హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి కార్ ఇన్సూరెన్స్
ప్రీమియం ఇంత వద్ద ప్రారంభం ₹2072 ^

ప్రీమియం ప్రారంభ ధర

కేవలం ₹2094 వద్ద*
8000+ నగదురహిత గ్యారేజీలు

8000+ నగదురహిత

గ్యారేజీలు
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు ^

ఓవర్ నైట్

వాహనం మరమ్మత్తులు¯
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ – ప్రీమియం లెక్కించండి మరియు డబ్బు ఆదా చేసుకోండి

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్

మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రీమియంను తెలుసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మీరు కవర్ సంబంధిత ఊహించిన ఖర్చు గురించి తెలుసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితిలోనే కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్లు ఉపయోగపడతాయి. మీరు పాలసీని కొనుగోలు చేయడానికి లేదా రెన్యూవల్ చేయడానికి ముందు మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడానికి మిమ్మల్ని అనుమతించే ఆన్‌లైన్ సాధనాలుగా ఈ క్యాలిక్యులేటర్లు ఉపయోగపడతాయి. ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు మరియు వారి కస్టమర్లు ఇద్దరికీ ఒక ఉపయోగకరమైన సాధనంగా పరిగణించబడే ఈ క్యాలిక్యులేటర్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియంలను నిర్ణయించే సంక్లిష్టమైన ప్రక్రియను సులభతరం చేస్తుంది. మీ కారును కవర్ చేసే కారు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెల్లించే డబ్బును కారు ఇన్సూరెన్స్ ప్రీమియంగా సూచిస్తారు. కారు రకం, దాని తయారీ, మోడల్ మరియు వేరియంట్, IDV మరియు కవరేజ్ ప్రాధాన్యతలు లాంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ప్రీమియం లెక్కించబడుతుంది.

ఈ క్యాలిక్యులేటర్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు మరియు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన ప్రీమియంను కనుగొనడానికి ఉపయోగించవచ్చు. తద్వారా, అత్యంత పోటీకరమైన ప్రీమియం రేటును అందించే సరైన ప్లాన్‌ను మీరు ఎంచుకోవచ్చు. కాబట్టి, మీరు తెలివైన నిర్ణయం తీసుకోవడానికి ఇది అనుమతిస్తుంది, మీ అవసరాలు మరియు బడ్జెట్‌కు సరిపోయే సరైన కవరేజీని ఎంచుకోవడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది. కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి మనం చర్చించే సమయంలో, అది ఎలా నిర్ణయించబడుతుంది మరియు మీకోసం ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కనుగొనడంలో కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో చదవండి.

మీ కారును కవర్ చేసే కారు ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం మీరు ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌కు చెల్లించే డబ్బును కారు ఇన్సూరెన్స్ ప్రీమియంగా సూచిస్తారు. ప్రీమియం అనేది మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ రకం, మీరు ఇన్సూరెన్స్ చేస్తున్న కారు, మీ డ్రైవింగ్ చరిత్ర లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం ఎలా నిర్ణయించబడుతుంది?

కారు ఇన్సూరెన్స్ లెక్కింపు ఈ కింది వివిధ అంశాల ఆధారంగా నిర్ణయించబడుతుంది,

● మీరు ఎంచుకునే ఇన్సూరెన్స్ రకం

● మోడల్, ఇంజిన్ సామర్థ్యం, కారు వయస్సు, ఇంధన రకం, రిజిస్ట్రేషన్ స్థానం మొదలైన వాటితో సహా కారు మోడల్.

● కారు ధర

● యాడ్-ఆన్ కవర్ మీ కారును అన్నివిధాలా రక్షిస్తుంది. అయితే, ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అంటే ఏమిటి?

కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు చెల్లించవలసిన కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని లెక్కించడానికి మీకు సహాయపడే ఒక వేగవంతమైన ఆన్‌లైన్ సాధనం. మీ పేరు, మొబైల్ నంబర్, కారు మరియు నగరం వివరాలు మరియు ఇష్టపడే పాలసీ రకం వంటి వివరాలను మీరు ఇవ్వాలి. కార్ ఇన్సూరెన్స్ కోసం ప్రీమియం క్యాలిక్యులేటర్ మీకు తక్షణమే ఖచ్చితమైన ప్రీమియం మొత్తాన్ని అందిస్తుంది.

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించడంలోని ప్రాముఖ్యత

మీరు ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి లేదా రెన్యూ చేయడానికి ముందు, కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించాలని, కవరేజ్ ధరను అంచనా వేయాలని సిఫార్సు చేయబడుతుంది. అందుకు గల కొన్ని కారణాలు ఇలా ఉన్నాయి –

  • ఇది పాలసీ ధరను నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. ఆ విధంగా మీరు మీ బడ్జెట్‌లో ప్రీమియం కోసం ఒక కేటాయింపు చేయవచ్చు
  • మీరు యాడ్-ఆన్‌లను జోడించడం లేదా తీసివేయడంతో సరసమైన ప్రీమియంను కనుగొనవచ్చు, అత్యంత సముచితమైన IDVని ఎంచుకోవచ్చు.
  • మీరు ఉత్తమమైన డీల్‌ను అందించే పాలసీని కనుగొనడానికి, వివిధ ఇన్సూరెన్స్ సంస్థల కోట్‌లను సరిపోల్చవచ్చు. ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఆదా చేయడంలో సహాయపడుతుంది
  • యాడ్-ఆన్‌లు పాలసీ మొత్తం ప్రీమియాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో మీరు తెలుసుకోవచ్చు
  • ప్రీమియంలను పెంచే మోసపూరిత డీల్స్ నుండి ఇది ఒక రక్షణ సాధనంగా ఉపయోగపడుతుంది

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు

కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌లను ఉపయోగించడంతో మీరు పొందగల కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి –

మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉపయోగించేటప్పుడు అవసరమైన సమాచారం

కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ ఉపయోగించేటప్పుడు ఈ కింది సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోండి:

● మీ వాహనం తయారీ, మోడల్, వేరియంట్ మరియు ఇంధన రకం

● ఎక్స్-షోరూమ్ ధర

● రిజిస్ట్రేషన్ వివరాలు- నగరం మరియు కొనుగోలు సంవత్సరం

● మునుపటి పాలసీ వివరాలు (రెన్యూవల్ విషయంలో).

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ ‌ను ఎలా ఉపయోగించాలి?

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలి

కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం చాలా సులభం. దిగువ పేర్కొన్న దశలను అనుసరించండి మరియు మీ ప్రీమియంను తక్షణమే లెక్కించండి –

• కారు ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయండి

• మీ కారు మేక్, మోడల్, వేరియంట్, రిజిస్ట్రేషన్ సంవత్సరం మరియు లొకేషన్ వంటి వివరాలను అందించండి

• మీరు ఇప్పటికే ఉన్న మీ పాలసీని రెన్యూ చేస్తున్నట్లయితే, మునుపటి క్లెయిముల వివరాలను పేర్కొనండి. అలాగే, మునుపటి ఇన్సూరెన్స్ సంస్థ, పాలసీ నంబర్‌ను పేర్కొనండి

• మీకు కావలసిన పాలసీ రకాన్ని ఎంచుకోండి - థర్డ్ పార్టీ లేదా కాంప్రిహెన్సివ్

• 'సమర్పించు' లేదా 'లెక్కించు'పై క్లిక్ చేయండి, వెంటనే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ మరియు ప్రీమియం అమౌంట్ చూపబడుతుంది

• మీరు దీనిని సవరించవచ్చు IDV మరియు యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు

• చేసిన మార్పులను బట్టి ప్రీమియం అప్‌డేట్ చేయబడుతుంది

• మీరు యాడ్-ఆన్‌లను జోడించినట్లయితే ప్రీమియం పెరుగుతుంది. మీరు అందుబాటులో ఉన్న డిస్కౌంట్లను కూడా ఎంచుకోవచ్చు, ఇది ప్రీమియం అమౌంటును తగ్గిస్తుంది

మీరు కవరేజీని ఫైనలైజ్ చేసిన తర్వాత, GSTతో సహా చివరి ప్రీమియం మొత్తం చూపబడుతుంది. మీరు ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించి, తక్షణమే పాలసీని కొనుగోలు చేయవచ్చు.

మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

మీరు చెల్లించే కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే అనేక అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అంశాలు ప్రీమియంను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అలాంటి కారకాలు క్రింద చర్చించబడ్డాయి –

1
ఇన్సూరెన్స్ పాలసీ రకం
ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఫోర్-వీలర్ల కోసం రెండు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తుంది. థర్డ్-పార్టీ కవర్ కవర్ అనేది కనీస పాలసీ, ఇది మోటార్ వాహన చట్టం, 1988 ప్రకారం తప్పనిసరి మరియు థర్డ్-పార్టీ నష్టాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. సమగ్ర ఇన్సూరెన్స్ ఆల్-రౌండ్ రక్షణను అందిస్తుంది మరియు థర్డ్-పార్టీ నష్టంతో పాటు దొంగతనం, సహజ మరియు మానవ నిర్మిత దుర్ఘటనలు మరియు ప్రమాదాలకు కవరేజ్ అందిస్తుంది. ఇది అందించే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, థర్డ్-పార్టీ కవర్ కోసం పాలసీ ప్రీమియంతో పోలిస్తే, ఈ సమగ్ర కవర్ కోసం చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
2
కారు రకం మరియు పరిస్థితి
వివిధ కార్లకు వేర్వేరు విశిష్టతలు ఉంటాయి కాబట్టి, వాటి కోసం ఇన్సూర్ చేసే ఖర్చు కూడా భిన్నంగా ఉంటుంది. కారు ఇంజిన్ క్యూబిక్ సామర్థ్యం అనేది ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే నిర్ణయాత్మక అంశంగా ఉంటుంది. క్యూబిక్ సామర్థ్యం ఎక్కువగా ఉంటే, ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువగా ఉంటుంది. కారు క్యూబిక్ సామర్థ్యం ప్రకారం థర్డ్ పార్టీ లయబిలిటీ ప్రీమియంలు IRDAI ద్వారా సెట్ చేయబడినప్పటికీ, వాహనం వయస్సు, కారు మోడల్ రకం మరియు వాహనం తరగతి, రిజిస్ట్రేషన్ స్థలం, ఇంధన రకం మరియు కవర్ చేయబడిన మైళ్ల సంఖ్య ప్రీమియం ధరను కూడా ప్రభావితం చేస్తాయి.
3
కారు మార్కెట్ విలువ
కారు ప్రస్తుత ధర లేదా మార్కెట్ విలువ కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ప్రభావితం చేస్తాయి. కార్ మార్కెట్ విలువ అనేది కారు బ్రాండ్ మరియు దాని పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. వాహనం పాతది అయితే, డిప్రిసియేషన్ కారణంగా దాని విలువ తక్కువగా ఉంటుంది. ఇది కూడా తక్కువ ప్రీమియంలను సూచిస్తుంది
4
యాడ్-ఆన్ కవర్లు
కవరేజ్ పెంచడానికి యాడ్-ఆన్ కవర్‌లు సహాయపడతాయి కానీ, యాడ్-ఆన్‌ల సంఖ్య ఎక్కువైతే, ప్రీమియం అధికంగా ఉంటుంది. కాబట్టి, మీకు అవసరమని భావించే కవర్‌లు మాత్రమే ఎంచుకోండి.
5
కారులో సవరణలు చేయబడ్డాయి
కారు అందం మరియు పనితీరు మెరుగుపరచడం కోసం తమ కార్‌లకు యాక్సెసరీలు జోడించడానికి చాలామంది ప్రజలు ఇష్టపడతారు. అయితే, ఈ సవరణలు సాధారణంగా స్టాండర్డ్ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడవు, మరియు ఈ సవరణల కోసం మీరు ఒక యాడ్-ఆన్ కవర్ కొనుగోలు చేయాలి. అయితే, ఈ సవరణలను మీ ఇన్సూరెన్స్ పాలసీకి జోడించడం వలన ప్రీమియం మొత్తం పెరగవచ్చు. మీరు మీ కారును సవరించడానికి ప్లాన్ చేస్తే, దానిని ముందుగా మీ ఇన్సూరర్‌తో చర్చించవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.
6
రిజిస్ట్రేషన్ తేదీ మరియు లొకేషన్
రిజిస్ట్రేషన్ తేదీ కారు వయస్సును సూచిస్తుంది. కారు పాతది అయితే, దాని విలువ తక్కువగా ఉంటుంది కావున, ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ లొకేషన్ కూడా ప్రీమియం అమౌంటును ప్రభావితం చేస్తుంది. మెట్రో నగరాల్లో రిజిస్టర్ అయిన కార్లు నాన్-మెట్రో నగరాల్లో రిజిస్టర్ చేయబడిన కార్‌ల కన్నా ఎక్కువ ప్రీమియంలను కలిగి ఉంటాయి.
7
అందుబాటులో ఉన్న డిస్కౌంట్‌లు
కార్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వివిధ రకాల డిస్కౌంట్లను అనుమతిస్తాయి. అందుబాటులో ఉన్న డిస్కౌంట్లకు మీరు అర్హత కలిగి ఉంటే, ప్రీమియం తగ్గించబడుతుంది. మీరు కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు ప్రీమియంపై డిస్కౌంట్ పొందే అవకాశాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి.
8
మునుపటి క్లెయిములు
కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు, మీరు మునుపటి సంవత్సరంలో క్లెయిమ్‌ను కలిగి ఉన్నట్లయితే, రెన్యూవల్స్‌పై ప్రీమియంను పెంచుతారు. కావున, మీ క్లెయిమ్ అనుభవాన్ని బట్టి రెన్యూవల్ ప్రీమియం ఎక్కువగా ఉండవచ్చు. రెన్యూవల్ ప్రీమియంపై మునుపటి క్లెయిమ్ ప్రభావాన్ని చెక్ చేయడానికి, మీరు కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించండి
9
NCB అందుబాటులో ఉంది
మీరు మునుపటి పాలసీ సంవత్సరాలలో క్లెయిమ్‌లు చేయకపోతే నో క్లెయిమ్ బోనస్ (NCB) అందుబాటులో ఉంటుంది. బోనస్ రేటు 20% నుండి ప్రారంభమవుతుంది మరియు మీకు ఉన్న క్లెయిమ్-రహిత సంవత్సరాల సంఖ్యను బట్టి 50% వరకు వెళ్తుంది. మీరు నో క్లెయిమ్ బోనస్‌ను సేకరించినట్లయితే, రెన్యూవల్ ప్రీమియంపై మీకు సమానమైన డిస్కౌంట్ లభిస్తుంది. మీరు ఒక కొత్త ఇన్సూరర్‌తో వెళ్లినా, మీ NCB సరిగ్గా ఉంటుంది.
10
స్వచ్ఛంద మినహాయింపు ఎంపిక
స్వచ్ఛంద మినహాయింపు అంటే క్లెయిమ్‌లో కొంత భాగాన్ని మీరే స్వయంగా చెల్లించడం. ఒకవేళ, మీరు ఈ మినహాయింపును ఎంచుకుంటే, ఇన్సూరెన్స్ సంస్థకు క్లెయిమ్ బాధ్యత తగ్గుతుంది, వారు మీకు ప్రీమియం డిస్కౌంట్‌తో రివార్డును అందిస్తారు.
11
మునుపటి పాలసీ ల్యాప్స్ అవడం
మీ మునుపటి పాలసీ ల్యాప్స్ అయితే, రెన్యూవల్ సమయంలో, ఒక యాక్టివ్ పాలసీని రెన్యూ చేయడం కంటే ఇన్సూరర్ ఎక్కువ ప్రీమియం వసూలు చేయవచ్చు.
నగదురహిత గ్యారేజ్ నెట్‌వర్క్
8000+** నెట్‌వర్క్ గ్యారేజీలు
భారతదేశం వ్యాప్తంగా

మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఎలా తగ్గించుకోవాలి

మీరు మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తగ్గించుకోవడానికి గల మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఈ మార్గాలు కింది విధంగా ఉన్నాయి –

  • అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్ కొనుగోళ్లపై ప్రీమియం డిస్కౌంట్ అందిస్తున్నందున, కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి
  • మీ పాలసీని క్రమం తప్పకుండా రెన్యూ చేయండి మరియు కవరేజ్ లాప్స్‌తో ప్రీమియంలో పెరుగుదలను నివారించండి
  • డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయడానికి, మీ కారులో ARAI ద్వారా ఆమోదించబడిన భద్రతా పరికరాలను ఇన్‌స్టాల్ చేయండి
  • ప్రీమియం డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయడానికి, ఒక గుర్తింపు పొందిన ఆటోమొబైల్ అసోసియేషన్‌లో సభ్యునిగా మారండి
  • చిన్న వాటికి క్లెయిమ్‌లు చేయవద్దు. అవి నో క్లెయిమ్ బోనస్‌ను హరించివేస్తాయి, ఫలితంగా మీరు రెన్యూవల్‌పై డిస్కౌంటును కోల్పోతారు. అంతేకాకుండా, మీరు చిన్న క్లెయిమ్‌లు చేయనట్లయితే, మీ రెన్యూవల్స్‌పై క్లెయిమ్-ఆధారిత భారాన్ని కూడా నివారించవచ్చు
  • అవసరమైన యాడ్-ఆన్‌లను ఎంచుకోండి
  • ఇన్సూరెన్స్ సంస్థల నుండి అత్యుత్తమ డీల్‌ను కనుగొనడానికి పాలసీని సరిపోల్చండి, కొనుగోలు చేయండి
  • ఒకవేళ, మీ కారు పాతది అయి మరియు/ లేదా మీరు తరచుగా కారును ఉపయోగించనట్లయితే, థర్డ్ పార్టీ కవరేజీని మాత్రమే ఎంచుకోండి
  • ఒకవేళ, మీరు సురక్షితంగా డ్రైవ్ చేసి, ఎక్కువ క్లెయిమ్‌లు చేయనట్లయితే, మీరు స్వచ్ఛంద మినహాయింపును ఎంచుకోవచ్చు, ప్రీమియం డిస్కౌంట్‌ను క్లెయిమ్ చేయవచ్చు

కొత్త కార్ల కోసం కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ వినియోగం

కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది ఒక ఉచిత సాధనం. ఇది మీ కొత్త కార్ల కోసం ఒక ప్లాన్‌ను ఎంచుకునే సమయంలో ఇన్సూరెన్స్ ప్రీమియంను నిర్ధారించడంలో మీకు సహాయపడుతుంది. కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ ఒక వేగవంతమైన మరియు ఖచ్చితమైన లెక్కింపులను అందిస్తుంది, తద్వారా మీరు మీ బడ్జెట్‌కు అనుగుణంగా మీ కారు కోసం అత్యంత సముచితమైన పాలసీ మరియు యాడ్-ఆన్‌లను ఎంచుకోవచ్చు.

కారు ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ పాత కార్ల కోసం

మీ కారు ఇన్సూరెన్స్ ప్రీమియం ముఖ్యంగా కారు వయస్సు పై ఆధారపడి ఉంటుంది. కారు పాతది అయితే, ప్రీమియం తక్కువగా ఉంటుంది మరియు ఇన్సూరెన్స్ మొత్తం తక్కువగా ఉంటుంది. 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వాహనాల కోసం కొన్ని యాడ్ ఆన్ కవర్లు అందుబాటులో ఉండకపోవచ్చు. పాత కారు ఇన్సూరెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ప్రీమియం లెక్కించడానికి దశలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • రిజిస్ట్రేషన్ నంబర్, మునుపటి యాజమాన్య వివరాలు మొదలైనటువంటి కారు వివరాలను నమోదు చేయండి.
  • మీ మునుపటి ఇన్సూరర్ వివరాలు అడగబడవచ్చు
  • మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న పాలసీ రకాన్ని ఎంచుకోండి మరియు అవసరమైతే రైడర్లను జోడించండి
  • మీరు క్లెయిమ్ చేయగల నో క్లెయిమ్ బోనస్ ఏదైనా ఉంటే నమోదు చేయండి
  • మీ ప్రీమియం మొత్తం ఏ సమయంలోనైనా లెక్కించబడుతుంది.

కొత్త కార్ల కోసం కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్

పాత కారు ఇన్సూరెన్స్ ప్రీమియంతో పోలిస్తే కొత్త కారు కోసం ప్రీమియం మరియు ఇన్సూరెన్స్ మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది. కొత్త కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి కొత్త కార్ల కోసం కారు ఇన్సూరెన్స్ ప్రీమియంలను లెక్కించడానికి దశలు క్రింద ఇవ్వబడ్డాయి

● ఒకవేళ మీ వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే, మీరు రిజిస్ట్రేషన్ లొకేషన్‌ను పేర్కొనవచ్చు

● పాలసీ రకం మరియు అవసరమైతే ఏవైనా యాడ్-ఆన్‌లను ఎంచుకోండి

● తక్షణమే ప్రీమియం అమౌంటు స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.

సెకండ్‌హ్యాండ్ కార్లు కోసం కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్

అన్ని రకాల కార్ల కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ ఉపయోగించవచ్చు. కాబట్టి, సెకండ్-హ్యాండ్ లేదా గతంలో వేరొకరి యాజమాన్యంలోని కారుని మీరు కొనుగోలు చేస్తుంటే, కార్ ఇన్సూరెన్స్ ఖర్చు క్యాలిక్యులేటర్‌ను మీరు సులభంగా ఉపయోగించవచ్చు. ఈ ప్రాసెస్ అనేది కొత్త కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌కు సమానంగా ఉంటుంది. మీరు అనుసరించాల్సిన దశలు చూడండి:

  • కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌‌లోకి వెళ్లి కార్ వివరాలు పూరించండి. s రిజిస్ట్రేషన్ నంబర్, గతంలోని యాజమాన్య వివరాలు మొదలైన వివరాలను అందుబాటులో ఉంచుకోండి
  • గతంలోని ఇన్సూరర్ వివరాల కోసం మిమ్మల్ని అడగవచ్చు
  • మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న పాలసీ రకాన్ని ఎంచుకోండి
  • ఇవ్వబడిన పరిధి నుండి IDVని ఎంచుకోండి
  • మీకు అవసరమైన ఏవైనా రైడర్లను జోడించండి
  • గతంలోని మీ కారుకి సంబంధించి మీకు ఏదైనా నో క్లెయిమ్ బోనస్ ఉంటే, మీరు దానిని క్లెయిమ్ చేయవచ్చు
  • మీకు తక్షణమే ప్రీమియం మొత్తం కనిపిస్తుంది.

భారతదేశంలో కారు ఇన్సూరెన్స్ పాలసీల రకాలు

సాధారణంగా, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా నాలుగు రకాల కారు ఇన్సూరెన్స్ పాలసీలు అందించబడుతున్నాయి

1
థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్
ఇది భారత ప్రభుత్వం అమలు చేసిన మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం, భారతీయ రోడ్ల పై డ్రైవ్ చేయడానికి మీకు అవసరమయ్యే తప్పనిసరి ఇన్సూరెన్స్ కవర్. ఊహించని ప్రమాదం కారణంగా థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన ఏదైనా నష్టం లేదా డ్యామేజ్ అనేది మీ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా కవర్ చేయబడుతుంది.
2
స్టాండ్‌అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్
ఇప్పటికే థర్డ్-పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కవర్‌ను తీసుకోవచ్చు. మీ కారుకు జరిగిన నష్టాలు OD కవర్ కింద కవర్ చేయబడతాయి.
3
సమగ్ర కవర్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్‌లో థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ మరియు దాని ఓన్ డ్యామేజ్ కవర్ కలిగి ఉంటుంది. మీరు రైడర్‌లు/యాడ్-ఆన్‌ల పరంగా కూడా చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు.
4
కొత్త కార్ల కోసం కవరేజ్
ఈ ప్లాన్ కింద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఒక సంవత్సరానికి స్టాండ్అలోన్ ఓన్-డ్యామేజ్ కవరేజ్ మరియు 3 సంవత్సరాల కోసం థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ అందిస్తుంది. మీరు మీ పాలసీకి యాడ్-ఆన్‌లను కూడా చేర్చవచ్చు.

కారు కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్:

కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ అనేది థర్డ్-పార్టీ నష్టం, ఓన్ డ్యామేజ్ మరియు వివిధ యాడ్-ఆన్‌లతో సహా విస్తృత కవరేజీని అందిస్తుంది. ఇది మీకు నచ్చిన విధంగా ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది సుదీర్ఘమైన లెక్కింపులు మరియు వివిధ యాడ్-ఆన్‌ల ప్రభావాలను కూడా తెలియజేస్తుంది. కానీ చింతించకండి. ఇప్పుడు మీరు కారు ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించి మీ కాంప్రిహెన్సివ్ కారు ఇన్సూరెన్స్ ప్రీమియంను సులభంగా లెక్కించవచ్చు. కారు ఇన్సూరెన్స్ ఎలా లెక్కించబడుతుంది మరియు వివిధ రైడర్లు పాలసీ ప్రీమియంను ఎలా ప్రభావితం చేస్తాయి అనేది అర్థం చేసుకోవడంలో ఇది మీకు సహాయపడుతుంది, అదేవిధంగా ఇది మీకు తెలివైన నిర్ణయం తీసుకోవడంలో, ఉత్తమ ప్లాన్‌ను ఎంచుకోవడంలో సహాయపడుతుంది.

కారు థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్

మీ కారు కోసం అత్యంత ప్రాథమిక మరియు తప్పనిసరి ఇన్సూరెన్స్ ఒక థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్. ఇది థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి సంబంధించిన నష్టాలను మాత్రమే కవర్ చేస్తుంది. మీ బడ్జెట్‌లో ఒక కేటాయింపు కోసం ప్రీమియం అమౌంటును నిర్ణయించడానికి మీరు కారు ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు.

కారు ఇన్సూరెన్స్ రెన్యూవల్ కోసం ప్రీమియం అమౌంటును లెక్కించండి

రెన్యూవల్ సందర్భంలో ప్రీమియం మొత్తాన్ని లెక్కించడానికి కారు ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ అవసరం. ముఖ్యంగా ఇది వేగవంతమైనది, ఎక్కువ సమయాన్ని ఆదా చేస్తుంది. దీని కోసం మీరు ఎంతో సమయాన్ని వెచ్చించి ఉంటారు మరియు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎందుకనగా, రెన్యూవల్ ప్రీమియం లెక్కింపు కోసం అనేక అంశాలు పరిగణలోకి తీసుకోబడతాయి. ఈ సుదీర్ఘవంతమైన లెక్కింపులు చేయడం అనేది గందరగోళానికి గురిచేస్తుంది. మరోవైపు, కారు ఇన్సూరెన్స్ ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్, రెన్యూవల్ ప్రీమియంలు మరియు యాడ్-ఆన్‌లను ఖచ్చితంగా లెక్కించడంలో మీకు ఎల్లవేళలా సహాయపడుతుంది.

మీ కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని ఎలా తగ్గించాలి?

మీరు ఒక కారును కొనుగోలు చేసిన వెంటనే, దానిని రోడ్డు పైకి తీసుకెళ్లడానికి ముందుగా ఇన్సూరెన్స్‌ను పొందవలసి ఉంటుంది. మీ కారు కోసం విస్తృత కవరేజీని పొందడం ముఖ్యం అయినప్పటికీ, దిగువ ఇవ్వబడిన చిట్కాలు కారు ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తాన్ని తగ్గించడంలో మీకు సహాయపడగలవు:

1
అధిక తగ్గింపుల కోసం ఎంచుకోవడం
మీరు మీ డ్రైవింగ్ నైపుణ్యాల గురించి తగినంత ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లయితే, క్లెయిమ్ ప్రాసెస్ సమయంలో బిల్లులో కొంత శాతాన్ని భర్తీ చేయడానికి మీరు స్వచ్ఛంద మినహాయింపులను ఎంచుకోవచ్చు. మీరు ఎక్కువ మొత్తంలో మినహాయింపును ఎంచుకుంటే, మీరు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం తక్కువగా ఉంటుంది.
2
పాత కార్లలో కాంప్రిహెన్సివ్ కవర్‌ను నివారించండి
ప్రతి కారు కోసం కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు ఉత్తమమైనవి. అయితే, ఒకవేళ మీకు ఒక పాత కారు ఉన్నట్లయితే మరియు మీరు దానిని ఎక్కువగా ఉపయోగించకపోతే లేదా దానిని రిప్లేస్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, కాంప్రిహెన్సివ్ సంరక్షణను నివారించడానికి ఎంచుకోవచ్చు మరియు బదులుగా థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ కోసం వెళ్లవచ్చు. ఇంతకు ముందు చర్చించినట్లు, పరిమిత కవరేజీ కారణంగా థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా చవకగా ఉంటుంది.
3
రైడర్లు/యాడ్-ఆన్‌లను తెలివిగా ఎంచుకోండి
మీరు ఎక్కువ యాడ్-ఆన్‌లను ఎంచుకుంటే, మీకు మెరుగైన కవరేజీ అందుతుంది. అలాగే, అది ప్రీమియం మొత్తాన్ని కూడా పెంచుతుందని గుర్తుంచుకోండి. అందువల్ల, మీ అవసరాలను అంచనా వేయండి మరియు సంబంధిత యాడ్-ఆన్‌లను మాత్రమే జాగ్రత్తగా ఎంచుకోండి.
4
సకాలంలో పాలసీ రెన్యూవల్
ఎల్లప్పుడూ మీ కారు ఇన్సూరెన్స్‌ను సకాలంలో రెన్యూ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే, దానిని తిరిగి పునరుద్దరించడానికి మీరు జరిమానా ఫీజు చెల్లించవలసి వస్తుంది, మరిన్ని ఆలస్యాల విషయంలో, పాలసీలు రద్దు చేయబడతాయి, మరియు మీరు ఒక కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం వెళ్లాల్సిందిగా కోరబడతారు, దానికి మరింత ఖర్చు అవుతుంది. మీ ఇన్సూరర్ మీకు 15-30 రోజుల గ్రేస్ వ్యవధిని అందించగలిగినప్పటికీ, గ్రేస్ వ్యవధిలో లేవదీయబడిన క్లెయిములు అంగీకరించబడవని గుర్తుంచుకోండి.
5
NCBలను పొందండి
నో-క్లెయిమ్ బోనస్ లేదా NCB అనేది ఏడాది పొడవునా క్లెయిమ్ ఫైల్ చేయని పాలసీహోల్డర్లకు అందించే ఒక రివార్డు. ఈ రివార్డు మీ రెన్యూవల్ ప్రీమియం పై డిస్కౌంట్‌ రూపంలో అందించబడుతుంది, అది మీ ప్రీమియం అమౌంటును తగ్గిస్తుంది. కాబట్టి, చిన్న చిన్న క్లెయిమ్‌లను చేయడాన్ని నివారించండి.
6
భద్రతా పరికరాలను అమర్చండి
తమ కార్లలో భద్రతా పరికరాలను ఇన్‌స్టాల్ చేసే వ్యక్తులకు ఇన్సూరెన్స్ సంస్థ తక్కువ ప్రీమియంను రివార్డు రూపంలో అందిస్తుంది.
7
మంచి డ్రైవింగ్ రికార్డును నిర్వహించండి
మీరు ఒక మంచి డ్రైవర్ అయితే, మీ గత డ్రైవింగ్ రికార్డును పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ప్రొవైడర్లు ప్రీమియంపై కొంత డిస్కౌంట్‌ను అనుమతించవచ్చు.
8
కారు ఇన్సూరెన్స్ కోసం ఆన్‌లైన్‌లో వెళ్ళండి
అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు ఆన్‌లైన్ కొనుగోళ్లపై ప్రీమియం డిస్కౌంట్ అందిస్తున్నందున, కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి.
10
తెలివైన క్లెయిములు చేయండి
చిన్న వాటికి క్లెయిమ్‌లు చేయవద్దు. అవి నో క్లెయిమ్ బోనస్‌ను హరించివేస్తాయి, ఫలితంగా మీరు రెన్యూవల్‌పై డిస్కౌంటును కోల్పోతారు. అంతేకాకుండా, మీరు చిన్న క్లెయిమ్‌లు చేయనట్లయితే, మీ రెన్యూవల్స్‌పై క్లెయిమ్-ఆధారిత భారాన్ని కూడా నివారించవచ్చు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా కార్ ఇన్సూరెన్స్ పాలసీలను అన్వేషించండి

ఒక కార్ యజమానిగా మీ కార్ ఇన్సూరెన్స్ అవసరాలు ఇతరుల నుండి భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల, మేము వివిధ రకాల ప్లాన్లను తీసుకువస్తాము, తద్వారా మీరు మీ అవసరాలు మరియు మీ బడ్జెట్‌కు ఉత్తమంగా సరిపోయేది ఎంచుకోవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి కారు ఇన్సూరెన్స్ పాలసీలలో ఉండేవి:

24*7 కవర్

సమగ్ర కారు ఇన్సూరెన్స్

మీ ప్రియమైన కారును అన్ని రకాల సహజ మరియు మానవ నిర్మిత నష్టాల నుండి రక్షిస్తుంది. కవరేజీని మరింత మెరుగుపరచడానికి మీరు యాడ్-ఆన్‌లను కూడా చేర్చవచ్చు.

సరసమైన ప్రీమియం

థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్

చట్టం ప్రకారం తప్పనిసరి, థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు తలెత్తే బాధ్యతల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. చట్టపరమైన బాధ్యతల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా ఈ కవర్ ఉందని నిర్ధారించుకోండి.

సమగ్ర కవరేజ్

స్టాండ్‍అలోన్ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్

మీకు ఇప్పటికే థర్డ్-పార్టీ కవరేజ్ ఉండి, కానీ మీ స్వంత వాహనం కోసం అదనపు కవరేజ్ కోసం చూస్తున్నప్పుడు ఒక స్టాండ్అలోన్ పాలసీని ఎంచుకోండి.

మీ ప్రయాణం అంతటా సహాయం

సెకండ్‌హ్యాండ్/ పాత కారు ఇన్సూరెన్స్

పాత కారుకు సమాన రక్షణ అవసరం. సరైన రకమైన కార్ ఇన్సూరెన్స్‌తో దానిని సురక్షితం చేసుకోండి.

మనశ్శాంతి

సున్నా తరుగుదల కారు ఇన్స్యూరెన్స్

మీ కారు విలువ తరుగుదలలో జరిగిన నష్టం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. మీరు ఒక క్లెయిమ్ చేసినప్పుడు మీ స్వంత ఖర్చులను తగ్గించుకోండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా కారు ఇన్సూరెన్స్ యాడ్-ఆన్‌లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కారు ఇన్సూరెన్స్ పాలసీల కోసం ఈ కింది విభిన్న రకాల యాడ్-ఆన్‌లను అందిస్తుంది

మీ కవరేజీని పెంచుకోండి
● పే-యాజ్-యు-డ్రైవ్

ఈ యాడ్-ఆన్ కింద, కిలోమీటర్ స్లాబ్ ఆధారంగా నిర్ణయించిన మీ వినియోగం ఆధారంగా మీరు ప్రీమియం చెల్లిస్తారు.

సున్నా తరుగుదల

జీరో డిప్రిసియేషన్ యాడ్-ఆన్ కవర్ కింద ఇన్సూరెన్స్ ప్రొవైడర్, మీకు డిప్రిసియేషన్ మినహాయించకుండా పూర్తి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తారు.

ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కవర్

ఈ యాడ్-ఆన్ కింద, యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో కారు ఇంజిన్ లేదా గేర్‌బాక్స్‌కు జరిగిన ఏదైనా నష్టం మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ద్వారా కవర్ చేయబడుతుంది.

టైర్ సెక్యూర్ కవర్
టైర్ సెక్యూర్ కవర్

పేరు సూచిస్తున్నట్లుగా, టైర్ సెక్యూర్ కవర్ యాడ్-ఆన్ మీ కారు టైర్లకు ప్రమాదవశాత్తు జరిగిన నష్టం లేదా డ్యామేజీని కవర్ చేస్తుంది. కొన్ని నిర్దిష్ట పరిస్థితులలో టైర్ల పరిహారం మరియు/లేదా భర్తీని యాడ్-ఆన్ అనుమతిస్తుంది.

కారు ఇన్సూరెన్స్ యాడ్ ఆన్ కవరేజ్
రోడ్‍సైడ్ సహకారం

రోడ్ అసిస్టెన్స్ కవర్‌తో కారు బ్రేక్‌డౌన్ సందర్భంలో మీరు 24*7 రీఫ్యూయలింగ్ సర్వీస్, రిపేర్ సర్వీస్, టోయింగ్ మొదలైన సేవలను పొందుతారు.

రిటర్న్-టు-ఇన్వాయిస్

ఒకవేళ దొంగతనం కారణంగా మీరు మీ కారును పోగొట్టుకున్నట్లయితే లేదా రిపేరింగ్ చేయలేనంతగా మీ కారు దెబ్బతిన్నట్లయితే, రిటర్న్-టు-ఇన్వాయిస్ కవర్‌ను కలిగి ఉండటం వలన పన్నులు మరియు రిజిస్ట్రేషన్ ఖర్చుతో పాటు మీ ఇన్‌వాయిస్ అసలు విలువకు సమానమైన పరిహారాన్ని మీరు పొందవచ్చు.

నో క్లెయిమ్ బోనస్ రక్షణ

ఒకసారి మీరు క్లెయిమ్ చేసిన తర్వాత నో క్లెయిమ్ బోనస్ కోల్పోవచ్చు. కాబట్టి, మీ బోనస్‌ను సురక్షితంగా ఉంచుకోవడానికి, మీరు క్లెయిమ్ బోనస్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్‌ను కొనుగోలు చేయవచ్చు. దీంతో మీరు మీ నో-క్లెయిమ్ బోనస్‌ను కోల్పోకుండా సంవత్సరానికి 3 క్లెయిములను ఫైల్ చేసుకోవచ్చు.

వినియోగ వస్తువుల ఖర్చు
వినియోగ వస్తువుల ఖర్చు

మీ కారు నట్లు, బోల్టులు మొదలైనటువంటి అనేక చిన్న మరియు ముఖ్యమైన భాగాల నుండి తయారు చేయబడింది. ప్రమాదవశాత్తు నష్టం జరిగిన సందర్భంలో, ఈ చిన్న వస్తువులు కలిసి మీ ఖర్చులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి, ఎందుకంటే అవి సాధారణ కవర్ కింద కవర్ చేయబడవు. కన్జ్యూమబుల్ కవర్ యాడ్-ఆన్ అటువంటి ఖర్చులపై తిరిగి తగ్గించవచ్చు.

నగదురహిత గ్యారేజ్ నెట్‌వర్క్

కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌పై తాజా బ్లాగులను చదవండి

మీరు యూజ్డ్ టాటా హారియర్ కొనుగోలు చేయాలా? - మరింత తెలుసుకోవడానికి దీన్ని చదవండి!

మీరు యూజ్డ్ టాటా హారియర్ కొనుగోలు చేయాలా? - మరింత తెలుసుకోవడానికి దీన్ని చదవండి!

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 12, 2022న ప్రచురించబడింది
మీరు కలలుగన్న కారుగా హ్యుందాయ్ టక్సన్ ఉండవచ్చా? - కారు వివరాలను తెలుసుకోండి!

మీరు కలలుగన్న కారుగా హ్యుందాయ్ టక్సన్ ఉండవచ్చా? - కారు వివరాలను తెలుసుకోండి!

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 12, 2022న ప్రచురించబడింది
మీరు దీర్ఘకాలిక థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

మీరు దీర్ఘకాలిక థర్డ్-పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 08, 2022న ప్రచురించబడింది
సెడాన్ మరియు ఎస్‌యువి కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే 5 అంశాలు

సెడాన్ మరియు ఎస్‌యువి కోసం కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేసే 5 అంశాలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
సెప్టెంబర్ 07, 2022న ప్రచురించబడింది
భారతీయ కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఎయిర్‌బ్యాగులు కవర్ చేయబడతాయా?

భారతీయ కార్ ఇన్సూరెన్స్ పాలసీలలో ఎయిర్‌బ్యాగులు కవర్ చేయబడతాయా?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఆగస్ట్ 29, 2022 న ప్రచురించబడింది
టాటా పంచ్‌ను మరింత శక్తివంతం చేసేందుకు కొత్త అప్‌గ్రేడ్‌లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి

టాటా పంచ్‌ను మరింత శక్తివంతం చేసేందుకు కొత్త అప్‌గ్రేడ్‌లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఆగస్ట్ 26, 2022 న ప్రచురించబడింది
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

తరచుగా అడగబడిన ప్రశ్నలు


కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా అగ్రిగేటర్ వెబ్‌సైట్ల ద్వారా అందించబడే ఒక ఉచిత ఆన్‌లైన్ సాధనం. మోడల్, వేరియంట్, కవరేజ్ రకం మరియు వ్యక్తిగత సమాచారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీ ఖర్చును అంచనా వేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. మీకు కావలసిన విధంగా మీరు IDV (ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ) ను కూడా కస్టమైజ్ చేయవచ్చు.
అనేక ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లు లేదా ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ వెబ్‌సైట్‌లలో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్‌ను మీరు కనుగొనవచ్చు. వెబ్‌సైట్‌లు క్యాలిక్యులేటర్ సాధనాలను కలిగి ఉంటాయి, ఇక్కడ మీరు మీ కారు రిజిస్ట్రేషన్ నంబర్ లాంటి వివరాలు నమోదు చేయాలి. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో, మీరు మీ కారు కోసం వ్యక్తిగతీకరించిన ఇన్సూరెన్స్ కోట్‌ పొందడమే కాకుండా, ఉత్తమ కార్ ఇన్సూరెన్స్ సేవల కోసం పోటీ రేట్లను కూడా ఆస్వాదించవచ్చు. మీరు ఎంచుకున్న ప్రీమియం ప్లాన్‌ల ఆధారంగా క్యాలిక్యులేటర్ మీకు వివిధ ధరలు చూపించే అవకాశం ఉందని గమనించండి.
మీ వయస్సు, లింగం, డ్రైవింగ్ చరిత్ర, లొకేషన్, కార్ మోడల్, కవరేజ్ ఎంపికలు మరియు మినహాయింపులతో సహా అనేక అంశాలు కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను ప్రభావితం చేస్తాయి. సురక్షితమైన డ్రైవర్లు మరియు తక్కువ-రిస్క్ ప్రాంతాలు తక్కువ ప్రీమియంలను కలిగి ఉంటాయి.
కార్ మోడల్ అనేది వాహనం ధర, మరమ్మత్తు ఖర్చులు మరియు భద్రతా ఫీచర్లను ప్రతిబింబిస్తుంది కాబట్టి, అది మీ ఇన్సూరెన్స్ ప్రీమియంను ప్రభావితం చేస్తుంది. ఖరీదైన, అధిక-పనితీరు లేదా దొంగతనానికి గురికాగల కార్లు తరచుగా అధిక ప్రీమియంలకు దారితీస్తాయి. ఉదాహరణకు, స్పోర్ట్స్ కార్ల కోసం ప్రీమియంలనేవి వాటి స్టాండర్డ్ కౌంటర్‌పార్ట్స్ కంటే ఎక్కువ ఖర్చుతో ఉంటాయి. అంతేకాకుండా, ఎక్కువ ఇంజిన్ డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన వాహనాలు లేదా గ్యాస్ లేదా CNG ఇంధనంతో నడిచే వాహనాలు సాధారణంగా ఎక్కువ ఇన్సూరెన్స్ ప్రీమియంలకు దారితీస్తాయి.
కార్ ఇన్సూరెన్స్‌లో బేసిక్ ప్రీమియం అనేది యాడ్-ఆన్‌లు, డిస్కౌంట్లు లేదా సవరణలు లాంటి ఏవైనా అదనపు అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ముందు చెల్లించాల్సిన ప్రాథమిక ఖర్చుగా ఉంటుంది. ఇది మీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ప్రధాన ఖర్చుగా ఉంటుంది
అవును, మీ కారు లొకేషన్ అనేది ఇన్సూరెన్స్ ప్రీమియం రేటును ప్రభావితం చేయగలదు. వివిధ ఇన్సూరెన్స్ ధరలనేవి ఎవరైనా వాటిని క్లెయిమ్ చేసే అవకాశం మీద ఆధారపడి ఉంటాయి. గ్రామీణ పట్టణాలతో పోలిస్తే, పట్టణ నగరాల్లో ఎక్కువ మంది ప్రజలు మరియు కార్లు ఉంటాయి కాబట్టి, ఎక్కువ ట్రాఫిక్ మరియు ఎక్కువ ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ రద్దీ ప్రదేశాల్లోని అధిక రిస్క్‌ను కవర్ చేయడానికి, సాధారణంగా ఇన్సూరెన్స్ కోసం మరింత ఖర్చు అవుతుంది.
కార్ ఇన్సూరెన్స్ కొనుగోలు సమయంలో, ప్రీమియం గురించే కాకుండా, ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర రక్షణను నిర్ధారించుకోవడం కోసం కవరేజీ, మినహాయింపులు, కస్టమర్ సర్వీస్, క్లెయిమ్ ప్రాసెస్ మరియు ఇన్సూరర్ ఖ్యాతి గురించి తెలుసుకోండి. అంతేకాకుండా, మీ ప్రీమియంని తగ్గించుకోవడం కోసం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని ఎంచుకోవడమనేది మరమ్మత్తు ఖర్చులను గణనీయంగా చెల్లించడానికి దారితీస్తుంది. కాబట్టి, ఉత్తమ కవరేజీ కోసం సరైన రకమైన మోటార్ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోవాలి.
అవును, అలాంటి డిస్కౌంట్లు చాలా ఉన్నాయి. సురక్షితమైన డ్రైవింగ్, యాంటీ-థెఫ్ట్ పరికరాలు ఇన్‌స్టాల్ చేయడం, ఒక విశ్వసనీయ కస్టమర్‌గా ఉండడం లేదా బండిలింగ్ పాలసీల కోసం ఈ డిస్కౌంట్లు లభించగలవు. NCB, లేదా నో క్లెయిమ్ బోనస్ అనేది చాలా ఇన్సూరెన్స్ సంస్థలు అందించే ఒక డిస్కౌంట్‌గా ఉంటుంది. 5 సంవత్సరాల పాటు మీరు ఎలాంటి క్లెయిమ్‌ చేయకపోతే, మీ తదుపరి సంవత్సరం ప్రీమియంలో మీరు 50% తగ్గింపు పొందవచ్చు. మీరు మీ కార్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు కూడా ఆదా చేసుకోవచ్చు. ప్రీమియం గురించి సరైన అంచనా మరియు ఏదైనా ప్రస్తుత డిస్కౌంట్ పొందడం కోసం కార్ ఇన్సూరెన్స్ ఖర్చు క్యాలిక్యులేటర్‌‌ను ఉపయోగించండి.
మీ చెల్లించాల్సిన కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం మొత్తం తెలుసుకోవడానికి, చాలావరకు ఇన్సూరెన్స్ కంపెనీలు అందించే ఆన్‌లైన్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను మీరు ఉపయోగించవచ్చు. మా హోమ్ పేజీలో, కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్‌ను మీరు కనుగొనవచ్చు. ప్రీమియం అంచనా వేయడానికి కార్ మోడల్ రకం, లొకేషన్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఇతర వివరాలు లాంటివి నమోదు చేయండి.
కార్ ఇన్సూరెన్స్ క్యాలిక్యులేటర్ కోసం అవసరమైన వివరాల్లో మీ వ్యక్తిగత సమాచారం, కారు తయారీ తేదీ, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV), వినియోగ పద్ధతులు, కార్ రిజిస్ట్రేషన్ నంబర్, మోడల్, యాడ్-ఆన్ కవర్ల సంఖ్య, ఏదైనా NCB ఉంటే, మినహాయింపులు మరియు మీరు చేర్చాలనుకుంటున్న ఏవైనా అదనపు ఫీచర్లు లేదా యాడ్-ఆన్‌లు లాంటివి ఉంటాయి. అంతేకాకుండా, కారు వేరియంట్‌లు, ఇంధన రకాలు, వయస్సు మరియు లింగం మరియు RTO లొకేషన్ కూడా తప్పనిసరిగా చేర్చాలి.
భారతదేశంలో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియంలనేవి పెద్ద మొత్తంలో తేడాతో ఉండవచ్చు. కవరేజీ రకం, కార్ మోడల్, లొకేషన్, డ్రైవర్ వయస్సు మరియు క్లెయిమ్ చరిత్ర లాంటి అంశాల మీద ఈ ఛార్జీ ఆధారపడి ఉంటుంది. ఖచ్చితమైన అంచనా పొందడానికి, కార్ ఇన్సూరెన్స్ ఖర్చు క్యాలిక్యులేటర్‌‌ను ఉపయోగించడంతో పాటు మీ నిర్దిష్ట వివరాలు మరియు ప్రాధాన్యతల ఆధారంగా వివిధ ఇన్సూరెన్స్ సంస్థల నుండి కోట్‌లు పొందడం మంచిది.
భారతదేశంలో సమగ్ర కార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే, ప్రీమియంల కోసం నిర్ణీత ధర అనేది ఏదీ ఉండదు. మీ లొకేషన్, కార్ మోడల్ మరియు కవరేజీ లాంటి అంశాల ఆధారంగా కార్ ఇన్సూరెన్స్ ఖర్చు అనేది విస్తృతంగా మారవచ్చు.
12-నెలల ప్రీమియం కార్ ఇన్సూరెన్స్ అనేది ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీని సూచిస్తుంది. ఇది మీ వాహనానికి పూర్తి సంవత్సరం పాటు కవర్ అందిస్తుంది మరియు మీరు వార్షికంగా ఒకసారి మాత్రమే ప్రీమియం చెల్లిస్తారు. 12-నెలల కార్ ఇన్సూరెన్స్ పాలసీతో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, మీ రేటు అనేది పూర్తి సంవత్సరం కోసం ఫిక్స్ చేయబడి ఉంటుంది.
మీరు చెల్లించాల్సిన ప్రీమియం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. కవర్ రకం, ప్రస్తుత IDV, ఎంచుకున్న యాడ్-ఆన్‌లు మరియు మీరు పొందిన NCB లాంటివన్నీ మీ ప్రీమియంను ప్రభావితం చేయగలవు. 10 లక్షల కారు కోసం ఇన్సూరెన్స్ ఖర్చు అనేది ₹20,000 నుండి ₹40,000 వరకు ఉండవచ్చు. అయితే, మీరు చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన ఖచ్చితమైన అంచనా పొందడానికి మీరు కార్ ఇన్సూరెన్స్ ఖర్చు క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించాలి.
కార్ ఇన్సూరెన్స్‌ని చట్టపరమైన ఆదేశంగా మాత్రమే పరిగణించకూడదు. దానివల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి, అతి తక్కువ ప్రీమియం కోసం అన్వేషించడమనేది ఎల్లప్పుడూ ఉత్తమ విధానం కాకపోవచ్చు. అయితే, కార్ ఇన్సూరెన్స్ మీద అతి తక్కువ ప్రీమియంను పొందడానికి, క్లీన్ డ్రైవింగ్ రికార్డును నిర్వహించండి, అందుబాటులోని డిస్కౌంట్‌ల కోసం చూడండి, మీ మినహాయింపులను నమోదు చేయండి, చిన్న చిన్న అంశాల కోసం క్లెయిమ్ చేయడాన్ని నివారించండి, యాంటీ-థెఫ్ట్ పరికరాలను ఉపయోగించండి మరియు మీ నో-క్లెయిమ్ బోనస్‌ని ట్రాన్స్‌ఫర్ చేయండి. అదేసమయంలో, అన్నిచోట్లా అన్వేషించండి మరియు ధరలను సరిపోల్చండి.
అవును, మీరు మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ సమయంలో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్‌ను ఉపయోగించవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ ప్రస్తుత పాలసీని అంచనా వేయడానికి మరియు దానికి అవసరమైన ఏవైనా మార్పుల గురించి ఆలోచించడానికి మీకు సహాయపడుతుంది.
అందుబాటులోని ఇతర ఎంపికలతో మీ ప్రస్తుత ప్రీమియంను సరిపోల్చడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి, కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ ప్రీమియం క్యాలిక్యులేటర్ కీలకమైనది. ప్రతి సంవత్సరం మీ కవరేజీ కోసం ఉత్తమ విలువను పొందేలా ఇది నిర్ధారిస్తుంది. ప్రతి కారు యజమాని భిన్నంగా ఉంటారు మరియు వారి అవసరాలు కూడా భిన్నంగా ఉంటాయి. రెన్యూవల్ ప్రీమియం క్యాలిక్యులేటర్ అనేది మీ మారుతున్న అవసరాలు మరియు బడ్జెట్‌కు తగినట్లుగా మీ కవరేజీని కస్టమైజ్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

అవార్డులు మరియు గుర్తింపు

చివరిగా అప్‌డేట్ అయిన తేదీ: 2023-02-20

అన్ని అవార్డులను చూడండి