MOTOR INSURANCE
Premium starting at Just ₹2094*

ప్రీమియం ప్రారంభం

కేవలం ₹2094 వద్ద*
9000+ Cashless Network Garages ^

9000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Overnight Car Repair Services ^

ఓవర్‌నైట్ కార్

రిపెయిర్ సర్వీసెస్
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / మోటార్ ఇన్సూరెన్స్ / కార్ ఇన్సూరెన్స్ / మేక్ మరియు మోడల్ కోసం కార్ ఇన్సూరెన్స్ / టొయోటా-పాతది / ఇన్నోవా క్రిస్టా
మీ కార్ ఇన్సూరెన్స్ కోసం త్వరిత కోట్

10pm కంటే ముందు నన్ను సంప్రదించడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌కు నేను అధికారం ఇస్తున్నాను. నా NDNC రిజిస్ట్రేషన్‌ను ఈ సమ్మతి ఓవర్‌రైడ్ చేయడానికి నేను అంగీకరిస్తున్నాను.

Call Icon
సహాయం కావాలా? మా నిపుణులతో మాట్లాడండి 022-62426242

టొయోటా ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

Toyota Innova Crysta Car Insurance

చాలామందికి నచ్చిన క్వాలీస్ స్థానంలో 2005లో ఇన్నోవా అందుబాటులోకి వచ్చింది. ఈ కాంపాక్ట్ MPVని చూసిన వెంటనే భారతీయులు దీని ప్రేమలో పడిపోయారు, హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కాని ఒక కారు కోసం ఇలాంటి ప్రేమ వ్యక్తం కావడం అరుదైన విషయం. భారతీయ మార్కెట్లో ఇది మొట్టమొదటి మూడు-వరుసల సీట్లు కలిగిన కారుగా ఉంటోంది, అందుకే, ఇది ఇంతలా విజయవంతం కావడం ఆశ్చర్యమేమీ అనిపించదు.

మరిన్ని ప్రీమియం ఇంటీరియర్ మరియు విలాసవంతమైన ఫీచర్‌లతో రెండవ-తరం ఇన్నోవా క్రిస్టా 2016లో అందుబాటులోకి వచ్చింది. రీడిజైన్ చేయబడిన గ్రిల్ మరియు బంపర్, అలాయ్ వీల్స్ మరియు ఇతర సూక్ష్మమైన ఇంటీరియర్ మెరుగుదలలతో 2020లో ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిఫ్ట్ చేయబడింది.

టొయోటా ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ఆఫర్‌లు

ఇన్నోవా క్రిస్టా అనేది ఎక్కువ మంది ఇష్టపడే MPV. ఇది కుటుంబం మొత్తానికి ఒక విలాసవంతమైన ప్రయాణం అందిస్తుంది. మీ వద్ద ఇన్నోవా ఉంటే, మీ కుటుంబం పెద్దదై ఉండే అవకాశం ఉంది కాబట్టి, వారందరి భద్రత అనేది ఒక ప్రధాన ఆందోళనగా ఉంటుంది. ఇన్నోవాలో డ్రైవర్ మరియు ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగులు కూడా ఉన్నప్పటికీ, ఏదైనా దురదృష్టకరమైన సంఘటన నుండి మీకు మరియు మీ కారుకు పటిష్టమైన రక్షణ కోసం కార్ ఇన్సూరెన్స్ పాలసీ తప్పనిసరి. మీ కోసం ఈ క్రింది ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

ఇన్నోవా కోసం ఒక సంవత్సరం సమగ్ర ఇన్సూరెన్స్ సొంత డ్యామేజీ కవర్ మరియు థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్‌తో ఏటా రెన్యూవల్ చేసేలా అందుబాటులో ఉన్న ఈ పాలసీ యాక్సిడెంటల్ డ్యామేజీ, దొంగతనం, మరియు సహజ మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల కారణంగా ఏర్పడే డ్యామేజీల నుండి మిమ్మల్నిఆర్థికంగా రక్షిస్తుంది. అలాగే, ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సమయంలో, మీ చికిత్స కోసం అయ్యే ఖర్చులకు ఇబ్బంది లేకుండా ₹15 లక్షలతో వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ కూడా అందిస్తుంది.

X
ఆల్-రౌండ్ రక్షణ కోరుకునే కారు ప్రేమికులకు అనువైన ఈ ప్లాన్, క్రింది అంశాలను కవర్ చేస్తుంది:

ప్రమాదం

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

మరిన్ని అన్వేషించండి
X
కారును తరచుగా ఉపయోగించే వారికి అనువైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ఒక సమగ్రమైన కవర్‌లో ఇది ఒక భాగంగా లభించడమే కాకుండా, మీ వాహనం కోసం మీ వద్ద ఇప్పటికే థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే, దీనిని ఒక ఒంటరి పాలసీగా కూడా కొనుగోలు చేయవచ్చు. యాక్సిడెంట్ లేదా ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తుల ఫలితంగా మీ స్వంత వాహనానికి జరిగిన నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. తిరిగి పొందలేని దొంగతనం జరిగిన సందర్భంలో మీకు ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (IDV) అందించే దొంగతనం కవర్‌తో కూడా ఇది వస్తుంది.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

అగ్ని

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

ఇది అత్యంత సిఫార్సు చేయబడిన పాలసీ మరియు కొత్త వాహనం కొనుగోలు సమయంలో దీనిని మీరు తప్పకుండా ఎంచుకోవాలి. ఇది మూడు సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ కవర్ మరియు ఏటా రెన్యూవల్ చేయగలిగిన స్వీయ డ్యామేజీ కవర్‌తో లభిస్తుంది కాబట్టి, పొడిగించబడిన వ్యవధి కోసం మీరు కవర్ చేయబడతారు. ఒక వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్, దొంగతనం నుండి రక్షణ మరియు యాడ్-ఆన్ కవర్‌ల ఎంపికతో కూడా ఇది లభిస్తుంది.

X
కొత్త బ్రాండ్ కారును కొనుగోలు చేసే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

ప్రమాదం

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

దొంగతనం

టొయోటా ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్‌లో చేర్పులు మరియు మినహాయింపులు

ఒక సమగ్రమైన ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్ పాలసీతో, ఏదైనా ప్రమాదం, లేదా భూకంపాలు, అగ్నిప్రమాదాలు, తుఫాన్లు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి ప్రకృతిసిద్ధ మరియు మానవ జోక్యంతో జరిగే విపత్తుల ఫలితంగా మీ వాహహానికి ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు మీకు కవరేజీ లభిస్తుంది. హాస్పిటలైజేషన్ సమయంలో చికిత్స ఛార్జీలతో పాటు ఇతర ఖర్చుల కోసం కూడా మీకు కవర్ లభిస్తుంది. అంతేకాకుండా, థర్డ్-పార్టీ వ్యక్తికి సంభవించిన ఏదైనా నష్టం విషయంలో మీ ఆర్థిక బాధ్యతలు కూడా నెరవేర్చబడడం ద్వారా, ఆల్-రౌండ్ రక్షణను నిర్ధారిస్తుంది.

Covered in Car insurance policy - Accident coverage

యాక్సిడెంట్ కవరేజ్

యాక్సిడెంట్‌లు తరచుగా ఊహించలేనివి, మరియు కొన్నిసార్లు నివారించలేనివి. అయితే, స్వంత డ్యామేజీ కవర్‌తో మీ వాహనం మరమ్మత్తు కోసం అయ్యే ఖర్చును తగ్గించవచ్చు.

Covered in Car insurance policy -Natural or manmade calamities

ప్రకృతి లేదా మానవ జోక్యంతో జరిగే విపత్తులు

విపత్తులనేవి హెచ్చరిక లేకుండా సంభవిస్తాయి. భూకంపాలు, వరదలు, తుఫాన్లు, అగ్నిప్రమాదాలు, విధ్వంసం, అల్లర్లు మొదలైన వాటి నుండి మీ కారును ఆర్థికంగా రక్షించుకోండి.

Covered in Car insurance policy - theft

దొంగతనం

మీకు కారు ఇన్సూరెన్స్ లేకపోతే, మీ ఇన్నోవా దొంగతనానికి గురైతే అది మీకు గణనీయమైన ఆర్థిక నష్టానికి దారితీస్తుంది. అయితే, ఇన్సూరెన్స్‌తో, మీరు మీ వాహనానికి IDV పొందుతారు, మరియు మీకు రిటర్న్ టూ ఇన్వాయిస్ కవర్‌ ఉంటే, కారుకు సంబంధించిన పూర్తి ఆన్-రోడ్ ధర కూడా తిరిగి వస్తుంది.

Covered in Car insurance policy - Personal accident

పర్సనల్ యాక్సిడెంట్

ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో చికిత్స ఖర్చును తగ్గించడం కోసం, యజమానులందరికీ కనీసం ₹15 లక్షల వ్యక్తిగత యాక్సిడెంట్ కవర్ తప్పక ఉండాలి.

Covered in Car insurance policy - Third party liability

థర్డ్-పార్టీ లయబిలిటీ

ఒకవేళ మీ వల్ల థర్డ్-పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి గాయాలు లేదా నష్టం ఏర్పడితే, అప్పుడు మీకు ఎదురయ్యే ఆర్థిక బాధ్యతలను ఇది తీసుకుంటుంది.

టొయోటా ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూవల్ చేసుకోవాలి?

కార్లు స్మార్ట్‌గా మారుతుతున్నాయి మరియు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా. ఇన్సూరర్ కార్యాలయంలో వరుసలో నిలబడే రోజులు ఎప్పుడో పాతబడిపోయాయి. మీరు ఇప్పుడు మీ టొయోటా ఇన్నోవా కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే సౌకర్యవంతంగా రెన్యూవల్ చేసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి:

  • Step #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి లేదా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి, మరియు రెన్యూవల్ ఎంపికను ఎంచుకోండి
  • Step #2
    దశ #2
    రిజిస్ట్రేషన్, స్థానం, మునుపటి పాలసీ వివరాలు, NCB మొదలైన వాటితో సహా మీ కార్ వివరాలు నమోదు చేయండి.
  • Step #3
    దశ #3
    కోట్ అందుకోవడానికి మీ ఇమెయిల్ ID మరియు ఫోన్ నంబర్ నమోదు చేయండి
  • Step #4
    దశ #4
    ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి, మరియు నిర్ధారించుకోండి! మీరు సురక్షితంగా ఉన్నారు.

టొయోటా ఇన్నోవా క్రిస్టా కార్ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండే ఎందుకు కొనుగోలు చేయాలి?

ఒక ఇన్సూరర్‌ను ఎంచుకునే సమయంలో, మీరు వారి క్లెయిమ్స్ సెటిల్‌మెంట్ నిష్పత్తి మరియు ప్రాసెస్, కస్టమర్ బేస్ మరియు మీ ప్రాంతంలో వారి ఉనికి లాంటి అంశాలు తనిఖీ చేయాలి. అప్పుడు మాత్రమే ఒక గొప్ప అనుభవం కోసం మీకు హామీ లభిస్తుంది. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎందుకు ఎంచుకోవాలో ఇక్కడ చదవండి:

Cashless facility

నగదురహిత సదుపాయం

మా నగదురహిత గ్యారేజీలతో మీ స్వంత ఆర్థిక పొదుపులను తాత్కాలికంగా వెచ్చించే అవసరం లేకుండానే మీ కారును మరమ్మత్తు చేయించుకోండి. దేశవ్యాప్తంగా 8700 నగదురహిత గ్యారేజీలతో, మీరు ఎల్లప్పుడూ కవర్ చేయబడతారు.

Easy claims

సులభమైన క్లెయిములు

80% కంటే ఎక్కువ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను మేము దాఖలు చేసిన అదే రోజున ప్రాసెస్ పూర్తి చేస్తాము. మీ కారు దెబ్బతినడం మరియు దాని మరమ్మత్తు పూర్తి కావడం మధ్య కనీస సమయం మాత్రమే వ్యర్థమయ్యేలా ఇది నిర్ధారిస్తుంది.

Overnight repair service

ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్

మా విశిష్టమైన ఓవర్‌నైట్ రిపేర్ సర్వీస్‌తో, ఏదైనా యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో మీరు రాత్రి నిద్రపోయి, ఉదయం లేచే సరికి మీ కారుకు సంబంధించిన చిన్నపాటి మరమ్మత్తులు పూర్తి చేయబడుతాయి. మరుసటి రోజున మీ అవసరాలకు కారు సిద్ధంగా ఉంటుంది.

24x7 assistance

24x7 సహాయం

బ్రేక్‌డౌన్‌లు, టో చేయాల్సిన సమయాల్లో మీకు సహాయం అందించడానికి మా 24x7 సహాయ సేవతో మీరు ఎక్కడా చిక్కుకుపోయే పరిస్థితి ఉండదు.

9000+ cashless Garagesˇ Across India

తరచూ అడిగే ప్రశ్నలు


ఇన్నోవా అనేది దృఢంగా నిర్మించబడిన ఒక కారు. గత మోడళ్ల నుండే దీని విశ్వసనీయత నిరూపించబడింది. అయినప్పటికీ, యాక్సిడెంట్లు మరియు ఇతర సహజ లేదా మానవ జోక్యం కలిగిన కారణాలతో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీని కోసం సమగ్ర కార్ ఇన్సూరెన్స్ అనేది సిఫార్సు చేయబడిన పరిష్కారంగా ఉంటోంది. మీ నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడానికి కన్జ్యూమబుల్స్ కవర్ పొందండి.
మీరు మీ ఇన్నోవాలో సర్టిఫై చేయబడిన యాంటీ-థెఫ్ట్ పరికరాలు ఇన్‌స్టాల్ చేయవచ్చు మరియు ప్రీమియంను తగ్గించడం కోసం మీ జమ చేయబడిన NCB ఉపయోగించవచ్చు. అలాగే, మీ నిర్వహణ ఖర్చు తగ్గించుకోవడం కోసం మీ కార్ ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి. అంతేకాకుండా, మీ ప్రీమియంను తగ్గించుకోవడం కోసం మీరు మీ మినహాయింపులను పెంచుకోవచ్చు.
ఇన్నోవాకు తగినంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ, వరదకు గురయ్యే అవకాశం లేని ప్రాంతంలో దానిని పార్క్ చేయాలనే మేము సిఫార్సు చేస్తాము. నీటి కోసం కూడా ఒక అవుట్‌లెట్ నిర్మించడాన్ని పరిగణనలోకి తీసుకోండి. అలాగే, మీ ఇన్నోవాలోని అత్యంత ముఖ్యమైన మరియు అసురక్షిత భాగాన్ని మరింతగా రక్షించడం కోసం మీరు ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్ కవర్‌ కూడా పొందవచ్చు.
ఇన్నోవా మృదువుగా ప్రయాణిస్తుంది మరియు హైవేలో సౌకర్యవంతమైన రైడ్ అందిస్తుంది. అన్ని సీట్లలోనూ ప్రయాణీకులు ఉన్నప్పటికీ, దీన్ని నడపడం ఒక పెద్ద కారు నడుపుతున్నట్లుగా ఉండదు. హ్యాండ్లింగ్ హామీ అందిస్తుంది, అదేసమయంలో, చెప్పుకోదగ్గ అధిక వేగంలో వెళ్తున్నప్పుడు కూడా బాడీ రోల్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది లేదా అస్సలు ఉండదు. అయితే, మీరు తరచుగా బయటకు వెళ్తున్నట్లయితే, 24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ యాడ్-ఆన్ పొందవలసిందిగా సిఫార్సు చేయబడుతోంది, తద్వారా మీరు ఎక్కడైనా ప్రయాణం మధ్యలో పంక్చర్లు, బ్రేక్‌డౌన్లు మొదలైన సమస్యల్లో ఎప్పుడూ చిక్కుకుపోరు.