""
tvs bike insurance
Two Wheeler Insurance with HDFC ERGO
Annual Premium starting at just ₹538*

వార్షిక ప్రీమియం ప్రారంభం

కేవలం ₹538 వద్ద*
7400+ Cashless Network Garages ^

2000+ నగదురహిత

నెట్‌వర్క్ గ్యారేజీలు**
Emergency Roadside Assistance

రోడ్‌సైడ్ ఎమర్జెన్సీ

సహాయం
4.4 Customer Ratings ^

4.4

కస్టమర్ రేటింగ్‌లు
హోమ్ / టూ వీలర్ ఇన్సూరెన్స్ / TVS టూ వీలర్ ఇన్సూరెన్స్ ఆన్‌లైన్

TVS ఇన్సూరెన్స్ పాలసీని ఆన్‌లైన్‌లో కొనండి/రెన్యూ చేసుకోండి

tvs bike insurance online

TVS మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచ దిగ్గజంగా నిలిచిన ఒక స్వదేశీ బ్రాండ్, ఈ సంస్థ వ్యవస్థాపక పితామహుడు T V సుందరం అయ్యంగార్ జ్ఞాపకార్థం ఆయన పేరు పెట్టడం జరిగింది. కంపెనీ 1911లో స్థాపించబడినప్పటికీ, దాని మోటార్ కంపెనీ 1970ల చివరలో TVS 50 మోపెడ్‌లను తయారు చేయడం ప్రారంభించినప్పుడు ఆలస్యంగా ఉనికిలోకి వచ్చింది,. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద టూ వీలర్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ మరియు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికాలో ఇతర ప్రాంతాలలో ఇది భారీ ఉనికిని కలిగి ఉంటుంది.

మోపెడ్‌లు, స్కూటర్లు, కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు, స్పోర్టీ బైక్‌ల వరకు TVS అనేక రకాల టూ వీలర్ వాహనాలను తయారు చేస్తోంది. ఈ బ్రాండ్ 44 మిలియన్ కన్నా ఎక్కువ కస్టమర్లను, నాలుగు తయారీ ప్లాంట్లను కలిగి ఉంది, అవి - తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని మైసూర్, హిమాచల్ ప్రదేశ్‌లోని నలగర్ మరియు ఇండోనేషియాలోని కరవాంగ్.

ప్రముఖ TVS టూ వీలర్ మోడల్స్

1
TVS స్కూటీ పెప్+
2005లో ప్రారంభించబడిన ఈ తేలికపాటి వాహనం అనేక రంగులలో అందుబాటులో ఉంటుంది. దాని DRL LED లైట్‌తో, ఇది ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటుంది. దీనిని తరచుగా ఆరంభికులు ఇష్టపడుతుంటారు ఎందుకనగా, దాని 87.8cc సింగిల్ సిలిండర్ మరియు 4-స్ట్రోక్ ఇంజిన్‌తో వాహనాన్ని నియంత్రించడం చాలా సులభం అవుతుంది. ఇది సీటు కింద తగినంత స్టోరేజ్‌తో పాటు USB మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్‌తో లభిస్తుంది.
2
టివిఎస్ జుపీటర్
ఇది TVS కుటుంబం నుండి ఒక ఫ్యామిలీ-ఫ్రెండ్లీ స్కూటర్, దీని110cc ఇంజిన్ మునుపటి దాని కన్నా పెద్దది, మెరుగైనది మరియు శక్తివంతమైనది. దాని సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ గొప్ప యాక్సిలరేషన్‌ను అందిస్తుంది, రైడ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉంటుంది. దీని ఇంధన సామర్థ్యం గొప్పగా ఉంటుంది. మెరుగుపరచబడిన LED హెడ్‌లైట్‌లు రాత్రిపూట మరింత దృగ్గోచరతను నిర్ధారిస్తాయి మరియు డిస్క్ బ్రేక్‌లు వాహనాన్ని వెంటనే ఆపివేస్తాయి. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో పూర్తి లుక్‌ అద్భుతంగా ఉంటుంది.
3
TVS స్టార్ సిటీ ప్లస్
బైక్ ఎరుపు మరియు నలుపు రంగులో స్టైలిష్‌గా ఉంటుంది. క్లోజ్-సెట్ హ్యాండిల్‌బార్లు మరియు సెట్ చేసిన ఇంధన ట్యాంక్, రోజువారీ సౌకర్యవంతమైన ప్రయాణానికి గొప్ప ఎంపికగా నిలుస్తుంది. హైడ్రాలిక్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఎగుడుదిగుడుగా ఉండే రైడ్‌లలో కూడా విశ్వసనీయ సహచరుడిగా మీకు తోడుగా ఉంటాయి. BS6 వేరియంట్ అవసరమైన పనితీరును అందించడానికి ETFi సాంకేతికతతో లోడ్ చేయబడి ఉంటుంది. ఎకో థ్రస్ట్ ఇంజిన్ గొప్ప మైలేజీని అందిస్తుంది మరియు ఉద్గారాల స్థాయి తక్కువగా ఉంటుంది. దీనికి ఒక USB ఛార్జర్ కూడా ఉంది.
4
అపాచీ RTR సిరీస్
మీరు జా-డ్రాపింగ్ అపాచీ RR 310 లిక్విడ్ కూల్ ఇంజిన్‌ను చూసి ఉంటారు, అలాగే, దాని పూర్వీకులను అంతగా ఆకట్టుకోలేదు. మొదటి అపాచీ 150cc మోడల్, ఇది 2005లో ప్రారంభించబడినప్పుడు ప్రతి తలను తనవైపు తిప్పుకుంది. సంవత్సరాలు గడిచేకొద్దీ, అపాచీ కొత్త వేరియంట్‌లు పెద్ద ఇంధన సామర్థ్యం, మరిన్ని ఫీచర్లు, సాంకేతిక పురోగతి మరియు మెరుగైన పనితీరును అందించాయి.
5
TVS XL 100
ఇప్పటికీ చాలా మంది ఉపయోగించే వాహనం మోపెడ్‌లు. TVS మోపెడ్ దాని డిజైన్ మరియు పనితీరుతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. పికప్ బాగుంది మరియు రైడర్ సాఫీగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఇది గొప్ప బలాన్ని కలిగి ఉంటుంది, ఇద్దరు ప్రయాణీకులతో పాటు అదనపు లగేజీని కూడా తీసుకెళ్లగలదు. మోపెడ్ బహుళ రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.
6
TVS iQUBE
TVS iQUBEతో భవిష్యత్తు కాలంలోకి ప్రవేశించండి. సుస్థిరత్వం వైపు ఒక అడుగు ముందుకు వేయాలని కోరుకునే వారు, సాటిలేని రైడింగ్ అనుభవాన్ని అందించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంచుకోవచ్చు. ఒక సాంకేతికపరమైన అద్భుతం, ఈ బైక్‌కు నిర్వహణ అవసరం తక్కువ. LED హెడ్, టెయిల్ ల్యాంప్స్, ఎక్కువ స్టోరేజ్ స్పేస్, USB ఛార్జింగ్ పోర్ట్‌లు, అంతర్‌నిర్మిత బ్లూటూత్ మరియు ఇతర ఫీచర్లు దీనిని నెక్స్ట్-జెన్ టూ-వీలర్‌గా మార్చాయి.

TVS టూ వీలర్ ఇన్సూరెన్స్ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆఫర్‌ల రకాలు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 4 రకాల టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను అందిస్తుంది, సమగ్ర థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ మరియు స్టాండ్అలోన్ ఓన్ డ్యామేజ్ కారు మరియు సరికొత్త బైక్ కోసం కవర్. మీ సమగ్ర బైక్ ఇన్సూరెన్స్కు యాడ్-ఆన్ కవర్‌లను జోడించడం ద్వారా మీరు మీ బైక్ రక్షణను మరింత మెరుగుపరచుకోవచ్చు.

ఇది థర్డ్-పార్టీ లయబిలిటీ, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ముఖ్యంగా ఓన్ డ్యామేజ్ కవర్లతో మిళితమై ఉన్నందున ఇది అత్యంత సిఫార్సు చేయబడిన ఒక ఎంపిక. ఒకవేళ, ఒక యాక్సిడెంట్‌లో మీరు దోషిగా నిర్ధారించబడితే ఇది మీకు, మీ బైక్‌కు సంబంధించిన బాధ్యతలన్నింటికీ అన్ని-విధాల ఆర్థిక రక్షణను అందిస్తుంది. మీరు ఎంచుకున్న యాడ్-ఆన్‌లతో మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవచ్చు.

X
అన్ని-విధాలా రక్షణ కోరుకునే బైక్ ప్రేమికులకు ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి.

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

ప్రకృతి వైపరీత్యాలు

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

మరిన్ని అన్వేషించండి

మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం ఇది తప్పనిసరి అవసరమైన ఇన్సూరెన్స్ రకం. ఇది థర్డ్ పార్టీ వ్యక్తికి జరిగిన గాయం, మరణం లేదా అంగవైకల్యం లేదా వారి ఆస్తికి జరిగిన నష్టం కారణంగా తలెత్తే ఏవైనా సమస్యల నుండి మిమ్మల్ని ఆర్థికంగా కవర్ చేస్తుంది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీరు ఎదుర్కొనే చట్టపరమైన బాధ్యతల నుండి కూడా మిమ్మల్ని కవర్ చేస్తుంది.

X
తరచుగా బైక్‌ను ఉపయోగించే వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:

పర్సనల్ యాక్సిడెంట్ కవర్

థర్డ్-పార్టీ ఆస్తి నష్టం

థర్డ్-పార్టీ వ్యక్తికి ఏర్పడిన గాయాలు

ఇప్పటికే థర్డ్-పార్టీ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండి, కవరేజ్ పరిధిని పెంచుకోవాలనుకునే వారికి ఈ పాలసీ అనువైనది. ఇది యాక్సిడెంట్ కారణంగా మీ స్వంత వాహనం దెబ్బతినడం వల్ల కలిగే నష్టాలను కవర్ చేస్తుంది. అంతేకాకుండా, మీరు మీ కవరేజీని మరింత మెరుగుపరచుకోవడానికి యాడ్-ఆన్‌ ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు.

X
ఇప్పటికే చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ కవర్‌ను కలిగి ఉన్న వారికి ఇది సరైనది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

యాడ్-ఆన్‌ల ఎంపిక

మీ బైక్ యాజమాన్య అనుభవానికి సౌలభ్యం మరియు ఆల్-రౌండ్ ప్రొటెక్షన్‌ను జోడించడానికి రూపొందించబడిన ఒక ప్లాన్, మల్టీ ఇయర్ బైక్ ఇన్సూరెన్స్ పాలసీలో ఐదు సంవత్సరాల థర్డ్-పార్టీ లయబిలిటీ భాగం మరియు వార్షికంగా రెన్యూ చేయదగిన ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ భాగం ఉంటాయి. ఒకవేళ, మీరు మీ ఓన్ డ్యామేజ్ కవర్‌ను సమయానికి రెన్యూ చేయడం మర్చిపోయినా, మీరు ఇప్పటికీ ఆర్థికంగా కవర్ చేయబడతారు.

X
సరికొత్త టూ వీలర్ వాహనాన్ని కొనుగోలు చేసిన వారికి తగినది, ఈ ప్లాన్‌లో కవర్ చేయబడేవి:
bike accident

యాక్సిడెంట్, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైనవి

ప్రకృతి వైపరీత్యాలు

పర్సనల్ యాక్సిడెంట్

థర్డ్-పార్టీ లయబిలిటీ

యాడ్-ఆన్‌ల ఎంపిక

TVS టూ వీలర్ ఇన్సూరెన్స్‌లో చేర్చబడిన అంశాలు మరియు మినహాయింపులు

మీ TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీ పాలసీ రకాన్ని బట్టి మీకు కవరేజీని అందిస్తుంది. థర్డ్-పార్టీ బైక్ ఇన్సూరెన్స్ కేవలం థర్డ్-పార్టీ వ్యక్తికి లేదా ఆస్తికి జరిగిన నష్టానికి మాత్రమే కవరేజీని అందిస్తుంది, సమగ్ర TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కింది వాటిని కవర్ చేస్తుంది:

Accidents

ప్రమాదాలు

ఒక ప్రమాదం కారణంగా మీ స్వంత బైక్‌కు జరిగిన నష్టం వలన తలెత్తే ఆర్థిక నష్టాలను కవర్ చేస్తాయి.

Fire & Explosion

అగ్నిప్రమాదం మరియు పేలుళ్లు

అగ్నిప్రమాదాలు లేదా పేలుడు వలన మీ బైక్‌కు జరిగిన నష్టం కవర్ చేయబడుతుంది.

Theft

దొంగతనం

మీ బైక్ చోరీకి గురైతే, మీరు బైక్ ఐడివి నుండి పరిహారం పొందుతారు.

Calamities

విపత్తులు

భూకంపాలు, తుఫానులు, వరదలు, అల్లర్లు మరియు విధ్వంసం వంటి ప్రకృతి మరియు మానవ నిర్మిత విపత్తులు కవర్ చేయబడతాయి.

Personal Accident

పర్సనల్ యాక్సిడెంట్

మీ చికిత్స సంబంధిత ఛార్జీలు అన్నీ ₹15 లక్షల వరకు కవర్ చేయబడతాయి.

Third Party Liability

థర్డ్ పార్టీ లయబిలిటీ

థర్డ్-పార్టీ వ్యక్తికి జరిగిన గాయం, వైకల్యం లేదా మరణం మరియు వారి ఆస్తికి జరిగిన నష్టాలు కూడా కవర్ చేయబడతాయి.

TVS టూ వీలర్ ఇన్సూరెన్స్‌ను ఎలా రెన్యూ చేయాలి?

మీ TVS బైక్ ఇన్సూరెన్స్ రెన్యూవల్‌ కోసం కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. మీ స్వంత ఇంటి నుండే సౌకర్యవంతంగా కేవలం కొన్ని క్లిక్‌లతో దీనిని పూర్తి చేయవచ్చు. క్రింద పేర్కొన్న నాలుగు-దశల ప్రక్రియను అనుసరించండి మరియు తక్షణమే కవరేజ్ పొందండి!

  • Step #1
    దశ #1
    హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వెబ్‌సైట్‌ను సందర్శించండి, మీ పాలసీని కొనుగోలు లేదా రెన్యూవల్‌ను ఎంచుకోండి
  • Step #2
    దశ #2
    మీ బైక్ వివరాలు, రిజిస్ట్రేషన్, నగరం, మునుపటి పాలసీ వివరాలు ఏవైనా ఉంటే ఎంటర్ చేయండి
  • Step #3
    దశ #3
    కోట్‌ను స్వీకరించడానికి మీ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్‌ను అందించండి
  • Step #4
    దశ #4
    ఆన్‌లైన్ చెల్లింపు చేయండి మరియు తక్షణమే కవరేజ్ పొందండి!

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మీ మొదటి ఎంపికగా ఎందుకు ఉండాలి?

బైక్ ఇన్సూరెన్స్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. దేశంలో చట్టబద్ధంగా రైడ్ చేయడానికి ఒక యజమాని-రైడర్ దీనిని తప్పకుండా కావాలి. అదనంగా, మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. మీ బైక్‌కు తీవ్ర నష్టాన్ని కలిగించే అనేక ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, వాటన్నింటినీ రిపేర్ చేయించడానికి మీకు చాలా ఖర్చు అవుతుంది. యాక్సిడెంట్లు, దొంగతనాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండానే జరుగుతాయి. మీ బైక్‌లో ఎన్ని భద్రతా ఫీచర్లు ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా ఉత్తమ రైడర్‌ల విషయంలో కూడా ఈ పరిస్థితి ఎదురవ్వొచ్చు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో నుండి బైక్ ఇన్సూరెన్స్ పాలసీ, ఈ ఊహించని ఖర్చులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం మీరు ఎంచుకోవాల్సిన ఇన్సూరెన్స్ సంస్థ మేమే కావడానికి చాలా కారణాలు ఉన్నాయి, అయితే అందులో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి:

extensive service

విస్తృతమైన సర్వీస్

మీరు ఉన్న ప్రాంతం లేదా దేశంలో అత్యంత ఉనికిని కలిగి ఉన్న ఇన్సూరెన్స్ సంస్థ మీకు అవసరం. మరియు భారతదేశ వ్యాప్తంగా 2000+ కంటే ఎక్కువ నగదురహిత గ్యారేజీలతో, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎల్లప్పుడూ సహాయం అందుబాటులో ఉండేలాగా నిర్ధారిస్తుంది.

24x7 roadside assistance

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్

24x7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ సదుపాయం, ఏదైనా బ్రేక్‌డౌన్ జరిగినప్పుడు మీరు ఎప్పుడు కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్లకుండా మీకు అండగా నిలుస్తుంది.

Over one crore customers

కోటి మందికి పైగా కస్టమర్లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో 1.6 కోట్లకు పైగా హ్యాపీ కస్టమర్లను కలిగి ఉంది, అంటే మీ అవసరాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయని, మీరు నిశ్చింతగా ఉండవచ్చు.

Overnight service

ఓవర్‌నైట్ సర్వీసులు

మీ కారు సర్వీస్‌లో ఉన్నప్పుడు మీ రోజువారీ కార్యక్రమాలకు అంతరాయం కలగవచ్చు. అయితే, ఒక చిన్న ప్రమాదం కారణంగా తలెత్తిన రిపేర్ల కోసం మా ఓవర్‌నైట్ సర్వీస్‌తో మీ రాత్రి నిద్రను హాయిగా ఆస్వాదించండి, అలాగే, తెల్లవారుజామున మీరు బయలుదేరే సమయానికి మీ కారును మీ ఇంటి వద్దకే డెలివరీని పొందండి.

Easy claims

సులభమైన క్లెయిములు

ఒక ఆదర్శవంతమైన ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్‌లను వేగంగా, సజావుగా ప్రాసెస్ చేయాలి. మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సరిగ్గా అదే చేస్తుంది, మేము మొదటి రోజే దాదాపు 50% క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తున్నాము, కావున క్లెయిమ్ గురించిన మీ ఆందోళనలను దూరం చేసుకోవచ్చు.

2000+<sup>**</sup> Network Garages Across India

తాజా TVS బైక్ ఇన్సూరెన్స్ బ్లాగులను చదవండి

Benefits and Considerations When Buying TVS Insurance

TVS ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్రయోజనాలు మరియు పరిగణనలు

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఫిబ్రవరి 3, 2025 న ప్రచురించబడింది
What is the Average Life of TVS Jupiter?

TVS జూపిటర్ యొక్క సగటు జీవితకాలం ఎంత?

పూర్తి ఆర్టికల్‌ను చూడండి
జనవరి 8, 2025 న ప్రచురించబడింది
Is TVS Apache Worth Buying?

టివిఎస్ అపాచీని కొనుగోలు చేయడం విలువైనదా?


పూర్తి ఆర్టికల్‌ను చూడండి
అక్టోబర్ 1, 2024 న ప్రచురించబడింది
5 Upcoming TVS Bikes To Look Out For

చూడవలసిన రాబోయే 5 టీవీఎస్ బైక్‌లు


పూర్తి ఆర్టికల్‌ను చూడండి
ఆగస్ట్ 24, 2023న ప్రచురించబడింది
blog right slider
blog left slider
మరిన్ని బ్లాగ్‌లను చూడండి

TVS బైక్ గురించి తాజా వార్తలు

టివిఎస్ మిడ్ 2025 నాటికి 300cc అడ్వెంచర్ బైక్‌ను ప్రారంభించాలని యోచిస్తోంది

టివిఎస్ బహుశా మిడ్-2025 నాటికి 300cc అడ్వెంచర్ బైక్‌ను ప్రారంభించవచ్చు. బైక్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది కానీ ఉత్పత్తికి దగ్గరగా ఉంది. రాబోయే అడ్వెంచర్ బైక్ RTR 310 మరియు RR 310 నుండి కొన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌కు లింక్ చేయబడుతుంది. మొత్తం స్టైలింగ్ ఒక సాధారణ అడ్వెంచర్ బైక్‌లాగా కఠినమైనదిగా ఉంటుందని అంచనా వేయవచ్చు. టివిఎస్ 21-అంగుళాల ఫ్రంట్ వీల్‌ను అందించగలదు. సస్పెన్షన్ డ్యూటీలు USD ఫ్రంట్ ఫోర్క్స్ మరియు మోనోషాక్ ద్వారా చేయబడే అవకాశం ఉంది.



ప్రచురించబడిన తేదీ: నవంబర్ 14, 2024

టివిఎస్ ₹73,700 వద్ద భారతదేశంలో కొత్త జూపిటర్ 110 ను ప్రారంభించింది

టివిఎస్ భారతదేశంలో వారి తదుపరి తరం జూపిటర్‌ను ప్రారంభించింది, ఇది ఒక దశాబ్దం-పాత జూపిటర్ 110 ను భర్తీ చేసింది. ఇది ₹73,700 నుండి ప్రారంభమయ్యే ధరతో ఆరు రంగులు మరియు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్ 125ని చేయడానికి ఉపయోగించే అదే ఛాసిస్ చుట్టూ నిర్మించబడింది. అయితే, మొత్తం స్టైలింగ్ ఇంతకు ముందు కంటే ఎక్కువగా కనిపిస్తుంది. టర్న్ ఇండికేటర్లతో విస్తృత LED DRL ఉనికి కారణంగా ఫ్రంట్ ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. కొత్త జూపిటర్ 110 USB ఛార్జింగ్ పోర్ట్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో పాటు LED డిస్‌ప్లేతో అమర్చబడింది. అయితే, తక్కువ వేరియంట్‌లో LED ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉండదు.

ప్రచురించబడిన తేదీ: ఆగస్ట్ 22, 2024

TVS ఇన్సూరెన్స్ పై సాధారణ ప్రశ్నలు


అవును, మీరు టైర్లను పెద్ద పరిమాణానికి మార్చవచ్చు, కానీ కొత్త చుట్టుకొలత, ప్రస్తుత చుట్టుకొలత మధ్య వ్యత్యాసం 2% కన్నా తక్కువగా ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. మీరు మార్పు గురించి ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి, తద్వారా మీరు క్లెయిమ్‌ను నమోదు చేయాల్సి వస్తే, అంతా సజావుగా సాగుతుంది.
బైక్ హ్యాండ్‌ఓవర్ ఫార్మాలిటీలను పూర్తి చేసే సమయంలో బైక్ ఒరిజినల్ యజమాని నుండి TVS బైక్ ఇన్సూరెన్స్ పాలసీని బదిలీ చేయవచ్చు. మీరు ముందుగా ఆ విషయాన్ని గురించి ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి. అయితే, మీరు కొత్త బైక్ ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్లాలనుకుంటే లేదా మరొక బీమా ప్రొవైడర్‌కి మారాలనుకుంటే, మీరు దానిని కూడా చేయవచ్చు. ఏవిధంగానైనా మీరు, మీ బైక్‌కు ఇన్సూరెన్స్ చేయించాలి.
ఇది మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, మీ TVS అపాచీ కోసం కొత్త బైక్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం మంచిది, ఎందుకనగా మీ కొత్త బైక్‌కు ఎక్కువ కవరేజ్ అవసరం కావచ్చు.
అవును, యాంటీ-థెఫ్ట్ పరికరాలు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) ద్వారా సర్టిఫై చేయబడతాయి. ముఖ్యంగా ఇవి, ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కోసం రిస్క్ అంశాలను తగ్గిస్తాయి.