హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / USA కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • FAQs

USA కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా)

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అందమైన నీలి మహాసముద్రాలు, అందమైన బీచ్‌లు, మంచుతో కప్పబడిన శిఖరాలు, ఆకర్షణీయమైన నగరాల వంటి సమస్త అందాలకు నిలయంగా ఉంది. ప్రకాశవంతమైన కాంతులతో నిండిన ఈ విభిన్నమైన ప్రదేశం మీకు ముక్తకంఠంతో స్వాగతం పలుకుతుంది. దాని సుందరమైన ప్రకృతి దృశ్యాలు, మనోహరమైన గమ్యస్థానాలు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రింద జాబితా చేయబడిన దేశాలను సందర్శించడానికి వచ్చినప్పుడు "ఆశ్చర్యం" కలిగించని ప్రదేశం ఉండదు. అది ఫ్లోరిడాకు సోలో ట్రిప్ అయినా, అలాస్కాకు బ్యాక్‌ప్యాకింగ్ ట్రిప్ అయినా, గ్రాండ్ కెనన్‌కు ఫ్యామిలీ ట్రిప్ అయినా లేదా లాస్ వేగాస్‌కు స్నేహితులతో సెలవుల కోసం గడపడానికి అయినా, సందర్భం ఏదైనా USA మీకు సకల ప్రయాణ అవకాశాలను కల్పిస్తుంది. USA మరియు ఆ చుట్టుపక్కల ప్రదేశాలను సందర్శించడం చాలా సరదాగా ఉంటుంది, అయితే ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమైన విషయం. పర్యటన కోసం ఒక ఖచ్చితమైన ప్లాన్ చేయడానికి ముందుగా, మీరు USA కోసం ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను చూడండి, మీ ట్రిప్‌కు ఇన్సూరెన్స్ చేయడానికి ఉత్తమమైన ట్రావెల్ ప్లాన్‌ను ఎంచుకోండి.


USAకు ప్రయాణించడానికి ముందు తప్పనిసరిగా తెలుసుకోవలసినవి


కేటగిరీ:  విశ్రాంతి/ వ్యాపారం/ విద్య 

కరెన్సీ: US డాలర్

ప్రయాణం చేయడానికి ఉత్తమ సమయం: మే నుండి సెప్టెంబర్ వరకు

భారతీయుల కోసం వీసా రకం: ప్రీ అప్రూవ్డ్

చూడవలసిన ప్రదేశాలు: ఫ్లోరిడా, గ్రాండ్ కెనన్, లాస్ వేగాస్, న్యూయార్క్ మరియు డిస్నీ ల్యాండ్.

USA కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్: USA ఒక టూరిస్ట్-ఫ్రెండ్లీ ఖండం అయినప్పటికీ, మీ వస్తువులు మరియు ట్రావెల్ ఎజెండాను సురక్షితం చేయడం ముఖ్యం. బ్యాగేజ్ కోల్పోవడం లేదా విమాన ఆలస్యాలు వంటి సాధారణ దుర్ఘటనలు మీ టూర్ ప్లాన్‌ను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు; అందువల్ల మీ తదుపరి U.S.A టూర్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పొందడం చాలా ముఖ్యం.

 

#పైన పేర్కొన్నవి సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. దయచేసి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందు, మీరు మీ ట్రావెల్ ఏజెంట్ లేదా సంబంధిత ఎంబసీని సంప్రదించండి

ఏమి చేర్చబడింది?

వైద్య సంబంధిత కవరేజ్

cov-acc

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

cov-acc

డెంటల్ ఖర్చులు

శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.

cov-acc

పర్సనల్ యాక్సిడెంట్

అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.

cov-acc

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.

బ్యాగేజ్-సంబంధిత కవరేజ్

cov-acc

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

cov-acc

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్‌ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

cov-acc

బ్యాగేజ్ మరియు అందులోని వస్తువుల దొంగతనం

లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

ప్రయాణం-సంబంధిత కవరేజ్

cov-acc

విమాన ఆలస్యం మరియు రద్దు

విమాన ఆలస్యాలు లేదా రద్దులు మా నియంత్రణకు మించి ఉండవచ్చు, కానీ వాటి కోసం తక్కువ బాధ కలిగించేలా చేయడంలో సహాయపడటానికి మేము ఖచ్చితంగా ఏదైనా చేయగలము. మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ మీకు ఎదురుదెబ్బ నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి అనుమతిస్తుంది.

cov-acc

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

cov-acc

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి, కొత్త లేదా డూప్లికేట్ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి సంబంధించిన ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

cov-acc

ట్రిప్ తగ్గింపు

ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

cov-acc

వ్యక్తిగత బాధ్యత

మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.

cov-acc

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం అత్యవసర హోటల్ వసతి

వైద్య అత్యవసర పరిస్థితులు అంటే మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా?? ఆ విషయాన్ని మాకు వదిలేయండి. మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.

cov-acc

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి ; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

cov-acc

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.

cov-acc

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు USAకు వెళ్తున్నట్లయితే, ట్రిప్‌లో మీరు ఎదుర్కొనే ఆర్థిక బాధ్యతలను ప్లాన్ కవర్ చేస్తుంది కాబట్టి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వివిధ రకాల కొనుగోలు విధానాలను అందిస్తుంది కాబట్టి USA ట్రిప్ కోసం ట్రావెల్ ప్లాన్ కొనుగోలు చేయడం చాలా సులభం. అటువంటి విధానాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి –

● ఆఫ్‌లైన్ మోడ్

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సమీప బ్రాంచ్ ఆఫీస్‌ను సందర్శించవచ్చు మరియు USA కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం అప్లై చేయవచ్చు. మీరు ఒక ప్రపోజల్ ఫారం నింపి దానిని ప్రీమియం మొత్తంతో కంపెనీకి సబ్మిట్ చేయాలి. కంపెనీ పాలసీని అండర్‌రైట్ చేస్తుంది మరియు విజయవంతమైన అండర్‌రైటింగ్ తర్వాత దానిని జారీ చేస్తుంది.

● ఆన్‌లైన్ విధానం

USA కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఆన్‌లైన్ విధానం అనేది ఒక సులభమైన ప్రత్యామ్నాయం. మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా తక్షణమే పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రాసెస్ ఈ క్రింది విధంగా ఉంటుంది –

https://www.hdfcergo.com/travel-insurance ని సందర్శించండి మరియు 'ఇప్పుడే కొనండి' పై క్లిక్ చేయండి

● ఆన్‌లైన్ ప్రతిపాదన ఫారంలో, మీరు చేపడుతున్న ట్రిప్ రకాన్ని (వ్యక్తిగత ట్రావెల్, ఫ్యామిలీ ట్రావెల్ లేదా స్టూడెంట్ ట్రావెల్), మీతో ప్రయాణిస్తున్న సభ్యులు, వారి సంబంధిత వయస్సులను పూరించండి మరియు 'కొనసాగించండి' పై క్లిక్ చేయండి

● అప్పుడు దేశాన్ని USA గా పేర్కొనండి మరియు మీ బయలుదేరే మరియు వచ్చే తేదీలను ఎంటర్ చేయండి

● కవరేజ్ ఎంపికలు మరియు మీరు చెల్లించవలసిన ప్రీమియంలను తనిఖీ చేయడానికి 'కోట్స్ చూడండి' పై క్లిక్ చేయండి

● తగిన ప్లాన్‌ను ఎంచుకోండి మరియు ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించండి

ప్రాసెస్ పూర్తయిన తర్వాత, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తక్షణమే జారీ చేయబడుతుంది మరియు ట్రిప్ వ్యవధిలో మీకు కవర్ చేయబడుతుంది.

USA ను కవర్ చేసే మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం ప్రీమియం మొత్తం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ప్రయాణిస్తున్న సభ్యుల సంఖ్య

● వారి వయస్సు

ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియం నేరుగా వయస్సు ప్రకారం ఉంటుంది. అధిక వయస్సు కోసం ప్రీమియంలు ఎక్కువగా ఉంటాయి మరియు తక్కువ వయస్సు కోసం తక్కువగా ఉంటాయి.

● ఇన్సూర్ చేయబడిన మొత్తం

ప్రీమియం ఇన్సూర్ చేయబడిన మొత్తానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. అధిక ఇన్సూరెన్స్ మొత్తం స్థాయిలు అంటే అధిక ప్రీమియంలు మరియు తక్కువ స్థాయిలు అంటే తక్కువ ప్రీమియంలు.

● ట్రిప్ వ్యవధి

ట్రిప్ వ్యవధి ఎక్కువగా ఉంటే, ప్రీమియం అంత ఎక్కువగా ఉంటుంది.

అలాగే, మీరు ఆన్‌లైన్ ప్రీమియం కాలిక్యులేటర్‌లో మీ ట్రిప్ సంబంధిత వివరాలను నమోదు చేసిన తర్వాత, USA కోసం ట్రావెల్ ప్లాన్ కొనుగోలు చేయడానికి మీరు చెల్లించవలసిన మొత్తాన్ని మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు, మీరు మరియు మీ జీవిత భాగస్వామి వరుసగా 36 మరియు 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే, 4 రోజులపాటు ప్రయాణిస్తున్నట్లయితే, ప్రీమియం ఈ క్రింది విధంగా ఉంటుంది –

● సిల్వర్ – ఇన్సూర్ చేయబడిన మొత్తం USD 50,000 – ప్రీమియం ₹948 (పన్నులు మినహాయించి)

● గోల్డ్ – ఇన్సూర్ చేయబడిన మొత్తం USD 100,000 – ప్రీమియం ₹1141 (పన్నులు మినహాయించి)

● ప్లాటినం – ఇన్సూర్ చేయబడిన మొత్తం USD 200,000 – ప్రీమియం ₹1339 (పన్నులు మినహాయించి)

● టైటానియం – ఇన్సూర్ చేయబడిన మొత్తం USD 500,000 – ప్రీమియం ₹1729 (పన్నులు మినహాయించి).

అలాగే, USAను సందర్శించేటప్పుడు మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. చెప్పాలంటే, USAలో వైద్య ఖర్చులు చాలా ఖరీదైనవి. ఒక సాధారణ హాస్పిటలైజేషన్ కోసం లక్షలు అవసరం కావచ్చు మరియు మీరు ఏదైనా చికిత్స పొందినట్లయితే, వైద్య బిల్లులు గణనీయంగా ఉండవచ్చు. మీరు USAకు ప్రయాణిస్తున్నప్పుడు, మీరు వైద్య అత్యవసర పరిస్థితులను అంచనా వేయలేరు. మీరు అనారోగ్యానికి గురికావచ్చు లేదా ఏదైనా గాయం వలన ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం మీకు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితులలో, వైద్య బిల్లులు మీకు భారంగా మారవచ్చు. మీ సేవింగ్స్ ఖర్చు అయిపోవచ్చు మరియు మీరు USA లో తీసుకున్న ఖరీదైన చికిత్సల కోసం చెల్లించడానికి కూడా లోన్ పొందవలసి రావచ్చు. అలాగే, మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేకపోతే, మీరు గణనీయమైన ఆర్థిక నష్టాలను ఎదుర్కోవచ్చు.

అత్యవసర హాస్పిటలైజేషన్ కోసం కవరేజ్ కాకుండా, USA కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అనేక కవరేజ్ ప్రయోజనాలను అందిస్తాయి. చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజీ నష్టం లేదా ఆలస్యం, హాస్పిటల్ రోజువారీ భత్యం, వైద్య తరలింపు, వైద్యం కోసం స్వదేశానికి తిరిగి రావడం, ప్రమాదవశాత్తు మరణం లేదా వైకల్యం, వ్యక్తిగత బాధ్యత, అత్యవసర సహాయం, హైజాక్ అలవెన్స్ మొదలైన వాటి కోసం మీరు కవర్ పొందవచ్చు. కాబట్టి, ఊహించని అత్యవసర పరిస్థితుల విషయంలో, పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది.

USA ఒక ఖరీదైన దేశం కాబట్టి, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది. ఒక చిన్న మరియు సరసమైన ప్రీమియంతో, మీరు ట్రిప్ సంబంధిత అత్యవసర పరిస్థితుల కోసం గణనీయమైన కవరేజ్ పొందవచ్చు.

USAలో హెల్త్‌కేర్ అనేది ప్రైవేట్ మరియు ప్రభుత్వం ప్రాయోజితం చేసిన ఆరోగ్య కార్యక్రమాల మిశ్రమం. అందువల్ల, పెయిడ్, ఉచిత క్లినిక్‌లు మరియు ఆసుపత్రులు ఉన్నాయి. అయితే, ప్రభుత్వం ద్వారా ప్రాయోజితం చేయబడిన ఉచిత హెల్త్‌కేర్ సౌకర్యం ఆ దేశంకి చెందిన పౌరులకు అందించబడుతుంది. పర్యాటకులు లేదా సందర్శకులు తమకు ఉచిత హెల్త్‌కేర్ సౌకర్యాలను పొందలేరు. కాబట్టి, USAకు ప్రయాణిస్తున్నప్పుడు, మీరు ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితితో బాధపడుతున్నట్లయితే మరియు సహాయం అవసరమైతే, మీరు దాని కోసం చెల్లించవలసి ఉంటుంది.

హెల్త్‌కేర్ సౌకర్యాల విషయానికి వస్తే, USA ఉత్తమ చికిత్సలు మరియు వైద్య సాంకేతికతను కలిగి ఉంది. అయితే, సౌకర్యాలు చవకగా రావు. హాస్పిటలైజేషన్ మరియు చికిత్సల ఖర్చు చాలా ఖరీదైనది మరియు సులభంగా భారతీయ కరెన్సీలో లక్షలలో ఉండవచ్చు. అందువల్ల, మీరు USAకు ప్రయాణిస్తున్నప్పుడు, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవలసిందిగా సలహా ఇవ్వబడుతుంది.

ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ వైద్య అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుంది మరియు మీ వైద్య బిల్లులను చెల్లిస్తుంది. అందువల్ల, మీ వద్ద ఉండే ఒక ట్రావెల్ ప్లాన్‌తో, మీరు ట్రిప్‌లో ఉచిత హెల్త్‌కేర్ సౌకర్యాల కోసం శోధించాల్సిన అవసరం లేదు లేదా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు అవసరమైన చికిత్సలను పొందవచ్చు మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఇందులోని ఖర్చులను కవర్ చేస్తుంది.

USA కవర్‌ల కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ –

● అత్యవసర వైద్య ఖర్చులు

● ఆసుపత్రి రోజువారీ క్యాష్ అలవెన్స్

● అత్యవసర వైద్య తరలింపు మరియు స్వదేశానికి తీసుకురావడం

● ప్రమాదవశాత్తు మరణాలు మరియు వైకల్యాలు

● భౌతిక అవశేషాలను స్వదేశానికి తీసుకురావడం

అందువల్ల, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ట్రావెల్ ప్లాన్ అనేది చాలా సమగ్రమైనది మరియు సంబంధిత ఖర్చుల గురించి ఆందోళన చెందకుండా ఉత్తమ హెల్త్‌కేర్ సౌకర్యాలను పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

అవును, విదేశీ వ్యక్తులు USAలో హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయవచ్చు. దేశం అందరికీ అందుబాటులో ఉన్న అనేక రకాల హెల్త్ ఇన్సూరెన్స్ పరిష్కారాలను అందిస్తుంది.

అయితే, USAలో హెల్త్ ఇన్సూరెన్స్ చవకైనది కాదు. ఇది ఎక్కువ డబ్బుతో కూడుకున్నది. అందుకే, మీరు భారతీయ పౌరులు అయితే మరియు ఒక విద్యార్థిగా లేదా సందర్శకునిగా యుఎస్ఎకు ప్రయాణిస్తున్నట్లయితే, మీరు భారతదేశంలోనే ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయవలసిందిగా సిఫార్సు చేయబడుతుంది.

USAకు ప్రయాణించే భారతీయ పౌరులకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో విదేశీ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. ఈ పాలసీ అనేది మీ ట్రిప్ వ్యవధిని కవర్ చేసే మరియు వైద్య అత్యవసర పరిస్థితుల్లో కవరేజీని అనుమతించే ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ. USAకు ప్రయాణిస్తున్నప్పుడు మీరు హాస్పిటలైజ్ చేయబడితే, పాలసీ హాస్పిటల్ బిల్లుల కోసం చెల్లిస్తుంది. అంతేకాకుండా, USA కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ల క్రింద ఈ క్రింది వాటి కోసం కవరేజ్ కూడా అందుబాటులో ఉంటుంది –

● వైద్య తరలింపు మరియు స్వదేశానికి తీసుకురావడం

● హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి రోజు హాస్పిటల్ క్యాష్ అలవెన్స్

● ప్రమాదవశాత్తు మరణం

● ప్రమాదం కారణంగా జరిగిన శాశ్వత పూర్తి వైకల్యం

● భౌతిక అవశేషాలను స్వదేశానికి తీసుకురావడం

మీరు వ్యక్తిగత లేదా వ్యాపార ప్రయాణం కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి USA ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. మూడు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి –

● USAకు ప్రయాణించే ఒకే వ్యక్తిని కవర్ చేసే వ్యక్తిగత ట్రావెల్ ప్లాన్

● ఒకే ప్లాన్‌లో మొత్తం కుటుంబాన్ని కవర్ చేసే ఫ్యామిలీ ట్రావెల్ ప్లాన్

● ఉన్నత విద్య కోసం USAకు ప్రయాణించే విద్యార్థిని కవర్ చేసే స్టూడెంట్ ట్రావెల్ ప్లాన్

హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కాకుండా, మీరు USA కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో అనేక ఇతర కవరేజ్ ప్రయోజనాలను కూడా ఆనందించవచ్చు. వివిధ ప్లాన్ వేరియంట్లు కూడా ఉన్నాయి, తద్వారా మీరు మీ అవసరాలను ఉత్తమంగా తీర్చే కవరేజీని ఎంచుకోవచ్చు.

అవార్డులు మరియు గుర్తింపు
x