కువ ధరలో సందర్శించగలిగే అత్యంత ప్రజాదరణ పొందిన విదేశీ దేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
దేశం పేరు | భారతీయుల కోసం వీసా వివరాలు | సగటు రౌండ్-ట్రిప్ విమాన ఖర్చు | రోజువారీ బడ్జెట్ | ఉత్తమ ఆకర్షణలు | ట్రావెల్ ఇన్సూరెన్స్ చిట్కాలు |
---|---|---|---|---|---|
నేపాల్ | వీసా-రహిత ప్రవేశం ; చెల్లుబాటు అయ్యే ఫోటో ID అవసరం | ₹12,000 - 15,000 | ₹1,200 - 4,000 | పశుపతినాథ్ ఆలయం, స్వయంభునాథ్ ఆలయం, పోఖరా, లుంబిని, సాగర్‌మాతా నేషనల్ పార్క్, మస్టాంగ్ మొదలైనవి. | తప్పనిసరి కాదు, కానీ ఎక్కువగా సిఫార్సు చేయబడుతుంది. |
శ్రీలంక | ప్రీ-అప్రూవ్డ్ టూరిస్ట్ వీసా అవసరం | ₹22,000 - 30,000 | ₹2,000 - 4,000 | క్యాండీ, కొలంబో, ఎల్లా, సిగిరియా, బెంటోటా, నువార ఎలియా మొదలైనవి. | తప్పనిసరి కాదు, కానీ ఎక్కువగా సిఫార్సు చేయబడుతుంది. |
భూటాన్ | ఆ దేశానికి చేరుకోగానే జారీ చేయబడే ఎంట్రీ పర్మిట్‌తో వీసా-రహితం | ₹20,000 - 35,000 | ₹2,500 - 5,000 | థింఫు, పారో, పారో తక్త్సంగ్, పునాఖ, బుద్ధ డోర్డెన్మా మొదలైనవి. | ఇక పై తప్పనిసరి కాదు, కానీ ఇప్పటికీ ఎక్కువగా సిఫార్సు చేయబడుతుంది. |
థాయిలాండ్ | వీసా-రహిత ప్రవేశం (60 రోజుల వరకు పర్యాటకం కోసం) | ₹18,000 - 40,000 | ₹2,000 - 5,000 | పట్టాయ, ఫుకెట్, బ్యాంకాక్, ఫి ఫి ద్వీపాలు, క్రాబి, అయుతయ, కో సముయి మొదలైనవి. | తప్పనిసరి కాదు, కానీ ఎక్కువగా సిఫార్సు చేయబడుతుంది. |
వియత్నాం | ఇ-వీసా | ₹20,000 - 25,000 | ₹2,500 - రూ. 6,000 | హోయ్ అన్, హాలాంగ్ బే, హో చి మిన్హ్ సిటీ, హనోయ్, డా నాంగ్, ఫోంగ్ న్హా-కే బ్యాంగ్ నేషనల్ పార్క్ మొదలైనవి. | తప్పనిసరి కాదు కానీ ఎక్కువగా సిఫార్సు చేయబడుతుంది. |
2025 లో సందర్శించవలసిన అత్యంత ప్రజాదరణ పొందిన హాలిడే గమ్యస్థానాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
ర్యాంక్ | గమ్యస్థానం పేరు | ఎందుకు సందర్శించాలి | సందర్శించడానికి ఉత్తమ సమయం |
---|---|---|---|
1 | బాకు, అజర్బైజాన్ | అజర్బైజాన్ యొక్క గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వం గురించి లోతైన అవగాహన కోసం బాకును సందర్శించండి. దాని కీలక పర్యాటక ఆకర్షణలు మరియు వికసించే అడవి పువ్వులను అన్వేషించండి. | ఏప్రిల్ మరియు జూన్ మధ్య |
2 | టోక్యో, జపాన్ | మీ జపనీస్ పాప్ సంస్కృతి రిఫరెన్సులను అన్నిటినీ తిరిగి అనుభూతి చెందడానికి టోక్యో యొక్క నియాన్ మెట్రోపోలిస్‌ను సందర్శించండి. దాని ప్రతిష్టాత్మకమైన లొకేషన్లు, రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ మరియు మరిన్నింటిని అన్వేషించండి. | మార్చి & మే మరియు అక్టోబర్ & నవంబర్ మధ్య |
3 | ట్రోమ్సో, నార్వే | అద్భుతమైన ఫోర్డ్స్ మరియు నార్దర్న్ లైట్లను చూడటానికి నార్వేలోని అందమైన ట్రామ్సో నగరాన్ని సందర్శించండి. | అక్టోబర్ మరియు ఏప్రిల్ మధ్య |
4 | అల్-ఉలా, సౌదీ అరేబియా | KSAలో అల్-ఉలాను సందర్శించడం ద్వారా వెనుకటి కాలానికి వెళ్ళండి. ఆ ప్రాంతం యొక్క పురాతన సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని అన్వేషించండి, సరదా సాహసాలలో పాల్గొనండి, సహజ ఎడారి అందాన్ని మరియు మరిన్ని వాటిని ఆనందించండి. | నవంబర్ మరియు ఫిబ్రవరి మధ్య |
5 | క్రాబీ, థాయిలాండ్ | థాయిలాండ్‌లో అద్భుతమైన వేసవి సెలవులను అనుభూతి చెందడానికి మరియు దాని అద్భుతమైన దృశ్యాలు, వాటర్‌స్పోర్ట్స్ లభ్యత మరియు విలాసవంతమైన వాటర్‌ఫ్రంట్ రిసార్ట్‌ల కోసం క్రాబీని సందర్శించండి. | నవంబర్ మరియు మార్చి మధ్య |
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తున్న విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ యొక్క ప్రత్యేక ఫీచర్ దాని 24x7 ఇన్-హౌస్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ సేవలు, దీనికి అదనంగా 1 లక్ష+ నగదురహిత ఆసుపత్రుల విస్తృత నెట్‌వర్క్ కూడా అందించబడుతుంది
మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పై ప్రీమియం అనేది మీ గమ్యస్థానం మరియు మీ బస వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఖర్చును నిర్ణయించడంలో ఇన్సూర్ చేయబడిన వ్యక్తి వయస్సు మరియు వివిధ రకాల ప్లాన్‌లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
మీ పాలసీ కవర్ మీ ఇంటి దేశం యొక్క ఇమ్మిగ్రేషన్ కౌంటర్ నుండి ప్రారంభమవుతుంది మరియు మీరు సెలవు తర్వాత తిరిగి వచ్చి మీ ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాత ముగుస్తుంది. అందుకే మీరు విదేశాలలో ఉన్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయలేరు. అందువల్ల, ప్రయాణం ప్రారంభమైన తర్వాత కొనుగోలు చేయబడిన ట్రావెల్ ఇన్సూరెన్స్ చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించబడదు.
విదేశానికి చేరుకున్న తరువాత, మీరు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని, అప్పటికీ చెల్లుబాటులో ఉంటే, పొడిగించవచ్చు. అయితే, మీరు మీ ప్రస్తుత పాలసీని మాత్రమే పొడిగించగలరని గుర్తుంచుకోండి. మీరు లేనప్పుడు కొనుగోలు చేయలేరు.
అవును, మీరు చివరి నిమిషంలో కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవచ్చు. కాబట్టి అది మీరు బయలుదేరే రోజున మరియు మీరు ఇన్సూర్ చేయబడకపోయినా కూడా ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయవచ్చు.
అవును, మీరు విదేశాలలో ఉన్నప్పుడు వైద్యుల సహాయం కోరవచ్చు, ఎందుకంటే అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు వైద్య ఖర్చులను కవర్ చేస్తాయి.
మీరు షెన్గన్ దేశాలకు ప్రయాణిస్తున్నట్లయితే, వీసా పొందడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి. ఇది కాకుండా, వీసా పొందడానికి అనేక దేశాల కోసం తప్పనిసరి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉండాలి. అందువల్ల, ప్రయాణించడానికి ముందు ప్రతి దేశం యొక్క వీసా అవసరాన్ని తనిఖీ చేయడం మంచిది.
అవును, ఇంటి వద్ద అత్యవసర పరిస్థితులు, కుటుంబ సభ్యుల ఆకస్మిక మరణం, రాజకీయ గందరగోళం లేదా తీవ్రవాద దాడి వంటి ఊహించని పరిస్థితుల కారణంగా మీరు బయలుదేరే తేదీకి ముందు ప్రయాణాన్ని రద్దు చేసుకుంటే ట్రిప్ రద్దు కోసం మీరు రీఫండ్ పొందవచ్చు. పాలసీ రద్దు చేసిన తర్వాత అటువంటి పరిస్థితులలో మీ ప్రీమియం యొక్క పూర్తి రీఫండ్ సాధ్యమవుతుంది.
పొడిగింపులతో సహా మొత్తం పాలసీ వ్యవధి 360 రోజులకు మించకూడదు.
అవును, విదేశాలకు ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి ముందు ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవడం మంచిది. మీరు ట్రిప్ చేసే ప్రతిసారీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసే అవాంతరాల నుండి మిమ్మల్ని కాపాడే మల్టీ ట్రిప్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో వెళ్లడం ద్వారా మీరు అలా చేయవచ్చు మరియు ఇది ఖర్చు-తక్కువగా కూడా ఉంటుంది.
అవును, మీరు ఫ్లైట్ బుకింగ్ తర్వాత మీ బయలుదేరే రోజున కూడా విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయవచ్చు. అయితే, మీ హాలిడేని బుక్ చేసుకున్న 14 రోజులలోపు ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్‌ను కొనుగోలు చేయడం మంచిది.
మీరు మీ పాలసీని ఉచితంగా రీషెడ్యూల్ చేయవచ్చు; అయితే, పాలసీ పొడిగింపు ఖర్చుపై ప్రభావం చూపుతుంది. ఖర్చులో పెరుగుదల మీరు పొడిగించిన రోజుల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.
లేదు, మీరు షెడ్యూల్ చేయబడిన తేదీ కంటే ముందు భారతదేశానికి తిరిగి వస్తే మీకు పాక్షిక రీఫండ్ లభించదు.
అవును, ఇది దంత చికిత్స ఖర్చును కవర్ చేస్తుంది. అదనంగా, ప్రమాదవశాత్తు గాయం కారణంగా తలెత్తే $500* వరకు గల అత్యవసర డెంటల్ వర్క్ ఖర్చులను అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
అవును, విదేశాలలో షిప్ లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు కలిగే గాయానికి ఇది కవరేజీని అందిస్తుంది.
ఒక అత్యవసర వైద్య పరిస్థితి, ప్రమాదం లేదా గాయం కారణంగా మీరు మీ ప్రయాణం చివరి రోజున మీ బసను పొడిగించినట్లయితే. అలాంటి సందర్భంలో, మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా 7 నుండి 15 రోజులపాటు మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని పొడిగించవచ్చు.
అవును, భారతదేశానికి తిరిగి ప్రయాణించిన తర్వాత ఒక క్లెయిమ్ ఫైల్ చేయడం సాధ్యమవుతుంది. అయితే, అత్యవసర వైద్య పరిస్థితి లేదా డాక్యుమెంట్ల నష్టం వంటి ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగిన 90 రోజుల్లోపు, మీ ఇన్సూరర్ ద్వారా పేర్కొనబడినట్లయితే తప్ప, మీరు క్లెయిమ్ ఫైల్ చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోండి.
మీకు మెయిల్ చేయబడిన ఇన్సూరర్ సాఫ్ట్ కాపీ మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం రుజువుగా పనిచేయడానికి సరిపోతుంది. అయితే, మీ పాలసీ నంబర్‌ను నమోదు చేసుకోవడం మంచిది మరియు ముఖ్యంగా, మా 24-గంటల సహాయ టెలిఫోన్ నంబర్‌ను మీ వద్ద ఉంచుకోవడం మంచిది, తద్వారా మీరు దూరంలో ఉన్నప్పుడు మా సహాయం అవసరమైతే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు.
మీ ట్రిప్ సమయంలో ట్రావెల్, వైద్య సలహా మరియు సహాయం కోసం 24-గంటల అలారం సెంటర్‌లో గల మా ఎమర్జెన్సీ ట్రావెల్ అసిస్టెన్స్ భాగస్వామికి కాల్ చేయండి.
• ఇ-మెయిల్: travelclaims@hdfcergo.com
• టోల్ ఫ్రీ నంబర్ (ప్రపంచవ్యాప్తంగా): +80008250825
• ల్యాండ్‌లైన్ (ఛార్జ్ చేయదగినది):+91-120-4507250
గమనిక: దయచేసి కాంటాక్ట్ నంబర్‌ను డయల్ చేసేటప్పుడు దేశంకి చెందిన కోడ్‌ను జోడించండి.
ట్రావెల్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్వదేశంలోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ప్రారంభమవుతుంది మరియు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఇమ్మిగ్రేషన్ పూర్తయ్యే వరకు కొనసాగుతుంది.
అవును, మీరు కోవిడ్-19 ద్వారా ప్రభావితమై మరియు వైద్య నిపుణుల ద్వారా క్వారంటైన్‌లో ఉండవలసిందిగా సలహా ఇవ్వబడిన సందర్భంలో అయిన ట్రిప్ రద్దులను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కవర్ చేస్తుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 6 నెలల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం సింగిల్-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మరియు 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తుల కోసం వార్షిక మల్టీ-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందిస్తుంది.
అవును. సెలవులు (విశ్రాంతి)తో పాటు, ఉద్యోగం మరియు వ్యాపార/అధికారిక ప్రయోజనాల కోసం విదేశీ ట్రిప్‌ను ప్లాన్ చేసే వ్యక్తుల కోసం కూడా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది.
మీరు ఒకే ట్రిప్‌లో అనేక దేశాలను కవర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, మీరు వాటి కోసం ప్రత్యేక పాలసీలను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మీరు మీ ట్రిప్‌లో సందర్శించడానికి ప్లాన్ చేస్తున్న అన్ని దేశాలను ఎంచుకునే ఎంపికను పొందుతారు. వాటిని అన్నింటినీ ఎంచుకోవడం ద్వారా, మీరు ఆ ట్రిప్‌లో మీ మొత్తం ప్రయాణాన్ని కవర్ చేసే ఒకే పాలసీని పొందవచ్చు.
అవును. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌లో నగదురహిత మరియు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లు రెండింటినీ అందిస్తుంది.
లేదు. అన్ని విదేశీ ప్రయాణాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి కాదు. అయితే, చాలా దేశాలు ఎంట్రీ వీసా కోసం అప్లై చేసే పర్యాటకులకు దీనిని తప్పనిసరి అవసరంగా చేసాయి. ఉదాహరణకు, షెన్‌గన్ ప్రాంతంలోని 29 దేశాలు తమ టూరిస్ట్ వీసా కోసం అప్లై చేయడానికి ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేశాయి.
అవును. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను సీనియర్ సిటిజన్స్ కొనుగోలు చేయవచ్చు. మేము ప్రత్యేకంగా వృద్ధుల విదేశీ ప్రయాణాన్ని కవర్ చేయడానికి రూపొందించబడిన ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందిస్తాము. వాటి గురించి మరిన్ని వివరాలను ఇక్కడకనుగొనండి.
సాధారణంగా, అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు, మీరు ఎటువంటి మెడికల్ ఫిట్‌నెస్ రుజువును సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. ప్రయాణం చేయడానికి ముందు తప్పనిసరి హెల్త్ చెక్-అప్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోకు అవసరం లేదు. అయితే, పాలసీని కొనుగోలు చేసే సమయంలో, మీరు ముందు నుండి ఉన్న ఏదైనా వ్యాధి లేదా ఆరోగ్య పరిస్థితులను వెల్లడించాలి.
సింగిల్-ట్రిప్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఒక నిర్దిష్ట ప్రయాణాన్ని కవర్ చేసే ప్లాన్. దాని కవరేజ్ ఆ ఒక ట్రిప్‌కు పరిమితం చేయబడుతుంది మరియు పేర్కొన్న ట్రిప్ వ్యవధి ముగిసినప్పుడు గడువు ముగుస్తుంది.
అవి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ కింద వైద్య అత్యవసర-సంబంధిత కవరేజీలో భాగం. ఉదాహరణకు, వైద్య అత్యవసర పరిస్థితిలో, మీకు వైద్య తరలింపు అవసరమైతే, మిమ్మల్ని సమీప ఆసుపత్రికి తరలించడానికి అయ్యే ఖర్చుల కోసం పాలసీ చెల్లిస్తుంది. హాస్పిటలైజేషన్ తర్వాత మీ ట్రిప్‌ను కొనసాగించలేకపోతే, మిమ్మల్ని భారతదేశానికి తిరిగి పంపించడానికి అయ్యే ఖర్చులను కూడా ఇది చెల్లిస్తుంది.
అవును. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎంపిక చేసిన ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీల పై ఫ్రీ-లుక్ పీరియడ్‌ను అందిస్తుంది. అయితే, ఇది పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి ఉంటుందని గమనించండి. దీని గురించి మరిన్ని వివరాల కోసం, మా టోల్-ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా care@hdfcergo.comకు ఒక ఇమెయిల్ పంపడం ద్వారా మా నిపుణులను సంప్రదించండి.
లేదు. మీరు భారతదేశం నుండి అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, మీ ట్రిప్ ప్రారంభమయ్యే లోపు, అంటే మీరు భారతదేశం వదిలి వెళ్ళడానికి ముందు అలా చేయాలి. విదేశీ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం చాలా సులభం మరియు వేగవంతమైనది, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అధికారిక వెబ్‌సైట్ లేదా అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.