1.3 కోట్లు+ హ్యాపీ కస్టమర్లు
  • పరిచయం
  • ఏమి చేర్చబడింది?
  • చేర్చబడని అంశాలు?
  • యాడ్ ఆన్ కవర్లు
  • హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ను ఎందుకు ఎంచుకోవాలి?
  • FAQs

ఇ@సెక్యూర్ ఇన్సూరెన్స్

 మీరు ఆన్‌లైన్‌లో గడిపే ప్రతి సెకను మీ విలువైన సమాచారాన్ని హానికరమైన కార్యకలాపాలు మరియు బెదిరింపులకు బహిర్గతం చేసే అవకాశం ఎక్కువ అని మేము మీకు చెప్పినట్లయితే? ఎందుకంటే, భారతదేశంలో ప్రతి 10 నిమిషాలకు సైబర్ నేరం నివేదించబడుతుంది. కానీ, సైబర్ నేరాల భయంతో మీరు వెనుకడుగు వేయకండి. ఇంటర్నెట్‌తో ఎక్కువ ప్రయోజనం పొందండి; ఇన్సూరెన్స్ పొందండి మరియు సంకోచం లేకుండా బ్రౌజ్ చేయండి!

ఇ@సెక్యూర్ ఇన్సూరెన్స్ ఎంచుకోవడానికి కారణాలు

Family cover
ఫ్యామిలీ కవర్
మీ కుటుంబం మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి హాని చేయడానికి సైబర్ నేరాలను అనుమతించకండి. మీరు, మీ జీవిత భాగస్వామి మరియు మీ మీద ఆధారపడిన ఇద్దరు పిల్లల (వయస్సుతో సంబంధం లేకుండా)ను సురక్షితం చేయడం ద్వారా ఆందోళన లేకుండా బ్రౌజ్ చేసుకునే అవకాశాన్ని మీ కుటుంబానికి అందించండి.
All Device Covered
అన్ని డివైజ్‌లు కవర్ చేయబడ్డాయి
ఈ రోజుల్లో, మనమందరం అనేక డివైజ్‌లలో ప్లగ్-ఇన్ కావడంతో పాటు బహుళ డివైజ్‌లలో సింక్ చేయబడి ఉన్నాము. అయితే, వాటన్నింటినీ వేర్వేరుగా ఇన్సూర్ చేయాలనే ఆందోళన మీకు అవసరం లేదు. హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వారి ఇ@సెక్యూర్ మీకు ఒకే ఇన్సూరెన్స్ ప్లాన్ కింద అన్ని డివైజ్‌లకు కవర్ అందిస్తుంది.
100% Coverage
100% కవరేజ్
క్రెడిట్/డెబిట్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ లేదా ఇ-వాలెట్‌లకు ఎదురుకాగల ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారా? మీరెందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో ఇక్కడ తెలుసుకోండి. మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీల కారణంగా మీకు ఎదురయ్యే నష్టాలను మా ఇ@సెక్యూర్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
Covers Legal Expenses
చట్టపరమైన ఖర్చులను కవర్ చేస్తుంది
చట్టపరంగా సరైన సలహా అందుకోవడంలో మరియు మరెన్నో పొందడంలో మీకు సహాయపడే మా ఇ@సెక్యూర్ ఇన్సూరెన్స్‌తో వరల్డ్‌వైడ్ వెబ్‌లోని చీకటి కోణం నుండి మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని రక్షించుకోండి.

ఏమి చేర్చబడింది?

Unauthorised Online Transactions
అనధికారిక ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లు

మీ బ్యాంక్ అకౌంట్, క్రెడిట్/ డెబిట్ కార్డ్ లేదా మీ ఇ-వాలెట్ ద్వారా మోసపూరితంగా జరిగే ఆన్‌లైన్ కొనుగోళ్ల నుండి 100% కవర్‌తో లభించే ప్లాన్‌తో మీ కష్టార్జితాన్ని రక్షించుకోండి.

Phishing & email Spoofing
ఫిషింగ్ మరియు ఇమెయిల్ స్పూఫింగ్

ఫిషింగ్ మరియు ఇమెయిల్ స్పూఫింగ్ ద్వారా మీ డబ్బును పోగొట్టుకోకండి. ఇ@సెక్యూర్‌తో, పరిమితితో కూడిన ఇ-మెయిల్ ఫిషింగ్ కోసం 15% నుండి 25% ఫిషింగ్ కోసం కవర్ పొందండి , అలాగే, పేర్కొనబడిన దాడుల కారణంగా ఎదురయ్యే ఆర్థిక నష్టానికి ఈ పాలసీ చెల్లిస్తుంది.

Damage to e-reputation
ఇ-ప్రతిష్టకు నష్టం

డిజిటల్ ప్రపంచంలో మీ ఖ్యాతిని నాశనం చేయడానికి కొన్ని సెకన్ల ఒక ట్రోల్‌ చాలు. ఇ@సెక్యూర్‌తో అటువంటి ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండండి.

Identity theft
గుర్తింపు చోరీ

ఒక మోసగాడు సెకన్లలో మీ ప్రతిష్టను ఎలా దెబ్బతీస్తాడో మీకు ఎప్పటికీ తెలియదు. మా ఇ@సెక్యూర్ తీసుకోండి మరియు ఈ దాడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

Cyber bullying
సైబర్ వేధింపు

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఇ@సెక్యూర్ ఇన్సూరెన్స్‌తో పాలసీతో 10% వరకు కవర్ పొందడం ద్వారా సైబర్ వేధింపుల నుండి మిమ్మల్ని మరియు మీ ప్రియమైన వారిని రక్షించుకోండి.

e-Extortion
ఇ-ఎక్స్‌టార్షన్

ఆన్‌లైన్ దోపిడీలపై పాలసీ పరిమితికి సంబంధించి 10% వరకు కవరేజ్ అందించే ఇ@సెక్యూర్‌తో బ్లాక్‌మెయిలర్‌లు మరియు రాన్సమ్‌వేర్ దాడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి

చేర్చబడని అంశాలు?

Intentional Loss
ఉద్దేశపూర్వక నష్టం

ఉద్దేశపూర్వకంగా/కావాలనే చేసిన ఒక మోసపూరిత చర్య కోసం మేము పరిహారం చెల్లించము.

Pre-existing Loss
ఇదివరకే ఉన్న నష్టం

పాలసీ కోసం మీరు సైన్ అప్ చేసిన తర్వాతే మా భాగస్వామ్యం ప్రయోజనాలు ప్రారంభమవుతాయి. అంతకు ముందు మేము మీ కోసం పెద్దగా ఏమీ చేయలేము.

Unexplained Loss
వివరించబడని నష్టం

ఒక రహస్యాన్ని ఛేదించడం కంటే ఆసక్తికరమైన విషయం ఇంకొకటి లేదు. అయితే, వివరించలేని లేదా గుర్తించలేని లేదా నిర్లక్ష్యం వల్ల సంభవించిన నష్టాలు ఇ@సెక్యూర్ క్రింద కవర్ చేయబడవు.

Delayed Claims
ఆలస్యం చేయబడిన క్లెయిమ్‌లు

మీరు క్లెయిమ్ చేయడంలో మీకు సహాయం చేయడాన్ని మా బాధ్యతగా మేము విశ్వసిస్తున్నప్పటికీ, దురదృష్టవశాత్తు, ఆరు నెలల తర్వాత రిపోర్ట్ చేయబడిన క్లెయిమ్స్‌కు సంబంధించి మేము ఎక్కువ చేయలేము.

Offline activity
ఆఫ్‌లైన్ కార్యాచరణ

డిజిటల్ స్పేస్‌లో మిమ్మల్ని రక్షిస్తామని మేము వాగ్దానం చేస్తున్నప్పటికీ, ఈ ప్లాన్ కింద మేము ఆఫ్‌లైన్‌‌లో ఎక్కువ రక్షణ అందించలేనందుకు మేము చింతిస్తున్నాము.

యాడ్ ఆన్ కవర్లు

ఫ్యామిలీ కవర్

నిజ జీవితంలో లాగే, ఇంటర్నెట్ వినియోగం నుండి ఉత్పన్నమయ్యే నష్టం/డ్యామేజీ నుండి కూడా మీ కుటుంబాన్ని రక్షించుకోండి. మీరు, మీ జీవిత భాగస్వామి మరియు మీ ఇద్దరు పిల్లల (వయస్సు పరిమితితో సంబంధం లేకుండా)ను రక్షించుకోండి మరియు మీ మొత్తం కుటుంబం కోసం పూర్తి డిజిటల్ భద్రతను నిర్ధారించుకోండి.


ఇది ఎలా పని చేస్తుంది?
ఇంటర్నెట్ వినియోగం ద్వారా, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నష్టం లేదా డ్యామేజీ (కవరేజీలలో పేర్కొన్న ఏదైనా సంఘటనల కారణంగా) ఎదుర్కొంటే, మీకు అవసరమైన కవర్ అందుకోవడానికి మీరు ఇ@సెక్యూర్ మీద ఆధారపడవచ్చు.

మాల్వేర్ కోసం కవర్

మీరు మీ ఇంటి తలుపులకు తాళం వేసినట్లుగానే, మీ డిజిటల్ ఆస్తులను కూడా సురక్షితం చేసుకోండి. మాల్వేర్ కారణంగా డిజిటల్ ఆస్తులకు జరిగే నష్టం మరియు వినాశనం నుండి రక్షణ పొందండి. ఈ యాడ్-ఆన్ పాలసీ అనేది పాలసీ పరిమితికి సంబంధించి 10% వరకు రీప్లేస్‌మెంట్ ఖర్చుల కోసం పరిహారం అందిస్తుంది .


ఇది ఎలా పని చేస్తుంది?
మీ సిస్టమ్‌లోకి మాల్వేర్ ప్రవేశపెట్టిన కారణంగా మీ డిజిటల్ ఆస్తులు చెడిపోవడం వల్ల మీకు ఏదైనా నష్టం వాటిల్లినప్పుడు, మీ ఆస్తులను పునరుద్ధరించడం కోసం అవసరమయ్యే ఖర్చుల కోసం (పాలసీ పరిమితిలో 10% వరకు కవరేజీతో) మేము చెల్లిస్తాము.
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

1.6+ కోట్ల చిరునవ్వులు సురక్షితం చేయబడ్డాయి!@

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

మీకు అవసరమైన సపోర్ట్ 24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. ఇబ్బందులు లేని క్లెయిమ్ అనుభవాన్ని అందించడానికి మా ఇన్ హౌస్ క్లెయిమ్స్ బృందం నిరంతరంగా సహకారం అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్లు మరియు యాడ్ ఆన్ కవర్లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా తీరుస్తున్నాము.
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards
awards
awards
awards
awards
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.
హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో ఎందుకు?
awards

1.6+ కోట్ల చిరునవ్వులు సెక్యూర్ చేయబడ్డాయి

విశ్వాసం అనేది హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో వద్ద సంబంధాలను నిర్వచిస్తుంది. ఇన్సూరెన్స్‌ను సులభంగా, మరింత సరసమైనదిగా మరియు మరింత ఆధారపడదగినదిగా చేయడానికి నిరంతరం కృషి చేస్తాము. ఇక్కడ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాము, క్లెయిమ్‌లు నెరవేర్చబడతాయి మరియు జీవితాలకు అత్యంత నిబద్ధతతో రక్షణ అందించబడుతుంది.
awards

మీకు అవసరమైన సపోర్ట్-24x7

క్లిష్ట సమయాల్లో వెంటనే సహాయం అవసరం అని మేము అర్థం చేసుకోగలము. అవాంతరాలు-లేని క్లెయిమ్ అనుభవాన్ని నిర్ధారించడానికి మా ఇన్-హౌస్ క్లెయిమ్స్ బృందం 24 గంటలూ మద్దతును అందిస్తుంది. అవసరమైన సమయాల్లో మీకు ఎల్లప్పుడూ సహకరించే వ్యవస్థగా ఉంటాము అని హామీ ఇస్తున్నాము.
awards

కస్టమర్ అవసరాలను తీర్చడం

గత 20 సంవత్సరాల నుండి, మేము ప్రతి పోర్ట్‌ఫోలియో కోసం విస్తృత శ్రేణి ప్లాన్‌లను మరియు యాడ్ ఆన్ కవర్‌లను అందించడం ద్వారా అంతులేని కస్టమర్ అవసరాలను సజావుగా అందజేస్తున్నాము.
awards

అత్యుత్తమమైన పారదర్శకత

హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అత్యంత పారదర్శకతతో మరియు సులభంగా సెటిల్ చేయబడతాయి.
awards

Awards

FICCI ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అవార్డులు, 2021 వద్ద హెచ్‌డిఎఫ్‌సి ఎర్గో "క్లెయిమ్స్ అండ్ కస్టమర్ సర్వీస్ ఎక్సలెన్స్" కేటగిరీ కింద అవార్డు గెలుచుకుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఈ రోజుల్లో, టీనేజర్ల నుండి సీనియర్ సిటిజన్స్ వరకు, ప్రతి ఒక్కరూ సైబర్ స్పేస్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అలాంటి ప్రతి వ్యక్తి ఆన్‌లైన్‌లో ఎదురయ్యే బెదిరింపులకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి, సైబర్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం ద్వారా ఆన్‌లైన్ మోసాల నుండి మీరు రక్షణ పొందవచ్చు. 18 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు వారు ఈ పాలసీ కొనుగోలు చేయవచ్చు మరియు కొనుగోలుదారు, వారి జీవిత భాగస్వామితో పాటు వారిమీద ఆధారపడిన ఇద్దరు పిల్లల (వారి వయస్సు పరిమితితో సంబంధం లేకుండా) కోసం దీనిని కొనుగోలు చేయవచ్చు.
సైబర్ ఇన్సూరెన్స్ అనేది సైబర్ మోసం కారణంగా జరిగే నష్టానికి కవర్ అందిస్తుంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో, సైబర్ స్పేస్‌లో ఉనికిలో ఉన్న సంబంధిత ప్రమాదాలకు ప్రతివ్యక్తి గురి కాగలరు. సైబర్ ఇన్సూరెన్స్ తో, అనధికారిక ఆన్‌లైన్ లావాదేవీలు, ఫిషింగ్ మరియు ఇమెయిల్ స్పూఫింగ్, ఇ-గౌరవానికి నష్టం, గుర్తింపు దొంగతనం, సైబర్ వేధింపు మరియు ఇ-దోపిడీ కారణంగా ఎదురయ్యే ఆర్థిక ప్రమాదాల నుండి ఒక వ్యక్తి తనను తాను మరియు కుటుంబ సభ్యులను రక్షించుకోవచ్చు.
అవును, ఇన్సూర్ చేయబడిన వ్యక్తి అతను/ఆమె సొంతంగా న్యాయవాదిని నియమించవచ్చు. అయితే, ఇన్సూరెన్స్ కంపెనీ నుండి సమ్మతి స్వీకరించిన తర్వాతే ఆ పని చేయాలి.
ఇ@సెక్యూర్ పాలసీ అనేది ఆన్‌లైన్ మోసాలు మరియు నేరాల కోసం వ్యక్తులు మరియు వారి కుటుంబానికి కవర్ అందిస్తుంది. ఇందులో ఆన్‌లైన్ కొనుగోలు సంబంధిత మోసాలు, ఇమెయిల్ స్పూఫింగ్, ఫిషింగ్, ఇ-ప్రతిష్టకు నష్టం మొదలైనవి ఉండవచ్చు.
ఇన్సూర్ చేయబడిన వ్యక్తి మీద ఆధారపడిన పిల్లలను కవర్ చేయడానికి ఈ పాలసీని పొడిగించవచ్చు. సైబర్ బెదిరింపులు మరియు వేధింపులతో పాటు అలాంటి బెదిరింపుల కారణంగా వాటిల్లే మానసిక అఘాతం నుండి ఆన్‌లైన్‌లో వారి ప్రతిష్టకు ఈ పాలసీ వారిని రక్షించగలదు.

ఈ పాలసీ కింద కవర్ చేయబడే ప్రమాదాలు ఏవంటే, :

  • ఇ-ప్రతిష్టకు నష్టం –థర్డ్ పార్టీ ద్వారా మీ గురించి ఇంటర్నెట్‌లో హానికర సమాచారం ప్రచురించినప్పుడు (ఫోరమ్‌లు, బ్లాగ్ పోస్టింగ్‌లు, సోషల్ మీడియా మరియు ఏదైనా ఇతర వెబ్‌సైట్‌తో సహా) సంభవిస్తుంది
  • గుర్తింపు దొంగతనం – డబ్బు, వస్తువులు లేదా సేవలు పొందడం కోసం థర్డ్ పార్టీ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడినప్పుడు ఇది సంభవిస్తుంది.
  • అనధికారిక ఆన్‌లైన్ లావాదేవీలు- మీ బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డును మోసపూరితంగా ఉపయోగించి ఒక థర్డ్ పార్టీ ద్వారా ఇంటర్నెట్‌లో కొనుగోళ్లు చేయబడినప్పుడు ఇది సంభవిస్తుంది.
  • ఇ-దోపిడీ– వస్తువులు, డబ్బు లేదా సేవలను దోపిడీ చేయడానికి థర్డ్ పార్టీ ఉద్దేశపూర్వకంగా మీకు ఇంటర్నెట్ ద్వారా భయపెట్టినప్పుడు ఇది సంభవిస్తుంది.
  • సైబర్ బెదిరింపు లేదా వేధింపు – ఒక థర్డ్ పార్టీ ద్వారా మీరు సైబర్ బెదిరింపు లేదా వేధింపులకు మీరు బాధితులుగా మారినప్పుడు ఇది సంభవిస్తుంది.
  • ఫిషింగ్ మరియు ఇ-మెయిల్ స్పూఫింగ్ – ఫిషింగ్ మరియు ఇమెయిల్ స్పూఫింగ్ కారణంగా సంభవించే ఆర్థిక నష్టం కవర్ చేయబడుతుంది.

యాడ్ ఆన్ కవర్:

  • కుటుంబం - ఇన్సూర్ చేసినవారు, వారి జీవిత భాగస్వామి మరియు వారిపై ఆధారపడిన పిల్లలను (గరిష్టంగా 4 మంది కుటుంబ సభ్యులను) ఇది కవర్ చేస్తుంది
  • మాల్వేర్ నుండి డిజిటల్ ఆస్తుల రక్షణ- డిజిటల్ డేటా పునరుద్ధరణ మరియు పునర్ సేకరణ ఖర్చును గరిష్టంగా 10% బాధ్యత పరిమితి వరకు కవర్ చేస్తుంది.
ఒక చట్టబద్ధమైన వెబ్‌సైట్‌కు నకిలీ రూపొందించడం ద్వారా, అచ్చంగా చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లాగే కనిపిస్తూ మరియు అలాంటి ఒక అనుభూతిని కలిగించేలా ఉండే వెబ్‌సైట్‌ను రూపొందించడాన్నే ఫిషింగ్ అంటారు. తద్వారా, ఆ నకిలీ వెబ్‌సైట్‌లో లావాదేవీలు నిర్వహించేలా లేదా వివరాలు పంచుకునేలా వ్యక్తులను ఆకర్షించడం వల్ల, ఆ వినియోగదారులు ఆర్థిక నష్టానికి గురవుతారు. నకిలీ మెయిల్ ID తో ఇమెయిల్‌లు పంపడం ద్వారా, వ్యక్తులు వారి అకౌంట్ వివరాలు, కంప్యూటర్ సిస్టమ్, పాస్‌వర్డ్ లాంటి వ్యక్తిగత సమాచారం లాంటి సున్నితమైన సమాచారం పంచుకునేలా చేసి, వారిని బాధితులుగా మార్చడాన్నే ఇమెయిల్ స్ఫూఫింగ్ అంటారు.
ఈ పాలసీలో ఫిషింగ్ అనేది 15% లో మరియు ఇమెయిల్ స్ఫూపింగ్ అనేది 25% లో కవర్ చేయబడుతుంది. పేర్కొనబడిన దాడుల కారణంగా జరిగిన ఆర్థిక నష్టానికి ఈ పాలసీ పరిహారం అందిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆన్‌లైన్ మోసాలు మరియు నేరాల కారణంగా సంభవించే నష్టానికి ఈ పాలసీ కవర్ అందిస్తుంది. అయితే, ఈ పాలసీ క్రింద ఏదైనా చట్టపరమైన చర్య కోసం అధికార పరిధి మాత్రం భారతదేశంలోనే ఉంటుంది.
క్లెయిమ్ సమయంలో, అనేక సెక్షన్‌లు పేర్కొనబడితే, అత్యధిక ఉప పరిమితి ఉన్న విభాగం క్రింద క్లెయిమ్ కోసం ఈ పాలసీ చెల్లిస్తుంది. ఉదాహరణకు: ఒక నష్టం అనేది ఇ ప్రతిష్ట విభాగం (పాలసీ పరిమితిలో 25% వరకు కవర్ చేయబడుతుంది) మరియు అనధికారిక ఆన్‌లైన్ లావాదేవీ (పాలసీ పరిమితిలో 100% వరకు కవర్ చేయబడుతుంది) రెండింటికీ నష్టం కలిగిస్తే, అప్పుడు క్లెయిమ్ అనేది అనధికారిక ఆన్‌లైన్ లావాదేవీ క్రింద చెల్లించబడుతుంది.
అవును. సైబర్ ఇన్సూరెన్స్ అనేది మీ క్రెడిట్ కార్డ్, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ మరియు ఇ-వాలెట్ ఉపయోగించి ఆన్‌లైన్‌లో చేసిన అనధికారిక ఆన్‌లైన్ కొనుగోళ్లను కవర్ చేస్తుంది.
నేరం జరిగిన 6 నెలల లోపల ఇన్సూర్ చేసిన వ్యక్తి క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఆ క్లెయిమ్ కోసం చెల్లించబడదు.
ఒక క్లెయిమ్ చేసే సందర్భంలో మరియు ఒక నిర్దిష్ట సంఘటన జరిగిన తర్వాత ఒక క్లెయిమ్ రిపోర్ట్ చేయడానికి, అలాంటి క్లెయిమ్ చేసిన తర్వాత 7 రోజుల లోపు సరైన విధంగా నింపిన క్లెయిమ్స్ ఫారమ్‌తో సహా ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ద్వారా హెచ్‌డి‌ఎఫ్‌సి ఎర్గోకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి.
అవును, మీ జీవిత భాగస్వామి మరియు 2 మంది మీపై ఆధారపడిన పిల్లలు వారి వయస్సు పరిమితితో సంబంధం లేకుండా మరియు అదనపు ప్రీమియంతో కవర్ చేయడానికి ఈ పాలసీని పొడిగించవచ్చు.
గుర్తింపు దొంగతనం అనేది క్రెడిట్, ఋణాలు మొదలైనవి పొందడానికి మరొక వ్యక్తి పేరు మరియు వ్యక్తిగత సమాచారాన్ని మోసపూరితంగా ఉపయోగించే చర్య.
అవును, గుర్తింపు దొంగతనాన్ని ఇ@సెక్యూర్ పాలసీ కవర్ చేస్తుంది.
ఇ@సెక్యూర్ పాలసీ క్రింద మీరు ఇన్సూరెన్స్ కలిగి ఉంటే, మీ అకౌంట్ వివరాలు ఉపయోగించి చేసిన మోసపూరిత ఆన్‌లైన్ కొనుగోళ్ల వలన మీకు కలిగిన ఆర్థిక నష్టం కవర్ చేయబడుతుంది. నేరం జరిగిన 6 నెలల లోపల ఇన్సూర్ చేసిన వ్యక్తి క్లెయిమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఆ తర్వాత ఆ క్లెయిమ్ కోసం చెల్లించబడదు.
ఈ పాలసీ ₹50,000 నుండి 1 కోటి వరకు ప్రారంభమయ్యే నష్టపరిహార ఎంపికల యొక్క అనేక పరిమితిని అందిస్తుంది. ఇన్సూర్ చేయబడిన వ్యక్తి ఏదైనా ఎంపికలను ఎంచుకోవచ్చు మరియు కుటుంబం మరియు మాల్వేర్ యాడ్ ఆన్ కవర్ కూడా తీసుకోవచ్చు. కవర్ ఇన్సూర్ చేయబడిన వ్యక్తి యొక్క క్రెడిట్ పరిమితి, తన బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ మరియు ఫ్రీక్వెన్సీ మరియు ఇంటర్నెట్ పై చేసిన కొనుగోలు మొత్తం పై ఆధారపడి ఉంటుంది.
అవును, ఇ-ప్రతిష్ట మరియు సైబర్ బెదిరింపులు మరియు వేధింపుల వల్ల ఏర్పడే నష్టాన్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. ఇ-ప్రతిష్టకు నష్టం జరిగిన సందర్భంలో, ఇంటర్నెట్‌లో హానికర కంటెంట్‌ను ఎదుర్కోవడానికి ఒక IT నిపుణుడిని నియమించే ఖర్చును ఈ పాలసీ తిరిగి చెల్లిస్తుంది. విఘాతం-తర్వాత ఒత్తిడి నిర్వహణ కోసం ఒక మానసిక నిపుణుడిని కలవడానికి అయ్యే ఖర్చులు రీయింబర్స్‌మెంట్ చేయడానికి పాలసీదారు కూడా అర్హత కలిగి ఉంటారు. సైబర్ బెదిరింపులు మరియు వేధింపుల విషయంలో, విఘాతం-తర్వాత ఒత్తిడి నిర్వహణ కోసం ఒక మానసిక నిపుణుడిని సంప్రదించడానికి అయ్యే ఖర్చును ఈ పాలసీ పరిహారంగా అందిస్తుంది.
₹50,000 ఇన్సూర్ చేయబడిన మొత్తం కోసం కనీస ప్రీమియం పరిమితి అనేది ₹1,410 + GSTగా ఉంటుంది.
అవును, మాల్వేర్ కారణంగా డిజిటల్ ఆస్తులకు అంతరాయం లేదా వినాశనం ఏర్పడడం వల్ల నష్టం జరిగితే, ఈ పాలసీ రక్షణను అందిస్తుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా, మాల్వేర్ కారణంగా నాశనం చేయబడిన డిజిటల్ ఆస్తుల భర్తీ, పునరుద్ధరణ మరియు రీకలెక్షన్ ఖర్చును ఈ పాలసీ చెల్లిస్తుంది.
ఇన్సూర్ చేసిన వ్యక్తి అకౌంట్ లేదా కార్డ్ వివరాలను ఉపయోగించడం ద్వారా, మోసపూరిత ఆన్‌లైన్ కొనుగోళ్లు చేసిన పక్షంలో ఇ@సెక్యూర్ పాలసీ క్రింద ఆ వ్యక్తి క్లెయిమ్ చేయవచ్చు. బ్యాంక్ అకౌంట్ నుండి చేసిన డబ్బు విత్‍డ్రాల్‌ను ఈ పాలసీ కవర్ చేయదు.