స్ట్రోక్ కోసం క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్
మెదడులో ఒక భాగానికి రక్త సరఫరాకి ఆటంకం ఏర్పడినప్పుడు లేదా పనిచేయడం ఆపివేసినప్పుడు స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది రక్త సరఫరా బ్లాక్ చేయబడినప్పుడు లేదా మెదడులో రక్త నాళాలు పగిలినప్పుడు ఇది సంభవిస్తుంది, ఇది మెదడు కణజాల మరణానికి సంభవిస్తుంది. ఇది ఒక వైద్య అత్యవసర పరిస్థితి మరియు ప్రాణాంతకమైనది అని రుజువు చేయబడింది, అందువల్ల వీలైనంత త్వరగా చికిత్స చేయించాలి. భారతదేశంలో మొదటిసారి స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో చేరిన వారిలో ఐదవ వంతు రోగుల వయస్సు 40 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ (National Center for Biotechnology Information వద్ద ఉన్న సమాచారం ఆధారంగా). 55 సంవత్సరాల వయస్సు తర్వాత స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది; అయితే ఇది జీవితంలో ఏ దశలోనైనా సంభవించవచ్చు. అత్యంత ముఖ్యంగా, కుటుంబంలో రోగ చరిత్ర ఉన్న వ్యక్తులు స్ట్రోక్ యొక్క అధిక రిస్క్ కలిగి ఉంటారు.
స్ట్రోక్ యొక్క ప్రభావాలు
అనేక పరీక్షలను నిర్వహించిన తర్వాత, మెదడులో బ్లడ్ క్లాట్లను తొలగించడానికి లేదా రక్త నాళాలను బాగు చేయడానికి చికిత్సను సూచించవచ్చు. ఇది రోగిని తీవ్రంగా ప్రభావితం చేయవచ్చు. మెదడులో ప్రభావితం అయిన ప్రదేశాన్ని బట్టి ఒక వ్యక్తి శరీరం యొక్క ఏ వైపు అయినా వైకల్యం సంభవించవచ్చు. డాక్టర్లు మరియు కేర్‌టేకర్ల ద్వారా అందించబడే థెరపీ మరియు చికిత్స ఆధారంగా స్ట్రోక్ కోసం రికవరీ సమయం ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. మెదడు వ్యాధితో పోరాడడం సులభం కాదు. , అలాంటి సమయంలో మీ కుటుంబసభ్యులు నిధుల నిర్వహణలో బిజీగా ఉండకుండా, మీకు తోడుగా నిలబడాలని మీరు కోరుకుంటారు. అందువల్లనే, క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీని సూచించడం జరిగింది హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ that covers medical expenses for treating stroke and related health issues.
హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆరోగ్య సమస్యల నుండి ఉత్పన్నమయ్యే ఆర్థిక విపత్తులను ఎదుర్కోవడానికి ఒక సులభమైన మార్గం, అందువల్ల ఇది ఆవశ్యకం. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఆన్‌లైన్‌లో గొప్ప ప్రోడక్టులను అందిస్తుంది, ఇది జీవితంలోని అన్ని వర్గాలకు చెందిన వ్యక్తుల హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
స్ట్రోక్ లక్షణాలు ఇలా ఉండవచ్చు
- తీవ్రమైన తలనొప్పి
- తాత్కాలిక లేదా శాశ్వత పక్షవాతం లక్షణాలలో చేర్చబడాలి
- ప్రొజెక్టివ్ వామిటింగ్
- బలహీనత
- గందరగోళం
- దృష్టిని కోల్పోవడం
- మాట్లాడటం లేదా మింగడంలో కష్టం మరియు ఇటువంటి అనేక లక్షణాలు *తీవ్రమైన లక్షణాలు కోమాకు దారితీయవచ్చు
రెండు ప్రధాన రకాల స్ట్రోక్లు ఉన్నాయి
- హెమర్‌హాజిక్ స్ట్రోక్
- ఇస్కెమిక్ స్ట్రోక్
ఇస్కెమిక్ స్ట్రోక్: అన్ని స్ట్రోక్స్‌లో ఎనిమిది శాతం ఇస్కెమిక్ స్ట్రోక్లు. మెదడులో పెద్ద ధమనులను సంకోచానికి గురి చేస్తుంది. మెదడులోని కణాలకు రక్తం అందకపోతే, వారు కొన్ని గంటలలో మరణిస్తారు. ఈ మృత కణాలు ఉన్న ప్రదేశాన్ని డాక్టరు "ఇన్ఫార్క్‌ట్" అని పేర్కొంటారు”.
హెమర్‌హాజిక్ స్ట్రోక్స్‌లో రక్తస్రావం జరుగుతుంది: అధిక రక్తపోటు, మధుమేహం మరియు వయస్సు కారణంగా మెదడులోని రక్త నాళాలు బలహీనపడి చిట్లిపోతాయి.
మీరు ఒక ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కలిగి ఉన్నప్పటికీ, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఎందుకు ముఖ్యం?
క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ అనేది ఒక సాధారణ ఇండెమినిటీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ మాదిరిగా కాకుండా ఒక సంపూర్ణ బెనిఫిట్-ప్లాన్. పాలసీలో కవర్ అయ్యేలా జాబితా చేయబడిన ఏదైనా తీవ్రమైన అనారోగ్యం నిర్ధారణ చేయబడిన తర్వాత మాత్రమే ఏకమొత్తం (బీమా చేయబడిన మొత్తం) చెల్లించబడుతుంది. ఒకవేళ, మీకు చికిత్స చేసే వైద్యుడు ఒక నిర్దిష్ట చికిత్స పద్ధతిని సిఫార్సు చేసినప్పుడు, హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో అందించే క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్ మీకు చికిత్స, సంరక్షణ మరియు రికవరీ కోసం చెల్లించడానికి ఉపయోగించేలా ఒకే లావాదేవీలో ఏకమొత్తం ప్రయోజనం అందిస్తుంది. అప్పులు చెల్లించడానికి, కోల్పోయిన ఆదాయానికి ప్రత్యామ్నాయంగా లేదా కొన్ని సందర్భాల్లో జీవనశైలి మార్పులు అనుసరించడానికి కూడా ఈ డబ్బు ఉపయోగపడవచ్చు. ఒక తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స తీసుకునే క్రమంలో మీ పొదుపులు ఖర్చు అయిపోవచ్చు, పని చేయడం మరియు సంపాదన పరిమితం కావచ్చు మరియు మీ సాధారణ జీవనశైలి ప్రభావితం కావచ్చు, కాబట్టి, ఇలాంటి కష్ట సమయాల్లో మీరు ఎంచుకున్న కవర్ ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం చేకూర్చడం ఉత్తమంగా ఉంటుంది. మీ ప్రస్తుత హెల్త్ కవర్ లేదా ఉద్యోగి హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి మీ వైద్య ఖర్చులను ఒక నిర్దిష్ట పరిధి వరకే కవర్ చేస్తాయి, అయితే, క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ అనేది మీకు మొదటి రోగనిర్ధారణ లేదా వైద్య నిపుణుల సలహా మేరకు ఒకే లావాదేవీలో ఏకమొత్తంలో ప్రయోజనం అందిస్తుంది.
స్ట్రోక్ కోసం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్‌ను ఎందుకు ఎంచుకోవాలి?
మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టవచ్చు, మరియు హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఫండ్స్ బాధ్యతను చేపడుతుంది. అంతే కాకుండా, మీరు చికిత్స పొందడంలో బిజీగా ఉన్నపుడు, ఆదాయ నష్టం సంభవించినట్లయితే, ఇన్సూరెన్స్ సంస్థ మీ కుటుంబానికి నగదు రూపంలో సహాయం చేస్తుంది. 30 రోజుల సర్వైవల్ వ్యవధి ముగిసిన తర్వాత మొదటిసారి జరిగిన రోగనిర్ధారణపై ఒక్క లావాదేవీలో పూర్తి మొత్తం చెల్లించబడుతుంది. ఈ ఏక మొత్తాన్ని సంరక్షణ, చికిత్స, రికవరీ ఖర్చులు, అప్పులు చెల్లించడం లేదా సంపాదించే సామర్థ్యం తగ్గడం వల్ల కోల్పోయిన ఆదాయానికి నిధులను సమకూర్చడం కోసం ఉపయోగించవచ్చు. అదనంగా, క్రిటికల్ ఇల్‌నెస్ హెల్త్ కవర్లను ఎంచుకోవడం వలన మీరు సెక్షన్ 80D కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.