హోమ్ / ట్రావెల్ ఇన్సూరెన్స్ / దుబాయి కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • FAQs

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు ప్రముఖ నగరాల్లో ఒకటిగా ఉన్న దుబాయ్ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఎత్తైన స్క్రాపర్లు మరియు విలాసవంతమైన మాల్‌లతో ప్రగల్బాలు పలుకుతున్న ఈ నగరం నిజంగా పట్టణీకరణ ఆకాశాన్ని తాకింది అన్నట్లు కనిపిస్తుంది. ఇది ఒక అద్భుతమైన నగరం, మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఈ ఎడారి ప్రాంతం మీ పర్యటనను గుర్తుండిపోయేలా చేస్తుంది. రుచికరమైన ఆహారం ఆస్వాదించడానికి మరియు మాల్స్‌లో షాపింగ్ చేయడానికి ఈ దుబాయ్ పర్యటన ఒక ఉత్తమ మార్గం. అయితే, వైద్య మరియు దంత అత్యవసర పరిస్థితులు, సామాను లేదా విమాన ఆలస్యాలు లాంటి ప్రయాణ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో దుబాయ్‌కు ప్రయాణించడం ఒక తెలివైన నిర్ణయం. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌‌ను కలిగి ఉండటం వలన అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఒత్తిడి లేకుండా నగరాన్ని అన్వేషించడానికి ప్రయాణీకుడికి అండగా ఉంటుంది.


దుబాయ్ వెళ్లే ముందు తప్పక తెలుసుకోండి


కేటగిరీ:  విశ్రాంతి/ వ్యాపారం/ విద్య 

కరెన్సీ: దిర్హం

ప్రయాణం చేయడానికి ఉత్తమ సమయం: ఏప్రిల్ నుండి నవంబర్

భారతీయుల కోసం వీసా రకం: ఆన్ అరైవల్

తప్పక చూడవలసిన ప్రదేశాలు: దుబాయ్ మిరాకల్ గార్డెన్, మెరైన్ డ్రీమ్, దుబాయ్ క్రీక్, డెసెర్ట్ సఫారి

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్: దుబాయ్ ఒక టూరిస్ట్ ఫ్రెండ్లీ నేషన్ అయినప్పటికీ, మీ వస్తువులు, మీ ప్రయాణాన్ని సురక్షితం చేసుకోవడం ముఖ్యం. సామాను నష్టం లేదా విమాన ఆలస్యాలు వంటి సాధారణ సమస్యలు మీ ట్రిప్ ప్లాన్‌ను చాలా ప్రభావితం చేయవచ్చు; అందువలన ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను పొందడం మీ తదుపరి దుబాయ్ పర్యటనకు చాలా ముఖ్యం.

#పైన పేర్కొన్నవి సమాచార ప్రయోజనం కోసం మాత్రమే. దయచేసి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేయడానికి ముందు, మీరు మీ ట్రావెల్ ఏజెంట్ లేదా సంబంధిత ఎంబసీని సంప్రదించండి

 

ఏమి చేర్చబడింది?

వైద్య సంబంధిత కవరేజ్

cov-acc

ఎమర్జెన్సీ వైద్య ఖర్చులు

ఈ ప్రయోజనం హాస్పిటలైజేషన్, గది అద్దె, OPD చికిత్స మరియు రోడ్ అంబులెన్స్ ఖర్చులను కవర్ చేస్తుంది. ఇది అత్యవసర వైద్య తరలింపు, భౌతికదేహాన్ని స్వదేశానికి తీసుకురావడం మరియు అవశేషాలను స్వదేశానికి తీసుకురావడంపై అయ్యే ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తుంది.

cov-acc

డెంటల్ ఖర్చులు

శారీరక అనారోగ్యం లేదా గాయం కారణంగా ఆసుపత్రిలో చేరడం ఎంత ముఖ్యమో దంత ఆరోగ్య సంరక్షణ కూడా అంతే ముఖ్యమని మేము నమ్ముతున్నాము; అందువలన, పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి మీ ప్రయాణ సమయంలో మీకు ఎదురయ్యే దంత వైద్య సంబంధిత ఖర్చులను కవర్ చేస్తాము.

cov-acc

పర్సనల్ యాక్సిడెంట్

అన్ని పరిస్థితులలో మేము మీకు అండగా ఉంటాము. విదేశాలకు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగిన సందర్భంలో, శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా సంభవించే ఏవైనా ఆర్థిక భారాలకు సహాయపడటానికి మా ఇన్సూరెన్స్ ప్లాన్ మీ కుటుంబానికి ఏకమొత్తం చెల్లింపును అందిస్తుంది.

cov-acc

పర్సనల్ యాక్సిడెంట్: కామన్ క్యారియర్

అన్ని సమయాల్లో మేము మీ పక్కనే ఉంటాము. కాబట్టి, దురదృష్టకర పరిస్థితులలో, ఒక సాధారణ క్యారియర్‌లో గాయం కారణంగా ఉత్పన్నమయ్యే ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యం సందర్భంలో మేము ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము.

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

హాస్పిటల్ క్యాష్ - యాక్సిడెంట్ మరియు అనారోగ్యం

గాయం లేదా అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తిని హాస్పిటలైజ్ చేసినట్లయితే, పాలసీ షెడ్యూల్‌లో పేర్కొన్న గరిష్ట రోజుల వరకు, హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి పూర్తి రోజుకు ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తాన్ని మేము చెల్లిస్తాము.

బ్యాగేజ్-సంబంధిత కవరేజ్

cov-acc

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ నష్టం

మీరు చెక్-ఇన్ చేయబడిన లగేజీని పోగొట్టుకున్నారా? ఆందోళన పడకండి; నష్టానికి మేము పరిహారం చెల్లిస్తాము, కాబట్టి వెకేషన్ కోసం ముఖ్యమైనవి మరియు ప్రాథమిక అవసరాలతో వెళ్ళవచ్చు. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

cov-acc

చెక్-ఇన్ చేయబడిన బ్యాగేజ్ యొక్క ఆలస్యం

వేచి ఉండటం అనేది ఎప్పుడూ సరదాగా ఉండదు. మీ లగేజీ రాకలో ఆలస్యం జరిగితే మేము దుస్తులు, టాయిలెట్రీలు, మెడిసిన్ లాంటి అవసరాల కోసం మీకు రీయింబర్స్‌ చేస్తాము, ఈ విధంగా మీరు మీ పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

cov-acc

బ్యాగేజ్ మరియు అందులోని వస్తువుల దొంగతనం

లగేజ్ దొంగతనం అనేది మీ ప్రయాణానికి ఆటంకం కలిగించవచ్చు. అయితే, మీ పర్యటన సజావుగా సాగేలా చూసేందుకు మేము లగేజ్ దొంగతనం సందర్భంలో డబ్బులు రీయంబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

ప్రయాణం-సంబంధిత కవరేజ్

cov-acc

విమాన ఆలస్యం మరియు రద్దు

విమాన ఆలస్యాలు లేదా రద్దులు మా నియంత్రణకు మించి ఉండవచ్చు, కానీ వాటి కోసం తక్కువ బాధ కలిగించేలా చేయడంలో సహాయపడటానికి మేము ఖచ్చితంగా ఏదైనా చేయగలము. మా రీయింబర్స్‌మెంట్ ఫీచర్ మీకు ఎదురుదెబ్బ నుండి ఉత్పన్నమయ్యే ఏవైనా ముఖ్యమైన ఖర్చులను తీర్చడానికి అనుమతిస్తుంది.

cov-acc

ట్రిప్ ఆలస్యం మరియు రద్దు

ట్రిప్ ఆలస్యం లేదా రద్దు విషయంలో, మీ ప్రీ-బుక్ చేయబడిన వసతి మరియు కార్యకలాపాల తిరిగి చెల్లించబడని భాగాన్ని మేము రీఫండ్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

cov-acc

పాస్‌పోర్ట్ మరియు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోల్పోవడం

ముఖ్యమైన డాక్యుమెంట్లను కోల్పోవడం వలన మీరు విదేశంలో చిక్కుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి, కొత్త లేదా డూప్లికేట్ పాస్‌పోర్ట్ మరియు/లేదా అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి సంబంధించిన ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

cov-acc

ట్రిప్ తగ్గింపు

ఊహించని పరిస్థితుల కారణంగా మీరు మీ ట్రిప్‌‌లో తక్కువ సమయం ఉండవలసి వస్తే చింతించకండి. పాలసీ షెడ్యూల్ ప్రకారం మీ నాన్-రీఫండబుల్ వసతి మరియు ప్రీ-బుక్డ్ కార్యకలాపాల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము.

cov-acc

వ్యక్తిగత బాధ్యత

మీరు ఎప్పుడైనా పర దేశంలో థర్డ్-పార్టీ నష్టానికి బాధ్యులుగా నిలిస్తే, మా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ నిబంధనలు మరియు షరతులకు లోబడి. మీ ఎదురయ్యే దంత ఖర్చులను కవర్ చేస్తాము.

cov-acc

ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కోసం అత్యవసర హోటల్ వసతి

వైద్య అత్యవసర పరిస్థితులు అంటే మీరు మరికొన్ని రోజుల కోసం మీ హోటల్ బుకింగ్‌ను పొడిగించవలసి ఉంటుంది. అదనపు ఖర్చు గురించి ఆందోళన చెందుతున్నారా?? ఆ విషయాన్ని మాకు వదిలేయండి. మీరు రికవర్ అయ్యేటప్పుడు దానిని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. పాలసీ నిబంధనలు మరియు షరతులకు లోబడి.

cov-acc

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్

మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ల కారణంగా ఊహించని ఖర్చుల గురించి ఆందోళన చెందకండి ; మీ గమ్యస్థానానికి చేరుకోవడానికి వసతి మరియు ప్రత్యామ్నాయ విమాన బుకింగ్ ఖర్చుల కోసం మేము మీకు రీయింబర్స్ చేస్తాము. షరతులు మరియు నిబంధనలకు లోబడి.

cov-acc

హైజాక్ డిస్ట్రెస్ అలవెన్స్

ఫ్లైట్ హైజాక్‌లు అనేవి బాధాకరమైన అనుభవం. మరియు అధికారులు సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతున్నప్పటికీ, మేము మా వంతు సహాయం చేస్తాము మరియు దాని వలన కలిగే ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తాము.

cov-acc

ఎమర్జెన్సీ క్యాష్ అసిస్టెన్స్ సర్వీస్

ప్రయాణిస్తున్నప్పుడు, దొంగతనం లేదా దోపిడీ నగదు కొరతకు దారితీయవచ్చు. కానీ చింతించకండి; హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అనేది భారతదేశంలో నివసించే ఇన్సూర్ చేయబడిన వ్యక్తి కుటుంబం నుండి నగదు బదిలీని సులభతరం చేస్తుంది.

ఇతర సంబంధిత కథనాలు

 

తరచుగా అడిగే ప్రశ్నలు

మీరు దుబాయ్‌కు ప్రయాణిస్తున్నట్లయితే, మీ ట్రిప్ ప్రారంభం అవ్వడానికి ముందు మీరు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. అనేక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ ప్లాన్‌ను అందిస్తాయి. మీ దుబాయ్ ట్రిప్‌ను సురక్షితం చేయడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కూడా ఒక సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందిస్తుంది. మీరు ఈ క్రింది మార్గాల్లో దుబాయ్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు –

● ఆఫ్‌లైన్

ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయడానికి మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో యొక్క సమీపంలో ఉన్న శాఖ కార్యాలయాన్ని సందర్శించాలి. బ్రాంచ్ వద్ద, ప్రతిపాదన ఫారం పొందండి మరియు ట్రిప్ వివరాలను పేర్కొంటూ దానిని పూరించండి. ఫారం సబ్మిట్ చేయండి మరియు ప్రీమియంను ముందుగానే చెల్లించండి. కంపెనీ ప్రతిపాదన ఫారంను అంచనా వేసి ధృవీకరిస్తుంది మరియు పాలసీని జారీ చేస్తుంది.

● ఆన్‌లైన్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ వారి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. https://www.hdfcergo.com/travel-insuranceని సందర్శించండి మరియు 'ఇప్పుడే కొనండి' పై క్లిక్ చేయండి. ట్రిప్ సంబంధిత వివరాలను అందించండి –

● ట్రిప్ రకం - వ్యక్తిగత, కుటుంబం లేదా విద్యార్థి ప్రయాణం

● ప్రయాణిస్తున్న సభ్యులు

● సభ్యుల వయస్సు

- సింగిల్ ట్రిప్స్: 6 నెలల నుండి 70 సంవత్సరాల వరకు

- వార్షిక మల్టీ ట్రిప్ ప్లాన్‌లు: 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు

- ఫ్యామిలీ ఫ్లోటర్: ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ స్వీయ, జీవిత భాగస్వామి మరియు 3 నెలల కనీస ప్రవేశ వయస్సు ఉన్న 2 పిల్లలను కవర్ చేస్తుంది

● గమ్యస్థానం - దుబాయ్

● ట్రిప్ ప్రారంభ తేదీ

● ట్రిప్ ముగింపు తేదీ

అలాగే, ప్లాన్ కొనుగోలులో వ్యక్తిగతీకరించిన సహాయం కోసం మీ సంప్రదింపు సమాచారాన్ని అందించండి. నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి మరియు ప్లాన్ ఎంపికలు మరియు వాటి సంబంధిత ప్రీమియంలను చూడటానికి కొనసాగండి. మీకు కావలసిన ప్లాన్‌ను ఎంచుకోండి, ఆన్‌లైన్‌లో ప్రీమియం చెల్లించండి మరియు పాలసీ తక్షణమే జారీ చేయబడుతుంది.

దుబాయ్ కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ కోసం మీరు ఎంత చెల్లించాలి అనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ అంశాల్లో క్రింది పేర్కొన్నవి ఉంటాయి –

● మీకు కావలసిన ప్లాన్ రకం - వ్యక్తిగత, ఫ్యామిలీ ట్రావెల్ లేదా స్టూడెంట్ ట్రావెల్ ప్లాన్

● మీరు ఎంచుకున్న ప్లాన్ రకం - కవరేజ్ ఫీచర్లను రకం నిర్ణయిస్తుంది. ఎంచుకున్న రకంలో ఎక్కువ కవరేజ్ ఫీచర్లు ఉంటే, ప్రీమియం అధికంగా ఉంటుంది

● మీరు ఎంచుకున్న ఇన్సూరెన్స్ మొత్తం - ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మొత్తం బాధ్యతను నిర్ణయిస్తుంది.

● సభ్యుల వివరాలు - ప్రయాణిస్తున్న సభ్యుల సంఖ్య మరియు వారి వయస్సు. సభ్యులు పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతుంది

● ట్రిప్ వ్యవధి - మీరు ఎన్ని రోజులు ప్రయాణిస్తున్నారు.

ప్లాన్ కోసం మీరు ఎంత చెల్లించాలో తెలుసుకోవడానికి హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆన్‌లైన్ ప్రీమియం క్యాలిక్యులేటర్లను అందిస్తుంది. క్యాలిక్యులేటర్‌లో పైన పేర్కొన్న వివరాలను నమోదు చేయండి మరియు మీరు ప్రీమియం మొత్తాన్ని కనుగొనగలుగుతారు.

ఉదాహరణకు, మీరు మరియు మీ జీవిత భాగస్వామి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే, 5 రోజులపాటు దుబాయ్‌కి ప్రయాణించినట్లయితే, వివిధ ప్లాన్ రకాల కోసం ప్రీమియం ఈ కింది విధంగా ఉంటుంది –

● సిల్వర్ ప్లాన్ – ₹728 + GST

● గోల్డ్ ప్లాన్ – ₹880 + GST

● ప్లాటినం ప్లాన్ – ₹1030 + GST

● టైటానియం ప్లాన్ – ₹1336 + GST

లేదు, దుబాయ్‌కు మీ ప్రయాణం కోసం ఒక మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తప్పనిసరి కాదు. అయితే, కవరేజీని విస్మరించడానికి ముందు, దుబాయ్‌లో వైద్య ఖర్చులు ఖరీదైనవి అని మీరు తెలుసుకోవాలి. దుబాయ్ అనారోగ్యాలు మరియు గాయాల కోసం అత్యాధునిక వైద్య చికిత్సలను అందిస్తుంది మరియు అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్న ఆసుపత్రులను కలిగి ఉంది. అటువంటి ఆసుపత్రులలో చికిత్సలు మరియు ఇతర వైద్య ఖర్చులు చవకగా ఉండవు. మీరు ట్రిప్‌లో అనారోగ్యానికి గురైనా లేదా గాయానికి గురైనా వాటి చికిత్స కోసం అయ్యే వైద్య ఖర్చులు మీకు భారంగా మారవచ్చు. అందువల్ల, మీకు అటువంటి ఖరీదైన వైద్య ఖర్చుల కోసం ఒక ఏర్పాటు అవసరం, ఇటువంటి పరిస్థితులలోనే మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది.

ఒక మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ దుబాయ్‌లో ప్రయాణించేటప్పుడు ఏర్పడే అత్యవసర వైద్య పరిస్థితులను కవర్ చేస్తుంది. అటువంటి ప్లాన్‌లు సమగ్ర వైద్య కవరేజీని అందిస్తాయి, ఇది మీ పై హాస్పిటల్ బిల్లుల భారం పడకుండా నిర్ధారిస్తుంది.

మీరు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందిస్తున్న మెడికల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఎంచుకుంటే, మీరు ఈ క్రింది వాటి కోసం కవరేజ్ పొందవచ్చు ‌‌ –

● దుబాయ్‌లో ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్సలు

● భౌతిక అవశేషాలను స్వదేశానికి తీసుకురావడం

● అత్యవసర పరిస్థితిలో డెంటల్ చికిత్సలు

● హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి రోజు కోసం రోజువారీ నగదు భత్యం

● ప్రమాదం కారణంగా మరణం లేదా శాశ్వత వైకల్యం ఏర్పడిన సందర్భంలో ఏకమొత్తంలో పరిహారం

కవరేజ్ USD 50,000 నుండి USD 500,000 వరకు ఉంటుంది. మీరు తగిన ప్లాన్ ఎంపికను ఎంచుకోవచ్చు మరియు మీ ప్రయాణ బడ్జెట్‌ను దెబ్బతీయకుండా అత్యవసర వైద్య పరిస్థితుల కోసం కవరేజీని ఆనందించవచ్చు. కాబట్టి, అది తప్పనిసరి కాకపోయినప్పటికీ దుబాయ్ కోసం ఒక మెడికల్ ట్రావెల్ ప్లాన్ ఎంచుకోండి.

లేదు, మీరు దుబాయ్‌కు ప్రయాణిస్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. అయితే, ఆర్థిక నష్టాన్ని కలిగించే ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉపయోగకరంగా ఉండవచ్చు. ఆ కారణంగా ఈ ప్లాన్ సిఫార్సు చేయబడుతుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో మీరు పొందగల కవరేజ్ ప్రయోజనాలను ఇక్కడ చూడండి –

● మెడికల్ కవరేజ్

ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో అత్యంత ముఖ్యమైన కవరేజ్ అత్యవసర వైద్య పరిస్థితులకు అందించే కవరేజ్. దుబాయ్‌కు ప్రయాణిస్తున్నప్పుడు మీకు ఏదైనా ఊహించని అనారోగ్యం లేదా గాయం కలిగితే, ఈ ప్లాన్ హాస్పిటలైజేషన్ మరియు సంబంధిత చికిత్సల ఖర్చును కవర్ చేస్తుంది. అంతేకాకుండా, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లతో మీరు వైద్యపరమైన తరలింపు మరియు స్వదేశానికి పంపడం, డెంటల్ చికిత్సలు మరియు హాస్పిటలైజేషన్ కోసం రోజువారీ భత్యం కొరకు కూడా కవరేజ్ పొందుతారు.

● ట్రిప్ కవరేజ్

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ట్రావెల్ ప్లాన్ కొన్ని ప్లాన్లలో విమాన ఆలస్యాలకు కూడా కవరేజీని అందిస్తుంది.

● బ్యాగేజ్ కవర్

ప్రయాణంలో మీరు బ్యాగేజ్ కోల్పోయినా లేదా చెక్ ఇన్ చేయబడిన బ్యాగేజ్ అందుకోవడంలో జాప్యం జరిగినా, ఆ కారణంగా ఏర్పడిన ఆర్థిక నష్టాలు కవర్ చేయబడతాయి

● లయబిలిటీ కవర్

మీరు మరొక వ్యక్తికి ఏదైనా భౌతిక లేదా ఆస్తి సంబంధిత నష్టానికి కారణం అయితే, ఆ నష్టాలకు మీరు ఆర్థికంగా బాధ్యత వహించవలసి ఉంటుంది. అటువంటి బాధ్యత వలన ఏర్పడే భారం నుండి మిమ్మల్ని ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ రక్షిస్తుంది

● పర్సనల్ యాక్సిడెంట్ కవర్

మీరు ట్రిప్‌లో ఉన్నప్పుడు ఒక ప్రమాదం కారణంగా మరణించినా లేదా శాశ్వత వైకల్యం ఏర్పడినా మీరు కవరేజ్ పొందుతారు.

ఈ కవరేజ్ ప్రయోజనాలతో, మీరు దుబాయ్‌కు ప్రయాణించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ తప్పనిసరి కానప్పటికీ, అవసరం అయిన సమయంలో సహాయపడుతుంది.

అవును, దుబాయ్‌లో ఉచిత హెల్త్‌కేర్ సౌకర్యాలు ఉన్నాయి, ఇందులో వ్యక్తులు పబ్లిక్ సదుపాయాలలో ఉచిత వైద్య చికిత్సలను పొందవచ్చు. అయితే, ఈ ఉచిత సౌకర్యం దుబాయ్ నివాసులు మరియు పౌరులకు అందుబాటులో ఉంది. మీరు విశ్రాంతి లేదా వ్యాపారం కోసం లేదా విద్యార్థిగా దుబాయ్‌కు ప్రయాణిస్తున్నట్లయితే, మీరు ఉచిత ఆరోగ్య సంరక్షణ కోసం అర్హత కలిగి ఉండరు.

అటువంటి పరిస్థితుల్లో, మీకు దుబాయ్‌లో వైద్య సహాయం అవసరమైతే మీరు ఎదుర్కొనే ఖరీదైన వైద్య ఖర్చుల నుండి రక్షించడానికి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవసరం. ఇటువంటి పరిస్థితులలో ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉపయోగపడుతుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే అంతర్జాతీయ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ మీరు విదేశాలకు, ఈ సందర్భంలో దుబాయ్, కి ప్రయాణిస్తున్నప్పుడు అత్యవసర వైద్య పరిస్థితుల కోసం అయ్యే ఖర్చును కవర్ చేస్తుంది. ఊహించని అనారోగ్యం లేదా గాయం కారణంగా అవసరమైన ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్‌ల కోసం మీరు కవరేజ్ పొందుతారు. చికిత్సల ఖర్చుతో పాటు, వీటి కోసం కూడా కవరేజ్ అనుమతించబడుతుంది –

● వైద్యపరమైన తరలింపు - అత్యవసర పరిస్థితిలో రహదారి లేదా వాయుమార్గం ద్వారా ఆసుపత్రికి తరలింపు.

● భౌతిక అవశేషాలను స్వదేశానికి తీసుకురావడం - ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ప్రయాణంలో మరణిస్తే శరీరానికి తిరిగి భారతదేశానికి తరలించడం

● డెంటల్ చికిత్సలు - అత్యవసర పరిస్థితి కారణంగా అవసరమైనవి

● హాస్పిటల్ క్యాష్ అలవెన్స్ - హాస్పిటలైజేషన్ యొక్క ప్రతి రోజు కోసం చెల్లించబడే ఒక రోజువారీ అలవెన్స్

● ప్రమాదం కారణంగా మరణం లేదా శాశ్వత వైకల్యం - ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఒక ప్రమాదంలో మరణించిన సందర్భంలో ఏకమొత్తంలో చెల్లించబడే పరిహారం

మీరు USD 500,000 వరకు కవరేజీని పొందవచ్చు మరియు మీరు ఒక పర్యాటకునిగా, సందర్శకునిగా లేదా విద్యార్థిగా దుబాయ్‌కు ప్రయాణిస్తున్నప్పుడు అయ్యే వైద్య ఖర్చుల కోసం మీరు కవర్ చేయబడతారని నిర్ధారించుకోవచ్చు.

మూలం: ఎక్స్‌పాట్ అరైవల్స్

విదేశీ వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందించే అనేక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు దుబాయ్‌లో ఉన్నాయి. కాబట్టి, మీరు దుబాయ్‌లో ఒక విదేశీ వ్యక్తిగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు పొడిగించబడిన అవధి కోసం దుబాయ్‌లో ఉంటే అటువంటి ప్లాన్లు తగినవి. మీరు సెలవు లేదా పని కోసం దుబాయ్‌ను సందర్శిస్తున్నట్లయితే, హెల్త్ ఇన్సూరెన్స్‌ను కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం అవ్వకపోవచ్చు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు దుబాయ్‌లో బస చేస్తున్నట్లయితే వారు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలును నివారించాలి.

బదులుగా, దుబాయ్‌లో అత్యవసర వైద్య పరిస్థితులను కవర్ చేసే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను భారతదేశంలో మీరు ఎంచుకోవచ్చు. మీ ప్రయాణ వ్యవధిని కవర్ చేసే ఒక ప్లాన్‌ను కొనుగోలు చేయండి మరియు దుబాయ్‌లో మీకు అయ్యే వైద్య ఖర్చుల నుండి మీరు సురక్షితంగా ఉంటారు. అధిక ఇన్సూరెన్స్ మొత్తాన్ని ఎంచుకోండి, అత్యవసర పరిస్థితుల్లో మీకు ఎదురయ్యే ఖరీదైన వైద్య చికిత్సలను ఈ ప్లాన్ కవర్ చేస్తుంది.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో దుబాయ్ కోసం సమగ్ర ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను అందిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోతో మీరు వీటిని ఆనందించవచ్చు –

● దుబాయ్‌లో ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదురహిత చికిత్సలు

● ఇన్‌పేషెంట్ హాస్పిటలైజేషన్

● వైద్య తరలింపు మరియు స్వదేశానికి తీసుకురావడం

● డెంటల్ చికిత్సలు

● హాస్పిటల్ క్యాష్ అలవెన్స్

ఈ కవరేజ్ ఫీచర్లు మీ బడ్జెట్‌కు భారం అవ్వకుండా దుబాయ్‌లో వైద్య సహాయం పొందడానికి మీకు సహాయపడతాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది మీరు ట్రిప్‌లో ఎదుర్కొనే ఇతర అత్యవసర పరిస్థితుల నుండి కూడా రక్షించే అదనపు కవరేజ్ ప్రయోజనాలతో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ కోసం అయ్యే ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి, దుబాయ్‌లో మిమ్మల్ని మీరు ఇన్సూర్ చేసుకోవడానికి బదులుగా, భారతదేశంలోనే ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం మరియు మీ ట్రిప్‌ను తక్కువ రేట్ల వద్ద సురక్షితం చేయడం మంచిది.

అవార్డులు మరియు గుర్తింపు
x