హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో టూ వీలర్ ఇన్సూరెన్స్
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో టూ వీలర్ ఇన్సూరెన్స్
ప్రీమియం ఇంత వద్ద ప్రారంభం ₹538*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
2000+ నగదురహిత నెట్‌వర్క్ గ్యారేజీలు ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలుˇ
ఎమర్జెన్సీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 కస్టమర్ రేటింగ్‌లు ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్

బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు /రెన్యూ చేయండి

బజాజ్ ఆటో టూ వీలర్ ఇన్సూరెన్స్

బజాజ్ గ్రూప్ దాని వివిధ పరిశ్రమల ఉనికితో దేశ వ్యాప్తంగా అత్యంత ప్రజాధారణ పొందిన ఒక గొప్ప వ్యాపార సంస్థ. 1926లో స్థాపించబడిన బజాజ్ ఆటో ఇప్పుడు ప్రపంచంలోని నాల్గవ-అతిపెద్ద టూ వీలర్, త్రీ-వీలర్ తయారీదారుగా నిలిచింది, అలాగే ఇది ₹120 బిలియన్ల ఆదాయంతో ప్రపంచవ్యాప్తంగా 70 కన్నా ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది.

దాని త్రీ-వీలర్ ఆటో రిక్షాలు ఊహించని విధంగా మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సమయంలో బజాజ్ ఆటో, దాని పల్సర్ రేంజ్ బైకులతో భారతదేశంలోని టూ-వీలర్ మార్కెట్‌లో పెను సంచలనాన్ని కలిగించింది. ఇది దేశంలో మోటార్‌సైకిల్ రేసింగ్‌కు మార్గాన్ని సుగమం చేసిన డ్యూక్ రేంజ్ KTM బైక్‌లను కూడా ప్రత్యేకంగా తయారు చేస్తుంది.

ప్రముఖ బజాజ్ టూ వీలర్ మోడల్స్

1
బజాజ్ పల్సర్ 150
ఇది ఆ విభాగంలో ఖచ్చితంగా ఒక పర్‌ఫెక్ట్ గేమ్‌ఛేంజర్, పల్సర్150 ప్రతిదీ కలిగి ఉంటుంది - స్టైల్, పవర్ మరియు మైలేజ్. బజాజ్ వారి అద్భుతమైన సర్వీస్‌ను దానికి జోడించండి, పల్సర్ 150 దాని తరగతిలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్ అని చెప్పడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. సరికొత్త నియాన్ ఎడిషన్, నియాన్ ట్రయల్స్‌తో కూడిన కొత్త మ్యాట్ పెయింట్ ఫినిషింగ్‌తో ఈ రేంజ్‌ బైక్‌కు మరింత స్టైల్‌ని జోడిస్తుంది, ఇది ప్రేక్షకుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
2
బజాజ్ పల్సర్ NS200
ఇది అత్యంత ప్రజాదారణ పొందిన 200CC బైక్‌లలో ఒకటి, అయితే బజాజ్ పల్సర్ NS200, 220F కన్నా మించి ఉంటుంది, 24.13 PS సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇది బెస్ట్-ఇన్-క్లాస్ ట్విన్ డిస్క్ బ్రేక్‌లతో కూడి, సింగిల్-ఛానల్ ABSతో వస్తుంది. దాని అదిరిపోయే స్టైల్‌తో, అద్భుతమైన పెయింట్ స్కీమ్ ఆప్షన్‌ల కలయికతో వీధుల్లో ప్రత్యేక ఆకర్షణతో నిలుస్తుంది.
3
బజాజ్ పల్సర్ 220F
దీనిని 2007లో దానిని ప్రవేశపెట్టబడినప్పుడు దాని పవర్, దూకుడు వైఖరితో అందరి దృష్టిని ఆకర్షించింది. బైక్ యొక్క BS VI వెర్షన్ దాని సింగిల్-సిలిండర్, 220 cc ఇంజన్ నుండి 20.4 PSని తొలగిస్తుంది. ఇది ఏరోడైనమిక్ డిజైన్‌తో కొనసాగుతుంది, అలాగే, ఒక ABS ఛానెల్‌తో జత చేయబడిన ట్విన్ డిస్క్ బ్రేక్‌లతో లభిస్తుంది.
4
బజాజ్ అవెంజర్ క్రూజ్ 220
విభిన్న రంగులతో, అందమైన వంపులతో కూడిన ఈ కాలాతీతమైన క్రూయిజర్ డిజైన్ అందరి మతిని పోగొడుతుంది. పేటెంట్ పొందిన DTS-i టెక్నాలజీ, 220CC ఇంజిన్‌లు హైవేలపై ప్రయాణించడానికి 18.4 PS పవర్‌ను ఉత్పత్తి చేయగా, లేడ్‌బ్యాక్ రైడింగ్ పొజిషన్ ఎక్కువ దూరం ప్రయాణించడానికి పూర్తి సౌకర్యాన్ని కల్పిస్తాయి. సింగిల్-ఛానెల్ ABS అనేది దాని తరగతిలో ఒక ప్రామాణిక భద్రతా ఫీచర్‌ మరియు ఇది అవెంజర్‌ను మార్కెట్లో అత్యంత సరసమైన క్రూయిజర్‌లలో ఒకటిగా చేసింది.
5
బజాజ్ డొమినార్ 400
బజాజ్ వారి అత్యంత స్థిరమైన, శక్తివంతమైన బైక్ డొమినార్ 400, ఇది 373cc డైరెక్ట్ ఓవర్ హెడ్ క్యామ్‌షాఫ్ట్ (DOHC), లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో వస్తుంది, 40 PS పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. దాని అద్భుతమైన బాడీ, ఫినిషింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తాయి, అయితే నిటారుగా ఉన్న స్పోర్ట్స్ టూరర్ డిజైన్ రోజంతా రైడింగ్ చేసిన తర్వాత కూడా సౌకర్యవంతంగా ఉండటాన్ని నిర్ధారిస్తుంది. ఇది బెస్ట్-ఇన్-క్లాస్ USD ఫోర్క్‌లు మరియు భద్రత కోసం ట్విన్-ఛానల్ ABSతో కూడా వస్తుంది.
6
బజాజ్ చేతక్
బజాజ్ చేతక్ దాని ఐకానిక్ స్కూటర్ డిజైన్‌తో బ్రాండ్ యొక్క ఉత్పత్తులలో మరోక కలికితురాయి. ఇప్పుడు, ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, ఇది కాలానుగుణంగా ఆధునికమైనది. ఇది 12-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో లభిస్తుంది, ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చోగలిగే సొగసైన డిజైన్, పూర్తి ఛార్జ్‌తో 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. 4080W మోటార్ ఈ స్కూటర్‌ను 70 kmph గరిష్ట వేగాన్ని చేరుకోవడానికి అనుమతిస్తుంది, అయితే బ్యాటరీ త్వరగా ఛార్జ్ అవుతుంది, సుదూర ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు కలగవు.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ ఆఫర్‌ల రకాలు

మీ బజాజ్ మోటార్ సైకిల్ ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రయాణానికి ముందు మీరు ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం తప్పనిసరి. అవును, ఇది ఒక చట్టపరమైన అవసరం, కానీ సంభావ్యంగా దురదృష్టకరమైన సంఘటనల నుండి ఉత్పన్నమయ్యే నష్టాల నుండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి బైక్ ఇన్సూరెన్స్ పొందడం కూడా ఒక తెలివైన ఆర్థిక నిర్ణయం. సాధారణ థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని లేదా మల్టీ-ఇయర్ కాంప్రిహెన్సివ్ ప్యాకేజీ ఇన్సూరెన్స్‌ను ఎంచుకోండి, మీ బజాజ్ మోటార్‌సైకిల్‌ను మరింత ఆహ్లాదకరంగా నడిపించే ఆర్థిక భద్రతా కవచాన్ని దానికి జోడించండి.

ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ, పర్సనల్ యాక్సిడెంట్ కవర్ మరియు ముఖ్యంగా స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ బైక్ ఇన్సూరెన్స్ కవర్ కలిగి ఉన్నందున, అత్యంత సిఫార్సు చేయబడిన ఒక ఎంపికగా ఉంది. ఒకవేళ, ఒక యాక్సిడెంట్‌లో మీరు దోషిగా నిర్ధారించబడితే ఇది మీకు, మీ బైక్‌కు సంబంధించిన బాధ్యతలన్నింటికీ అన్ని-విధాల ఆర్థిక రక్షణను అందిస్తుంది. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌లతో మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవచ్చు.

X
అన్ని-విధాలా రక్షణ కోరుకునే బైక్ ప్రేమికులకు ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
బైక్ యాక్సిడెంట్

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

మరిన్ని అన్వేషించండి

మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ఇది తప్పనిసరిగా అవసరమైన ఇన్సూరెన్స్ రకం. ఇది థర్డ్ పార్టీ వ్యక్తి గాయపడినా, మరణించినా లేదా అంగవైకల్యం కలిగినా లేదా వారి ఆస్తికి జరిగిన నష్టం కారణంగా తలెత్తే ఏవైనా సమస్యల నుండి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీరు ఎదుర్కొనే చట్టపరమైన బాధ్యతల నుండి కూడా మిమ్మల్ని కవర్ చేస్తుంది.

X
తరచుగా బైక్‌ను ఉపయోగించే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ఇప్పటికే థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండి, కవరేజ్ పరిధిని పెంచుకోవాలనుకునే వారికి ఈ పాలసీ అనువైనది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీ స్వంత వాహనం దెబ్బతినడం వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మీరు మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవడానికి యాడ్-ఆన్‌ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
బైక్ యాక్సిడెంట్

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

యాడ్-ఆన్‌ల ఎంపిక

మీ బైక్ యాజమాన్య అనుభవానికి సౌలభ్యం మరియు ఆల్-రౌండ్ ప్రొటెక్షన్‌ను జోడించడానికి రూపొందించబడిన ఒక ప్లాన్, మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ భాగం మరియు వార్షికంగా రెన్యూ చేయదగిన ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ భాగం ఉంటాయి. ఒకవేళ, మీరు మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను సమయానికి రెన్యూ చేయడం మర్చిపోయినా, మీరు ఇప్పటికీ ఆర్థికంగా కవర్ చేయబడతారు.

X
సరికొత్త టూ వీలర్ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి తగినది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
బైక్ యాక్సిడెంట్

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో చేర్చబడిన అంశాలు మరియు మినహాయింపులు

మీ బజాజ్ ఆటో బైక్ ఇన్సూరెన్స్ పాలసీ మీ పాలసీ రకాన్ని బట్టి కవరేజీని అందిస్తుంది. ఒక థర్డ్ పార్టీ బైక్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ వ్యక్తి లేదా ఆస్తికి జరిగిన నష్టానికి మాత్రమే కవరేజ్ అందిస్తుంది, ఒక సమగ్ర బైక్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ క్రింది వాటిని కవర్ చేస్తుంది:

ప్రమాదాలు

ప్రమాదాలు

ఒక ప్రమాదం కారణంగా మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టం వలన తలెత్తే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తాయి.

అగ్నిప్రమాదం మరియు విస్పోటనం

అగ్నిప్రమాదం మరియు విస్పోటనం

అగ్నిప్రమాదాలు లేదా పేలుడు వలన మీ బైక్‌కు జరిగిన నష్టం కవర్ చేయబడుతుంది.

దొంగతనం

దొంగతనం

మీ బైక్ దొంగిలించబడితే, మీరు బైక్ యొక్క IDV ఆధారంగా నష్ట పరిహారాన్ని పొందుతారు.

విపత్తులు

సహజ/ మానవ నిర్మిత విపత్తులు

భూకంపాలు, తుఫానులు, వరదలు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తులు కవర్ చేయబడతాయి.

పర్సనల్ యాక్సిడెంట్

పర్సనల్ యాక్సిడెంట్

మీ చికిత్స సంబంధిత ఛార్జీలు అన్నీ ₹15 లక్షల వరకు కవర్ చేయబడతాయి.

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్-పార్టీ వ్యక్తికి జరిగిన గాయం, వైకల్యం లేదా మరణం మరియు వారి ఆస్తికి జరిగిన నష్టాలు కూడా కవర్ చేయబడతాయి.

బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఆన్‌లైన్‌లో ఎలా రెన్యూ చేసుకోవాలి?

మీ బజాజ్ టూ వీలర్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ కేవలం కొన్ని నిమిషాల సమయాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఇది మీ ఇంటి సౌలభ్యం నుండి కేవలం కొన్ని క్లిక్‌లతో పూర్తి చేయబడుతుంది. దిగువ పేర్కొన్న నాలుగు-దశల ప్రాసెస్‌ను అనుసరించండి, తక్షణమే మిమ్మల్ని మీరు కవర్ చేసుకోండి!

  • దశ #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్‌ను ఎంచుకోండి
  • దశ #2
    దశ #2
    మీ బైక్ వివరాలు, రిజిస్ట్రేషన్, నగరం, మునుపటి పాలసీ వివరాలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి
  • దశ #3
    దశ #3
    కోట్‌ను స్వీకరించడానికి మీ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్‌ను అందించండి
  • దశ #4
    దశ #4
    ఆన్‌లైన్ చెల్లింపు చేయండి మరియు తక్షణమే కవరేజ్ పొందండి!

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ మొదటి ఎంపికగా ఎందుకు ఉండాలి?

బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ మీ మోటార్‌సైకిల్‌ రైడింగ్‌లో ఒక కీలక అధ్యాయం. మీరు యాక్సిడెంట్‌కు గురైతే లేదా మీ బైక్ దొంగిలించబడినట్లయితే, ఇన్సూరెన్స్ పాలసీ మీ ఆర్థిక నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా, వరదలు, తుఫానులు, భూకంపాలు, అల్లర్లు లేదా విధ్వంసం వంటి ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల ఫలితంగా మీ బైక్‌కు ఏదైనా నష్టం జరిగితే, అన్నీ కూడా బజాజ్ కాంప్రిహెన్సివ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడతాయి, మీరు ఎలాంటి ఖర్చులను భరించాల్సిన అవసరం లేదని ఇది నిర్ధారిస్తుంది. ఈ క్రింది కారణాల వలన మీ బజాజ్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోను ఎంచుకోండి:

విస్తృతమైన సర్వీస్

విస్తృతమైన సర్వీస్

మీరు ఉన్న ప్రాంతం లేదా దేశంలో గణనీయమైన ఉనికిని కలిగి ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ మీకు అవసరం. మరియు భారతదేశ వ్యాప్తంగా ఉన్న 2000 పైగా నగదురహిత గ్యారేజీలతో హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో, ఎల్లప్పుడూ మీకు సహాయం అందుబాటులో ఉండేలా చేస్తుంది.

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం, ఏదైనా బ్రేక్‌డౌన్ జరిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లకుండా మీకు అండగా నిలుస్తుంది.

కోటి మందికి పైగా కస్టమర్లు

కోటి మందికి పైగా కస్టమర్లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1.5 కోట్లకు పైగా హ్యాపీ కస్టమర్లను కలిగి ఉంది, అంటే మీ అవసరాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

ఓవర్‌నైట్ సర్వీస్

ఓవర్‌నైట్ సర్వీస్

మీ కారు సర్వీస్‌లో ఉన్నప్పుడు మీ రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలగవచ్చు. అయితే, ఒక చిన్న ప్రమాదం కారణంగా తలెత్తిన రిపేర్ల కోసం మా ఓవర్‌నైట్ సర్వీస్‌తో మీ రాత్రి నిద్రను హాయిగా ఆస్వాదించండి, అలాగే, తెల్లవారుజామున మీరు బయలుదేరే సమయానికి మీ కారును మీ ఇంటి వద్దకే డెలివరీని పొందండి.

సులభమైన క్లెయిములు

సులభమైన క్లెయిములు

ఒక ఆదర్శవంతమైన ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌లను వేగంగా, సజావుగా ప్రాసెస్ చేయాలి. మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సరిగ్గా అదే చేస్తుంది, మేము మొదటి రోజే దాదాపు 50% క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తున్నాము, కావున క్లెయిమ్ గురించిన మీ ఆందోళనలను దూరం చేసుకోవచ్చు.

2000కు పైగా భారతదేశం అంతటా నెట్‌వర్క్ గ్యారేజీలు
2000+ˇ నెట్‌వర్క్ గ్యారేజీలు
భారతదేశం వ్యాప్తంగా

బైక్ ఇన్సూరెన్స్ గురించిన తాజా వార్తలు

బజాజ్ త్వరలో భారతదేశంలో RS200 ను ప్రారంభించనున్నారు

బజాజ్ భారతదేశంలో రాబోయే నెలల్లో RS200 ప్రారంభించే అవకాశం ఉంది. బజాజ్ పల్సర్ RS200 అనేక ఫీచర్ అప్‌డేట్లు మరియు కొత్త కలర్ స్కీమ్‌లను అందుకోవచ్చని భావిస్తున్నారు. బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో మోటార్ సైకిల్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా పొందవచ్చు. RS200 LED హెడ్‌ల్యాంప్‌లు మరియు కొత్త పెయింట్ స్కీమ్‌లను కూడా కలిగి ఉంటుంది. కొత్త పల్సర్ RS200 మార్జినల్ ధరలో పెరుగుదలను చూడవచ్చు, హీరో కరిజ్మా XMR మరియు సుజుకి జిక్సర్ SF250 తో పోటీపడుతుంది.



ప్రచురించబడిన తేదీ: ఏప్రిల్ 18, 2024

బజాజ్ యొక్క CNG బైక్ నెలవారీ ఇంధన ఖర్చును సగానికి తగ్గించవచ్చు

ప్రపంచంలోని మొట్టమొదటి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ వాహనంతో బజాజ్ ఆటో ఎంట్రీ స్థాయి దేశీయ మోటార్ సైకిల్ మార్కెట్‌లో సంచలనం సృష్టించనుంది. అంతేకాకుండా, బజాజ్ దాని CNG బైక్ నెలవారీ ఇంధన ఖర్చును సగానికి తగ్గిస్తుంది అని పేర్కొంటుంది. ప్రీమియం ధర కలిగిన ఈ బై-ఫ్యూయల్ మోటార్‌సైకిళ్లు హీరో మోటోకార్ప్ యొక్క ఆధిపత్యాన్ని సవాలు చేస్తాయి. మైలేజ్‌కి ప్రాముఖ్యత ఇచ్చే ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్ నుండి లాభపడడానికి బజాజ్ లక్ష్యంగా చేసుకుంది. ఇది ప్రస్తుతం ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో 8% మార్కెట్ షేర్‌ను కలిగి ఉంది. ఈ చర్య ప్రభుత్వ కార్బన్ తగ్గింపు లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది. బజాజ్ మొదట మహారాష్ట్ర మరియు గుజరాత్‌లో బై-ఫ్యూయల్ బైక్‌ను ప్రారంభిస్తుంది మరియు తరువాత భారతదేశంలోని ఇతర భాగాల్లో దాని CNG పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుంది.

ప్రచురించబడిన తేదీ: ఏప్రిల్ 08, 2024

తరచుగా అడగబడిన ప్రశ్నలు


కొత్త బైక్‌‌ కొనుగోలు చేశారా...మా హృదయపూర్వక అభినందనలు! ఈ సందర్భంలో డీలర్ మీకు ఇన్సూరెన్స్‌ ఆఫర్ చేయవచ్చు అయితే, దానిని వెంటనే కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. మీరు ఆ ఇన్సూరెన్స్ కొనుగోలును నిరాకరించవచ్చు, స్వతహా పరిశోధించి మీకు నచ్చింది ఎంచుకోవచ్చు. డీలర్‌షిప్‌లు మీకు తగినవిధంగా సరిపోయే దాని కన్నా, వారికి సరిపోయే ఇన్సూరెన్స్ పాలసీలను మాత్రమే సిఫారసు చేయవచ్చు. అయితే, మీరు చేసే చిన్నపాటి ఆన్‌లైన్ రీసెర్చ్, మీ అవసరాలకు తగినవిధంగా సరిపోయే పాలసీని ఎంచుకోవడంలో సహాయపడుతుంది.
అవును, అవసరం. మోటారు వాహనాల చట్టం ప్రకారం, 250W మోటార్ మరియు 25-30 kmph వేగంతో కూడిన వాహనాలకు ఇన్సూరెన్స్ లేదా రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ అవసరం లేదు. కానీ బజాజ్ చేతక్ శక్తివంతమైన 4080 W మోటారును కలిగి ఉంటుంది కావున, సాధారణ టూ వీలర్ వాహన నియమాలు దీనికి వర్తిస్తాయి. అత్యుత్తమ రక్షణను నిర్ధారించడానికి మీ బజాజ్ చేతక్ కోసం సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము.
మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పోర్టల్‌కు లాగిన్ అయి మీ పాలసీ వివరాలను ఎంటర్ చేయవచ్చు. ఇక్కడ మీ వెహికల్ డ్యామేజీని మీరే స్వయంగా-తనిఖీ చేసి, మొబైల్ యాప్‌తో యాక్సిడెంట్‌కు గురైన బైక్ ఫోటోలను పంపించాల్సి ఉంటుంది. మీరు టోల్‌ఫ్రీ నంబర్‌కు కూడా కాల్ చేయవచ్చు, అలాగే మీ క్లెయిమ్‌ను రిజిస్టర్ చేసుకోవచ్చు. మీ పాలసీ డాక్యుమెంట్‌ను అందుబాటులో ఉంచుకోండి. ఇవన్నీ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి, ముఖ్యంగా దుర్ఘటన జరిగిన 24 గంటల్లోపు.
దీనికి సమాధానం మీ టైర్లు దెబ్బతిన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ప్రమాదం జరిగితే, టైర్లు పాడైపోయినట్లయితే, బజాజ్ ఆటో సమగ్ర ఇన్సూరెన్స్ ప్లాన్ ఆ నష్టాన్ని కవర్ చేస్తుంది మరియు టైర్లను రీప్లేస్ చేస్తుంది. అయితే, విధ్వంసం జరిగిన సందర్భంలో, అది కవర్ చేయబడదు.