నాలెడ్జ్ సెంటర్
హోమ్ / హోమ్ ఇన్సూరెన్స్ / ప్రాపర్టీ ఇన్సూరెన్స్

ఆస్తి ఇన్సూరెన్స్

ఆస్తి ఇన్సూరెన్స్

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అని మేము చెప్పినప్పుడు, అది ఆస్తి యజమానులకు రక్షణ కవరేజీ అందించే ఒక రకమైన హోమ్ ఇన్సూరెన్స్‌గా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, అగ్నిప్రమాదం మొదలైన వాటి కారణంగా ఆస్తికి జరిగే నష్టం వల్ల ఏర్పడే ఆర్థిక నష్టాలను నివారించడానికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది యజమానికి సహాయపడగలదు.

మీ సొంతం అని చెప్పుకునే ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి మీరు మీ జీవితకాలం పొదుపులను వెచ్చించాల్సి ఉంటుంది! అయితే, అస్తి కొనుగోలు చేయడంతోనే మీ పని ముగిసిపోదు. మీరు ఊహించని సంఘటనల నుండి కూడా మీ ఆస్తిని సురక్షితం చేసుకోవాలి. కాబట్టి, మీరు మీ ఆస్తిని రక్షించుకోవడానికి, మీరు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సరసమైన ప్రీమియంలతో ప్రత్యేకంగా రూపొందించబడింది, దీని ద్వారా మీరు రక్షణ మరియు భద్రత అందుకోవచ్చు. కాబట్టే, మీ ఆర్థిక పొదుపులను రక్షించుకోవడానికి మరియు ప్రకృతి వైపరీత్యాలు, దొంగతనం, ప్రమాదవశాత్తూ నష్టం మొదలైన వాటి నుండి మీ ఆస్తిని రక్షించడానికి, మీరు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాల్సిందిగా మేము సిఫార్సు చేస్తున్నాము. తద్వారా, అనవసర సందర్భాలలో పెను ఆర్థిక భారం ఎదురయ్యే పరిస్థితిని నివారించండి.

మీకు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అవసరమేమిటి?

అగ్నిప్రమాదం, అల్లర్లు, ప్రకృతి వైపరీత్యాలు మరియు ఇతర ఊహించని సంఘటనల కారణంగా మీ ఇంట్లోని వస్తువులు/మీ ఇంటి నిర్మాణం దెబ్బతినడం వల్ల సంభవించగల ఏదైనా ఆర్థిక భారాన్ని నివారించడానికి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతే కాకుండా, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఎందుకు కలిగి ఉండాలో చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని మేము క్రింద చర్చించాము

1. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తో మీరు మీ ఇంట్లోని వస్తువులు మరియు మీ ఇంటి నిర్మాణం రెండింటి కోసం ఒక సమగ్ర కవరేజీ అందుకోవచ్చు.

2. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఏదైనా ప్రమాదం నుండి మీ విలువైన ఆస్తిని సురక్షితం చేయడంలో సహాయపడుతుంది.

3. ఇన్సూర్ చేయబడిన మీ ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే, దాని మరమ్మత్తు ఖర్చు అనేది ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ద్వారా కవర్ చేయబడుతుంది.

4. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది ఖాళీగా ఉండే ఇంటికి కూడా కవరేజీ అందిస్తుంది. మీరు మీ ఇంట్లో లేనప్పటికీ, దాని మరమ్మత్తు/పునర్నిర్మాణం కోసం అయ్యే ఖర్చు కవర్ చేయబడుతుంది.

5. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది కంటెంట్ (వస్తువులు) కోసం కవరేజీ అందించడం ద్వారా ఆర్థిక ఒత్తిడి నివారిస్తుంది కాబట్టి, అద్దె అపార్ట్‌మెంట్‌లో నివసించే వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

6. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు మరియు మీ క్లెయిమ్‌లు ప్రాసెస్ చేయడానికి లేదా మీ సంబంధిత ఇన్సూరెన్స్ ప్లాన్‌ గురించి ఏదైనా సమస్యను పరిష్కరించడానికి మా కస్టమర్ సపోర్ట్ బృందం 24x7 అందుబాటులో ఉంటుంది.

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ యొక్క ప్రీమియంను ప్రభావితం చేసే అంశాలు

స్థానం

స్థానం

తరచూ వరదలు లేదా భూకంపాలు వచ్చే ప్రదేశంలో మీ ఆస్తి ఉంటే, అలాంటప్పుడు మీ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

మీ భవనం వయస్సు మరియు నిర్మాణం

మీ భవనం వయస్సు మరియు నిర్మాణం

మీ ఆస్తి కొంచెం పాతదిగా మరియు నిర్మాణ సంబంధిత సమస్యలతో ఉంటే, అప్పుడు మీ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

హోమ్ సెక్యూరిటీ

హోమ్ సెక్యూరిటీ

మీ ఆస్తికి అన్ని భద్రతా వ్యవస్థలు ఉంటే, దొంగతనం జరిగే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి, ఆలాంటి సందర్భాల్లో మీ ప్రీమియం కూడా తక్కువగా ఉండవచ్చు.

అందులోని వస్తువుల మొత్తం

అందులోని వస్తువుల మొత్తం

మీరు ఇన్సూర్ చేయడానికి ఎంచుకున్న కొన్ని విలువైన వస్తువులు కూడా మీ ఆస్తిలో ఉంటే, అలాంటప్పుడు ఇన్సూర్ చేయడానికి మీరు ఎంచుకున్న కంటెంట్ విలువ మీద మీ ప్రీమియం ఆధారపడి ఉండవచ్చు.

మీ ఆస్తికి సంబంధించిన ఇన్సూర్ చేయబడిన మొత్తం లేదా మొత్తం విలువ

మీ ఆస్తికి సంబంధించిన ఇన్సూర్ చేయబడిన మొత్తం లేదా మొత్తం విలువ

ప్రీమియంను నిర్ణయించే సమయంలో మీ ఆస్తి మొత్తం విలువ కీలకంగా ఉంటుంది. మీ ఆస్తి నిర్మాణ విలువ ఎక్కువగా ఉంటే మీ ప్రీమియం ఎక్కువగా ఉంటుంది మరియు ప్రీమియం ఎక్కువగా ఎక్కువగా ఉంటే, ఆస్తి విలువ కూడా ఎక్కువే ఉంటుంది. మీ ఆస్తి మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్సూర్ చేసిన మొత్తం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దానిని మీ ఇంటి మార్కెట్ విలువగా కూడా పిలుస్తారు.

హెచ్‍‌డిఎఫ్‌సి ఎర్గోతో మీ ఆస్తిని కవర్ చేయడానికి కారణాలు

స్వల్ప కాలపు బస? ఎక్కువ ప్రయోజనాలు

స్వల్ప కాలపు బస? ఎక్కువ ప్రయోజనాలు

మీ ఆస్తిని ఇన్సూర్ చేయడానికి చేసే ఖర్చు వృధా అవుతుందని చింతిస్తున్నారా? మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది మీ సౌలభ్యానికి తగ్గట్టుగా అవధిని ఎంచుకునే సౌకర్యం అందిస్తుంది. అయితే, కనిష్ట అవధి అనేది కనీసం ఒక సంవత్సరం ఉండాలి.

45% వరకు డిస్కౌంట్‌లు

45% వరకు డిస్కౌంట్‌లు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తో, మీరు మీ ప్రీమియంల మీద కొన్ని ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో మీ ఇంటిని ఇన్సూర్ చేసుకోవచ్చు. జీతం పొందే ఉద్యోగి, దీర్ఘకాలిక పాలసీ మొదలైన వాటి కోసం ఆన్‌లైన్‌లో పాలసీ కొనుగోలు చేసినప్పుడు మేము డిస్కౌంట్‌లు అందిస్తాము.

₹ 25 లక్షల వరకు వస్తువులు కవర్ చేయబడతాయి

₹ 25 లక్షల వరకు వస్తువులు కవర్ చేయబడతాయి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది మీరు ఎటువంటి నిర్దిష్ట గృహోపకరణాల జాబితాను పంచుకోవాల్సిన అవసరం లేకుండానే, మీ అన్ని వస్తువులను (₹ 25 లక్షల వరకు) కవర్ చేసే ఎంపికను అందిస్తుంది.

పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ కవర్ చేయబడతాయి

పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ కవర్ చేయబడతాయి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తో ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్‌లు మరియు టాబ్లెట్‌లు వంటి మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను ఇన్సూర్ చేయండి మరియు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలకు నష్టం కారణంగా సంభవించే ఆర్థిక నష్టాలను నివారించండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ద్వారా ఉత్తమ హోమ్ ఇన్సూరెన్స్
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగి పడటం వంటి రూపాల్లో వాతావరణంలోని మార్పుల భారాన్ని భారతదేశం భరిస్తోంది. మీరు నిర్ణయం తీసుకోవడానికి మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి మీ ఆస్తిని సురక్షితం చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ద్వారా అందించబడే కవరేజీని అర్థం చేసుకోండి

అగ్ని

అగ్ని

అగ్నిప్రమాదం అనేది మీ కలల ఆస్తిని సర్వనాశనం చేయగలదు. అగ్నిప్రమాదం కారణంగా జరిగిన నష్టాలను మా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది కాబట్టి, మీరు మీ ఇంటిని పునర్నిర్మించుకోవచ్చు.

దొంగతనాలు మరియు దోపిడీలు

దొంగతనం మరియు దోపిడీ

మీ విలువైన ఆభరణాలు లేదా ఇతర విలువైన వస్తువుల నుండి దొంగలను దూరంగా ఉంచవచ్చు. మీరు వాటిని కవర్ చేసినట్లయితే, సులభంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్

ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్

ఉపకరణాలు లేకుండా మనం మన జీవితాలను ఊహించలేము! ఎలక్ట్రికల్ బ్రేక్‌డౌన్ నుండి కవరేజీ పొందడానికి వాటిని ఇన్సూర్ చేయండి.

ప్రకృతి వైపరీత్యాలు

ప్రకృతి వైపరీత్యాలు మరియు మానవ నిర్మిత సంఘటనలు

తుఫాను, భూకంపం, వరద మొదలైన వాటి కారణంగా మీ ఆస్తి దెబ్బతిన్నప్పుడు మేము మీకు కవరేజీ అందిస్తాము! అలాగే, సమ్మెలు, అల్లర్లు, తీవ్రవాదం మరియు హానికర చర్యల నుండి మీ ఇంటిని సురక్షితం చేసుకోండి.

ప్రత్యామ్నాయ వసతి

ప్రత్యామ్నాయ వసతి

ఇన్సూరెన్స్ చేయబడిన ఆస్తికి నష్టం జరిగి, ఇన్సూరెన్స్‌లో పేర్కొన్న ప్రమాదం కారణంగా అది నివాసయోగ్యం కానిదిగా మారినట్లు భావించబడితే, యజమాని తాత్కాలిక బస కోసం కూడా ఇన్సూరర్ ద్వారా ఏర్పాట్లు చేయబడుతాయి.

ప్రమాదం వలన నష్టం

ప్రమాదం వలన నష్టం

ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తో ఖరీదైన ఫిట్టింగ్‌లు మరియు ఫిక్సర్‌ల కోసం కూడా మీకు రక్షణ లభిస్తుంది. కాబట్టి, ప్రమాదవశాత్తూ నష్టం జరిగితే, మీ విలువైన వస్తువులకు కవరేజీ లభిస్తుంది.

యుద్ధం

యుద్ధం

యుద్ధం, దండయాత్ర, విదేశీ శత్రు చర్యలు, శత్రువుల దాడి లాంటి సంఘటనల వల్ల నష్టం జరగడం/దెబ్బతినడం జరిగితే, అవి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లో కవర్ చేయబడవు.

విలువైన సేకరణలు

విలువైన సేకరణలు

బులియన్లు, స్టాంపులు, కళాఖండాలు, నాణేలు మొదలైన వాటికి మొదలైన వాటికి జరిగే నష్టాలు కవర్ చేయబడవు.

పాత వస్తువులు

పాత వస్తువులు

మీ అన్ని విలువైన వస్తువులకు భావోద్వేగ విలువ కూడా ఉందని మేము అర్థం చేసుకున్నాము కానీ, 10 సంవత్సరాల కంటే ఎక్కువ పాతబడిన వస్తువులకు ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ లభించదు.

పర్యవసాన నష్టం

పర్యవసాన నష్టం

పర్యవసానమైన నష్టాలు అనేవి సాధారణ విషయాలలో ఉల్లంఘన కారణంగా వచ్చే నష్టాలు, అటువంటి నష్టాలు కవర్ చేయబడవు.

ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన

ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన

మీరు ఊహించని మీ నష్టాలు కవర్ చేయబడతాయని మేము నిర్ధారిస్తాము కానీ, నష్టం అనేది ఉద్దేశపూర్వకంగా జరిగిన పక్షంలో, దానికి కవర్ లభించదు.

థర్డ్ పార్టీ నిర్మాణ నష్టం

థర్డ్ పార్టీ నిర్మాణ నష్టం

థర్డ్ పార్టీ నిర్మాణం కారణంగా మీ ఆస్తికి జరిగిన ఏదైనా నష్టం కవర్ చేయబడదు.

అరుగుదల మరియు తరుగుదల

అరుగుదల మరియు తరుగుదల

మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది సాధారణ అరుగుదల మరియు తరుగుదల లేదా నిర్వహణ/పునరుద్ధరణను కవర్ చేయదు.

భూమి ఖర్చు

భూమి ఖర్చు

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కొన్ని పరిస్థితులలో భూమి ఖర్చును కవర్ చేయదు.

నిర్మాణంలో ఉంది

నిర్మాణంలో ఉంది

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కవర్ అనేది మీరు నివసిస్తున్న మీ ఇంటి కోసం ఉద్దేశించబడినది. నిర్మాణంలో ఉన్న ఏదైనా ఆస్తి కోసం ఈ కవర్ లభించదు.

ప్రాపర్టీ కవరేజీ కోసం హోమ్ ఇన్సూరెన్స్ కింద ఆప్షనల్ కవర్

  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ ఇన్సూరెన్స్ నుండి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలకు కవర్

    పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కవర్

  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ ఇన్సూరెన్స్ నుండి ఆభరణాలు, విలువైన వస్తువులకు కవర్

    ఆభరణాలు మరియు విలువైన వస్తువులు

  • పెడల్ సైకిల్

    పెడల్ సైకిల్

  • టెర్రరిజం కొరకు కవర్

    టెర్రరిజం కొరకు కవర్

పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కవర్
పోర్టబుల్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్ కవర్

మీరు తరలించేటప్పుడు కూడా మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సురక్షితం చేసుకోండి.

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ప్రాపర్టీ ఇన్సూరెన్స్‌తో ల్యాప్‌టాప్, కెమెరా, సంగీత పరికరాల వంటి పోర్టబుల్ ఎలక్ట్రానిక్ వస్తువులకు యాడ్-ఆన్ కవరేజీ పొందండి. అయితే, 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగిన ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎలాంటి కవరేజీ ప్రయోజనాలు లభించవు.

మీరు విహారయాత్రకు వెళ్లినప్పుడు, ప్రమాదవశాత్తూ మీ కెమెరా దెబ్బతింటే, కెమెరా నష్టాన్ని మేము కవర్ చేస్తాము కానీ, ఆ దెబ్బతినడమనేది ఉద్దేశ్యపూర్వక చర్యగా ఉండకూడదు.

మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి 4 సులభమైన దశలలో తెలుసుకోండి

మీ హోమ్ ఇన్సూరెన్స్ ప్రీమియంను లెక్కించడం చాలా సులభం. వేగంగా పూర్తి అయ్యే 4 దశలను అనుసరిస్తే సరిపోతుంది.

మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను తెలుసుకోండి
దశ 1 : మీరు ఏమి కవర్ చేస్తున్నారు?

దశ 1

మీరు ఏది ఇన్సూర్ చేయాలనుకుంటున్నారో
మాకు తెలియజేయండి

ఫోన్-ఫ్రేమ్
దశ 2: ఆస్తి వివరాలను నమోదు చేయండి

దశ 2

ఆస్తి వివరాలను పూరించండి

ఫోన్-ఫ్రేమ్
దశ 3: అవధిని ఎంచుకోండి

దశ 3

బీమా మొత్తాన్ని ఎంచుకోండి

ఫోన్-ఫ్రేమ్
దశ 4: హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకోండి

దశ 4

ప్రీమియంని లెక్కించండి

మీ హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఎలా క్లెయిమ్ చేయాలి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో హోమ్ ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేయండి

క్లెయిమ్‌ను నమోదు చేయడానికి లేదా సమాచారం అందించడానికి, మీరు మా హెల్ప్‌లైన్ నెంబర్ 022 - 6234 6234కు కాల్ చేయండి లేదా మా కస్టమర్ సర్వీస్ డెస్క్‌ ఇమెయిల్ ఐడి care@hdfcergo.comపై మెయిల్ పంపండి, క్లెయిమ్ నమోదు చేసిన తర్వాత, మా బృందం మీకు ప్రతి దశలో మార్గనిర్దేశం చేస్తుంది, ఎటువంటి అవాంతరాలు లేకుండా క్లెయిమ్‌లను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి ఈ క్రింది ప్రామాణిక డాక్యుమెంట్లు అవసరం:

- పాలసీ/పూచీకత్తు డాక్యుమెంట్లు
- ఫోటోగ్రాఫ్స్
- క్లెయిమ్ ఫారం
- లాగ్ బుక్/ ఆస్తి రిజిస్టర్ / క్యాపిటలైజ్ చేయబడిన వస్తువుల జాబితా (వర్తించే చోట)
- రశీదుతో కూడిన రిపేర్ / రీప్లేస్‌మెంట్ ఇన్వాయిస్‌లు
- క్లెయిమ్ ఫారం
- అన్ని వర్తించే చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్లు
- FIR కాపీ (ఒకవేళ వర్తిస్తే)

హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

చదవడం పూర్తయిందా? ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
ఇప్పుడే దానిని కొనండి!

తాజా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ బ్లాగ్‌లు చదవండి

'హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం ఒక అద్భుతమైన మార్గదర్శని'

'హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల కోసం ఒక అద్భుతమైన మార్గదర్శని'

మరింత చదవండి
20 సెప్టెంబర్ 2021 న ప్రచురించబడింది
మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎంచుకోవాల్సిన 5 యాడ్-ఆన్‌లు

మీ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కోసం మీరు ఎంచుకోవాల్సిన 5 యాడ్-ఆన్‌లు

మరింత చదవండి
13 సెప్టెంబర్ 2021 న ప్రచురించబడింది
ప్రాపర్టీ ఇన్సూరెన్స్: ఇన్సూర్ చేయండి, సమాచార సహితంగా ఉండండి

ప్రాపర్టీ ఇన్సూరెన్స్: ఇన్సూర్ చేయండి, సమాచార సహితంగా ఉండండి

మరింత చదవండి
8 సెప్టెంబర్ 2021 న ప్రచురించబడింది
మీ ఇంటిని సురక్షితం చేసుకోవడానికి సులభమైన మరియు తెలివైన మార్గాలు

మీ ఇంటిని సురక్షితం చేసుకోవడానికి సులభమైన మరియు తెలివైన మార్గాలు

మరింత చదవండి
19 ఆగస్ట్ 2021న ప్రచురించబడింది

ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి తరచూ అడగబడే ప్రశ్నలు

మీ ఇంట్లోని వస్తువులు ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీ క్రింద కవర్ చేయబడతాయి. ఈ వస్తువులలో ఈ క్రిందివి ఉంటాయి –

● ఫర్నిచర్ మరియు ఫిక్స్చర్స్

● టెలివిజన్ సెట్లు

● హోమ్ అప్లయెన్సెస్

● వంటగది ఉపకరణాలు

● నీటి నిల్వ పరికరం

● ఇతర గృహోపకరణాలు

అంతేకాకుండా, మీరు అదనపు ప్రీమియం కూడా చెల్లించవచ్చు మరియు ఆభరణాలు, కళాఖండాలు, అరుదైన వస్తువులు, వెండి వస్తువులు, పెయింటింగ్లు, కార్పెట్లు, పురాతన వస్తువులు మొదలైనటువంటి మీ విలువైన వస్తువులను ఇన్సూర్ చేయవచ్చు.

లేదు, ఒక నిర్దేశిత బ్యాంక్ నుండి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయడం తప్పనిసరి కాదు. సాధారణంగా, హోమ్ లోన్లను అనుమతించే బ్యాంకులు హోమ్ లోన్‌తో కలపబడిన ప్రాపర్టీ ఇన్సూరెన్స్ పాలసీని అందించవచ్చు. అయితే, మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను సరిపోల్చడానికి మరియు మీ అవసరానికి సరిపోయే ప్లాన్‌ను ఎంచుకోవడానికి మీకు ఎంపిక ఉంటుంది.

సరిపోల్చడానికి మీరు కవరేజ్ ప్రయోజనాలను, ఇన్సూర్ చేయబడిన మొత్తం మరియు ఛార్జ్ చేయబడిన ప్రీమియంను చూడాలి. అత్యంత సమగ్ర కవర్ పరిధిని అందించే ఒక ప్లాన్‌ను ఎంచుకోండి, తద్వారా సాధ్యమైన నష్టాలు ఇన్సూర్ చేయబడతాయి. అంతేకాకుండా, మీరు ఉత్తమ డీల్ పొందడానికి ప్రీమియం ఆకర్షణీయంగా ఉండాలి.

అవును, మీరు ఒక భవనంలో నివసిస్తున్నట్లయితే, మా హోమ్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో మీ ఇంటికి రక్షణ కల్పించవచ్చని మేము తెలియజేస్తున్నాము. ప్రీమియం రేట్‌లు తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఖచ్చితంగా కాదు. అయితే, ప్రకృతి వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు లేదా దొంగతనం లాంటి సందర్భాల్లో, హోమ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తో కొనుగోలుదారులు వారి అత్యంత విలువైన ఆస్తిని సురక్షితం చేసుకునేలా ప్రోత్సహించబడుతారు.

అవును. ఫర్నిచర్, విలువైన వస్తువులు మరియు పోర్టబుల్ ఎలక్ట్రానిక్స్ వంటి మీ ఇంట్లోని వస్తువులను మేము సురక్షితం చేస్తాము.

మీ ఇంటి నిర్మాణానికి నష్టం ఏర్పడిన సందర్భంలో, ప్రత్యామ్నాయ వసతి కోసం మేము మీకు కవర్ అందిస్తాము కాబట్టి, ప్రత్యామ్నాయ బస కోసం వెళ్లడానికి మరియు వస్తువుల ప్యాకింగ్ కోసం, అద్దె మరియు బ్రోకరేజీ కోసం మేము మీకు కవర్ అందిస్తాము.

మీరు ఇంటి వాస్తవ యజమాని పేరు మీద ప్రాపర్టీకి ఇన్సూరెన్స్ చేయవచ్చు. అలాగే, మీరు యజమానితో పాటు మీ పేరు మీద జాయింట్‌గా ఇన్సూరెన్స్ పొందవచ్చు.

మీరు ఇండివిడ్యువల్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ కోసం ఇన్సూరెన్స్ చేయవచ్చు. అద్దెదారుగా మీరు మీ ఇంటి వస్తువులను కవర్ చేయవచ్చు.

నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీ హోమ్ ఇన్సూరెన్స్ కింద కవర్ చేయబడదు. అలాగే, అసంపూర్ణ నిర్మాణం కవర్ చేయబడదు.

శిధిలాల తొలగింపు కోసం ఇన్సూరెన్స్ చేయబడిన మొత్తం అనేది క్లెయిమ్ మొత్తంలో 1% గా ఉంటుంది.

అవార్డులు మరియు గుర్తింపు

BFSI లీడర్‌షిప్ అవార్డులు 2022 - సంవత్సరం యొక్క ప్రోడక్ట్ ఇన్నోవేటర్ (ఆప్టిమా సెక్యూర్)

ETBFSI ఉత్తమ పురస్కారాలు 2021

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ
అవార్డులు సెప్టెంబర్ 2021

ICAI అవార్డులు 2015-16

SKOCH ఆర్డర్-ఆఫ్-మెరిట్

ఉత్తమ కస్టమర్ అనుభవం
అవార్డ్ ఆఫ్ ది ఇయర్

ICAI అవార్డులు 2014-15

CMS అవుట్‌స్టాండింగ్ అఫిలియేట్ వరల్డ్-క్లాస్ సర్వీస్ అవార్డ్ 2015

iAAA రేటింగ్

ISO సర్టిఫికేషన్

ప్రైవేట్ సెక్టార్‌లో ఉత్తమ ఇన్సూరెన్స్ కంపెనీ - జనరల్ 2014

slider-right
స్లైడర్-లెఫ్ట్
అన్ని అవార్డులను చూడండి
హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?

చదవడం పూర్తయిందా? ఇంటి ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా?