హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / మేక్ మరియు మోడల్ కోసం కార్ ఇన్సూరెన్స్ / హ్యుందాయ్ ఎలైట్ i20
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • యాడ్-ఆన్ కవర్లు
  • FAQs

హ్యూందాయ్ ఎలైట్ I20 కోసం కార్ ఇన్సూరెన్స్

భారతదేశపు రెండవ-అతిపెద్ద వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందిన సంస్థ, 2008లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో i20ని ప్రవేశపెట్టింది. భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగం ప్రారంభమవ్వడానికి ఇది ప్రధాన పాత్రను పోషించింది. సెకండ్-జనరేషన్‌లో ఇది ఇలైట్ i20గా రూపాంతరం చెందింది, నేడు భారతదేశంలో విక్రయించబడుతోంది, i20 ప్రీమియం స్టైలింగ్, విశాలమైన క్యాబిన్, ఫీచర్ల సుదీర్ఘమైన జాబితా మరియు ఇంజిన్ ఎంపిక కోసం ఆప్షన్‌లను అందిస్తుంది. ఇలైట్ i20 మీద హ్యుందాయ్ చేపట్టిన విస్తృతమైన డిజైన్ వర్క్ ఫలించింది, ఫలితంగా ఇది దాని విభాగంలో అత్యుత్తమంగా కనిపించే కార్లలో ఒకటిగా నిలిచింది.

హ్యుందాయ్ భారతదేశంలో i20 తో మూడు ఇంజిన్-గేర్‌బాక్స్ కలయికలను అందిస్తుంది - 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఒక 1.2-లీటర్ పెట్రోల్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌కు సరిపోయే 1.4-లీటర్ డీజిల్ మోటార్. హ్యుందాయ్ ఇటీవల భారతీయ మార్కెట్ సెన్సింగ్‌లో 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ప్రత్యేకంగా జత చేయబడిన మరింత శక్తివంతమైన 1.4-లీటర్ పెట్రోల్ మోటార్‌ను కూడా తిరిగి ప్రవేశపెట్టింది. భారతదేశంలో ఆటోమేటిక్ కార్ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తూ హుందాయ్ ఈ చర్యను చేపట్టింది. క్రింది మోటారుల క్లెయిమ్ చేయబడిన ఇంధన సామర్థ్య అంకెలు – 1.2-లీటర్, 1.4-లీటర్ పెట్రోల్ మరియు 1.4-లీటర్ డీజిల్ వరుసగా 18.6, 18.0 మరియు 22.5 km/l.

హ్యుందాయ్ i20ను ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7.0-inch ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యాపిల్ కార్‌ప్లే, మిర్రర్ లింక్ కనెక్టివిటీ ఆప్షన్‌లు, రివర్స్ కెమెరా మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల వంటి వివిధ పరికరాలతో కూడిన సమగ్ర జాబితాతో అందిస్తుంది.

ఎలైట్ i20 భారతదేశంలో అత్యధిక పోటీ ఉన్న ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలోకి వస్తుంది మరియు సుజుకి బాలెనో, ఫోక్స్‌వేగన్ పోలో, హోండా జాజ్ మరియు ఫియట్ పుంటో వంటి వాటితో పోటీపడుతుంది  కారు ఇన్సూరెన్స్ హ్యుందాయ్ ఎలైట్ i20 గురించిన మా ప్రత్యేక ప్లాన్, యాక్సిడెంట్ వంటి సందర్భాల్లో అవసరమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది.

 


 

హ్యుందాయ్ ఎలైట్ i20 కార్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడానికి గల కారణాలు

మా కారులో 80% క్లెయిములు అదే రోజున సెటిల్ చేయబడతాయి
మా 80% కారు క్లెయిమ్‌లు అదే రోజున సెటిల్ చేయబడతాయి
అద్భుతమైన కోట్‌లు కేవలం ఒక క్లిక్‌ దూరంలో ఉన్నప్పుడు, మరెక్కడో ఎందుకు చూడాలి?
నగదురహితంగా వెళ్లండి! 8000+ నగదురహిత గ్యారేజీలతో
నగదురహితంగా వెళ్లండి! 8000+ నగదురహిత గ్యారేజీలతో
దేశవ్యాప్తంగా విస్తరించబడిన 8000+ నెట్‌వర్క్ గ్యారేజీలు ఉన్నాయి, ఇది చాలా పెద్ద సంఖ్య కదా? ఇది మాత్రమే కాదు, IPO యాప్ మరియు వెబ్‌సైట్ ద్వారా కూడా క్లెయిమ్‌ రిజిస్టర్ చేయడానికి మేము మిమ్మల్ని అనుమతిస్తాము మరియు మేము మీ క్లెయిమ్‌లను 30* నిమిషాల్లోనే ఆమోదిస్తాము.
మీ క్లెయిమ్‌లను ఎందుకు పరిమితం చేయాలి? అపరిమితంగా వెళ్ళండి!
మీ క్లెయిమ్‌లను ఎందుకు పరిమితం చేయాలి? అపరిమితంగా వెళ్ళండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అపరిమిత క్లెయిమ్‌లకు అవకాశం ఇస్తుంది! మీరు జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తారని మేము విశ్వసిస్తున్నప్పటికీ, ఏదైనా క్లెయిమ్‌ను మీరు రిజిస్టర్ చేయాలనుకున్నప్పుడు మేము మిమ్మల్ని నిరోధించము.
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు
ఓవర్‌నైట్ కారు మరమ్మత్తు సేవలు
మేము సాయంత్రం నుండి తెల్లవారుజాము వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చిన్న చిన్న యాక్సిడెంటల్ నష్టాలను సరిచేస్తాము. మీరు సులభంగా మమ్మల్ని సంప్రదించవచ్చు; మేము మీ కారును రాత్రి సమయంలో పికప్ చేసుకుని, దాని మరమ్మత్తు పూర్తి చేసి, ఉదయానికి మీ ఇంటి వద్దకే దానిని డెలివరీ చేస్తాము.

చేర్చబడిన అంశాలు?

ప్రమాదాలు
ప్రమాదాలు

ప్రమాదాలు ఉహించలేనివి. యాక్సిడెంట్ కారణంగా మీ కారు దెబ్బతిందా? భయపడకండి! మేము దానిని కవర్ చేస్తాము!

అగ్నిప్రమాదం మరియు విస్పోటనం
అగ్నిప్రమాదం మరియు విస్పోటనం

బూమ్! అగ్నిప్రమాదం మరియు విస్ఫోటనం లాంటి ఘటనల్లో నిప్పు కారణంగా మీ కారుకు పాక్షికంగా లేదా పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లవచ్చు. చింతించకండి మేము దానిని పరిష్కరిస్తాము.

దొంగతనం
దొంగతనం

కార్ దొంగిలించబడిందా? చాలా బాధాకరమైన విషయం! మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మేము దాని కోసం కవరేజ్ అందిస్తాము!

విపత్తులు
విపత్తులు

భూకంపం, కొండచరియలు విరిగిపడడం, వరదలు, అల్లర్లు, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా జరిగే తీవ్రమైన ప్రమాదంతో మీకు ఇష్టమైన కార్ తీవ్రంగా దెబ్బతినవచ్చు. మరింత చదవండి...

పర్సనల్ యాక్సిడెంట్
పర్సనల్ యాక్సిడెంట్

మీకు ₹ 15 లక్షల ప్రత్యామ్నాయ వ్యక్తిగత యాక్సిడెంట్ పాలసీ ఉంటే, మీరు ఈ కవర్‌ను దాటవేయవచ్చు మరింత చదవండి...

థర్డ్ పార్టీ లయబిలిటీ
థర్డ్ పార్టీ లయబిలిటీ

మీ వాహనానికి ప్రమాదవశాత్తు నష్టం లేదా థర్డ్ పార్టీకి గాయాలు సంభవించినట్లయితే, మేము కింది సందర్భాల్లో పూర్తి కవరేజీని అందిస్తాము మరింత చదవండి...

ఏమి చేర్చబడలేదు?

డిప్రిసియేషన్
డిప్రిసియేషన్

కారు విలువలో తరుగుదలను మేము కవర్ చేయము.

ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్
ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ బ్రేక్‌డౌన్

ఏవైనా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్‌లు మా కార్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చట్టవిరుద్ధమైన డ్రైవింగ్
చట్టవిరుద్ధమైన డ్రైవింగ్

మీకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మీ కార్ ఇన్సూరెన్స్ ఉపయోగపడదు. డ్రగ్స్/మద్యం ప్రభావం కింద డ్రైవింగ్ చేసినట్లయితే, అది కార్ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి రాదు.

యాడ్ ఆన్ కవర్లు

జీరో డిప్రిషియేషన్ కవర్
జీరో డిప్రిసియేషన్ కవర్‌తో పూర్తి మొత్తాన్ని పొందండి!

సాధారణంగా, డిప్రిసియేషన్ మొత్తాన్ని తీసివేసిన తర్వాత మాత్రమే మీ పాలసీ మీకు క్లెయిమ్ మొత్తాన్ని చెల్లిస్తుంది. మీ పాలసీ వివరాలలో డిప్రిసియేషన్/తరుగుదల వివరాలు ఉంటాయి. కావున, పూర్తి మొత్తాన్ని పొందడానికి మీరు ఏమి చేయవచ్చు? ఇక్కడ ఒక మార్గం ఉంది! జీరో-డిప్రిసియేషన్ కవర్! జీరో డిప్రిసియేషన్‌తో, ఇక డిప్రిసియేషన్ కోతలు ఉండవు, మీరు పూర్తి మొత్తాన్ని పొందుతారు !


ఇది ఎలా పని చేస్తుంది? మీ కారు పాడైపోయి, క్లెయిమ్ మొత్తం ₹15,000 అయితే, పాలసీకి చెందిన అదనపు/మినహాయింపు మినహా మీరు డిప్రిసియేషన్ మొత్తంగా ₹7000 చెల్లించాల్సి ఉంటుందని ఇన్సూరెన్స్ కంపెనీ చెబుతోంది. ఒకవేళ, మీరు ఈ యాడ్‌ ఆన్‌ కవర్‌ను కొనుగోలు చేస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ పూర్తి అంచనా వేయబడిన మొత్తాన్ని చెల్లిస్తుంది. అయితే, పాలసీ ప్రకారం అదనపు/మినహాయింపును కస్టమర్ చెల్లించాలి, ఇది నామమాత్రంగా ఉంటుంది.
నో క్లెయిమ్ బోనస్ రక్షణ
మీరు మీ NCBని రక్షించుకోవడానికి ఒక మార్గం ఉంది

పార్క్ చేసిన వాహనానికి లేదా విండ్‌షీల్డ్ గ్లాస్‌కు ఏదైనా బాహ్య ప్రభావం వలన, వరదలు, మంటలు మొదలైన వాటి వల్ల కలిగే నష్టం కోసం క్లెయిమ్ చేసినట్లయితే, ఈ యాడ్ ఆన్ కవర్ మీరు ఇప్పటివరకు అర్జించిన నో క్లెయిమ్ బోనస్‌ను రక్షించడమే కాకుండా, తదుపరి NCB స్లాబ్‌కు కూడా తీసుకువెళుతుంది.


ఇది ఎలా పని చేస్తుంది? ఢీకొనడం లేదా ఏదైనా ఇతర విపత్తు కారణంగా మీ పార్క్ చేసిన కారు పాడైపోయే పరిస్థితికి చేరిందని ఊహించుకోండి, నో క్లెయిమ్ బోనస్ రక్షణ అదే సంవత్సరం మీ NCBని 20% భద్రంగా ఉంచుతుంది మరియు తదుపరి సంవత్సరం 25% స్లాబ్‌కు సాఫీగా తీసుకువెళుతుంది. ఈ కవర్ మొత్తాన్ని పాలసీ వ్యవధిలో 3 క్లెయిమ్‌ల వరకు పొందవచ్చు.
ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్
మేము మిమ్మల్ని కవర్ చేశాము!

మీ కారులోని ఏదైనా సాంకేతికత లేదా మెకానికల్ బ్రేక్‌డౌన్ సమస్యలను ఎదుర్కోవడానికి, మేము 24 గంటలూ మీకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నాము! ఎమర్జెన్సీ అసిస్టెన్స్ కవర్‌లో సైట్‌లో చిన్న రిపేరింగ్‌లు, లాస్ట్ కీ అసిస్టెన్స్, డూప్లికేట్ కీ సమస్య, టైర్ మార్పులు, బ్యాటరీ జంప్ స్టార్ట్‌లు, ఇంధన ట్యాంక్ ఖాళీ చేయడం, టోయింగ్ ఛార్జీలు ఉంటాయి! 


ఇది ఎలా పని చేస్తుంది? ఈ యాడ్ ఆన్ కవర్ కింద మీరు పొందగలిగే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు మీ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తున్నట్లయితే, ఏదైనా నష్టం జరిగితే, దానిని గ్యారేజీకి తీసుకువెళ్లాలి. ఈ యాడ్ ఆన్ కవర్‌తో, మీరు ఇన్సూరెన్స్ సంస్థకు కాల్ చేయవచ్చు, వారు మీరు అందించిన రిజిస్టర్డ్ అడ్రస్ నుండి 100 కి.మీల దూరంలో ఉన్న గ్యారేజీకి మీ వాహనాన్ని తీసుకువెళతారు.
రిటర్న్ టు ఇన్వాయిస్
IDV మరియు వాహనం ఇన్‌వాయిస్ విలువ మధ్య వ్యత్యాసం మొత్తాన్ని అందజేస్తుంది

మీ కారు దొంగిలించబడిందని లేదా పూర్తిగా డ్యామేజ్‌ అయిందని అనే మాట వినబడిన రోజు కన్నా బాధాకరమైన విషయం ఏముంటుంది? మీ పాలసీ ఎల్లప్పుడూ మీ వాహనం యొక్క IDV (ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ)ని మీకు చెల్లిస్తుంది. IDV వాహనం యొక్క ప్రస్తుత మార్కెట్ ధరకు సమానంగా ఉంటుంది. కానీ, ఇన్‌వాయిస్ యాడ్-ఆన్‌కు తిరిగి రావడంతో, మీరు ఇన్‌వాయిస్ విలువ మరియు IDV మధ్య వ్యత్యాసాన్ని కూడా పొందుతారు! మీరు FIR ఫైల్ చేయబడిందని, సంఘటన జరిగిన 90 రోజులలోపు కారును తిరిగి పొందలేదని నిర్ధారించుకోవాలి .


ఇది ఎలా పని చేస్తుంది? మీరు 2007లో వాహనాన్ని కొనుగోలు చేసినపుడు, కొనుగోలు ఇన్‌వాయిస్ ₹7.5 లక్షలుగా ఉంటే, రెండు సంవత్సరాల తర్వాత, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) ₹5.5 లక్షలు అవుతుంది మరియు తిరిగి రాని విధంగా పాడైపోయినా లేదా దొంగిలించబడినా, మీరు ఒరిజినల్ కొనుగోలు ఇన్‌వాయిస్ ధర ₹7.5 లక్షలు పొందుతారు. దీనికి అదనంగా, మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మరియు వర్తించే పన్నులు కూడా పొందుతారు. పాలసీ షెడ్యూల్ ప్రకారం అదనపు/తగ్గింపును మీరు భరించవలసి ఉంటుంది.
ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ప్రొటెక్టర్
వర్షాలు లేదా వరదల సమయంలో ఇంజిన్‌లోకి నీరు ప్రవేశించినప్పుడు మీ కారు ఇంజిన్ దెబ్బతినకుండా కాపాడుతుంది

వర్షాలు కురిసినా లేదా వరద అలలు ఎగసిపడినా, మీ వాహనం యొక్క గేర్‌బాక్స్, ఇంజిన్‌లు ప్రత్యేక రక్షణ కవచం ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కవరేజీతో సురక్షితం చేయబడతాయి! ఇది అన్ని చిన్న భాగాలు లేదా అంతర్గత భాగాల భర్తీ లేదా మరమ్మత్తు కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఇది లేబర్ ఖర్చులు, కంప్రెషన్ టెస్టుల ఖర్చులు, మెషిన్ ఛార్జీలు, ఇంజన్ సిలిండర్ రీ-బోరింగ్‌లను మరింత కవర్ చేస్తుంది.


ఇది ఎలా పని చేస్తుంది? ఒక వర్షాకాలపు రోజున జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఇంజిన్/గేర్ బాక్స్ పాడైపోయిందని ఉహించుకుందాం, అపుడు ఇంజిన్ ఆయిల్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కావున, అటువంటి పరిస్థితిలో మీరు వాహనం నడపడం కొనసాగిస్తే, ఇంజిన్ సీజ్ చేయబడుతుంది. అటువంటి నష్టం పర్యవసాన నష్టంగా మారుతుంది, అది ప్రామాణిక మోటారు ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడదు. ఈ యాడ్-ఆన్‌తో మీ కారు ఇంజన్ అంతర్గత భాగాలు, గేర్‌బాక్స్ సురక్షితంగా ఉంటాయి.
కీ రీప్లేస్‌మెంట్ కవర్
కీస్ పోగొట్టుకున్నారా / దొంగిలించబడ్డాయా? కీ రీప్లేస్‌మెంట్ కవర్ మీకు సహాయపడుతుంది!

మీ కీస్ దొంగిలించబడ్డాయా లేదా పోగొట్టుకున్నారా? వీలైనంత త్వరగా మీరు రీప్లేస్‌మెంట్ కీస్ పొందడానికి ఈ యాడ్-ఆన్ మీకు సహాయపడుతుంది!


ఇది ఎలా పనిచేస్తుంది? మీరు మీ కార్ కీలను కోల్పోయినా లేదా పోగొట్టుకున్నా, ఈ యాడ్-ఆన్ కవర్ ఒక రక్షకునిగా పనిచేస్తుంది.
వినియోగించదగిన వస్తువుల ధర

మీ కారులో ఉపయోగించే అన్ని వినియోగ వస్తువులను కవర్ చేసే వినియోగించదగిన వస్తువుల కవర్ ఇక్కడ ఇవ్వబడింది! అవును! మీకు ప్రస్తుతం ఇది అవసరం! నట్స్, బోల్టులు వంటి మళ్లీ ఉపయోగించడానికి వీలుకాని అన్ని వినియోగ వస్తువుల కోసం ఇది చెల్లిస్తుంది....


ఇది ఎలా పని చేస్తుంది? మీ కారు ప్రమాదానికి గురై, రిపేరింగ్స్ అవసరమైనట్లయితే, అలాంటి సందర్భంలో మీ కారును సరిచేయడానికి పునర్వినియోగించలేని వినియోగ వస్తువులను మళ్లీ కొనుగోలు చేయాల్సి రావచ్చు. వాషర్‌లు, స్క్రూలు, లూబ్రికెంట్‌లు, ఇతర నూనెలు, బేరింగ్‌లు, నీరు, రబ్బరు పట్టీలు, సీలెంట్లు, ఫిల్టర్లు మరియు మరెన్నో భాగాలు మోటారు ఇన్సూరెన్స్ కవరేజీ కింద కవర్ చేయబడవు మరియు ఇన్సూరెన్స్ చేసినవారే వాటిని భరించాలి. ఈ యాడ్ ఆన్ కవర్‌తో మేము అటువంటి వినియోగ వస్తువులకు చెల్లిస్తాము, మీకు సులభతరం చేస్తాము.
ఉపయోగం కోల్పోవడం - డౌన్‌టైమ్ రక్షణ

మీ కారు రిపేర్‌లో ఉన్నప్పుడు క్యాబ్స్ కోసం చెల్లించారా? డౌన్‌టైమ్ ప్రొటెక్షన్ ఇక్కడ ఉంది! రోజువారీ ప్రయాణం కోసం ఇతర రవాణా మార్గాలను ఉపయోగించడానికి కస్టమర్ చేసిన ఖర్చుకు క్యాష్ అలవెన్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది .


ఇది ఎలా పని చేస్తుంది? మీ వాహనం ప్రమాదానికి గురైంది, రిపేరింగ్ పనుల కోసం మాకు అందించబడింది! ఇప్పుడు, మీరు ప్రయాణించడానికి మీకు వాహనం లేకుండా పోయింది, ఫలితంగా క్యాబ్‌లకు ఎక్కువగా చెల్లించవలసి వస్తుంది! కానీ, వినియోగ నష్టం-డౌన్‌టైమ్ ప్రొటెక్షన్‌ క్యాబ్‌లపై చేసే అన్ని ఖర్చులను కవర్ చేయగలదని మీకు తెలుసా? అవును! ఇది పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఉంటుంది!
రెన్యూవల్ ప్రాసెస్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పై ఆన్‌లైన్‌లో మీ కార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ వేగవంతమైనది మరియు సులభమైనది. దీనికి అవసరం అయ్యే పేపర్‌వర్క్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఇక్కడ క్లిక్ చేయడం మరియు మీ గడువు ముగిసే పాలసీ వివరాలను ఆన్‌లైన్‌లో ఇవ్వడం, కొత్త పాలసీ వివరాలను చూడడం మరియు అనేక సెక్యూర్డ్ చెల్లింపు ఎంపికల ద్వారా తక్షణ ఆన్‌లైన్ చెల్లింపు చేయడం. అంతే!

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి హ్యుందాయ్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినప్పుడు సరళమైన విధానాలు, వేగవంతమైన పంపిణీ మరియు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. కాబట్టి, ఏదైనా ఊహించని దుర్ఘటన జరిగిన తర్వాత, మీరు సురక్షితంగా మరియు వెంటనే డ్రైవింగ్ చేయాలని అనుకుంటే, అప్పుడు మీ ఇన్సూరెన్స్ భాగస్వామిగా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోండి!

క్లెయిమ్స్ ప్రాసెస్

మీలో ఎక్కువ మందికి దీనిని అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. కానీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఈ అపోహను తొలగించింది. ఇది క్లెయిమ్ ప్రాసెస్‌ను వేగంగా, సులభంగా మరియు సరళంగా మార్చేసింది. మీరు చేయవలసిందల్లా, ఈ కంపెనీ మొబైల్ యాప్‌, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియో ఆర్గనైజర్ (IPO) లేదా టోల్ ఫ్రీ నంబర్ 022 6234 6234 ద్వారా మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవడం. క్లెయిమ్ ప్రాసెస్ గురించి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

కార్ ఇన్సూరెన్స్ సంబంధిత ఇతర కథనాలు
 

హ్యుందాయ్ ఎలైట్ i20 కార్ ఇన్సూరెన్స్ పై FAQలు

కారు ఇన్సూరెన్స్ అనేది మీ వాహనానికి ఆర్థిక నష్టం కలిగించే ఏదైనా నష్టం నుండి రక్షణ కల్పించడానికి అవసరమైన ఒక రకమైన ఇన్సూరెన్స్ పాలసీ. దీనికి అదనంగా, మీ వాహనం ఉపయోగించడం వల్ల ఉత్పన్నమయ్యే ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యత కారు ఇన్సూరెన్స్ క్రింద కవర్ చేయబడుతుంది. మోటార్ వాహన చట్టం ప్రకారం, బాధ్యత మాత్రమే కలిగిన పాలసీని కొనుగోలు చేయడం తప్పనిసరి, ఇది లేకుండా రోడ్డుపై వాహనాన్ని ఉపయోగించలేరు.
ఒక సమగ్ర ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా డీకొనడం వలన జరిగే నష్టం, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం మొదలైన వాటి వలన మీ వాహనానికి రక్షణను అందిస్తుంది. దీనితో పాటు, మరణం, శారీరక గాయం మరియు థర్డ్ పార్టీ ఆస్తి నష్టం విషయంలో ఏదైనా థర్డ్ పార్టీ బాధ్యతకు ఇది కవర్‌ను అందిస్తుంది.
చట్టం ప్రకారం, థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ మాత్రమే అవసరం, అది లేకుండా రోడ్డుపై వాహనాన్ని ఉపయోగించలేరు. అయితే, థర్డ్ పార్టీ లయబిలిటీ ఓన్లీ పాలసీ క్రింద, అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, తీవ్రవాదం మొదలైన వాటి కారణంగా మీ వాహనానికి ఏదైనా నష్టం కవర్ చేయబడదు మరియు అది భారీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అందువల్ల, థర్డ్ పార్టీ బాధ్యత నుండి రక్షణతో పాటు ఆర్థిక రక్షణను అందిస్తుంది కాబట్టి ఒక సమగ్ర కవర్ కొనుగోలు చేయమని సిఫార్సు చేయబడుతుంది.
రెండు రకాల కార్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి - సమగ్ర మరియు లయబిలిటీ ఓన్లీ పాలసీ
సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం, 1సెప్టెంబర్, 2018 నుండి ప్రతి కొత్త కారు యజమాని దీర్ఘకాలిక పాలసీని కొనుగోలు చేయాలి. మీ అత్యంత విలువైన వస్తువు కోసం మీరు క్రింది దీర్ఘకాలిక పాలసీల నుండి ఎంచుకోవచ్చు:
  1. 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం లయబిలిటీ ఓన్లీ పాలసీ
  2. 3 సంవత్సరాల పాలసీ వ్యవధి కోసం ప్యాకేజ్ పాలసీ
  3. 3 సంవత్సరాల లయబిలిటీ కవర్ మరియు 1 సంవత్సరం పాటు స్వంత నష్టానికి కవర్‌ లతో బండిల్డ్ పాలసీ
అవును, రోడ్డుపై తిరిగే ప్రతి మోటారు వాహనం కనీసం లయబిలిటీ ఓన్లీ పాలసీతో ఇన్సూరెన్స్ చేయబడాలి అని మోటార్ వాహన చట్టం పేర్కొంది.
జీరో డిప్రిసియేషన్ అనేది ఒక యాడ్-ఆన్ కవర్ మరియు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయాలి. ఇది డిప్రిసియేషన్‌తో సంబంధం లేకుండా మీ వాహనానికి పూర్తి కవరేజ్ అందిస్తుంది. ఉదాహరణకు, మీ వాహనం బాగా దెబ్బతిన్నట్లయితే, మీరు ఎటువంటి డిప్రిసియేషన్ ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు, పాలసీ యొక్క నిబంధనలు మరియు షరతులకు లోబడి పూర్తి క్లెయిమ్ మొత్తానికి అర్హులు.
ఎమర్జెన్సీ సహాయం అనేది ఒక యాడ్-ఆన్ కవర్ మరియు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా కొనుగోలు చేయాలి. ఇది బ్రేక్‌డౌన్, టైర్ రీప్లేస్‌మెంట్, టోయింగ్, ఫ్యూయల్ రీప్లేస్‌మెంట్ మొదలైన సందర్భాల్లో సహాయం వంటి బహుళ ప్రయోజనాలను కలిగి ఉంది, వీటిని పాలసీ వ్యవధిలో పొందవచ్చు. ఈ ప్రయోజనాలను పొందడానికి పాలసీలో పేర్కొన్న కస్టమర్ కేర్ నంబర్‌కు కస్టమర్లు కాల్ చేయాలి.
చాలా సులభంగా, క్లెయిమ్-రహిత సంవత్సరం తర్వాత మీ పాలసీని రెన్యూ చేసేటప్పుడు చెల్లించవలసిన స్వంత డ్యామేజ్ ప్రీమియంలో ఇది ఒక డిస్కౌంట్. ఇది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయడానికి, ప్రమాదాలను నివారించడానికి ఒక ప్రోత్సాహకం.
అన్ని రకాల వాహనాలుఓన్ డ్యామేజ్ ప్రీమియంపై % తగ్గింపు
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి పూర్తి సంవత్సరంలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు20%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 2 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు25%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 3 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు35%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 4 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు45%
ఇన్సూరెన్స్ యొక్క మునుపటి 5 వరుస సంవత్సరాలలో ఎటువంటి క్లెయిమ్ చేయబడలేదు లేదా ఏ క్లెయిమ్ పెండింగ్‌లో లేదు50%
మీరు మీ గడువు ముగిసిన పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసి, డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి, ఒకసారి డాక్యుమెంట్‌లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆమోదించబడిన తర్వాత, ఒక చెల్లింపు లింక్ పంపబడుతుంది మరియు మీరు పాలసీని రెన్యూ చేయడానికి చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయబడిన తర్వాత, మీరు పాలసీ కాపీని అందుకుంటారు.
మునుపటి పాలసీ గడువు తేదీ నుండి 90 రోజుల వరకు నో క్లెయిమ్ బోనస్ చెల్లుతుంది. పాలసీ 90 రోజుల్లోపు రెన్యూ చేయబడకపోతే, నో క్లెయిమ్ బోనస్ 0% అవుతుంది మరియు రెన్యూ చేయబడిన పాలసీకి ఎటువంటి ప్రయోజనం అందజేయబడదు.
వాహనం యొక్క ఇన్సూర్డ్ డిక్లేర్డ్ విలువ (IDV) 'ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం'గా పరిగణించబడుతుంది, ప్రతి ఇన్సూరెన్స్ చేయబడిన వాహనానికి ప్రతి పాలసీ వ్యవధి ప్రారంభంలో ఇది నిర్ణయించబడుతుంది.
వాహనం యొక్క IDV అనేది బ్రాండ్ యొక్క తయారీదారు జాబితా చేసిన అమ్మకం ధర మరియు ఇన్సూరెన్స్/ రెన్యూవల్ ప్రారంభంలో ఇన్సూరెన్స్ కోసం ప్రతిపాదించిన వాహనం మోడల్ ఆధారంగా నిర్ణయించబడుతుంది మరియు డిప్రిసియేషన్ కోసం సర్దుబాటు చేయబడుతుంది (క్రింద పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం). IDV అనేది సైడ్ కార్(లు) మరియు/లేదా యాక్సెసరీలు వాహనానికి అమర్చబడి ఉంటే, కానీ తయారీదారు జాబితా చేసిన వాహనం యొక్క అమ్మకం ధరలో చేర్చబడకపోతే కూడా అదే విధంగా నిర్ణయించబడుతుంది.
వాహనం యొక్క వయస్సుIDV నిర్ణయించడానికి % లో డిప్రిసియేషన్
6 నెలలకు మించనిది5%
6 నెలలకు మించి కానీ 1 సంవత్సరం మించనిది15%
1 సంవత్సరం మించి కానీ 2 సంవత్సరాలు మించనిది20%
2 సంవత్సరాలు మించి కానీ 3 సంవత్సరాలు మించనిది30%
3 సంవత్సరాలు మించి కానీ 4 సంవత్సరాలు మించనిది40%
4 సంవత్సరాలు మించి కానీ 5 సంవత్సరాలు మించనిది50%
పేపర్ వర్క్, భౌతిక డాక్యుమెంటేషన్ అవసరం లేదు మరియు మీరు మీ పాలసీని తక్షణమే పొందుతారు.
కేవలం ఒక ఎండార్స్‌మెంట్‌ను పాస్ చేయడం ద్వారా మీ ప్రస్తుత ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలుదారు పేరు మీదకు బదిలీ చేయవచ్చు. అయితే, ప్రస్తుత పాలసీ కింద ఎండార్స్‌మెంట్ జారీ చేయడానికి సేల్ డీడ్/ఫారం 29/30/విక్రేత యొక్క NOC/NCB రికవరీ లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
లేదా
మీరు మీ ప్రస్తుత పాలసీని రద్దు చేయవచ్చు. పాలసీని రద్దు చేయడానికి సేల్ డీడ్/ఫారం 29/30 లాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
ఇప్పటికే ఉన్న ఇన్సూరర్ ద్వారా జారీ చేయబడిన NCB రిజర్వింగ్ లెటర్ ఆధారంగా ఇప్పటికే ఉన్న వాహనాన్ని విక్రయించాలి. NCB రిజర్వింగ్ లెటర్ ఆధారంగా, ఈ ప్రయోజనాన్ని కొత్త వాహనానికి బదిలీ చేయవచ్చు
ఇన్సూరెన్స్ బదిలీ కోసం మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్లతో ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్లలో విక్రేత యొక్క సేల్ డీడ్/ఫారం 29/30/NOC, పాత RC కాపీ, బదిలీ చేయబడిన RC కాపీ మరియు NCB రికవరీ ఉంటాయి.
మీరు మీ గడువు ముగిసిన పాలసీని ఆన్‌లైన్‌లో సులభంగా రెన్యూ చేసుకోవచ్చు. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి సెల్ఫ్ ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి, ఒకసారి డాక్యుమెంట్లు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఆమోదించబడిన తర్వాత, చెల్లింపు లింక్ పంపబడుతుంది, మీరు పాలసీ రెన్యూవల్ కోసం చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు చేయబడిన తర్వాత, మీరు పాలసీ కాపీని అందుకుంటారు.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్లో లేదా వారికి ఒక కాల్ చేయడం ద్వారా క్లెయిమ్‌ నమోదు చేయవచ్చు సెంటర్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్లో లేదా వారికి ఒక కాల్ చేయడం ద్వారా క్లెయిమ్‌ నమోదు చేయవచ్చు సెంటర్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ యాప్ ద్వారా చేయవచ్చు
ఓవర్‌నైట్ మరమ్మత్తు సౌకర్యంతో, చిన్న నష్టాల మరమ్మత్తు ఒక రాత్రిలో పూర్తి చేయబడుతుంది. సదుపాయం అనేది ప్రైవేట్ కార్లు మరియు ట్యాక్సీలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఓవర్‌నైట్ మరమ్మత్తు సౌకర్యం కోసం ప్రక్రియ క్రింద పేర్కొనబడింది
  1. కాల్ సెంటర్ లేదా హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మొబైల్ అప్లికేషన్ (IPO) ద్వారా క్లెయిమ్ తెలియజేయబడాలి.
  2. మా బృందం కస్టమర్‌ని సంప్రదించి, డ్యామేజ్ అయిన వాహన ఫోటోల కోసం అభ్యర్థిస్తుంది.
  3. 3 ప్యానెల్‌లకు పరిమితమైన నష్టాలు ఈ సర్వీస్ క్రింద అంగీకరించబడతాయి.
  4. వర్క్‌షాప్ అపాయింట్‌మెంట్ మరియు పికప్ అనేవి వాహన భాగం మరియు స్లాట్ లభ్యతకు లోబడి ఉంటాయి కాబట్టి వాహనం వెంటనే రిపెయిర్ చేయబడదు.
  5. గ్యారేజీకి వెళ్లి రావడానికి పట్టే డ్రైవింగ్ సమయాన్ని కస్టమర్ ఆదా చేస్తారు.
  6. ప్రస్తుతం ఈ సేవ ఢిల్లీ, ముంబై, పూణే, నాగ్‌పూర్, సూరత్, వడోదర, అహ్మదాబాద్, గుర్గావ్, జైపూర్, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా మరియు బెంగుళూరు వంటి 13 ఎంపిక చేయబడిన నగరాల్లో అందుబాటులో ఉంది.
అవార్డులు మరియు గుర్తింపు
x