కార్పొరేట్ సామాజిక కార్యక్రమాలు - సామాజిక మార్పునకు సాధికారత కల్పించడం

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మేము సమాజ ఆర్థిక పురోగతి కోసం పెద్ద మొత్తంలో క్రియాశీల రీతిలో సహకారం అందిస్తున్నాము. సామాజిక మార్పునకు సాధికారత కల్పించడం, విద్యను ప్రోత్సహించడం, మరియు ఒక సుస్థిరమైన వాతావరణ సృష్టి కోసం మేము ప్రతిజ్ఞ చేశాము. వినియోగదారులు, వ్యాపార భాగస్వాములు, రీ-ఇన్సూరర్‌లు, వాటాదారులు, ఉద్యోగులు, మరియు సమాజం లాంటి మా వాటాదారులందరి ఆసక్తులను పరిగణనలోకి తీసుకునే క్రమంలో, మా వ్యాపార నిర్ణయాల్లో మేము SEED - సెన్సిటివిటీ, ఎక్సలెన్స్, ఎథిక్స్ మరియు డైనమిజమ్ - అనే మా తాత్వికతను బలంగా వ్యవస్థాపిస్తాము. పది లక్షల మంది ముఖాల మీద చిరునవ్వు మరియు కాంతిని నింపడమే ఈ కార్యక్రమం వెనుక ఏకైక ప్రయోజనంగా ఉంటోంది.

గావ్ మేరా ప్రోగ్రామ్ (గ్రామీణ విద్యను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం)

మా CSR కార్యాచరణలో "గావ్ మేరా" అనే మా ప్రతిష్టాత్మక కార్యక్రమం కీలకంగా ఉంటోంది. ఎంపిక చేసిన గ్రామాల్లో విద్య మరియు పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రస్తుత స్థితిని మెరుగుపరచడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంటోంది.


విద్య మరియు గ్రామీణాభివృద్ధి


పిల్లల విషయంలో బడి అనేది ఇల్లు తర్వాత ఇల్లు లాంటిది అని చెబుతారు. అయితే, ప్రభుత్వం-నడిపే అనేక పాఠశాలలు నీరు, విద్యుత్ లేదా పరిశుభ్రత లాంటి విషయాలకు దూరంగా ఉంటూ, కలుషిత వాతావరణంలో మరియు శిధిలమైన స్థితిలో ఉంటున్నాయి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, గ్రంధాలయాలు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోవడం లేదు. మెజారిటీ పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ప్రసక్తే లేదు.


ఈ అంతరాయం పూరించడం కోసమే, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి "గావ్ మేరా" కార్యక్రమం స్థిరమైన విద్యా మౌలిక సదుపాయాల అవసరాలు పరిష్కరించడాన్ని లక్ష్యంగా ఎంచుకుంది. విద్యకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని (SDG) సాకారం చేసే దిశగా, గ్రామీణ భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మించడం ద్వారా వాటిలో భౌతిక మౌలిక సదుపాయాలు పునరుద్ధరించడానికి కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలో, కొత్తగా నిర్మించబడిన పాఠశాలలు బోధనోపకరణాలు (బాల మార్గదర్శకాలు) సహితంగా నిర్మించడం ద్వారా, సరైన రీతిలో నిర్మించబడతాయి. అభ్యాసన కోసం శిశు-స్నేహిత మరియు వినోద-ఆధారిత భౌతిక పర్యావరణం అభివృద్ధి చేయడం ద్వారా విద్యలో నాణ్యమైన మెరుగుదలను అందించడానికి ఉద్దేశించిన ఒక వినూత్న భావన ఇది. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన తరగతి గదుల్లో ప్రకాశవంతమైన లైటింగ్ మరియు వెంటిలేషన్ ఉండేలా మేము నిర్ధారిస్తాము. అలాగే, కొత్తగా నిర్మించబడిన పాఠశాలల్లో బెంచీలు, డెస్కులు, గ్రీన్ బోర్డులు, వంటగది, భోంచేసే సౌకర్యాలు, లైబ్రరీలు మరియు కంప్యూటర్ గదులు లాంటి సదుపాయాలన్నీ ఉంటాయి.

గావ్ మేరా కార్యక్రమం: పాఠశాల పునర్నిర్మాణ కార్యక్రమం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం

కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
మహారాష్ట్రలోని మచలా చోప్డా గావ్ జల్‌గావ్‌లోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
మహారాష్ట్రలోని మచలా చోప్డా గావ్ జల్‌గావ్‌లోని పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లోలో భాగమైన రామన్ గ్రామంలోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లోలో భాగమైన రామన్ గ్రామంలోని పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లోలో భాగమైన సర్సి గ్రామంలోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లోలో భాగమైన సర్సి గ్రామంలోని పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో భాగమైన టాండియాలోని ఒక పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో భాగమైన టాండియాలోని ఒక పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురంలో భాగమైన అగ్రహారంలోని పాఠశాాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురంలో భాగమైన అగ్రహారంలోని పాఠశాాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
మహారాష్ట్రలోని జలగావ్‌లో భాగమైన కొలంబ చోప్డా గావ్‌లోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
మహారాష్ట్రలోని జలగావ్‌లో భాగమైన కొలంబ చోప్డా గావ్‌లోని పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
మహారాష్ట్రలోని సతారాలో భాగమైన గాడేవాడీలోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
మహారాష్ట్రలోని సతారాలో భాగమైన గాడేవాడీలోని పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
ఒడిశాలోని గంజామ్‌లో భాగమైన పాండియపథార్‌లోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
ఒడిశాలోని గంజామ్‌లో భాగమైన పాండియపథార్‌లోని పాఠశాల
కామ్-ప్రీ
ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందు:
తమిళనాడులోని సింగనేరి తిరునెల్వేలిలోని పాఠశాల
కామ్-ప్రీ
కామ్-ప్రీ
అభివృద్ధి చేసిన తర్వాత:
తమిళనాడులోని సింగనేరి తిరునెల్వేలిలోని పాఠశాల

మా ప్రభావం: జీవితాలను మెరుగ్గా మార్చడానికి కృషి చేస్తున్నాము

 

మా ప్రభావం: కలిసిమెలిసి బలంగా పనిచేయడం మరియు జీవితాను మెరుగ్గా మార్చడం

 

గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల కోసం పాఠశాలలు పునర్నిర్మించడంలో భాగంగా, మా కార్యక్రమాన్ని మేము 10 రాష్ట్రాల కు విస్తరించాము

ఇతర కార్యక్రమాలు

 

కోవిడ్ 19 ప్రతిస్పందన


  • బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) నిర్వహిస్తున్న నాయర్ హాస్పిటల్ కు N95 రెస్పిరేటర్‌లు అందించాము.

  • ముంబై పోలీసులకు కాటన్ మాస్క్‌లు మరియు శానిటైజర్‌లు పంపిణీ చేశాము.

  • ఢిల్లీ మరియు గుర్గావ్‌లోని ఆసుపత్రులకు వెంటిలేటర్‌లు అందించాము.

  • కోవిడ్ 19 కారణంగా తమ జీవనోపాధి కోల్పోయిన ముంబైలోని 1000 పేద కుటుంబాల వారికి రేషన్ సరుకులు పంపిణీ చేశాము

  • అస్సాంలోని చిరంగ్ జిల్లాలో భాగమైన రౌమారీ గ్రామానికి చెందిన 5,000 మంది గిరిజన పిల్లలకు ఉతికి ఉపయోగించగల కాటన్ మాస్కులు అందించాము.

విద్య


  • స్కాలర్‌షిప్ మరియు నైపుణ్య నిర్మాణ కార్యక్రమాల ద్వారా 28 మంది విద్యార్థినులు వారి ఇంజనీరింగ్ విద్య కొనసాగించడం కోసం మద్దతు అందించాము, తద్వారా, వారికి ఆర్థిక స్వతంత్రం లభించింది.

  • కర్ణాటకలోని గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలకు చెందిన 10 మంది అమ్మాయిలు చదువుకోవడానికి సహాయం చేయబడింది

  • మహిమ్‌లోని సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌లోని రెండు అంతస్తులను సౌండ్ ప్రూఫ్ చేయడం జరిగింది. ఈవిధంగా, చదువుకోవడానికి అనువైన పర్యావరణాన్ని ఏర్పరచడం వల్ల 1,200 కంటే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం లభించింది.

  • 3ఇ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారికి స్కూల్ బస్ విరాళంగా ఇవ్వడమైనది.

  • కేరళలోని పేద విద్యార్థులకు 451 సైకిళ్ళు పంపిణీ చేయబడ్డాయి


ఆరోగ్య సంరక్షణ


  • మేథోపరంగా వికలాంగులైన వయోజనులకు చికిత్స, శిక్షణ మరియు పునరావాసం స్పాన్సర్ చేయబడింది.

  • తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా మరియు పుట్టుకతోనే వచ్చిన గుండె జబ్బులతో బాధపడే పిల్లల కోసం ప్రాయోజిత వైద్య చికిత్స.

  • ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఎముక మజ్జ మార్పిడి మరియు కొహెలర్ మార్పిడి కోసం సహకారం అందించబడింది.

  • గ్రామీణ భారతదేశంలోని 10,000 అమ్మాయిలకు 2 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం శానిటరీ నాప్కిన్లు సరఫరా చేశాము.

  • పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులోని వివిధ జిల్లాల్లోని గ్రామాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించాము. కేటరాక్ట్ శస్త్రచికిత్స ఖర్చు భరించలేని వారికి ఆర్థిక సహాయం కూడా అందించాము.

  • డయాగ్నోస్టిక్ పరికరాలు అందించడం ద్వారా పుల్వామా (జమ్మూ కాశ్మీర్)లోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మెరుగుపరిచాము

  • మహారాష్ట్ర, బీహార్, ఝార్ఖండ్, కర్ణాటక మరియు మధ్యప్రదేశ్‌లో 15 నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేశాము.

  • హై-ఎండ్ ట్యూబర్‌క్యులోసిస్ డిటెంక్షన్ అండ్ కంట్రోల్ పరికరం అందించడం ద్వారా, ముంబై హాస్పిటల్‌లోని పాథాలజీ ల్యాబోరేటరీని అప్‌గ్రేడ్ చేశాము.


విపత్తు సహాయం


  • కొల్హాపూర్ వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన 4 గ్రామాల్లోని 500 కుటుంబాలకు పాత్రల కిట్లు పంపిణీ చేశాము

  • మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన 14 గ్రామాలకు చెందిన 3,144 కుటుంబాల వారికి మా క్షామ ఉపశమనం కార్యక్రమం క్రింద సురక్షిత తాగునీరు అందించబడింది.

  • జమ్మూ, కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని 4 గ్రామాలకు సౌరశక్తితో పనిచేసే విద్యుత్ దీపాలు అందించాము.

ఇతర ముఖ్యమైన కార్యక్రమాలు


  • పేద పిల్లలకు పోషకాహారం అందించాము.

  • ఢిల్లీలోని 8 ప్రభుత్వ పాఠశాలలకు 10,000 కాలుష్య నిరోధక మాస్కులు పంపిణీ చేశాము.

  • రహదారి భద్రతా వారంలో భాగంగా, సమాజ రహదారి భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

  • ముంబై ట్రాఫిక్ పోలీసులకు 5,000 రెయిన్‌కోట్‌లు పంపిణీ చేయబడ్డాయి.

  • ముంబైలోని 3 ట్రాఫిక్ ఐల్యాండ్‌లలో మొక్కలు నాటడం మరియు సుందరీకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

  • పూణేలో ధ్వని మరియు వాయు కాలుష్యం పరిశీలన కోసం ఒక పర్యావరణ పరిశీలనా కేంద్రం ఏర్పాటు చేయడం కోసం ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ అసోసియేషన్‌కు మద్దతు అందించబడింది.

  • 750 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి.

  • మసాలా దినుసుల సాగు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి మీద వొకేషనల్ ట్రైనింగ్ నిర్వహించబడింది.



పైన పేర్కొన్న కార్యకలాపాలకు అదనంగా, మరికొన్ని కార్యక్రమాల కోసం మా ఉద్యోగులు క్రియాశీల రీతిలో స్వచ్ఛందంగా పనిచేశారు.

క్వారంటైన్ ప్రక్రియ
ఉద్యోగుల ద్వారా ఆహార పంపిణీ

కాస్మిక్ డివైన్ సొసైటీతో కలసి మా ఉద్యోగులు స్వచ్ఛందంగా ముంబైలోని పేద పిల్లలకు పోషకాలతో నిండిన భోజనం అందించారు.

సెల్ఫ్ ఇన్సోలేషన్
కంటి ఆరోగ్యం శిబిరాల్లో పాల్గొన్న ఉద్యోగులు

చెన్నై, ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, బెంగళూరు మరియు చండీగఢ్‌లో నిర్వహించబడిన కంటి ఆరోగ్య శిబిరాల్లో స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఉద్యోగులు. ఈ శిబిరాల్లో భాగంగా, గ్రామీణ ప్రజలకు కేటరాక్ట్, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, రెటినల్ రుగ్మతలు మరియు ఇతర కంటి వ్యాధుల గురించి అవగాహన కల్పించాము.


భౌతిక దూరం
శ్రమదానం కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్న ఉద్యోగులు

పూణేలోని గరడే గ్రామంలో వాటర్‌షెడ్‌ల నిర్మాణం కోసం హెచ్‌టి పరేఖ్ ఫౌండేషన్‌తో పాటు పానీ ఫౌండేషన్‌తో కలసి స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్న హెచ్‌డిఎఫ్‌సిఎర్గో ఉద్యోగులు. దాదాపుగా 30,000 లీటర్ల నీటిని ఒక సమయంలో తీసుకురాగలిగిన మరియు మొత్తం 1,45,000 లీటర్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగిన 03 కంపార్ట్‌మెంట్‌ బండ్‌లు నిర్మించిన వాలంటీర్లు.


మా CSR భాగస్వాముల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం

చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (సిఎఎఫ్) ఇండియా
చారిటీస్ ఎయిడ్ ఫౌండేషన్ (CAF) ఇండియా అనేది ఒక నమోదిత, లాభాపేక్ష రహిత, సేవా ట్రస్ట్. కార్పొరేట్, వ్యక్తులు మరియు NGO లు వారి దాతృత్వ మరియు CSR పెట్టుబడుల్లో మరింత ప్రభావంగా ముందుకు సాగడానికి వ్యూహాత్మక మరియు నిర్వహణ మద్దతు అందించడం కోసం 1998లో ఇది ఏర్పాటు చేయబడింది. CAF ఇండియా అనేది ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఇండియా, రష్యా, దక్షిణాఫ్రికా మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలతో సహా తొమ్మిది దేశాల్లో కార్యాలయాలతో ఒక అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా 90 కంటే ఎక్కువ దేశాలకు ఇది నిధులు పంపిణీ చేస్తోంది. CAF ఇండియా, తన నిబద్ధత కలిగిన నిపుణుల బృందం సాయంతో, తీసుకోవడం కంటే ఎక్కువ 'ఇవ్వడం' కోసం అభివృద్ధి రంగానికి పరిజ్ఞానం మరియు అనుభవం అందిస్తోంది.
యువ అన్‌స్టాపబుల్
యువ అన్‌స్టాపబుల్ అనేది ఒక లాభాపేక్ష రహిత రిజిస్టర్డ్ సంస్థ. బలహీన వర్గాల పిల్లల జీవితాలను మెరుగ్గా చేసే లక్ష్యంతో ఇది ఏర్పాటు చేయబడింది. 100 అగ్రశ్రేణి కార్పొరేట్ భాగస్వాములతో కలసి పని చేస్తున్న ఈ సంస్థ, పిల్లలు చిన్న విషయాల్లో సైతం గొప్పదనం గుర్తించడం, సంతోషం మరియు అవగాహనను అనుసరించేలా వారికి ప్రేరణ అందిస్తోంది. 2005లో అమితాబ్ షా సహ-వ్యవస్థాపకుడిగా ప్రారంభమైన ఈ యువ అన్‌స్టాపబుల్ అనేది దయను విస్తరించే వ్యామోహం కలిగిన ఉత్సాహవంతులైన వ్యక్తులతో ఇరవై సంవత్సరాల క్రితమే ఒక బృందంగా ప్రయాణం మొదలుపెట్టింది. దేశంలోని దాదాపుగా 14 రాష్ట్రాల్లోని 1500 ప్రభుత్వ పాఠశాలల వ్యాప్తంగా 6 లక్షలకు పైగా పిల్లలను ప్రభావితం చేయడం కోసం నేడు ఇది 1.5 లక్షలకు పైగా యువ రాయబారులు, మార్పు-సాధకులు, మరియు స్మార్టేరియన్ వాలంటీర్లను కలిగి ఉంది.
విజన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా
భారతదేశాన్ని అంధత్వ రహితంగా మార్చాలనే లక్ష్యంతో, 1994లో డాక్టర్ కులిన్ కొథారీ ఈ విజన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (VFI) ని స్థాపించారు. అంధత్వాన్ని నిర్మూలించడంలో భాగంగా, ఈ సంస్థ మే 2020 వరకు 4,87,537 శస్త్రచికిత్సలకు సహాయం అందించింది. ప్రారంభించబడిన నాటి నుండి, భారతదేశంలోని నలుమూలల సమాజాల్లోని, ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల్లో వారి శస్త్రచికిత్స కోసం విఎఫ్ఐ సహాయం అందిస్తోంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు ఉపకరణాల సాయంతో ఉచితంగా కంటి సంరక్షణ అందించడం ద్వారా, విజన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారు ప్రజలకు సాధికారత అందిస్తున్నారు. చూపు సరిగా లేకపోవడానికి లేదా అంధత్వానికి డబ్బు లేకపోవడమనేది కారణం కాకూడదని ఈ సంస్థ విశ్వసిస్తుంది.
ఆధార్ - మానసిక వైకల్యం కలిగిన పిల్లల తల్లిదండ్రుల అసోసియేషన్
ఆధార్ అనేది మానసిక వైకల్యం కలిగిన పిల్లల తల్లితండ్రులతో ఏర్పడిన ఒక అసోసియేషన్. ప్రత్యేక అవసరాలు కలిగిన అలాంటి పిల్లలకు నివాసం అందించడం ద్వారా వారికి జీవితకాల సంరక్షణ, పునరావాసం మరియు మద్దతు అందించడంలో భాగంగా, వారి తల్లితండ్రులకు భౌతిక, మానసిక మరియు ఆర్థిక ఉపశమనం అందించడం కోసం ఈ సంస్థ ఏర్పడింది.. 1990 లో స్పెషల్ అడల్ట్స్ యొక్క దాదాపు 25 తల్లిదండ్రులు ఆలస్య శ్రీ ఎం.జి. గోర్ నాయకత్వంలో తమ పిల్లల విషయంలో వారి ఆందోళనలకు పరిష్కారం కనుగొనడానికి సిద్ధమయ్యారు. నేడు, వారు 325 మంది ప్రత్యేక అవసరాల వయోజనులకు సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్స్, మెడికల్ ఆఫీసర్స్, సోషల్ వర్కర్స్, స్పెషల్ టీచర్స్ మరియు కేర్ టేకర్స్ వంటి స్పెషలిస్టులతో సహాయంగా నిలుస్తున్నారు.
జెనెసిస్ ఫౌండేషన్
జెనెసిస్ ఫౌండేషన్ (GF) అనేది లాభాపేక్ష సంస్థ కాదు. చికిత్స కోసం డబ్బు లేని కారణంగా ఏ శిశువు మరణించకూడదనే ఆలోచనతో ఇది స్థాపించబడింది. CHD తో తీవ్ర అనారోగ్యం కారణంగా బాధపడే పేద పిల్లలకు GF వైద్య చికిత్స అందిస్తుంది. ఇలాంటి పిల్లలకు నిర్దిష్ట శస్త్రచికిత్సలు (నవజాత శిశువులతో సహా), క్యాత్ ల్యాబ్ ఇంటర్వెన్షన్‌లు, రికవరీ మరియు సర్జరీ తర్వాత రెకుపరేషన్ లాంటివి అవసరమవుతుంటాయి. నెలకు ₹10,000 వరకు ఆదాయంతో జీవించే కుటుంబాల పిల్లలకు ఈ ఫౌండేషన్ మద్దతు అందిస్తుంది. PAN నంబర్ AAATG5176Hతో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 12-A మరియు సెక్షన్ 80-G క్రింద GF రిజిస్టర్ చేయబడింది. విదేశాల నుండి విరాళాలు అందుకోవడానికి వీలుగా, రిజిస్ట్రేషన్ నంబర్ 172270037 తో విదేశీ సహకార నియంత్రణ చట్టం - 1976 (FCRA) క్రింద కూడా ఇది రిజిస్టర్ చేయబడింది.
లీలా పూనావాలా ఫౌండేషన్
సామాజం నుండి తిరస్కరించబడిన మరియు ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్న మహిళలకు ప్రోత్సాహం అందించే దృష్టితో లీలా పూనావాలా ఫౌండేషన్ (ఫౌండేషన్) 1995లో స్థాపించబడింది. ఆ మహిళలు ప్రొఫెషనల్ డిగ్రీలు చదవడం కొనసాగించడానికి ఇది వారికి సహాయపడుతుంది. తద్వారా, వారు ఆర్థిక స్వాతంత్రం సాధిస్తారు. నాణ్యమైన విద్య మరియు లింగ సమానత అనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు వారు సహాయంగా నిలుస్తారు. ప్రారంభించిన నాటి నుండి, ఈ ఫౌండేషన్ ద్వారా దాదాపుగా ₹78 కోట్ల స్కాలర్‌షిప్‌లను 8500 కంటే ఎక్కువ మంది అమ్మాయిలకు అందించారు. స్కూల్ ఎడ్యుకేషన్, అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ కోసం అవసరం మరియు మెరిట్ ప్రాతిపదికన అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్ గ్రౌండ్ నుండి అమ్మాయిలకు ఈ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందిస్తుంది. పూణే, అమరావతి, వర్ధా మరియు నాగపూర్‌లో చదువుతున్న విద్యార్థులకు ఈ ఫౌండేషన్ మద్దతు ఇస్తుంది.
రే ఆఫ్ లైట్ ఫౌండేషన్
రే ఆఫ్ లైట్ ఫౌండేషన్ అనేది 2002లో స్థాపించబడింది. ఇది పిల్లలను కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా, వారికి అత్యుత్తమ మనుగడ అవకాశం అందించే చికిత్స అందిస్తుంది. రే ఆఫ్ లైట్ ఫౌండేషన్ అనేది ఆదాయ పన్ను చట్టం -1961లోని సెక్షన్ 12AA క్రింద ఒక పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్‌గా రిజిస్టర్ చేయబడింది.
సొసైటీ ఫర్ రీహ్యాబిలిటేషన్ ఆఫ్ క్రిపుల్డ్ చిల్డ్రన్ (SRCC)
SRCC ఆసుపత్రి ముంబైలో ఉంది. గత రెండున్నర సంవత్సరాలుగా నారాయణ హెల్త్ ద్వారా ఇది నిర్వహించబడుతోంది. SRCC అనేది బాంబే పబ్లిక్ ట్రస్ట్ చట్టం - 1950 క్రింద ఒక పబ్లిక్ ట్రస్ట్‌గా రిజిస్టర్ చేయబడింది. పోలియోమెలిటిస్‌తో ప్రభావితమైన పిల్లలకు చికిత్స చేయడానికి ఒక డాక్టర్ వెయిటింగ్ రూమ్‌లో చిన్న క్లినిక్ ప్రారంభించడం కోసం కొందరు ఔత్సాహిక వాలంటీర్లు 1947లో ఏకమయ్యారు. ఒక క్లినిక్ లేదా ఆసుపత్రి లాంటి సరైన వైద్య సదుపాయంలో పిల్లలను సంరక్షించడం ద్వారా వారికి రోగ నిర్ధారణ మరియు చికిత్సలు అందించే లక్ష్యంతో ఎSRCC ని తెరమీదకు వచ్చింది. మంచి ఆరోగ్యం, భరోసా మరియు సంతోషం అనే వాటిని ఎస్ఆర్‌సిసి వ్యాప్తి చేస్తోంది. ఈ సంస్థ దాని శిశు అభివృద్ధి కేంద్రం ద్వారా వందలాది మంది పిల్లలకు సహాయం అందించింది.
CSC అకాడమీ
CSC అకాడమీ అనేది ఢిల్లీ యూనియన్‌కి వర్తించే సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 కింద ఏర్పాటైన ఒక సొసైటీ. ప్రత్యేకించి, గ్రామ స్థాయి వ్యవస్థాపకుల్లో సామర్థ్యం, నైపుణ్యాభివృద్ధి, విద్య మరియు అభివృద్ధి పెంపొందించడమే దీని లక్ష్యం. సమాచారం మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డెలివరీ ఫ్రేమ్‌వర్క్‌లు మరియు బోధన లాంటివి పెద్ద మొత్తంలో వినియోగించుకోవడం ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్‌లోని ఇతర వాటాదారులు కూడా ప్రయోజనం పొందుతారు. వీళ్లు ప్రత్యేకమైన కోర్సులు/శిక్షణ కార్యక్రమాలు అందిస్తారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న, ప్రత్యేకించి, గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల్లోని అభ్యాసకుల కోసం భారీ స్థాయి ఇ-లెర్నింగ్ అవకాశాలు అందించడానికి ఒక ఆన్‌లైన్ అభ్యాసన పర్యావరణాన్ని CSC అభివృద్ధి చేస్తుంది, నిర్వహిస్తుంది మరియు దానికి మద్దతు అందిస్తుంది.
కాస్మిక్ డివైన్ సొసైటీ
కాస్మిక్ డివైన్ సొసైటీ అనేది తిండి కోసం కష్టాలు పడే పిల్లలను ఆదుకునే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక రిజిస్టర్డ్ వెల్‌ఫేర్ సొసైటీ. "ఆకలిని పారద్రోలడం" కోసం మరియు భారతదేశం నుండి సామాజికంగా, భౌతికంగా మరియు మానసికంగా ఆకలిని పారద్రోలడం ద్వారా ఒక గొప్ప సామాజిక ప్రభావం కల్పించడానికి ఇది నిరంతరాయంగా ప్రయత్నిస్తుంది. మంచి పోషక విలువలతో, తినడానికి సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజనాన్ని ఈ సంస్థ తన మొబైల్ ఫుడ్ వ్యాన్‌ల ద్వారా ప్రతి రోజు, ఒక నిర్దిష్ట సమయంలో, నేరుగా పిల్లల ఇంటి వద్దకే చేరుస్తుంది.

 

టెస్టిమోనియల్స్

ఎక్స్‌పర్ట్ చిత్రం
అతుల్ గుజరాతీ, హెడ్ - మోటార్ క్లెయిమ్స్
గావ్ మేరా కార్యక్రమంలో భాగంగా, మధ్య ప్రదేశ్‌లోని జలగావ్‌లో భాగమైన కొలంబ మరియు మచాల గ్రామాల్లో పనిచేయడానికి నేను నామినేట్ అయ్యాను. పాఠశాలల పునరుద్ధరణకు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో కనబరిచిన అంకితభావంతో ఆయా పాఠశాలలు మెరుగ్గా తయారయ్యాయి. నా దృష్టిలో ఇది గ్రామాభివృద్ధి మరియు దేశ నిర్మాణంలో ఒక అతిపెద్ద సహకారం లాంటిది.
ఎక్స్‌పర్ట్ చిత్రం
నీలాంచల గౌడ, సర్పంచ్ - పాండియాపథర్ గంజాం, ఒడిశా
పాఠశాల నిర్మాణంలో భాగమైన హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో మరియు సంబంధిత సభ్యులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామస్థుల తరపున, నేను మనస్ఫూర్తిగా, గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎక్స్‌పర్ట్ చిత్రం
ఒడిశాలోని జయ దుర్గ స్కూల్ హెడ్‌మాస్టర్ బయమన పాండ
పాండియపథర్‌లోని మా పాఠశాలను పునరాభివృద్ధి చేసినందుకు హెచ్‌డిఎఫ్‌సిఎర్గో వారికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. "గావ్ మేరా" స్కూల్ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో పూర్తి చేసిన ఈ కొత్త నిర్మాణం అనేది పట్టణ మరియు గ్రామీణ మరియు సమృద్ధ మరియు పేద విద్యార్థుల మధ్య అంతరాన్ని తగ్గించింది.
ఎక్స్‌పర్ట్ చిత్రం
అశోక్ ఆచారి, మేనేజర్ - రిటైల్ ఆపరేషన్స్, ముంబై
CSR గావ్ మేరా కార్యక్రమాన్ని మా గ్రామం పాండియపథర్‌లో ఫిబ్రవరి 2020లో నిర్వహించారు. ఇది మా గ్రామ ప్రజల మీద అత్యద్భుతమైన ప్రభావం చూపింది. మా గ్రామంలో ఒక సానుకూల మార్పు తీసుకొచ్చే అవకాశం అందించిన హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో బృందానికి నేను నిజాయితీగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎక్స్‌పర్ట్ చిత్రం
పియూష్ సింగ్, సీనియర్ మేనేజర్ - రూరల్ అండ్ అగ్రి బిజినెస్, లక్నో
గావ్ మేరా కార్యక్రమంలో భాగంగా, ఉత్తర ప్రదేశ్‌లోని మా గ్రామం - తండియా వారణాసిని నేను నామినేట్ చేశాను. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారు నా నామినేషన్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో నేను మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పునరుద్ధరణకు వెళ్లాను. మా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పునరుద్ధరణలో భాగమైనందుకు నాకు గొప్ప సంతృప్తి మరియు ఆనందంగా ఉంది.
ఎక్స్‌పర్ట్ చిత్రం
రాఘవేంద్ర కె, అసిస్టెంట్ మేనేజర్ - కార్పొరేట్ క్లెయిమ్స్, బెంగళూరు
గావ్ మేరా కార్యక్రమం అనేది ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురంలో భాగమైన నా పుట్టిన ఊరు అగ్రహారం గ్రామానికి ఏదైనా చేయడానికి నాకు సరైన మార్గంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఒక స్కూల్ పునరాభివృద్ధి చేయబడింది, అది ఇప్పుడు కొత్తదిగా కనిపిస్తోంది.

మమ్మల్ని సంప్రదించండి

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో CSR కార్యక్రమాలకు సంబంధించిన ప్రశ్నలు, సలహాలు మరియు అభిప్రాయాల కోసం, మాకు ఇక్కడ రాయండి: csr.initiative@hdfcergo.com

 
అవార్డులు మరియు గుర్తింపు
x