హోమ్ / హెల్త్ ఇన్సూరెన్స్ / మై:హెల్త్ విమెన్ సురక్ష ఇన్సూరెన్స్ / విమెన్ క్రిటికల్ ఇల్‌నెస్ కాంప్రిహెన్సివ్
  • పరిచయం
  • చేర్చబడిన అంశాలు?
  • ఏవి చేర్చబడలేదు?
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?
  • FAQs

విమెన్ క్రిటికల్ ఇల్‌నెస్ కాంప్రిహెన్సివ్ ప్లాన్

నేడు, జీవితంలోని అన్ని అంశాల్లోనూ నాయకత్వం వహించడానికి మహిళలు సిద్ధంగా ఉంటున్నారు. మహిళలు సైతం అనేక బాధ్యతలు మోస్తున్నారు, అందుకే, వారి జీవితంలోనూ సమతౌల్యత తీసుకురావడానికి మరియు వారి ఆరోగ్యాన్ని సురక్షితం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో సమర్పిస్తోన్న మై:హెల్త్ విమెన్ హెల్త్ సురక్ష ప్లాన్ అనేది మహిళలకు సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాలు, తీవ్రమైన అనారోగ్యాలు, శస్త్రచికిత్సలు మరియు తీక్షణమైన అనారోగ్యాల నుండి రక్షణ అందించడం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. మీ జీవితానికి అడ్డంకిగా మారడానికి ఏ వ్యాధిని అనుమతించకండి, దాని మీద పోరాడడానికి మరియు మీ ఆర్థిక పొదుపులను సురక్షితంగా ఉంచుకోవడానికి తగినంత సిద్ధంగా ఉండండి. మీ కుటుంబంలోని ఇతర సభ్యులలాగే మీ ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే, ఈరోజే దానిని సురక్షితం చేసుకోండి మరియు #1 కోటి కంటే ఎక్కువమంది వినియోగదారుల విశ్వాసం పొందిన బ్రాండ్, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే ఒకే ప్లాన్ కింద అనేక అనారోగ్యాల నుండి రక్షణ పొందండి.

విమెన్ క్రిటికల్ ఇల్‌నెస్ కాంప్రిహెన్సివ్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి కారణాలు

మొత్తం కవర్ కోసం హామీ పొందండి
ప్రాథమిక హెల్త్ కవర్‌ కంటే మించిన దానికోసం చూస్తున్నారా? మహిళల ప్రత్యేక మైనర్ మరియు మేజర్ అనారోగ్యాలు, ప్రత్యేకించిన శస్త్రచికిత్సలు మరియు సమగ్ర ఆరోగ్య సంరక్షణ అవసరాల కోసం జాబితా చేయబడిన 41 క్లిష్టమైన అనారోగ్యాలు కవర్ చేయడానికి ఈ ప్లాన్ రూపొందించబడింది.
పరిమితులకు మించిన హెల్త్ కవర్
నేడు మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు, అలాంటప్పుడు వారికి భౌగోళిక పరిమితులు విధించే పాలసీని ఎందుకు అనుమతించాలి? మేము ప్రపంచవ్యాప్త కవరేజీ అందిస్తాము కాబట్టి, విదేశంలో జరిగిన ఏదైనా శస్త్రచికిత్స లేదా అక్కడ సంభవించిన అనారోగ్యానికి కూడా కవర్ లభిస్తుంది.
స్వీయ సాధికారత ఆప్షనల్ కవర్‌లు
మహిళలు వారి జీవిత లక్ష్యాలను సాధించకుండా వారి మార్గంలో అడ్డుగా నిలిచే అంశాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగం కోల్పోవడం, గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యలు మరియు రోగనిర్ధారణ తర్వాత మద్దతు కోసం మేము ఆప్షనల్ కవర్‌లు అందిస్తాము.
అంతరాయం లేని పాలసీ కొనసాగింపు
మైనర్ అనారోగ్యం కోసం చేసే ఒక క్లెయిమ్‌తో ఈ పాలసీ ముగిసిపోతుందని ఆందోళన చెందుతున్నారా? అలా ఏమీ జరగదు, ఏదైనా మైనర్ అనారోగ్యం కోసం మీరు క్లెయిమ్ చేసినప్పటికీ, మిగిలి ఉన్న ఇన్సూర్ చేయబడిన మొత్తంతో మీ మేజర్ అనారోగ్యం మరియు శస్త్రచికిత్సల కోసం కవర్ అందించడానికి మీ పాలసీ కొనసాగుతుంది.

ఏమి చేర్చబడ్డాయి?

cov-acc

క్యాన్సర్ కవర్

ఈ పాలసీతో, మీరు సురక్షితంగా ఉండండి మరియు మీ జీవిత లక్ష్యాలు సాధించే క్రమంలో క్యాన్సర్ మిమ్మల్ని నిరోధించే అవకాశం ఇవ్వకండి. అలాంటి మహిళల నిర్దిష్ట క్యాన్సర్ కోసం మేము 100% ఇన్సూర్ చేయబడిన మొత్తం అందిస్తాము. మరింత తెలుసుకోండి...

cov-acc

సిటులో కార్సినోమా

ప్రారంభ స్థితిలోనే క్యాన్సర్‌ను గుర్తించినప్పుడు అది స్థానికంగా ఉంటుంది మరియు శరీరంలోని ఇతర అవయవాలు లేదా కణజాలాలకు వ్యాపించదు, దీనిని మందులు మరియు చికిత్సతో సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఆ దశలోనూ మేము మీకు కవర్ అందిస్తాము.మరింత తెలుసుకోండి...

cov-acc

మేజర్ మరియు మైనర్ అనారోగ్యాలు కవర్ చేయబడతాయి

లూపస్ నెఫ్రిటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో దైహిక లూపస్ ఎరిథెమాటస్‌ చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించడానికి మేము 100% ఇన్సూర్ చేయబడిన మొత్తం అందిస్తాము. ఈ వ్యాధులు భయంకరమైనవి, దీర్ఘకాలిక చికిత్స అవసరమవుతుంది మరియు ఆర్థిక ప్రమాదాలకు దారితీయగలవు మరింత తెలుసుకోండి...

 

cov-acc

శస్త్రచికిత్సా విధానాలు

నిస్సందేహంగా, చికిత్స సమయంలో సర్జికల్ విధానాలనేవి ఆర్థిక భారానికి ప్రధాన కారణంగా ఉంటాయి. శస్త్రచికిత్సా ప్రక్రియల కారణంగా ఏర్పడే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి మరింత తెలుసుకోండి...

cov-acc

గుండె సంబంధిత అనారోగ్యాలు మరియు ప్రక్రియలు

ఈ రోజుల్లో గుండె జబ్బులు అంత అరుదైనవి కావు! WHO ప్రకారం, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మరణాలకు గుండె సంబంధిత వ్యాధులు (CVD) ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ఓపెన్ చెస్ట్ CABG, మొదటి గుండె పోటు, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్ అమర్చడం మరియు మరెన్నో వాటి కోసం కవరేజీ పొందండి.

cov-acc

క్రిటికల్ ఇల్‌నెస్

ప్రాణాంతక వ్యాధులనేవి మీ దూసుకెళ్తున్న కెరీర్‌కు పూర్తి అడ్డంకి కాగలవు. వాటి మీద పోరాడడానికి మరియు మంచి నాణ్యమైన వైద్య సేవలు నిర్ధారించడానికి అవసరమైన మెరుగైన ఆర్థిక ప్రణాళికను నిర్ధారించడానికి, జాబితా చేయబడిన 41 క్లిష్టమైన అనారోగ్యాల కోసం ఈ ప్లాన్ కవరేజీ అందిస్తుంది.

క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ వేటిని కవర్ చేయదు?

అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు
అడ్వెంచర్ స్పోర్ట్ కారణంగా గాయాలు

సాహస క్రీడలు మీకు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి, కానీ, కొన్ని ప్రమాదాలు ఎదురైనపుడు అవి హానికరంగా మారతాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు ఎదురయ్యే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

స్వయంగా చేసుకున్న గాయాలు
స్వయంగా చేసుకున్న గాయాలు

మీరు మీ విలువైన ప్రాణానికి హాని తలపెట్టాలనుకోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు గాయపరచుకోవడం మేము కోరుకోము. మా పాలసీ స్వతహాగా-చేసుకున్న గాయాలను కవర్ చేయదు.

యుద్ధం
యుద్ధం

యుద్ధం వినాశకరమైనది మరియు దురదృష్టకరమైనది కావచ్చు. అయితే, మా పాలసీ యుద్ధాల కారణంగా సంభవించే ఏ క్లెయిమ్‌ను కవర్ చేయదు.

డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం
డిఫెన్స్ కార్యకలాపాలలో పాల్గొనడం

మీరు డిఫెన్స్ (ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్) కార్యకలాపాలలో పాల్గొన్నప్పుడు సంభవించే ప్రమాదాలను మా పాలసీ కవర్ చేయదు.

సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు
సుఖ వ్యాధులు లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు

మీ వ్యాధి తీవ్రతను మేము అర్థం చేసుకున్నాము. అయితే, మా పాలసీ సుఖవ్యాధులు లేదా లైంగికంగా సంక్రమించే వ్యాధులను కవర్ చేయదు.

ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ
ఊబకాయం కొరకు చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ

ఊబకాయం కోసం చికిత్స లేదా కాస్మెటిక్ సర్జరీ వంటివి మీ ఇన్సూరెన్స్ పాలసీ కింద కవర్ చేయబడవు.

చేర్పులు మరియు మినహాయింపు సంబంధిత పూర్తి వివరాల కోసం దయచేసి సేల్స్ బ్రోచర్/ పాలసీ వివరాలు చూడండి

ఆప్షనల్ కవర్లు

గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యలు కవర్ చేయబడతాయి

ప్రేమ అనే స్వచ్ఛమైన రూపాన్ని ప్రభావితం చేసేందుకు దేనినీ అనుమతించకండి

ప్రసవ సమయంలో మహిళలు తరచుగా సమస్యలను ఎదుర్కొంటుంటారు; డిస్సెమినేటెడ్ ఇంట్రావస్కులర్ కొయాగ్యులేషన్ (DIC), ఈక్టోపిక్ ప్రెగ్నెన్సీ, మోలార్ ప్రెగ్నెన్సీ మరియు ఎక్లాంప్సియా లాంటి వాటిని మేము కవర్ చేస్తాము. తల్లి మాత్రమే కాకుండా, శిశువు కూడా సమస్యలు ఎదుర్కోవడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, స్పినా బిఫిడా లాంటి పుట్టుకతో వచ్చే అనేక వ్యాధుల కోసం శస్త్రచికిత్సలు అవసరమవుతుంటాయి. అలాంటి పరిస్థితిలో, ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 25% లేదా ₹ 5 లక్షలులో ఏది తక్కువైతే దానిని మేము మీకు అందిస్తాము.


డయాగ్నోస్టిక్ సపోర్ట్ తర్వాత

పొడిగించబడిన సంరక్షణ తప్పనిసరి

మీరు మీ మొదటి రోగనిర్ధారణ వివరాలతో సంతృప్తి చెందకపోవచ్చు మరియు వివరణాత్మక సమీక్ష కోసం మరొక వైద్యుడిని సంప్రదించాలనుకుంటారు కాబట్టి, రెండో వైద్య అభిప్రాయం కోసం మేము మొదట ₹10,000 వరకు అందిస్తాము. ఆ తర్వాత, మీరు ఏదైనా ప్రధాన క్యాన్సర్ రోగనిర్ధారణపై చికిత్స మార్గదర్శకత్వం పొందడానికి మాలిక్యులర్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ పరీక్ష కోసం కూడా కవర్ చేయబడతారు మరియు చివరిగా రోగనిర్ధారణ సహాయం అనంతరం, త్వరిత రికవరీ కోసం చర్యలను తీసుకోవడానికి కౌన్సిలింగ్ పొందడానికి, ఇది ప్రతి సెషన్‌కు సుమారు ₹3000 మరియు మీరు అటువంటి 6 సెషన్లను తీసుకోవచ్చు.


ఉద్యోగం కోల్పోవడం

ఆందోళన అవసరం లేదు, మీ ఆర్థిక అంశాలకు రక్షణ ఉంటుంది

మేజర్ అనారోగ్యం నిర్థారణ అయినప్పుడు మీరు రాజీనామా చేయడం లేదా ఉద్యోగం కోల్పోవడం లాంటి పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో, మీ ద్వారా భర్తీ చేయబడే అంశాల విషయంలో మహిళలు తీవ్రమైన ఆర్థిక ప్రతికూలత ఎదుర్కొంటారు. అయితే, ఈ స్థితిలోనూ మీరు ఆర్థికంగా స్థిరంగా ఉండడం కోసం 6 నెలల పాటు మేము మీ నెలవారీ జీతంలో 50% అందిస్తాము.


నిరీక్షణ కాలవ్యవధి / సర్వైవల్ పీరియడ్

cov-acc

90 రోజుల నిరీక్షణ కాలవ్యవధి

"మేజర్"‌గా వర్గీకరించబడిన అన్ని అనారోగ్యాలు/చికిత్సా విధానాల మీద 90 రోజుల నిరీక్షణ కాలవ్యవధి వర్తిస్తుంది.

cov-acc

180 రోజుల నిరీక్షణ కాలవ్యవధి

"మైనర్"గా వర్గీకరించబడిన అన్ని అనారోగ్యాలు/వైద్య చికిత్సా విధానాల మీద 180 రోజుల నిరీక్షణ కాలవ్యవధి వర్తిస్తుంది

cov-acc

1 సంవత్సరం నిరీక్షణ కాలవ్యవధి

గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యల కవర్ క్రింద చేసే అన్ని క్లెయిమ్‌ల కోసం 1 సంవత్సరం నిరీక్షణ కాలవ్యవధి వర్తిస్తుంది.

cov-acc

7 రోజుల సర్వైవల్ వ్యవధి

ప్రసూతి సమస్యలతో సహా అనారోగ్యాలు/వైద్య చికిత్సా విధానాల కోసం 7 రోజుల సర్వైవల్ వ్యవధి

cov-acc

30 రోజుల సర్వైవల్ వ్యవధి

నవజాత శిశువు సమస్యల కోసం డెలివరీ తేదీ నుండి 30 రోజుల వరకు సర్వైవల్ వ్యవధి వర్తిస్తుంది మరియు శిశువు జన్మించిన రోజు నుండి రెండు సంవత్సరాల లోపల రోగనిర్ధారణ చేసి ఉండాలి

మై:హెల్త్ విమెన్ సురక్షను ఒక 360 డిగ్రీ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా మార్చేది ఏమిటి?

cov-acc

ఏకమొత్తం చెల్లింపు - ప్రయోజనం ప్లాన్

వ్యాధుల సంక్లిష్టత మరియు ఆర్థిక సహాయం అవసరం అర్థం చేసుకున్నాం కాబట్టి, మేము తక్షణ మరియు ఏకమొత్తంలో చెల్లింపును అందిస్తాము అంటే, మీ ఇన్సూర్ చేయబడిన మొత్తం ఒకే ట్రాన్సాక్షన్ ద్వారా చెల్లించబడుతుంది.

cov-acc

ఇన్సూరెన్స్ మొత్తానికి చెందిన విస్తృత శ్రేణి అందుబాటులో ఉంది

మీ ఆరోగ్య చరిత్రతో పాటు ప్రీమియం చెల్లించగల స్థోమతను అనుసరించి, 3 లక్షల నుండి 1 కోటి వరకు ఇన్సూర్ చేయబడిన మొత్తాన్ని ఎంచుకోండి.

cov-acc

ఆకర్షణీయమైన డిస్కౌంట్లు

ఆన్‌లైన్ పాలసీ కోసం 5% వరకు డిస్కౌంట్ పొందండి. 2 సంవత్సరాల పాలసీ మీద 7.5% డిస్కౌంట్ మరియు 3 సంవత్సరాల పాలసీ కాలవ్యవధి కోసం 12.5% డిస్కౌంట్ కూడా పొందుతారు.

cov-acc

లైఫ్‌టైమ్ రెన్యూబిలిటీ

ఈ ఫీచర్ అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో విమెన్ హెల్త్ సురక్షను మీ ఆరోగ్య సంరక్షణ భాగస్వామిగా చేస్తుంది మరియు మీకు ఆంక్షలు లేని కవరేజీ అందిస్తుంది.

cov-acc

ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్

ఏదైనా అనారోగ్యాన్ని ముందుగానే గుర్తించడం కోసం ప్రతి రెన్యూవల్ సమయంలో ఉచిత ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్ అందుకోండి.

cov-acc

పన్ను ప్రయోజనాలు

సెక్షన్ 80 D క్రింద పన్ను ప్రయోజనం అందుకోండి.

cov-acc

వెల్‌నెస్ కోచ్

వెల్‌నెస్ కోచ్ అనేది మీ వ్యాయామం మరియు క్యాలరీ లెక్కింపును అవాంతరాలు లేకుండా ట్రాక్ చేయడానికి మీకు వీలు కల్పిస్తుంది. మీకు సరిపోయే జీవనశైలిని కొనసాగించడానికి ఇది సహాయపడుతుంది.

cov-acc

ఫ్రీ లుక్ క్యాన్సలేషన్

తప్పనిసరి కాదు. పాలసీ మీకు తగినది కాదని మీరు భావిస్తే, పాలసీ డాక్యుమెంట్ అందుకున్న తేదీ నుండి 15 రోజుల లోపు పాలసీని రద్దు చేసే స్వేచ్ఛ మీకు ఉంటుంది.

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్‌ను ఎందుకు ఎంచుకోవాలి?

1.5 కోటి పైగా ప్రజల ముఖాలలో చిరునవ్వు!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7
ప్రతి దశలోనూ పారదర్శకత!
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.
కాగితరహితంగా ఉండండి!
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

1.5 కోటి+ చిరునవ్వులు సురక్షితం!

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

మీకు అవసరమైన సపోర్ట్-24 x 7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. మా 24x7 కస్టమర్ కేర్ మరియు అంకితమైన క్లెయిమ్స్ అప్రూవల్ బృందంతో, అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
ప్రతి దశలోనూ పారదర్శకత!

ప్రతి దశలోనూ పారదర్శకత!

ఇన్సూరెన్స్ పాలసీలో క్లెయిమ్స్ ఒక ప్రధాన భాగం, మేము అవాంతరాలు లేని క్లెయిమ్ ప్రాసెస్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తాము.
ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ యాప్.

మేము హెల్త్ ఇన్సూరెన్స్‌కు మించి, మీ ఆరోగ్యంతో పాటు మనస్సును సురక్షితంగా చూసుకుంటాము. మై:హెల్త్ సర్వీసెస్ అప్లికేషన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవడంలో మీకు సహాయపడుతుంది. మీ హెల్త్ కార్డును పొందండి, మీరు తీసుకునే క్యాలరీలను చెక్ చేయండి, మీ శారీరక శ్రమను పర్యవేక్షించండి, ఉత్తమ ఆరోగ్యాన్ని ఆస్వాదించండి.
కాగితరహితంగా ఉండండి!

కాగితరహితంగా ఉండండి!

మాకు కూడా పేపర్‌వర్క్‌ ఇష్టం లేదు. నేటి డిజిటల్ ప్రపంచంలో, కనీస డాక్యుమెంటేషన్ మరియు సులభమైన చెల్లింపు పద్ధతులతో మీ పాలసీని ఆన్‌లైన్‌లో పొందండి. మీ పాలసీ నేరుగా మీ ఇన్‌బాక్స్‌లోకి చేరుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

మై:హెల్త్ విమెన్ సురక్ష కింద కవర్ చేయబడటానికి కనీస మరియు గరిష్ట ప్రవేశ వయస్సు అనేది ప్రాథమిక కవర్‌ కోసం వరుసగా 18 మరియు 45 సంవత్సరాలుగా ఉంటుంది, మరియు ఐచ్ఛిక గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యల కవర్ కోసం వరుసగా 18 మరియు 40 సంవత్సరాలుగా ఉంటుంది.
మహిళల్లో సర్వసాధారణమైన అనారోగ్యాలన్నీ విభిన్న ప్లాన్‌ల క్రింద ఈ ఉత్పత్తిలో కవర్ చేయబడతాయి. వీటిలో క్యాన్సర్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, గుండె సంబంధిత వ్యాధులు, ప్రధాన శస్త్రచికిత్సలు మరియు 41 క్లిష్టమైన అనారోగ్యాలు ఉన్నాయి.
గర్భధారణ కవర్ చేయబడదు కానీ, అదనపు ప్రీమియం చెల్లింపు ద్వాారా గర్భధారణ మరియు నవజాత శిశువు సమస్యల కోసం ఆప్షనల్ కవర్‌ అందుబాటులో ఉన్నాయి.
క్లెయిమ్ సమయంలో ఏకమొత్తంలో చెల్లించే పాలసీని ప్రయోజనం అందించే పాలసీగా పిలుస్తారు. మై:హెల్త్ విమెన్ సురక్ష అనేది ఒక ప్రయోజనం అందించే పాలసీ. ఎందుకంటే, ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి ఒక అనారోగ్యం (ఎంచుకున్న ప్లాన్‌లో భాగమైనది) ఉన్నట్లు కనుగొనబడితే మరియు ఇన్సూర్ చేయబడిన వ్యక్తి రోగనిర్ధారణ తేదీ నుండి 7 రోజులు జీవించి ఉంటే, అప్పుడు, వ్యాధి కేటగిరీ ఆధారంగా ఏక మొత్తం (పాక్షికంగా లేదా పూర్తిగా) సెటిల్ చేయబడుతుంది.
పాలసీ క్రింద క్లెయిమ్ చేయడం కోసం, ఎంచుకున్న ప్లాన్ ప్రకారం అనారోగ్యం నిర్ధారించిన తర్వాత ఇన్సూర్ చేయబడిన వ్యక్తి జీవించాల్సిన కనీస రోజుల సంఖ్యనే సర్వైవల్ కాలవ్యవధి అంటారు. సంప్రదాయకంగా, ఏదైనా క్లిష్టమైన అనారోగ్య పాలసీకి సంబంధించిన సర్వైవల్ వ్యవధి అనేది 30 రోజులుగా ఉంటుంది. అయితే, మై:హెల్త్ విమెన్ సురక్ష కోసం సర్వైవల్ ప్రయోజనం అనేది 7 రోజులు మాత్రమే.
1. అనారోగ్యాన్ని మైనర్ మరియు మేజర్ అనే 2 విస్తృత రకాలుగా విభజిస్తారు.
  • 2. ఒకవేళ పాలసీలో జాబితా చేయబడిన మైనర్ పరిస్థితిలో దేని క్రింద అయినా క్లెయిమ్ అనుమతించబడితే, అప్పుడు ఒక పరిమితికి క్లెయిమ్ మొత్తం అనేది ఇన్సూర్ చేయబడిన మొత్తంలో 25%, గరిష్టంగా ₹ 10 లక్షల వరకు చెల్లించబడుతుంది. మిగిలిన ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది రెన్యూవల్ సమయంలో ముందుకు తీసుకెళ్లబడుతుంది. అంతే కాకుండా, రెన్యూవల్ ప్రీమియం సైతం తదుపరి 5 రెన్యూవల్స్ కోసం 50% వరకు రద్దు చేయబడుతుంది.
  • 3. ముందుకు తీసుకువెళ్లిన ఇన్సూరెన్స్ మొత్తం అనేది భవిష్యత్తులో ఎదురయ్యే ఏదైనా మేజర్ పరిస్థితి క్లెయిమ్ కోసం అర్హత కలిగి ఉంటుంది.
  • పాలసీ జీవితకాలంలో, క్రింద ఇవ్వబడిన ప్రతి దశలోనూ ఒక క్లెయిమ్ మాత్రమే చెల్లించబడుతుంది.


    మైనర్ స్థితి
    : పాలసీ కింద మైనర్ దశ పరిస్థితిలో క్లెయిమ్ అనుమతించబడిన తర్వాత, ఇతర అన్ని మైనర్ దశ పరిస్థితుల కోసం కవరేజీ ఉనికిలో ఉండదు. మిగిలిన ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది పాలసీలోని మేజర్ దశ పరిస్థితిని కవర్ చేయడం కోసం కొనసాగుతుంది.

    మేజర్ దశ: మేజర్ దశ పరిస్థితి కోసం క్లెయిమ్ అనుమతించబడిన తర్వాత, ఈ పాలసీ క్రింద కవరేజీ ఉనికిలో ఉండదు.


    నేడు, మహిళలు సైతం కుటుంబ ఆర్థిక అవసరాలు పంచుకోవడంలో సమాన చొరవ ప్రదర్శిస్తున్నారు. ఏదైనా క్లిష్టమైన అనారోగ్యం కారణంగా వారు జీతం పొందే ఉద్యోగం వదిలివేయాల్సిన పరిస్థితి వస్తే, వారి కుటుంబపు ప్రాథమిక ఆర్థిక అవసరాలు నెరవేర్చబడతాయనీ, EMIలు డిఫాల్ట్ కావు అని LOJ కవర్ నిర్ధారిస్తుంది. అదేసమయంలో, ఏకమొత్తం ప్రయోజనం అనేది వారి వైద్య చికిత్సకు ఉపకరిస్తుంది. దురదృష్టకర సమయాల్లో ఇది ఊపిరి పీల్చుకునే అవకాశం ఇస్తుంది.
    1. పాలసీ ప్రారంభ సమయంలో, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి పూర్తి సమయం పనిచేస్తూ జీతం పొందే ఉద్యోగి అయి ఉండాలి. 2. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి నెలవారీ జీతం ఆధారంగా, జాబ్ కవర్ నష్టం కోసం ఇన్సూర్ చేయబడిన మొత్తం అనేది లెక్కించబడుతుంది. ఇది 6 నెలల కోసం నెలవారీ జీతంలో 50% లేదా బేస్ ఇన్సూర్ చేయబడిన మొత్తంలో, ఏది తక్కువైతే దాని మొత్తంగా ఉంటుంది.
    మాతో పాలసీని రెన్యూవల్ చేసుకున్న ప్రతిసారి, పాలసీ రెన్యూవల్ ప్రారంభ తేదీ నుండి 60 రోజుల వరకు పరీక్షల జాబితా మరియు అర్హతా ప్రమాణాల ప్రకారం, మా నెట్‌వర్క్ డయాగ్నోస్టిక్ సెంటర్లు లేదా హాస్పిటల్స్‌లో ప్రివెంటివ్ హెల్త్ చెక్-అప్‌లు చేయించుకోవడానికి ఇన్సూర్ చేయబడిన వ్యక్తికి అర్హత ఉంటుంది.
    ఒక వ్యక్తికి క్లిష్టమైన అనారోగ్యం, ప్రత్యేకించి క్యాన్సర్ నిర్ధారించబడినప్పుడు తప్పనిసరిగా చికిత్స అందించాల్సి ఉంటుంది. రోగనిర్ధారణ తర్వాత, సపోర్ట్ కవర్ అనేది ఈ క్రింది మద్దతును అందిస్తుంది: 1. రోగనిర్ధారణ మరియు ప్లాన్ చేయబడిన చికిత్స గురించి రెట్టింపు నిర్ధారణకు వీలుగా మీ కోసం రెండవ వైద్య అభిప్రాయం. 2. గరిష్టంగా 6 సెషన్ల వరకు ఔట్ పేషెంట్ కౌన్సిలింగ్ కోసం మీకు ఆర్థికంగా సహాయపడటానికి పోస్ట్-డయాగ్నోసిస్ అసిస్టెన్స్ మీకు సహాయపడుతుంది. ఈ కవర్ క్రింద ప్రయోజనం అనేది ప్రతి సెషన్‌కు ₹ 3000/- వరకు వర్తిస్తుంది. 3. ఒకరిలో క్యాన్సర్ పునరావృతమయ్యే సమస్యను అంచనా వేయడానికి ఉపయోగపడే మాలిక్యులర్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్టులనేవి సర్జరీ తర్వాత అదనపు (సహాయక) చికిత్స ద్వారా ఎవరికి ప్రయోజనం ఉంటుందో నిర్ణయించడంలో వైద్యులకు సహాయపడతాయి. పాలసీ కాలవ్యవధిలో ఒకసారి అందుకోవచ్చు మరియు చెల్లించవలసిన ప్రయోజనం మొత్తం ₹ 10,000 మించకూడదు.
    పాలసీ మరియు వర్తించే అండర్‌ రైటింగ్ మార్గదర్శకాల క్రింద ఎలాంటి క్లెయిమ్ లేకుండా ఉండడానికి లోబడి రెన్యూవల్ సమయంలో మీరు ప్లాన్ మరియు ఇన్సూరెన్స్ మొత్తం మార్చవచ్చు .
    పోస్ట్-డయాగ్నోసిస్ సపోర్ట్ ఆప్షనల్ కవర్ కోసం ఎంచుకున్నవారికి క్యాన్సర్‌ ఉన్నట్లు రోగనిర్ధారణ చేయబడిన పక్షంలో మరియు ఈ పాలసీ క్రింద అనుమతించదగిన క్లెయిమ్ చేసినట్లయితే, 'మాలిక్యులర్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్ట్' చేసుకోవడానికి అర్హులవుతారు. మాలిక్యులార్ జీన్ ఎక్స్‌ప్రెషన్ ప్రొఫైలింగ్ టెస్ట్ అనేది భారతదేశంలోని మహిళల్లో అత్యంత తరచుగా కనిపించే క్యాన్సర్ రకమైన రొమ్ము క్యాన్సర్ కోసం చికిత్సా ప్రోటోకాల్‌ నిర్ణయించడంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది.
    పాలసీ క్రింద కవర్ చేయబడిన తీవ్ర అనారోగ్యం/వైద్య విధానానికి సంబంధించి మెడికల్ ప్రాక్టీషనర్ నుండి పొందిన రెండవ వైద్య అభిప్రాయానికి అయ్యే ఖర్చులు; • ఈ కవర్ కింద ప్రయోజనం పాలసీ వ్యవధిలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ చేయబడుతుంది. • ఈ కవర్ క్రింద గరిష్ట ప్రయోజనం ₹ 10,000 మించకూడదు
    అవును, సెక్షన్ 80D క్రింద ఈ పాలసీ కోసం పన్ను ప్రయోజనం పొందవచ్చు.
    మై:హెల్త్ విమెన్ సురక్ష కోసం ఆన్‌లైన్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో, 3 లక్షల నుండి 24 లక్షల మధ్య మీరు ఎంచుకోవచ్చు. అయితే, మీరు అంతకంటే ఎక్కువ ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందాలనుకుంటే, దయచేసి మా సమీప శాఖను సందర్శించండి.
    అవార్డులు మరియు గుర్తింపు
    x